ఎఫ్‌అండ్‌వో, నగదులో ఈ నెల 8 నుంచి షురూ
నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది.
ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కీలకంగా నిలవనున్నాయి. ఇన్‌ఫ్రా ఇండెక్స్‌లో ఎల్‌అండ్‌టీ, ఆర్‌ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్ ప్రాధాన్యత వహించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment