Futures and Options
-
జీరో బ్రోకరేజీలకు ఇక చెల్లు!
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) విభాగంలో చిన్న ఇన్వెస్టర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వారిని ట్రేడింగ్‌కు దూరంగా ఉంచేందుకు సెబీ రంగంలోకి దిగింది. తాజాగా నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో జీరో బ్రోకరేజీ సంస్థలకు బాగానే సెగ తగలనుంది. సెబీ చర్యలు అమల్లోకి వస్తే.. డెరివేటివ్స్ వాల్యూమ్స్ పడిపోయి బ్రోకరేజీ కంపెనీల ఆదాయాలకు గండి పడుతుంది. దీంతో జీరో బ్రోకరేజీ ప్లాన్లకు ఇక ‘ఎక్స్పైరీ’ తప్పదంటున్నాయి మార్కెట్ వర్గాలు!డెరివేటివ్ ట్రేడింగ్ విషయంలో సెబీ తీసుకున్న చర్యలతో జీరో బ్రోకరేజీ సంస్థల జోరుకు అడ్డకట్ట పడనుంది. ఎఫ్ అండ్ ఓ విభాగం నుంచి లభించే ఆదాయానికి చిల్లు పడుతుందన్న అంచనాలతో ఏంజెల్ వన్ ‘జీరో బ్రోకరేజీ’కి చెల్లు చెబుతున్నట్లు ప్రకటించింది. క్లయింట్ల సంఖ్య పరంగా దేశంలో మూడో అతపెద్ద బ్రోకరేజీ సంస్థగా ఇది నిలుస్తుండం విశేషం. నవంబర్ 1 నుంచి క్యాష్ మార్కెట్ లావాదేవీలు (షేర్ల కొనుగోలు, అమ్మకం)పై రూ.20 ఫ్లాట్ ఫీజు లేదా టర్నోవర్‌పై 0.1% (ఏది తక్కువైతే అది) ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇప్పటిదాకా ఈ లావాదేవీలపై ఎలాంటి ఫీజులు లేవు. కాగా, రాబోయే రోజుల్లో ఇతర బ్రోకరేజీ సంస్థలు కూడా ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘పరిస్థితుల మార్పుతో అతి తక్కువ ఫీజులతో బ్రోకింగ్ పరిశ్రమ నిలదొక్కుకోవడం అంత సులువు కాదు. ముఖ్యంగా డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థలు ఫీజులు పెంచక తప్పదు. ఎందుకంటే అవి ఎఫ్అండ్ఓ వాల్యూమ్స్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. సెబీ నిర్ణయంతో ఆదాయాలకు కోత పడుతుంది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ఎండీ ధీరజ్ రెల్లి పేర్కొన్నారు.కొన్నేళ్లుగా హవా... గతంలో ఓ వెలుగు వెలిగిన బ్యాంకింగ్ ‘బ్రోకరేజ్’లకు (ఐసీఐసీ డైరెక్ట్, యాక్సిస్ డైరెక్ట్ వంటివి) జీరోధా, గ్రో వంటి కొత్త తరం బ్రోకరేజీ సంస్థలు భారీగానే గండి కొట్టాయి. ముఖ్యంగా క్యాష్ లావాదేవీలపై జీరో బ్రోకరేజీ, ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌కు అతి తక్కువ చార్జీలు, మార్జిన్లపై లీవరేజీ వంటి ప్రయోజనాలతో బ్యాంకుల వ్యాపారాన్ని కొల్లగొట్టాయి. మరోపక్క, రిటైల్ ఇన్వెస్టర్లు ముఖ్యంగా యువత సరైన అవగాహన లేకుండా, అత్యాశతో ఎఫ్అండ్ఓ ట్రేడింగ్‌లో కుదేలయ్యే పరిస్థితికి దారితీస్తోంది. చిన్న ఇన్వెస్టర్లు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేయకుండా సెబీ పలు చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. 2022–24 మధ్య వ్యక్తిగత ట్రేడర్లు సగటున రూ.2 లక్షలు నష్టపోయారని.. రూ.1.8 లక్షల కోట్లు ఆవిరైందని సెబీ అధ్యయనం తేల్చింది. దీంతో ఇంకాస్త కఠిన నిబంధనలు తెచి్చంది. రూ. 2,000 కోట్ల చిల్లు... మార్కెట్ ఇన్ఫ్రా సంస్థలు (ఎంఐఐలు–ఎక్సే్చంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు, డిపాజిటరీలు) మెంబర్లకు (బ్రోకర్లు) విధించే ఛార్జీ లతో సమానంగానే కస్టమర్లకు (ఇన్వెస్టర్లు, ట్రేడర్లు) కూడా చార్జీలు ఉండాలని సెబీ ఈ ఏడాది జూలైలో ఆదేశించింది. ప్రస్తుతం అధిక వాల్యూమ్ ఉంటే ఎంఐఐలు బ్రోకర్లకు కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ట్రేడర్లకు మాత్రం ఫ్లాట్ రేట్ అమలు చేస్తుండటంతో ఆమేరకు బ్రోకింగ్ కంపెనీలకు లాభం చేకూరుతోంది. అయితే, సెబీ ఏకరీతి చార్జీల నిబంధనల వల్ల బ్రోకరేజీ సంస్థల ఆదాయాల్లో రూ. 2,000 కోట్లకు పైగా చిల్లు పడుతుందని అంచనా. ముఖ్యంగా డిస్కౌంట్ ప్లాట్‌ఫామ్‌లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు జీరో బ్రోకరేజీ మోడల్స్‌కు తెరపడవచ్చనేది పరిశ్రమ విశ్లేషకుల మాట! ‘ఆదాయంలో 15–20 శాతం కోత ప్రభావంతో చాలా వరకు బ్రోకరేజీలు ఈక్విటీ డెలివరీపై ఫీజు విధించవచ్చు. మధ్య, చిన్న స్థాయి బ్రోకింగ్ కంపెనీలకు ఈ సెగ బాగా తగులుతుంది’ అని ఫైయర్స్ బ్రోకరేజ్ కో–¸ఫౌండర్, సీఈఓ తేజస్ ఖోడే అభిప్రాయపడ్డారు. కాగా, బ్రోకింగ్ దిగ్గజం జీరోధా మాత్రం ప్రస్తుతానికి తాము షేర్ల డెలివరీపై ఎలాంటి ఫీజూ విధించబోమని స్పష్టం చేసింది. ‘మా ఆదాయంలో అత్యధిక భాగం ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారానే వస్తోంది. ఈ విభాగంలో కఠిన నిబంధనల వల్ల ఆదాయంలో 30–50 శాతం తగ్గుదలకు ఆస్కారం ఉంది’ అని జీరోధా ఫౌండర్, సీఈఓ నితిన్ కామత్ పేర్కొనడం విశేషం! సెబీ కీలక మార్పులు... ఇండెక్స్ డెరివేటివ్స్‌లో కాంట్రాక్ట్ కనీస విలువను రూ.15 లక్షలకు (గరిష్టంగా రూ.20 లక్షలు) పెంపు. వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్టుల సంఖ్య కుదింపు, ఇంట్రాడే పొజిషన్ లిమిట్లను తప్పనిసరిగా పర్యవేక్షించడంబ్రోకరేజీలు ఆప్షన్ ప్రీమియంను బయ్యర్ల నుంచి ముందుగానే పూర్తిగా వసూలు చేయడం. డెరివేటివ్స్ ఎక్స్పైరీ రోజున మార్జిన్ల పెంపు, క్యాలెండర్ స్ప్రెడ్ ప్రయోజనాల తొలగింపు. ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజున టెయిల్ రిస్క్ కవరేజీ పెంపు. ఈ నిబంధనలు నవంబర్ 20 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు దశల వారీగా అమల్లోకి రానున్నాయి.సెబీ కఠిన నిబంధనల కారణంగా మొత్తం ఎఫ్అండ్ఓ ట్రేడ్స్‌లో 60% మేర ప్రభావం ఉండొచ్చు. మా ప్లాట్ఫామ్లో డెరివేటివ్ ఆర్డర్లు 30% తగ్గుతాయని భావిస్తున్నాం. – నితిన్ కామత్, జీరోధా ఫౌండర్, సీఈఓ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఎఫ్‌అండ్‌వో చర్చాపత్రంపై సెబీకి భారీగా ఫీడ్‌బ్యాక్
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌కి సంబంధించి విడుదల చేసిన చర్చాపత్రంపై దాదాపు 6,000కు పైగా పరిశ్రమవర్గాల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. ఆ ఫీడ్‌బ్యాక్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా వేగవంతంగా ప్రాసెస్ చేసినట్లు ఆమె చెప్పారు. నిఘా, ప్రాసెసింగ్‌ను మెరుగుపర్చేందుకు పలు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై సెబీ పని చేస్తోందని మాధవి వివరించారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి సంబంధించి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, డెరివేటివ్ మార్కెట్లలో స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై జూలైలో సెబీ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. కనీస కాంట్రాక్టు సైజును పెంచడం, పొజిషన్ లిమిట్స్‌ను ఇంట్రా–డేలో పర్యవేక్షించడం, స్ట్రైక్ ప్రైస్‌లను క్రమబదీ్ధకరించడం, నియర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ మార్జిన్‌ను పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
డెరివేటివ్స్అంటే దడే!
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(డెరివేటివ్స్) లావాదేవీలపై పన్నును పెంచేందుకు ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌అండ్‌వో సెక్యూరిటీస్‌లో ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ)ను పెంచారు. దీంతో సెక్యూరిటీల ఆప్షన్ విక్రయంపై ప్రస్తుతమున్న ఆప్షన్ ప్రీమియంలో 0.625 శాతం పన్ను 0.1 శాతానికి పెరగనుంది. ఇక సెక్యూరిటీల ఫ్యూచర్స్ విక్రయంపై సైతం 0.0125 శాతం నుంచి 0.02 శాతానికి పెంచారు. అక్టోబర్ 1 నుంచి పన్ను పెంపు అమల్లోకి రానుంది.నిజానికి ఎఫ్‌అండ్‌వో విభాగంలో ఇటీవల కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా ఆసక్తి చూపుతున్నారు. దీనిపై సెబీ, ఆర్థిక శాఖ, స్టాక్ ఎక్సే్ఛంజీలతోపాటు ఆర్థిక సర్వే సైతం ఆందోళన వ్యక్తం చేసింది. డెరివేటివ్స్ విభాగంలో రిటైలర్ల పారి్టసిపేషన్ భారీగా పెరిగిపోతుండటంతో జూదానికి దారితీస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో సీతారామన్ ఎఫ్‌అండ్‌వో లావాదేవీలపై పన్నులను పెంచేందుకు నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సెబీ చీఫ్ మాధవి పురి బచ్, ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ ఇటీవలే ఎఫ్‌అండ్‌వో లావాదేవీలు పెరుగుతుండటంపై రిటైలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. రిటైలర్లను డెరివేటివ్స్ అత్యధికంగా ఆకట్టుకుంటున్న కారణంగా విశ్లేషకులు సైతం రిస్కులను అర్ధం చేసుకోగలిగినవాళ్లు మాత్రమే లావాదేవీలను చేపట్టమంటూ అప్రమత్తం చేస్తున్నారు. సాధారణ ఇన్వెస్టర్లు వీటిని చేపట్టకపోవడమే మేలని సూచిస్తున్నారు. టర్నోవర్ దూకుడు డెరివేటివ్స్ విభాగంలో నెలవారీ టర్నోవర్ 2024 మార్చికల్లా కొన్ని రెట్లు ఎగసి రూ. 8,740 లక్షల కోట్లను తాకింది. 2019 మార్చిలో కేవలం రూ. 217 లక్షల కోట్లుగా నమోదుకావడం గమనార్హం! ఇదే కాలంలో నగదు విభాగంలోనూ రోజువారీ సగటు టర్నోవర్ రూ. లక్ష కోట్లను తాకగా.. ఎఫ్‌అండ్‌వోలో రూ. 330 లక్షల కోట్లకు చేరింది. ఎఫ్‌అండ్‌వో అంటే? ఒక షేరు లేదా కమోడిటీ విలువ ఆధారంగా కుదుర్చుకునే తాత్కాలిక కాంట్రాక్ట్‌ల లావాదేవీలను ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌గా పేర్కొనవచ్చు. అత్యధిక శాతం ట్రేడర్లు రిసు్కల రక్షణ(హెడ్జింగ్)కు, ధరల కదలికలపై అంచనాలు, షేర్లు లేదా కమోడిటీల ధర వ్యత్యాసాల లబ్ధికి సైతం వీటిలో లావాదేవీలను చేపడుతుంటారు. వెరసి వీటిని స్వల్పకాలిక లాభార్జనకు స్పెక్యులేటివ్ టూల్‌గా వినియోగిస్తుంటారు. అయితే మార్కెట్ ఆటుపోట్లు, లెవరేజ్.. తదితర రిస్క్‌ల కారణంగా అత్యధికస్థాయిలో నష్టాలు సైతం వాటిల్లుతుంటాయి.సెబీ ఇటీవలి నివేదిక ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లలో 89 శాతంమంది డెరివేటివ్స్‌లో నష్టపోతున్నారు. 2021–22 ఏడాదిలో వీరికి సగటున రూ. 1.1 లక్ష చొప్పున నష్టాలు నమోదయ్యాయి. కరోనా కాలంలో ఎఫ్‌అండ్‌వో ఇన్వెస్టర్ల సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. 2019లో ఈ సంఖ్య 7.1 లక్షలుకాగా.. 2021కల్లా 45.24 లక్షలకు జంప్‌చేసింది.5 రెట్లు అధికమైనా.. డెరివేటివ్స్‌లో ఎస్టీటీ 5 రెట్లు పెరగనున్నట్లు సిట్రస్ అడ్వయిజర్స్ వ్యవస్థాపకుడు సంజయ్ సిన్హా పేర్కొన్నారు. ఇటీవల ఈ విభాగంలో లావాదేవీలు భారీగా పెరిగిన నేపథ్యంలో పన్ను పెంపు ఊహించిందేనని తెలియజేశారు.అయితే పన్ను పెంపు అమల్లోకిరానున్న 2024 అక్టోబర్ 1 నుంచి ఎక్సే్ఛంజీల టర్నోవర్ చార్జీలు తగ్గనున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ డిజిటల్ బిజినెస్ హెడ్ ఆశిష్ నందా పేర్కొన్నారు. ఉదాహరణకు ఆప్షన్స్‌పై రూ. 10,000 రౌండ్ ట్రిప్ ప్రీమియంపై ఎస్టీటీ రూ. 3.75 పెరుగుతుందనుకుంటే.. టర్నోవర్ చార్జీలు రూ. 3.5–4 స్థాయిలో తగ్గనున్నట్లు వివరించారు. దీంతో నికరంగా ప్రభావం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.ఎల్‌టీసీజీలో సవరణలుకేంద్రానికి రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయంబడ్జెట్లో వివిధ ఆస్తుల(సెక్యూరిటీలు, స్థిరాస్తులు) హోల్డింగ్ కాలావధి ఆధారంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లను క్రమబదీ్ధకరించారు. ఏడాదికి మించి లిస్టెడ్ ఫైనాన్షియల్ ఆస్తుల హోల్డింగ్‌తోపాటు.. రెండేళ్లకు మించి ఆర్థికేతర ఆస్తులు, అన్‌లిస్టెడ్ ఆస్తుల హోల్డింగ్స్ దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ (ఎల్టీసీజీ) జాబితాలో చేరనున్నాయి.అన్‌లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లను మినహాయించి(వీటికి సంబంధిత స్లాబ్‌లు వర్తిస్తాయి) వివిధ ఆస్తులపై దీర్ఘకాలిక లాభాల పన్ను సగటున 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచారు. ఇక స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్, బిజినెస్ ట్రస్ట్ యూనిట్లు వీటిలోకి వస్తాయి. అయితే ఆర్థికేతర ఆస్తులపై 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించారు.అయితే ఇండెక్సేషన్ లబ్ధిని ఎత్తివేశారు. ఎల్టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి రూ. లక్ష నుంచి రూ. 1.25 లక్షలకు పెంచారు. కాగా... మూలధన లాభాలపై పన్ను(క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్) రేట్ల సవరణ కారణంగా రూ. 15,000 కోట్లమేర అదనపు ఆదాయం సమకూరే వీలున్నట్లు రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా అంచనా వేశారు. బైబ్యాక్ షేర్లపైనా పన్నుడివిడెండ్ తరహాలో విధింపు బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం డివిడెండ్ తరహాలో బైబ్యాక్ చేసే షేర్లపై వాటాదారులు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అక్టోబర్ 1నుంచి అమల్లోకి రానున్న నిబంధనలతో ఇకపై బైబ్యాక్ షేర్లకు వాటాదారులపై పన్ను విధించనున్నారు.వెరసి కంపెనీలు చేపట్టే బైబ్యాక్‌లో భాగంగా షేర్లకు చెల్లించే సొమ్ముపై డివిడెండ్ తరహాలో వాటాదారులపైనే పన్ను భారం పడనుంది. ఇది ఇన్వెస్టర్లపై పన్ను భారాన్ని మరింత పెంచనుంది. మరోవైపు ఎస్టీటీతోపాటు.. స్వల్పకాలిక లాభాలపై పన్ను పెంపునకు తాజా బడ్జెట్ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ బైబ్యాక్ షేర్లకు కంపెనీలే పన్ను చెల్లిస్తున్నాయి.మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్..ప్రపంచ కప్ గెలిచిన తర్వాత.. టీమ్ ఇండియా కోసం ఆర్థిక మంత్రి సీతారామన్ ద్వారా ఒక మ్యాచ్ విన్నింగ్ బడ్జెట్ ఇది. సామాన్యుల ప్రయోజనాలపై బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అనుభవజు్ఞడైన కెప్టెన్ నాయకత్వంలో దేశం నాడిని పెంపొందించే కచి్చత, వివరణాత్మక, పరిశోధించి రూపొందించిన బడ్జెట్. – హర్‡్ష గోయెంకా, చైర్మన్, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్. పెట్టుబడులను ఆకర్షిస్తుంది..ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడానికి, స్థిర భవిష్యత్తును ప్రోత్సహించడానికి రూపొందించిన దార్శనికత, ఆచరణాత్మక బ్లూప్రింట్. ఇది వినియోగాన్ని ప్రేరేపిస్తుంది. గణనీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరిస్తుంది. భారత్‌ను సాంకేతికతతో నడిచే, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టింది. – పవన్ ముంజాల్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్, హీరో మోటోకార్ప్.సమగ్ర రోడ్‌మ్యాప్..ప్రజల–కేంద్రీకృత బడ్జెట్. ఇది ఆర్థిక స్థిరత్వంతో సమానమైన వృద్ధిని సమతుల్యం చేస్తుంది. ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తూనే సుస్థిర, సమాన వృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. – సంజీవ్ పురి, ప్రెసిడెంట్, సీఐఐ. -
Economic Survey 2023-24: ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ ప్రమాదకరం
న్యూఢిల్లీ: ప్రభుత్వం డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుగా కమోడిటీల జాబితాను విస్తరించినప్పటికీ మార్కెట్లు మరింత అభివృద్ధి చెందేటంతవరకూ బియ్యం, గోధుమలుసహా ఇతర తృణధాన్యాలలో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రమాదకరమని ఆర్థిక సర్వే ప్రస్తావించింది. సున్నిత(సెన్సిటివ్) కమోడిటీలను ఫ్యూచర్స్ మార్కెట్లనుంచి ప్రస్తుతానికి పక్కనపెట్టడమే మేలు. అగ్రికల్చర్ ఫ్యూచర్స్ మార్కెట్ ఆయిల్‌సీడ్స్, కాటన్, బాస్మతి బియ్యం, మసాలా దినుసుల వంటి నాన్సెన్సిటివ్ కమోడిటీలపై దృష్టి పెట్టడం మంచిదని పేర్కొంది. ఇటీవల ప్రభుత్వం డెరివేటివ్స్‌లోకి కమోడిటీలను 91 నుంచి 104కు పెంచింది. యాపిల్స్, జీడిపప్పు, వెల్లుల్లి, పాలపొడి, వైట్ బటర్ తదితరాలను జాబితాలో కొత్తగా చేర్చింది. కాగా.. చిన్న రైతులతోకూడిన రైతు ఉత్పత్తి సంస్థల(ఎఫ్‌పీవోలు)ను కమోడిటీ మార్కెట్లతో అనుసంధానించాలి. ప్రభుత్వం, సెబీ, కమోడిటీ ఎక్సే్ఛంజీలు ఎఫ్‌పీవోలను ప్రోత్సహించాలి. ఆర్థిక అక్షరాస్యత ద్వారా వీటి నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపరచాలి. వెరసి అగ్రిడెరివేటివ్స్ ద్వారా రైతులు లబ్ది పొందేందుకు వీలు కలి్పంచాలి.అవకతవకలకు చాన్స్ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) విభాగంలో రిటైల్ ఇన్వెస్టర్ల లావాదేవీలు పెరిగితే జూదాల(గ్యాంబ్లింగ్)కు వీలు ఏర్పడుతుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. డెరివేటివ్స్‌లో రిటైలర్ల ఆసక్తి పుంజుకోవడం ఆందోళనకర అంశం. అభివృద్ధి చెందుతున్న దేశంలో స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌కు అవకాశంలేదు. కొన్ని సందర్భాలలో అసాధారణ లాభాలకు డెరివేటివ్స్ వీలు కలి్పస్తాయి. అయితే ఇది జూదానికి దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్థిక మంత్రి, సెబీ చీఫ్, స్టాక్ ఎక్సే్ఛంజీలు సైతం రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించాయి. తక్కువ తలసరి ఆదాయంగల దేశాలలో ఎఫ్‌అండ్‌వో సమర్థనీయంకాదు. దిద్దుబాటుకు అవకాశమున్న మార్కెట్లలో రిటైలర్లకు ఎఫ్‌అండ్‌వో ద్వారా అధిక నష్టాలకు వీలుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు సైతం చేటు చేస్తుంది. 2019లో రూ. 217 లక్షల కోట్ల టర్నోవర్ 2024కల్లా రూ. 8,740 ట్రిలియన్లకు చేరడం ఎఫ్‌అండ్‌వో విభాగ భారీ వృద్ధిని అద్దం పడుతోంది. అయితే ఇదే కాలంలో ఈక్విటీ నగదు టర్నోవర్ సగటు సైతం రూ. లక్ష కోట్ల నుంచి రూ. 330 లక్షల కోట్లకు ఎగసింది. ఇది కూడా ఆందోళనకర అంశమే. కుటుంబ పొదుపులో 20 శాతం ఫైనాన్షియల్ మార్కెట్లలో పెట్టుబడులకు తరలివస్తోంది. ప్రత్యక్షంగా, మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది రూ. 14 లక్షల కోట్లు ఎగసింది. ఏయూఎం రూ. 53.4 లక్షల కోట్లను తాకింది. ఇక సెబీ నివేదిక ప్రకారం 89 శాతంమంది రిటైలర్లు 2022లో డెరివేటివ్స్ ద్వారా సగటున రూ. 1.1 లక్షలు నష్టపోయారు.ఆరోగ్యంతోనే ఆశించిన ప్రయోజనాలు భారత్ అధిక జనాభా నుంచి ఆశించిన ఫలాలను పొందాలంటే ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లకుతోడు, మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం, ప్రజలు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తు చేసింది. అధికంగా ప్రాసెస్ చేసిన, చక్కెరలు, కొవ్వులు అధికంగా ఉన్న ఆహారాల వినియోగంతో సమాజంలో స్థూలకాయం పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో 56.4 శాతం వ్యాధులకు అనారోగ్యకర ఆహార అలవాట్లే కారణమన్న ఐసీఎంఆర్ తాజా అంచనాలను వెల్లడించింది. ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, స్థూలకాయం నివారణ కోసం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరింది. పట్టణ ప్రాంతాల్లో 29.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 19.3 శాతం పురుషులు స్థూలకాయంతో బాధపడుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలను ప్రస్తావించింది. కొన్ని రాష్ట్రాల్లో ఇది మరింత అధికంగా ఉందంటూ.. ఢిల్లీలో 41.3 శాతం మహిళలు, 38 శాతం పురుషుల్లో ఈ సమస్య ఉన్నట్టు పేర్కొంది. మానసిక ఆరోగ్యంపై సమాజంలో తగినంత చర్చ జరగడం లేదని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. వ్యక్తిగత, దేశాభివృద్ధిపై ఇది ప్రభావం చూపిస్తుందని తెలిపింది. వైవిధ్యమైన, భిన్నమైన ఆహారం దిశగా అడుగులు వేయాలని సూచించింది. ఈకామర్స్ వృద్ధికి అవరోధాలు డేటా ప్రైవసీ అంశాలు, ఆన్లైన్ మోసాలతో సవాళ్లు వ్యక్తిగత వివరాల గోప్యత సమస్యలు, పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు దేశీయంగా ఈకామర్స్ వృద్ధికి ప్రధాన అడ్డంకిగా నిలుస్తున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2030కల్లా దేశీ ఈకామర్స్ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఒక అంచనా. అయితే ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్ వినియోగంలో వినియోగదారులు మోసపోకుండా తగిన విధంగా సన్నద్దం(ఎడ్యుకేట్) చేయవలసి ఉంది. ఇదేవిధంగా ఆన్లైన్ విక్రయాలకు సైతం కేటలాగింగ్ తదితర నైపుణ్యాలను పెంచవలసి ఉంది. వీటికితోడు వ్యక్తిగత వివరాల గోప్యత అంశాలు, ఆన్లైన్లో పెరుగుతున్న మోసాలు ఈకామర్స్ వృద్ధిని దెబ్బతీస్తున్నాయి. వెరసి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను రక్షణాత్మకంగా వినియోగించుకోవడంలో యూజర్లకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా దేశీ ఈకామర్స్ వేగవంతంగా వృద్ధి చెందుతోంది. ఇందుకు మెరుగుపడుతున్న సాంకేతికతలు, ఆధునికతరం బిజినెస్ విధానాలు, డి/æటల్ ఇండియా వంటి ప్రభుత్వ చర్యలు, ఓఎన్డీసీ, ఎఫ్‌డీఐ విధానాల్లో సరళత, వినియోగదారుల రక్షణ చట్టాలు సహకరిస్తున్నాయి.124 బిలియన్ డాలర్లకు రెమిటెన్సులు... సేవా రంగం ఎగుమతుల తర్వాత భారతదేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న రెమిటెన్సులు 2024లో 3.7 శాతం పురోగతితో 124 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని సర్వే పేర్కొంది. 2025లో 4 శాతం వృద్ధితో 129 బిలియన్ డాలర్లకు పురోగమిస్తాయని వివరించింది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు తమ సొంత దేశానికి నిధులు పంపడానికి సంబంధించిన రెమిటెన్సుల విషయంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో నిలుస్తోంది. 2023లో 120 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు దేశాలనికి వచి్చనట్లు ప్రపంచబ్యాంక్ ఇటీవలి నివేదిక పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్ వంటి కీలక దేశాలతో తన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)ని అనుసంధానించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు వ్యయాలను తగ్గించి, చెల్లింపులను వేగవంతం చేయగలవని అంచనా వేసినట్లు సర్వే వివరించింది. ఆటో రంగంలో రూ. 67,690 కోట్ల పెట్టుబడులు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంతో (పీఎల్ఐ) ఆటోమొబైల్, ఆటో విడిభాగాల పరిశ్రమలోకి ఇప్పటివరకు రూ. 67,690 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచి్చనట్లు ఆర్థిక సర్వే తెలిపింది. 2024 మార్చి ఆఖరు నాటికి రూ. 14,043 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందని వివరించింది. దరఖాస్తుదారులు 1.48 లక్షల ఉద్యోగాల కల్పనకు హామీ ఇవ్వగా ఇప్పటివరకు 28,884 ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొంది. ఈ స్కీము కింద 85 దరఖాస్తుదార్లకు ఆమోదం లభించినట్లు సర్వే తెలిపింది. 2023–27 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆటో, ఆటో విడిభాగాల పరిశ్రమ కోసం పీఎల్ఐ స్కీము కింద రూ. 25,938 కోట్ల మేర బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 49 లక్షల ప్యాసింజర్ వాహనాలు, 9.9 లక్షల త్రీ వీలర్లు, 2.14 కోట్ల ద్విచక్ర వాహనాలు, 10.7 లక్షల వాణిజ్య వాహనాల ఉత్పత్తి నమోదైంది. అసమానతల నివారణలో పన్నులు కీలకంకృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత ఉపాధి కల్పన, ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని ఆర్థిక సర్వే తెలిపింది. కనుక రాబోయే రోజుల్లో సమాజంలోని అసమానతల పరిష్కారంలో పన్ను విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంది. అంతర్జాతీయంగానూ అసమానతలు పెరిగిపోతుండడం విధాన నిర్ణేతలకు కీలక ఆర్థిక సవాలుగా పరిణమిస్తున్నట్టు తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెబుతూ.. ఉపాధి కల్పన, సంఘటిత రంగంతో అసంఘటిత రంగం అనుసంధానం, మహిళా కారి్మక శక్తి పెంచడం కోసం చర్యలు తీసుకున్నట్టు గుర్తు చేసింది. దేశంలో ఒక్క శాతం ప్రజలు 6–7 శాతం ఆదాయం పొందుతున్నట్టు, టాప్–10 శాతం వర్గం మొత్తం ఆదాయంలో ఒకటో వంతు వాటా కలిగి ఉన్నట్టు గుర్తు చేసింది. మరింత తగ్గనున్న వాణిజ్య లోటు .. రాబోయే రోజుల్లో వాణిజ్య లోటు మరింత తగ్గగలదని ఆర్థిక సర్వే తెలిపింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకాలతో దేశీయంగా తయారీకి ఊతం లభించడం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో ఎగుమతులు పెరగడం వంటి అంశాలు ఇందుకు దోహదపడగలవని వివరించింది. అయితే, కమోడిటీల ధరల్లో, ముఖ్యంగా చమురు, లోహాలు, వ్యవసాయోత్పత్తులు మొదలైన వాటి ధరల్లో హెచ్చుతగ్గులనేవి వాణిజ్య సమతౌల్యత, ద్రవ్యోల్బణ స్థాయులపై ప్రభావం చూపవచ్చని పేర్కొంది. అలాగే, ప్రధాన వ్యాపార భాగస్వామ్య దేశాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు భారత ఎగుమతి అవకాశాలను ప్రభావితం చేయొచ్చని వివరించింది. భౌగోళిక రాజకీయ సవాళ్ల వల్ల ఉత్పత్తుల ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ, అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడమనేది 2023 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు తగ్గడానికి తోడ్పడిందని సర్వే వివరించింది. ఉత్పత్తులపరమైన వాణిజ్య లోటు 2022–23లో 265 బిలియన్ డాలర్లుగా ఉండగా 2023–24లో 240 బిలియన్ డాలర్లకు తగ్గింది. వృద్ధుల సంక్షేమానికి ప్రాధాన్యం దేశంలో వృద్ధ జనాభా పెరుగుతున్న తరుణంలో వారి సంరక్షణ అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే తెలియజేసింది. వృద్ధుల సంరక్షణ మార్కెట్ ప్రస్తుతం దేశంలో రూ.58వేల కోట్లుగా ఉందంటూ.. మౌలిక వసతులు, వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అంశంలో అంతరాలున్నట్టు గుర్తు చేసింది. 60–69 సంవత్సరాల వయసులోని వారి సామర్థ్యాలను దేశ ఉత్పాదకత పెంపునకు వినియోగించుకోవాల్సిన ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. వృద్ధాప్య అనుకూల ఉద్యోగాలతో జీడీపీ 1.5 శాతం మేర పెంచుకోవచ్చన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదిక సూచనలను ప్రస్తావించింది. 60 ఏళ్లపైబడిన వయసులోని వారికి తగిన ఉపాధి కలి్పంచడం ద్వారా వారిని సమాజంలో చురుగ్గా, ఆర్థికంగా మెరుగ్గా ఉండేలా చూడొచ్చని, ఇది వారి సంరక్షణ అవసరాలను తగ్గిస్తుందని ఆర్థిక సర్వే సూచించింది. 2022 నాటికి దేశ జనాభాలో 14.7 కోట్ల మంది వృద్ధులు ఉంటే, 2050 నాటికి 34.7 కోట్లకు పెరుగుతారని అంచనా. వాస్తవానికి అద్దంఎకానమీ వాస్తవ పరిస్థితికి సర్వే అద్దం పట్టింది. ఈ అంశాల ప్రాతిపదికన భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడానికి తగిన ‘‘ఆచరణాత్మకమైన’’ మార్గాన్ని సర్వే నిర్దేశించింది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ 7 శాతానికి మించి వృద్ధి భారత వృద్ధికి సంబంధించి సర్వే సానుకూలంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ 7 శాతం వరకూ ఉంటుందని సర్వే అంచనావేసినా, 8 శాతంగా ఉండే అవకాశం ఉందని విశ్వసిస్తున్నాను. – సంజీవ్ పురి, సీఐఐ ప్రెసిడెంట్సంక్షోభాన్ని దాటి స్థిరత్వం.. కోవిడ్ నేపథ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి కోలుకున్న ఎకానమీ.. 2047 నాటికి ‘వికసిత భారత్’ ఆవిర్భావ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశలో ముందుకు కదులుతోంది. సర్వే ఈ అంశాన్ని అద్దం పడుతోంది. – సంజీవ్ అగర్వాల్, పీహెచ్డీ చాంబర్సంస్కరణలు బాటన ముందుకు.. ఎకానమీ అవుట్‌లుక్ పరిణతి చెందినట్లు గమనిస్తున్నాము. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధి రేటును దేశం కొనసాగిస్తుంది. జీఎస్టీ, ఐబీసీ తర్వాత తదుపరి సంస్కరణల బాటన నడవాల్సిన అవసరం ఉంది. – అనిష్ షా, ఫిక్కీ ప్రెసిడెంట్ సాహసోపేత డాక్యుమెంట్ సాహసోపేతమైనది. భారీ ఉపాధి కల్పనతోపాటు ఏఐ వంటి కొత్త సాంకేతికత సది్వనియోగం చేసుకుని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సంకల్పాన్ని సూచిస్తోంది. – దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్ ఆర్థికాభివృద్ధి లక్ష్యంఅపూర్వ ఆర్థిక పరిస్థితిని అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్పొరేట్ రంగం, విద్యాసంస్థల మధ్య ఒక ఒప్పందాన్ని ఆర్థిక సర్వే ప్రతిపాదించింది. అలాగే వివిధ నిబంధనలను ప్రభుత్వం విడనాడాలి. – రానెన్ బెనర్జీ, పార్ట్నర్, పీడబ్లు్యసీ ఇండియా. సహకారం కీలకంమధ్య కాలంలో వృద్ధికి ప్రైవేట్ కార్పొరేట్ రంగం, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు అవసరమని సర్వే పరోక్షంగా నొక్కి చెప్పింది. ద్రవ్యోల్బణాన్ని నిర్వహించడం అనేది కేవలం ఆర్బీఐ, దాని ద్రవ్య విధాన కమిటీ ప్రత్యేకాధికారం కాదు. ముఖ్యంగా ఆహార ధరల నిర్వహణ రంగంలో కేంద్రం చురుకైన జోక్యం అవసరం. – అదితీ నాయర్, చీఫ్ ఎకనమిస్ట్, ఇక్రాఇన్ఫ్రా ఊతంఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నప్పటికీ.. ఐపీ, మెషినరీలో ప్రైవేట్ పెట్టుబడి కూడా బలంగా ఉంది. గృహాలు, నిర్మాణాలలో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. భౌతిక ఆస్తులలో పొదుపు చేయడానికి కుటుంబాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. – రుమ్కీ మజుందార్, ఎకనమిస్ట్, డెలాయిట్.చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. చిన్న పరిశ్రమల మద్దతు కీలకంప్రభుత్వ దార్శనికత ప్రకారం భారత్ అతి త్వరలో మూడవ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలను ముందుకు నడిపిస్తే తప్ప ఈ దార్శనికతను సాధించలేము. ఎందుకంటే అవి భారతదేశానికి ప్రధాన ఉపాధి మార్గాలు, జీడీపీని నడిపించేవి. – వివేక్ జలన్, పార్ట్నర్, ట్యాక్స్ కనెక్ట్ అడ్వైజరీ సరీ్వసెస్. సవాళ్ల అధిగమనంఅంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించి ఉన్న అభివృద్ధి మార్గంలో ఆర్థిక వ్యవస్థకు ఉన్న కొన్ని కీలక సవాళ్ల గురించి సర్వే చర్చించింది. ఉద్యోగాలను పెంచడం, గ్రామీణ పట్టణ విభజనను తగ్గించడంపై దృష్టి కేంద్రీకరించడం ప్రభుత్వ రాడార్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. – రిశి షా, పార్ట్నర్, గ్రాంట్ థాంటన్. పెట్టుబడుల పురోగతిసర్వేలో అంచనా వేసిన 6.5–7 శాతం వృద్ధికి 35–36 శాతం నిజమైన పెట్టుబడి రేటు అవసరం. తదనుగుణంగా 33–34 శాతం నిజమైన పొదుపు రేటు ఉండాలి. ప్రస్తుత పొదుపు, పెట్టుబడి రేట్లను బట్టి ఇది సాధ్యమయ్యేలా కనిపిస్తోంది. తగిన విధానపర జోక్యాల ద్వారా రెండు మూడు దశాబ్దాల్లో వృద్ధి ఈ స్థాయిలో కొనసాగాలి. – డి.కె.శ్రీవాస్తవ, చీఫ్ పాలసీ అడ్వైజర్, ఈవై ఇండియా. -
ఎన్ఎస్ఈలో కొత్తగా 4 సూచీలు
నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కీలకంగా నిలవనున్నాయి. ఇన్ఫ్రా ఇండెక్స్‌లో ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ ప్రాధాన్యత వహించనున్నాయి. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆర్థిక ఫలితాలు, ఎఫ్‌అండ్‌వో ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ సిరీస్ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితాల జోరు ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ నెల 24న, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్టŠస్ 25న, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ టవర్స్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్టీఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో 27న, ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి. ఇతర అంశాలూ కీలకమే నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్‌లలో బ్యాంకింగ్ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విదేశీ అంశాలకూ ప్రాధాన్యం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారమిలా.. ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్ క్యాప్ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి. ఎఫ్‌పీఐల పెట్టుబడులు దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్ కంపెనీలలో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్‌పీఐలు ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి. -
సూచీలకు పన్ను పోటు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్ సెషన్ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఏఎంసీ షేర్ల పతనం.. తాజా ఫైనాన్స్ బిల్లుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్ 3.2 శాతం, నిప్పన్ లైఫ్ ఇండియా 1.3 శాతం చొప్పున క్షీణించాయి. -
ఎఫ్‌అండ్‌వోలో బ్రోకరేజీల జోరు..
ముంబై: డిస్కౌంట్ బ్రోకరేజీలను మించి పూర్తిస్థాయి బ్రోకింగ్ సంస్థలు ఇటీవల రిటైల్ డెరివేటివ్ విభాగంలో జోరు చూపుతున్నాయి. ఫ్యూచర్ అండ్ అప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) లావాదేవీలలో ఏంజెల్‌వన్, మోతీలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకరేజీలను మించుతూ ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. రిటైల్ విభాగంలో ఏంజెల్‌వన్ 82 శాతం, మోతీలాల్ ఓస్వాల్ 54 శాతం ఆదాయ వాటాను పొందినట్లు ఒక నివేదిక పేర్కొంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇటీవల చేపట్టిన ఒక పరిశీలన ప్రకారం డిస్కౌంట్ బ్రోకర్స్ ఎన్ఎస్ఈలో అత్యధికంగా జరిగే ఎఫ్‌అండ్‌వో లావాదేవీల జోరుకు కారణమవుతున్నాయి. ఎఫ్‌అండ్‌వో పరిమాణంలో 2022లోనూ ఎన్ఎస్ఈ వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్ ఎక్సే్ఛంజీగా నిలిచిన సంగతి తెలిసిందే. రిటైలర్లకు నష్టాలు గత కేలండర్ ఏడాది(2022)లో రిటైల్ ట్రేడర్లు నిర్వహించిన 10 ఎఫ్‌అండ్‌వో ట్రేడ్లలో 9 నష్టాలతోనే ముగిసినట్లు గత నెలలో సెబీ పేర్కొంది. సుమారు రూ. 1.1 లక్షల కోట్ల నష్టాలు నమోదైనట్లు తెలియజేసింది. అంతేకాకుండా 2019తో పోలిస్తే డెరివేటివ్ విభాగంలో రిటైల్ ట్రేడర్ల సంఖ్య 500 శాతం పెరిగినట్లు వెల్లడించింది. వెరసి ఇన్వెస్టర్ల కోసం బ్రోకర్లు, స్టాక్ ఎక్సే్ఛంజీలు రూపొందించే అదనపు రిస్క్ మార్గదర్శకాలను త్వరలోనే జారీ చేయనున్నట్లు తెలియజేసింది. టెక్నాలజీపై దృష్టిపెట్టిన ఏంజెల్‌వన్ అతితక్కువ కాలంలోనే 12.89 మిలియన్ కస్టమర్లను పొందడం ద్వారా 2023 జనవరికల్లా అతిపెద్ద బ్రోకరేజీగా ఆవిర్భవించింది. 2022 అక్టోబర్–డిసెంబర్(క్యూ3) కాలంలో సాధించిన రూ. 800 కోట్ల ఆదాయంలో 82 శాతం వాటాను ఈక్విటీ డెరివేటివ్ ట్రేడింగ్ ద్వారానే పొందింది. ఈ కంపెనీ వెబ్సైట్ ప్రకారం వరుసగా గత రెండు సంవత్సరాలలో ఎఫ్‌అండ్‌వో వాటా 72 శాతం, 52 శాతంగా నమోదైంది. ఇక ఈ క్యూ3లో మోతీలాల్ ఆర్జించిన రూ. 688 కోట్ల ఆదాయంలో 54 శాతం వాటా ఎఫ్‌అండ్‌వో విభాగం నుంచే లభించింది. 2019లో 39 శాతంగా నమోదైన ఈ వాటా తదుపరి ఇదేస్థాయిలో కొనసాగుతూ తాజాగా 54 శాతానికి ఎగసింది. మరోవైపు బ్రోకింగ్ రంగంలో రెండో ర్యాంకులో ఉన్న జిరోధా డెరివేటివ్ విభాగం నుంచి 20 శాతమే పొందింది. ఈ సంస్థ 7 మిలియన్ యాక్టివ్ కస్టమర్లతో డిస్కౌంట్ బ్రోకింగ్‌లో టాప్ ర్యాంకులో నిలుస్తోంది. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి 75 శాతం పరిమాణాన్ని సాధిస్తోంది. అప్‌స్టాక్స్, 5పైసా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తదితరాలు సైతం డిస్కౌంట్ బ్రోకింగ్ సేవలు అందిస్తున్న విషయం విదితమే. కాగా.. పూర్తిస్థాయి బ్రోకింగ్ సేవలందించే జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్‌అండ్‌వో నుంచి 20 శాతం ఆదాయాన్ని అందుకుంది. ఈ బాటలో 8.7 మిలియన్ కస్టమర్లను కలిగిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ డెరివేటివ్స్‌నుంచి 20 శాతం ఆదాయాన్నే పొందింది. డెరివేటివ్స్‌లో రిటైలర్లు సెబీ పరిశీలన ప్రకారం గతేడాది(2022)లో టాప్–10 బ్రోకర్ల ద్వారా 45 లక్షలకుపైగా రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో లావాదేవీలు నిర్వహించారు. 2019లో నమోదైన 7.1 లక్షమందితో పోలిస్తే ఈ సంఖ్య 500 శాతం దూసుకెళ్లింది. ఇటీవల కొత్త ఇన్వెస్టర్లు, యువత అత్యధికంగా ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ చేపడుతున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో 36 శాతం 20–30 మధ్య వయసువారు కావడం గమనార్హం! 2019లో వీరి సంఖ్య 11 శాతమే. -
Stock Market: కరెక్షన్ కొనసాగొచ్చు
ముంబై: స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా కరెక్షన్ కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డెరివేటివ్‌ల గడువు(గురువారం) ముగింపుతో పాటు ఈ వారంలో సుమారు 700కి పైగా కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపవచ్చని వారు అంచనా వేస్తున్నారు. సూచీల గమనాన్ని ప్రపంచ పరిణామాలు నిర్ధేశిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అలాగే కరోనా కేసుల నమోదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, రూపాయి విలువ, క్రూడాయిల్ ధరల కదలికలు తదితర అంశాలూ ట్రేడింగ్ పై ప్రభావాన్ని చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘‘బ్యాంక్ నిఫ్టీ తొలిసారి 40,000 స్థాయిని అధిగమించింది. అనేక బ్యాంకులు ఈ వారంలో రెండో క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఎఫ్అండ్ఓ ముగింపు, కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల నేపథ్యంలో కరెక్షన్(దిద్దుబాటు) కొనసాగేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పతనం కొనసాగితే నిఫ్టీకి దిగువ స్థాయిలో 18,050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువస్థాయిలో 18,300–18,350 శ్రేణిలో వద్ద బలమైన నిరోధం ఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సరీ్వసెస్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. వరుస నాలుగు రోజుల పతనంతో గతవారం సెన్సెక్స్ 483 పాయింట్లు నిఫ్టీ 224 పాయింట్లు నష్టపోయాయి. క్యూ2 ఫలితాల జాబితా... సూచీలు ముందుగా గత శుక్రవారం విడుదలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, శనివారం వెల్లడైన ఐసీఐసీఐ బ్యాంక్ ఆర్థిక ఫలితాలపై స్పందించాల్సి ఉంటుంది. ఇక ఈ వారంలో నిఫ్టీ–50 ఇండెక్స్‌లోని షేర్లకు చెందిన 20 కంపెనీలతో సహా సుమారు 700కు పైగా కార్పొరేట్లు తమ రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వీసెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర కంపెనీలున్నాయి. ఈ వారంలో రెండు ఐపీఓలు... బ్యూటీ ఉత్పత్తుల సంస్థ నైకాతో పాటు ఫినో పేమెంట్స్ బ్యాంక్స్ ఈ వారం పబ్లిక్ ఇష్యూల(ఐపీఓ) ద్వారా మార్కెట్లోకి రానున్నాయి. ఫినోటెక్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీఓ ఈ నెల 29న(శుక్రవారం) ప్రారంభమై.., నవంబర్ 2న ముగుస్తుంది. ధర శ్రేణిని కంపెనీ ఈ వారంలో ప్రకటించనుంది. ఎఫ్ఐఐల ట్రెండ్ రివర్స్... గత రెండు నెలల్లో కనిపించిన పెట్టుబడుల ట్రెండ్‌కు భిన్నంగా విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) దేశీయ ఈక్విటీల అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం నికరంగా అక్టోబర్ నెలలో ఇప్పటివరకూ(అక్టోబర్ 24)ఎఫ్‌పీఐలు రూ. 3,825 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇందులో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.2,331 కోట్ల షేర్లను అమ్మగా., డెట్ మార్కెట్లో రూ.1,494 కోట్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ షేర్ల పట్ల బేరిష్ వైఖరి కలిగి ఉన్నారు. బ్యాంకింగ్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఐటీ కంపెనీలు రెండో క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పటికీ.., ఈ ఏడాది తొలి భాగంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,406 కోట్ల ఐటీ షేర్లను విక్రయించారు. సాధ్యమైనంత తొందర్లో ట్యాపరింగ్ చర్యలను చేపట్టడంతో పాటు కీలక వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్ వ్యాఖ్యలతో విదేశీ ఇన్వెస్టర్లు వర్థమాన దేశాల మార్కెట్లలో లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని జియోజిత్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ ప్రధాన వ్యూహకర్త వీకే విజయ్ కుమార్ తెలిపారు. 28 నుంచి నైకా ఐపీవో షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125 సౌందర్య సంరక్షణ ఉత్పత్తుల సంస్థ నైకా మాతృసంస్థ ఎఫ్ఎస్ఎన్ ఈ–కామర్స్ వెంచర్స్ ప్రతిపాదిత పబ్లిక్ ఇష్యూ అక్టోబర్ 28న ప్రారంభమై నవంబర్ 1న ముగియనుంది. దీనికి సంబంధించి షేరు ధర శ్రేణి రూ. 1,085–1,125గా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 5,352 కోట్లు సమీకరించనుంది. ఇందులో భాగంగా తాజాగా రూ. 630 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రమోటర్లు.. ప్రస్తుత షేర్హోల్డర్లు 4,19,72,660 షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో విక్రయించనున్నారు. కార్యకలాపాల విస్తరణకు, కొత్త రిటైల్ స్టోర్లు.. గిడ్డంగుల ఏర్పాటు కోసం ఐపీవో నిధులను కంపెనీ వినియోగించనుంది. అలాగే కొంత రుణాన్ని తీర్చడం ద్వారా వడ్డీ వ్యయాలను తగ్గించుకుని, లాభదాయకతను మెరుగుపర్చుకోనుంది. -
అయిదో రోజూ ఆగని అమ్మకాలు
ముంబై: స్టాక్ మార్కెట్లో అయిదో రోజూ అమ్మకాలు ఆగలేదు. ఫలితంగా సెన్సెక్స్ 47వేల స్థాయిని, నిఫ్టీ 14వేల మార్కును కోల్పోయాయి. జనవరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్అండ్ఓ) కాంట్రాక్టులకు చివరి రోజు కావడంతో పాటు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల పరంపర కొనసాగడంతో బుల్స్ ఏ దశలో కోలుకోలేకపోయాయి. బడ్జెట్ ప్రకటనకు ముందు 2020–21 ఆర్థిక సంవత్సరపు సామాజిక ఆర్థిక సర్వే నేడు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి విలువ 13 పైసల పతనం ప్రతికూలాంశాలు మన మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 536 పాయింట్ల నష్టంతో 46,874 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 150 పాయింట్లను కోల్పోయి 13,817 వద్ద నిలిచింది. ఒక్క ప్రైవేట్ రంగ బ్యాంక్స్ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అత్యధికంగా ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 892 పాయింట్లు, నిఫ్టీ 185 పాయింట్లు క్షీణించాయి. మార్కెట్ ఐదురోజుల పతనంతో సెన్సెక్స్ 2,918 పాయింట్లు, నిఫ్టీ 827 పాయింట్లను కోల్పోయాయి. దేశీయ ఫండ్లు(డీఐఐ)లు జనవరి 1 తర్వాత దాదాపు 28 రోజుల తర్వాత తొలిసారి రూ.1737 కోట్ల షేర్లను కొని నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ.3713 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఎదురీదిన ప్రైవేట్ బ్యాంకు షేర్లు... మార్కెట్ భారీ నష్టాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకులు ఎదురీదాయి. డిసెంబర్ క్వార్టర్లో మొండిబకాయిలు తగ్గినట్లు యాక్సిస్ బ్యాంక్ ప్రకటించడంతో షేరు 6 శాతం లాభపడింది. మెరుగైన క్యూ3 ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో పలు బ్రేకరేజ్ కంపెనీలు బై రేటింగ్‌ను కేటాయించడంతో పాటు టార్గెట్ ధరను పెంచడంతో ఫెడరల్ బ్యాంకు షేరు 3 శాతం ర్యాలీ చేసింది. ఇదే రంగానికి చెందిన బంధన్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, సిటీయూనియన్ బ్యాంక్ షేర్లు 2.50 శాతం నుంచి అరశాతం వరకు ఎగిశాయి. నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు ... రెండురోజుల పాటు సమీక్ష సమావేశాలను నిర్వహించిన యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ కమిటీ వడ్డీరేట్లపై యథాతథ విధానానికే ఓటు వేసినప్పటికీ.., ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో అమెరికా మార్కెట్ బుధవారం 3 నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఆసియా మార్కెట్లు 2%, యూరప్ 1% నష్టంతో ముగిశాయి. బోర్డ్ మీటింగ్స్ ఐఓసీ, సెయిల్, వేదాంత, టాటా మోటార్స్, సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, జస్ట్ డయల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, డీఎల్ఎఫ్, మణిప్పురం ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ -
‘పేటీఎం మనీ’పై ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్
న్యూఢిల్లీ: పేటీఎంకు చెందిన పేటీఎం మనీ తన ప్లాట్‌ఫామ్‌పై ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ (ఎఫ్‌అండ్‌వో) సేవలను అందించనున్నట్టు ప్రకటించింది. వచ్చే 18 నెలల నుంచి 24 నెలల కాలంలో రోజువారీ రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ బుధవారం ప్రకటించింది. పేటీఎం మనీ ఇప్పటికే స్టాక్స్, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్, ఐపీవో, ఎన్పీఎస్, డిజిటల్ బంగారం సాధనాల్లో పెట్టుబడుల సేవలను అందిస్తోంది. 10 కోట్ల మంది భారతీయులకు వెల్త్ సేవలను (సంపద) అందించడమే తమ లక్ష్యమని, ఎఫ్‌అండ్‌వో సేవలను ప్రారంభించిన సందర్భంగా పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవల ఆరంభం దీన్ని మరింత వేగవంతం చేస్తుందన్నారు. ‘‘మొదటిసారి మొబైల్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉత్పత్తిని రూపొందించాము. ఎంతో సులభంగా, తక్కువ ధరతో కూడిన ఉత్పత్తులను అందించడం ద్వారా చిన్న పట్టణాల్లోకి బలంగా చొచ్చుకుపోతాము’’ అని విజయ్ శేఖర్ శర్మ చెప్పారు. ట్రేడ్‌కు రూ.10 చార్జీ అన్ని రకాల ఎఫ్‌అండ్‌వో లావాదేవీలకు కేవలం రూ.10 చార్జీగా (ఒక ఆర్డర్‌కు) పేటీఎం వసూలు చేయనుంది. క్యాష్ విభాగంలోనూ ఇంట్రాడే ట్రేడ్స్‌కు రూ.10, డెలివరీ ట్రేడ్స్‌ను ఉచితంగా ఈ సంస్థ ఆఫర్ చేస్తోంది. 18–24 నెలల్లో రోజువారీగా మిలియన్ ట్రేడ్స్‌ను, రూ.1.5 లక్షల కోట్ల టర్నోవర్‌ను సాధించాలనే లక్ష్యాన్ని విధించుకున్నట్టు పేటీఎం మనీ సీఈవో వరుణ్ శ్రీధర్ చెప్పారు. ఎఫ్‌అండ్‌వో సేవలను తొలుత 500 మంది యూజర్లకు అందిస్తామని.. వచ్చే రెండు వారాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. -
ప్యాకేజీపై మార్కెట్ దృష్టి
దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈవారంలో జరిగే పరిణామాలు కీలకం. లాక్డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉన్నందున ఈ విషమ పరిస్థితుల్లో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ సర్కార్ ప్రకటిస్తుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులే.. మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం (మే1) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలకు సెలవు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. ఏప్రిల్ సిరీస్ ముగింపు ఈవారంలోనే.. గురువారం (30న) ఏప్రిల్ నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్ అండ్ ఓ) సిరీస్ ముగియనుంది. బుధవారం సమావేశంకానున్న అమెరికా ఫెడ్.. వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెక్సావేర్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, అంబుజా సిమెంట్స్, అదానీ పవర్ ఫలితాలను ఈవారంలోనే ప్రకటించనున్నాయి. -
ఒడిదుడుకుల వారం..!
ముంబై: మార్చి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ ముగింపు, స్థూల ఆర్థిక అంశాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల(ఎఫ్ఐఐ) నిర్ణయాలు ప్రధానంగా ఈవారంలో దేశీ స్టాక్ మార్కెట్ దిశను నిర్దేశించనున్నట్లు దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఆర్థిక సంవత్సరం ముగింపు నెల అయినందున రుణ మార్కెట్ల నుండి ద్రవ్యలభ్యత (లిక్విడిటీ) తగ్గేందుకు అవకాశం ఉంది. ఇదే సమయంలో రిడెంప్షన్ ఒత్తిడికి ఆస్కారం ఉండడం వల్ల దేశీ సంస్థలు (డీఐఐ)లు కూడా భారీ స్థాయిలో అమ్మకాలకు పాల్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉంది’ అని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘కొంత దిద్దుబాటు జరిగిన తరువాత నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. ప్రస్తుతం అంతర్జాతీయ సంకేతాలు కూడా పురోగతికి ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు లార్జ్‌క్యాప్ ఇండీసెస్ను అవుట్పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎంపికచేసిన షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచన’ అని ఎడిల్వీస్ వెల్త్ మేనేజ్మెంట్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ విశ్లేషించారు. స్థూల ఆర్థిక అంశాలపై దృష్టి.. ద్రవ్య లోటు, మౌలిక సదుపాయాల ఉత్పత్తి డేటా శుక్రవారం (29న) విడుదల కానుండగా.. విదేశీ రుణ గణాంకాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఇవి ఏమాత్రం ప్రతికూలంగా ఉన్నా నిఫ్టీ 11,380 వరకు వెళ్లే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని విశ్లేషించారు. ఇక్కడ కీలక మద్దతు లభించకపోతే మరింత దిద్దుబాటుకు ఆస్కారం ఉందన్నారు. మార్కెట్ పెరిగితే 11,572 కీలక నిరోధంగా పనిచేయనుందని విశ్లేషించారు. అమెరికా–చైనాలు బీజింగ్‌లో భేటీ: వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య గురువారం బీజింగ్‌లో ఇరుదేశాల ఉన్నతస్థాయి అధికారుల మధ్య చర్చలు పునర్ప్రారంభంకానున్నాయి. ఇక్కడ నుంచి వెలువడే కీలక అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ఆలస్యం అవుతున్న ఈ అంశం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రతికూలత చూపుతుందన్నారు. ఈసారి ఏమైనా పురోగతి ఉంటే మాత్రం సూచీలకు సానుకూలం అవుతుందన్నారాయన. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ మరింత జాప్యం కానుందని రాయిటర్స్ భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పార్లమెంట్ తిరస్కరణకు గురైన బ్రెగ్జిట్ ఒప్పందంపై త్వరలోనే మరోసారి ఓటింగ్ ఉండే అవకాశాలున్నాయని అంచనా వేసింది. బ్రెగ్జిట్ అంశంపై కొత్త ప్రజాభిప్రాయ సేకరణను డిమాండ్ చేస్తూ శనివారం లండన్‌లో దాదాపు 10లక్షల మంది పౌరులు మార్చ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై సైతం ఇన్వెస్టర్లు దృష్టిసారించారు. ఇక బ్యాంక్ ఆఫ్ జపాన్ ఈనెల 14–15న జరిగిన పాలసీ మీటింగ్‌కు సంబంధించిన తన బోర్డ్ సభ్యుల అభిప్రాయ సారాంశాన్ని సోమవారం ప్రకటించనుంది. రూపాయికి 68.30 వద్ద మద్దతు.. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ శుక్రవారం ఒక్కసారిగా 2 శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందనే ఆందోళనలు, తగ్గిన డిమాండ్ నేపథ్యంలో ముడిచమురు ధరలు దిగివచ్చి డాలరుతో రూపాయి మారకం విలువకు బలాన్నిచేకూర్చాయి. వరుసగా ఆరోవారంలోనూ బలపడిన రూపాయి.. గతవారంలో 15 పైసలు బలపడి 68.95 వద్ద ముగిసింది. రూపాయికి కీలక నిరోధం 69.50 వద్ద ఉండగా, సమీపకాల మద్దతు 68.30 వద్ద ఉందని ఐసీఐసీఐ డైరెక్ట్ విశ్లేషకులు అమిత్ గుప్తా అన్నారు. విదేశీ నిధుల వెల్లువ.. విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. ఎఫ్ఐఐలు భారత స్టాక్ మార్కెట్లలో రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. మార్చి 1–22 కాలంలో వీరు ఏకంగా రూ.38,211 కోట్ల పెట్టుబడులను పెట్టారు. రూ.27,424 కోట్లను ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసిన వీరు.. రూ.10,787 కోట్లను డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. సాధారణ ఎన్నికల్లో సానుకూలత ఉండవచ్చనే ప్రధాన అంశం కారణంగా వీరి పెట్టుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ నాయర్ అన్నారు. ఇక నుంచి నిధుల ప్రవాహం ఏవిధంగా ఉండనుంది.. రూపాయి కదలికల ఆధారంగా మార్కెట్ గమనం ఉండనుందని ఎస్ఎంసీ ఇన్వెస్ట్మెంట్ అండ్ అడ్వైజర్స్ చైర్మన్, ఎండీ డీకే అగర్వాల్ విశ్లేషించారు. -
ఆర్ఐఎల్..‘ఫ్యూచర్స్’ సిగ్నల్స్!
♦ ఈ రోజు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో (ఎఫ్అండ్ ఓ) ఏ షేర్లయితే బెటర్? ♦ ఆ ‘ఫ్యూచర్ సిగ్నల్స్’ ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... ఆర్ఐఎల్.. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌లో భాగంగా మన మార్కెట్ కూడా గురువారం బాగా తగ్గింది. ఐటీ షేర్లు మినహా దాదాపు బ్లూచిప్ షేర్లన్నీ నష్టాల్లోనే ముగిసాయి. ఈ క్రమంలోనే ఇటీవల పెద్ద ర్యాలీ జరిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా 1 శాతం క్షీణతతో రూ. 1,584 వద్ద క్లోజయ్యింది. స్పాట్ మార్కెట్లో ట్రేడింగ్ పరిమాణం తక్కువగా నమోదుకాగా, ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 4.71 షేర్లు (3.59 శాతం) కట్ అయ్యాయి. ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.26 కోట్లకు తగ్గింది. గురువారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలతో సహా దాదాపు అన్ని స్టాక్ ఫ్యూచర్ల నుంచి కొంతవరకూ లాంగ్ అన్‌వైండింగ్ జరిగింది. అయితే పలు షేర్ల ఫ్యూచర్ ప్రీమియంలు తగ్గగా, ఆర్ఐఎల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ప్రీమియం పెరిగింది. ఆర్ఐఎల్ స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే నాటకీయంగా రూ. 2 నుంచి రూ. 9కి పెరిగింది. ఓఐ తగ్గుతూ...ప్రీమియం పెరగడం షార్ట్ కవరింగ్ కార్యకలాపాల్ని సూచిస్తోంది. రూ. 1,600, 1,620 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో వీటివద్ద కాల్ బిల్డప్ 6.86 లక్షలు, 6.64 లక్షల షేర్లకు పెరిగింది. కానీ 1,640 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్ కారణంగా బిల్డప్ నుంచి లక్ష షేర్లు తగ్గగా, బిల్డప్ 8.08 లక్షల షేర్లకు దిగింది. ఈ ట్రెండ్ షేరుకి నిరోధస్థాయి రూ. 1,640 నుంచి దిగువ శ్రేణి రూ. 1,600–1,620 వద్దకు తగ్గుతుందని కాల్‌రైటర్లు భావించడం కారణం కావొచ్చు. రూ. 1,600 స్థాయికి 1 % దిగువన షేరు ముగిసినా, ఆ స్ట్రయిక్ వద్ద పుట్ బిల్డప్ నుంచి కేవలం 39 వేల షేర్లు కట్ అయ్యాయి. ఇక్కడ 5.50 లక్షల పుట్ బిల్డప్ వుంది. రూ. 1,580 స్ట్రయిక్ వద్ద కూడా 39 వేల పుట్స్ కట్‌కాగా, బిల్డప్ 5.50 లక్షలకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 1,580పైన స్థిరపడితే రూ. 1,600–1,620 శ్రేణిని చేరవచ్చని, రూ. 1,580 స్థాయి దిగువన కొనసాగితే క్రమేపీ క్షీణించవచ్చని ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ⇔ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ సంకేతాలు ఎలా వున్నాయి? ఈ వివరాలు www.sakshibusiness.comలో -
పెరుగుతున్న ఖాతాలు...తగ్గుతున్న బ్రోకింగ్ సంస్థలు
* నగదు మార్కెట్లో క్షీణిస్తున్న లావాదేవీలు * ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పెరుగుతున్న ట్రేడింగ్ పరిమాణం సాక్షి ప్రత్యేక ప్రతినిధి,హైదరాబాద్: ధమాకా దీపావళి వచ్చేసింది. మూరత్ ట్రేడింగ్‌తో కొత్త సంవత్సరం ఖాతాలు తెరుచుకుంటున్నాయ్. గతేడాదితో పోలిస్తే..కొన్ని స్టాక్ బ్రోకింగ్ సంస్థలు రాకెట్లా దూసుకుపోతోంది. గత నాలుగైదునెలలుగా స్టాక్మార్కెట్లో ఇన్వెస్టర్ సెంటిమెంట్ బలపడి వ్యాపార పరిమాణం పెరుగుతోంది. పది లక్షల కొత్తఇన్వెస్టర్ అకౌంట్లు రెండు ప్రధాన డిపాజిటరీ సంస్థలయిన ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్లలో ఈ ఏడాది నమోదయ్యాయి.అయితే అదేం విచిత్రమోకానీ, ఒక వైపు బ్రోకింగ్ బిజినెస్ పెరుగుతున్నా, ఎంతో కాలంగా ఈ వ్యాపారంలో స్థిరపడ్డ బ్రోకర్లు వైదొలగుతుండటం ఆందోళనకలిగిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్ట్ మధ్య కాలంలో 335 మంది వ్యక్తిగత స్టాక్ బ్రోకర్లు, 136 కార్పొరేట్ బ్రోకర్లు, 5,773 మంది సబ్‌బ్రోకర్లు ఈ వ్యాపారం నుంచి వైదొలిగారు. రిటైల్ ఇన్వెస్టర్ లావాదేవీలు ఆశించినంతగా లేకపోవడం, తక్కువ మార్జిన్లుండే ఆప్షన్ల వ్యాపారంపై డే ట్రేడర్లు ఆసక్తి చూపించడం, పెరిగిపోతున్న నిర్వహణా వ్యయాలను తట్టుకోలేకపోవడంతో బ్రోకర్లు వ్యాపారం నుండి వైదొలుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాష్ మార్కెట్లో మందకొడి లావాదేవీలు... మార్కెట్లో 90 శాతం వ్యాపారం కేవలం 10 మంది టాప్ బ్రోకర్ల చేతిలో ఉందని, షేర్ల లావాదేవీల్లో 90 శాతం వ్యాపారం కేవలం ఆప్షన్స్ సెగ్మెంట్లో జరుగుతుందని ఆర్ఎల్పీ సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ మురళి తెలిపారు.గతంలో లాగా షేర్లు కొని డెలివరీ తీసుకునేవారు బాగా తగ్గిపోయారన్నారు. బ్రోకరేజీతో పాటు, సెక్యూరిటీ ట్రేడ్ టాక్స్ (ఎస్టీటీ), సర్వీస్ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ లాంటి వ్యయాలతో పాటు ఒకే ఏడాది వ్యవధిలో షేర్లు కొని అమ్మితే షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్ లావాదేవీ పరిమాణంలో 15 శాతం చెల్లించాల్సిరావడంతో క్యాష్ మార్కెట్లో లావాదేవీలు గ ణనీయంగా తగ్గాయన్నారు. అయితే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో మంచి ట్రేడింగ్ పరిమాణం నమోదవుతోందని, బ్రోకరేజ్ సంస్థలు ట్రేడర్ను బట్టి మార్జిన్లలో డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారన్నారు. ఒక్కో ట్రేడర్ జరిపే లావాదేవీల పరిమాణంబట్టి అతి తక్కువ బ్రోకరేజ్కూడా ఇచ్చేందుకు కొన్ని సంస్థలు సిద్ధపడుతున్నాయన్నారు. ఫైనాన్షియల్ లిటరసీ పెంపొందించాలి... స్టాక్మార్కెట్లో లావాదేవీలు జరిపే క్లయంట్లకు ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం పెద్ద సమస్యగా పరిణమిస్తోందని ప్రశాంత్ శ్రీమాలి, ఎండీ, పీసీఎస్ సెక్యూరిటీస్ తెలిపారు. తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేసినంత మాత్రాన అందరూ ఆన్లైన్ లావాదేవీలు జరపలేరని, సాంప్రదాయబద్ధంగా షేర్ మార్కెట్ బిజినెస్‌చేసే వారు బ్రోకరేజ్ సంస్థలకు దూరం కాలేరని ఆయన చెప్పారు. గత ఏడెనిమిది దశాబ్దాలుగా తామీ వ్యాపారంలో ఉన్నామని, ఇప్పుడు కూడా తమ వ్యాపారంలో 50 శాతం ఆన్లైన్ ట్రేడింగ్ జరుగుతుండగా మిగతా సగం బ్రోకర్ ఇంటరాక్షన్‌తోనే జరుగుతుందన్నారు. రానున్న అడ్వైజరీ సేవలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అందిస్తే ఈ వ్యాపారంలో ఎంతకాలమైనా కొనసాగవచ్చన్నారు. అమెరికాలోలా ఇండియాలో ఫుల్సర్వీస్ బ్రోకర్స్, డిస్కౌంట్ బ్రోకర్స్ అనే విధానంలేదని, ఇక్కడున్నదల్లా డిస్కౌంట్బ్రోకరే జ్ సంస్థలేని వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ వివికే ప్రసాద్ సాక్షి ప్రతినిధికి తెలిపారు. కుటుంబ యాజమాన్యంలో ఉన్న స్టాక్‌బ్రోకింగ్ సంస్థలు హైస్పీడ్ ట్రేడింగ్‌కు అనుగుణంగా సేవలందించేందుకు ముంబైలో కోలొకేషన్ సర్వర్లను ఏర్పాటుచేసుకోలేకపోవడంతోనే ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో పోటీపడలేకపోతున్నాయన్నారు. ఒక్కో కోలొకేషన్ సర్వర్‌కు రూ. కోటి రూపాయలు ఖర్చవుతుందని, దీనితో పాటు ముంబైలో కార్యాలయం నిర్వహించాలంటే అయ్యే ఖర్చులు అదనం కావడంతో పోటీలో నిలవలేని సంస్థలు వ్యాపారం నుంచి వైదొలగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. చౌక ధరలే ఆకర్షణ... ఆన్లైన్ ట్రేడింగ్ పుంజుకోవడంతో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల నుండి స్టాక్స్ కొనుగోళ్లు, విక్రయాలు జోరందుకున్నాయి. నిఫ్టీ ఆప్షన్స్ ఒక లాట్ కొనుగోలు చేయాలంటే గతంలో వంద రూపాయలు బ్రోకరేజ్ చెల్లించాల్సి వచ్చేది. టెక్నాలజీ వినియోగం బాగా పెరగటంతో ఇప్పుడు ఒక లాట్ ఆప్షన్స్ బ్రోకరేజీ రూ. 10-20కి పడిపోయింది. దీంతో ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే బ్రోకరేజీ సంస్థలు పోటీలో నిలబడలేకపోతున్నాయని జాజూ సెక్యూరిటీస్ ప్రతినిధి సంజయ్‌జాజూ చెప్పారు. -
మార్కెట్ పై ఫలితాల ఎఫెక్ట్
విదేశీ నిధుల ప్రవాహం దేశీ స్టాక్ మార్కెట్లలోకి విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) నిధుల ప్రవాహం జోరుగానే కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో ఇప్పటిదాకా నికరంగా రూ.6,783 కోట్ల విలువైన షేర్లను ఎఫ్ఐఐలు కొనుగోలు చేయడమే దీనికి నిదర్శనం. ప్రధానంగా రానున్న కేంద్ర ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని, సంస్కరణలకు పెద్దపీటవేస్తుందన్న విశ్వాసమే విదేశీ నిధుల ప్రవాహానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. కాగా, జనవరి నుంచి ఇప్పటిదాకా ఎఫ్ఐఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ.28,979 కోట్ల పెట్టుబడులు పెట్టారు. కాగా, ఏప్రిల్‌లో డెట్ మార్కెట్ నుంచి రూ.4,282 కోట్లను నికరంగా ఉపసంహరించుకున్నారు. న్యూఢిల్లీ: గత వారంలో ప్రారంభమైన కార్పొరేట్ కంపెనీల మార్చి క్వార్టర్(క్యూ4) ఫలితాలు స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్ధేశించనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ వారంలో వెలువడనున్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర బ్లూచిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు దిక్సూచిగా పనిచేస్తాయని వారు పేర్కొన్నారు. బుధవారం నాడు ఏప్రిల్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) ముగింపు నేపథ్యంలో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూడొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా, గురువారం(24న) ముంబైలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. మరోపక్క, గత శుక్రవారం వెలువడిన దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ఆర్థిక ఫలితాలు కూడా స్వల్పకాలానికి మార్కెట్‌పై ప్రభావం చూపనున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. కొనసాగనున్న ఎన్నికల ట్రిగ్గర్... ఈ నెల 7న ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ స్టాక్ మార్కెట్లకు అతిపెద్ద ట్రిగ్గర్‌గా కొనసాగనుందని రెలిగేర్ క్యాపిటల్ మార్కెట్స్ డెరైక్టర్(ఇనిస్టిట్యూషనల్ రీసెర్చ్) తీర్థంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. ‘ప్రస్తుత స్టాక్ మార్కెట్ ర్యాలీకి ప్రధానంగా కేంద్రంలో రానున్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమేనన్న బలమైన అంచనాలే కారణం. అదేవిధంగా దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగవడం, డాలరుతో రూపాయి మారకం విలువ పుంజుకోవడం వంటి అంశాలు కూడా మార్కెట్ దూకుడుకు దోహదం చేస్తున్నాయి. ఎలక్షన్ ఆధారిత ర్యాలీని పక్కనబెడితే... తాజాగా మొదలైన కార్పొరేట్ల త్రైమాసిక పనితీరు(క్యూ4 ఫలితాలు) కూడా రానున్న కొద్దివారాల్లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించనుంది’ అని పట్నాయక్ చెప్పారు. నిఫ్టీ 6,800 స్థాయిపైన మరింత జోరు... సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆశావహ ధోరణి(సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు అంచనాలు)ని స్టాక్ మార్కెట్లు ప్రదర్శిస్తున్నాయని, తదుపరి దిశానిర్దేశం క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలదేనని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేశ్ గోయల్ తెలిపారు. మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుల్లా కొనుగోళ్ల మద్దతు కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,800 పాయింట్లపైన మరింత ర్యాలీకి అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో బులిష్ ట్రెండ్‌కు ప్రతిబింభంగా తగిన సాంకేతిక సూచికలు కనబడుతున్నాయని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి పేర్కొన్నారు. నిఫ్టీ 6700-6,800 స్థాయిలో, సెన్సెక్స్ 22,600-23,800 స్థాయిలో కదలాడవచ్చనేది ఆయన అంచనా. ఎఫ్ఐఐ, రూపాయిపై దృష్టి... స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశాన్ని కొనసాగించే అంశాల్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, డాల రుతో రూపాయి మారకం విలువ కదలికలు, ప్రపంచ మార్కెట్ల గమనం, సంబంధిత పరిణామాలు ప్రధానంగా ఉంటాయని చౌదరి చెప్పారు. అమెరికాలో ఇళ్ల అమ్మకాలు, ఇతరత్రా కొన్ని కీలక గణాంకాలు ఈ వారంలోనే వెలువడనున్నాయని... మార్కెట్ వర్గాలు వీటిపైనా దృష్టిసారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. గడిచిన వారంలో(సెలవుల కారణంగా మూడు ట్రేడింగ్ రోజులే) ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలు, కార్పొరేట్ ఫలితాల ప్రభావంతో దేశీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూశాయి. గురువారం సెన్సెక్స్ 352 పాయింట్లు(22,629), నిఫ్టీ 104 పాయింట్లు(6,779) చొప్పున ఎగబాకాయి.