National Stock Exchange
-
11 కోట్లకు ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్ల సంఖ్య 11 కోట్ల మార్క్‌ను (2024 ఆగస్ట్ నాటికి) అధిగమించింది. చివరి కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం ఐదు నెలల్లోనే చేరినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎన్ఎస్ఈ వద్ద ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు వేగాన్ని అందుకున్నాయని, గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగినట్టు తెలిపింది. ఎన్ఎస్ఈ 1994లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మొదటి కోటి ఇన్వెస్టర్ల చేరికకు 14 ఏళ్లు పట్టగా, తదుపరి కోటి మందికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోటి మంది ఇన్వెస్టర్లు కేవలం 3.5 ఏళ్లలోనే చేరారు. ఆ తర్వాత కోటి మంది చేరికకు కేవలం ఏడాది సమయం తీసుకుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో పాల్గొనేందుకు ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆసక్తికి ఇది నిదర్శనమని ఎన్ఎస్ఈ పేర్కొంది. ‘‘గత ఐదు నెలల నుంచి రోజువారీ యూనిక్ ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు 47,000 నుంచి 73,000 మధ్య ఉంటున్నాయి. డిజిటైజేషన్ వేగాన్ని పుంజుకోవడం, ఇన్వెస్టర్లలో అవగాహన, అందరికీ ఆర్థిక సేవల చేరువ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మార్కెట్ పనితీరు బలంగా ఉండడం వంటివి దోహదం చేశాయి’’అని ఎన్ఎస్ఈ వివరించింది. -
ఇన్వెస్టర్లు ఇంతింతై.. నేడు 11 కోట్ల మంది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.ఎన్ఎస్ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్ఎస్ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.మార్కెట్లో 20 శాతం కుటుంబాలు 2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.యువ ఇన్వెస్టర్లుమార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్‌పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది. -
ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్లు @ 10 కోట్లు
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) మరో ఘనతను సాధించింది. రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య 10 కోట్లను తాకింది. ప్రధానంగా గత ఐదేళ్లలోనే కోటి మంది కొత్తగా రిజిస్టర్ అయ్యారు. వెరసి గత ఐదేళ్లలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరిగారు. డిజిటైజేషన్లో వేగవంత వృద్ధి, ఇన్వెస్టర్లకు అవగాహన పెరుగుతుండటం, నిలకడైన స్టాక్ మార్కెట్ల పురోగతి, ఆర్థిక వృద్ధిలో అందరికీ భాగస్వామ్యం(ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) తదితర అంశాలు ఇందుకు సహకరిస్తున్నట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ పేర్కొంది. గురువారానికల్లా(ఆగస్ట్ 8) యూనిక్ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 10 కోట్ల మైలురాయికి చేరినట్లు వెల్లడించింది. దీంతో మొత్తం క్లయింట్ల ఖాతాల(కోడ్స్) సంఖ్య 19 కోట్లను తాకినట్లు తెలియజేసింది. క్లయింట్లు ఒకటికంటే ఎక్కువ(ట్రేడింగ్ సభ్యులు)గా రిజిస్టరయ్యేందుకు వీలుండటమే దీనికి కారణం. 25ఏళ్లు.. నిజానికి ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 4 కోట్ల మార్క్‌కు చేరుకునేందుకు 25 ఏళ్లు పట్టింది. 2021 మార్చిలో ఈ రికార్డ్ సాధించగా.. తదుపరి రిజి్రస్టేషన్ల వేగం ఊపందుకోవడంతో సగటున ప్రతీ 6–7 నెలలకు కోటి మంది చొప్పున జత కలిసినట్లు ఎన్ఎస్ఈ తెలియజేసింది. ఈ ట్రెండ్ కొనసాగడంతో గత 5 నెలల్లోనే కోటి కొత్త రిజి్రస్టేషన్లు నమోదైనట్లు వెల్లడించింది. క్లయింట్ల కేవైసీ విధానాలను క్రమబదీ్ధకరించడం, ఇన్వెస్టర్లకు అవగాహనా పెంపు కార్యక్రమాలు, సానుకూల మార్కెట్ సెంటిమెంటు తదితర అంశాలు ఇందుకు తోడ్పాటునిచి్చనట్లు ఎన్ఎస్ఈ బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ వివరించారు. -
నిఫ్టీ.. సిల్వర్ జూబ్లీ!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్ఎస్ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.25,000 ప్రయాణం ఇలా.. → 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది. → కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది. → ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం. -
ఇక ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ ఫ్యూచర్స్
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్సేచంజీ నేటి(బుధవారం) నుంచి ‘నిఫ్టీ నెక్ట్స్ 50’ సూచీ డెరివేటివ్ కాంట్రాక్టులు ప్రవేశపెడుతోంది. మూడు నెలల ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంచుతుంది. ప్రతినెలా చివరి శుక్రవారం ఈ కాంట్రాక్టుల గడువు ముగుస్తుంది. నిఫ్టీ 100లోని నిఫ్టీ 50 కంపెనీలు మినహా మిగితా కంపెనీలన్నీ ఈ సూచీలో ఉంటాయి. ఈ ఏడాది మార్చి 29 నాటికి ఈ సూచీలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.70 లక్షల కోట్లుగా ఉంది. ఎన్ఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో ఇది సుమారు 18%గా ఉంది. ఈ కాంట్రాక్టు్టలపై అక్టోబర్ 31 వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ చార్జీలు ఉండవని ఎన్ఎస్ఈ పేర్కొంది. మూడో రోజూ సూచీలు ముందుకే... స్టాక్ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. సెన్సెక్స్ 90 పాయింట్లు పెరిగి 73,738 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 32 పాయింట్లు బలపడి 22,368 వద్ద నిలిచింది. సూచీలకిది ఇది మూడో రోజూ లాభాల ముగింపు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 411 పాయింట్లు ఎగసి 74,060 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు దూసుకెళ్లి 22,448 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. అయితే అధిక వెయి టేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరులో లాభా ల స్వీకరణ, క్రూడాయిల్ ధరల రికవరీ, విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలతో సూచీల లాభాలు పరిమితమయ్యాయి. టెలికం, రియల్టీ, యుటిలిటీ, కన్జూమర్, కమోడిటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి. మెటల్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫాలోఆన్ఆఫర్(ఎఫ్‌పీఓ) ద్వారా రూ.18వేల కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియా షేరు 12% పెరిగి రూ.14.39 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ఎగసి రూ.14.42 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
ఎన్ఎస్ఈలో కొత్తగా 4 సూచీలు
నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కీలకంగా నిలవనున్నాయి. ఇన్ఫ్రా ఇండెక్స్‌లో ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ ప్రాధాన్యత వహించనున్నాయి. -
హైరిస్క్ డెరివేటివ్స్తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అత్యధిక రిస్క్లతోకూడిన డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టేటపుడు అప్రమత్తంగా వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా సూచించారు. స్టాక్ మార్కెట్లో తరచూ లావాదేవీలు నిర్వహించడం రిస్క్‌లతో కూడిన వ్యవహారమని హెచ్చరించారు. వీటికి చెక్ పెట్టడం ద్వారా నష్టాలను తప్పించుకోమంటూ సలహా ఇచ్చారు. దేశ వృద్ధి పథంలో భాగస్వామిగా కట్టుబాటును ప్రదర్శిస్తూ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవలసిందిగా సూచించారు. స్టాక్ మార్కెట్లో సాధారణంగా దీర్ఘకాలిక పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను అందిస్తుంటాయన్న విషయాన్ని గత అనుభవాలు తేటతెల్లం చేస్తున్నట్లు తెలియజేశారు. రిజిస్టరైన ఇంటర్మీడియరీలతోనే లావాదేవీలు చేపట్టమంటూ పేర్కొన్నారు. నియంత్రణ పరిధిలోలేని ప్రొడక్టులలో ఇన్వెస్ట్ చేయవద్దంటూ హెచ్చరించారు. దీర్ఘకాలిక దృష్టి.. దీర్ఘకాలంలో సంపద సృష్టి యోచనతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు చేపట్టవలసిందిగా ఇన్వెస్టర్లకు ఆశి‹Ùకుమార్ సలహా ఇచ్చారు. తప్పుడు నిర్ణయాలు నిలకడైన ఇన్వెస్టర్లను సైతం నిస్పృహకు గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కొత్త ఇన్వెస్టర్లు లేదా అంతగా అవగాహనలేనివారు అప్రమత్తతతో వ్యవహరించడం కీలకమని వివరించారు. కాగా.. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో) పట్ల ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తి ఆశ్చర్యంతోపాటు కలవరపాటుకు గురిచేస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ గత నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌అండ్‌వో విభాగంలో 90 శాతంమంది ఇన్వెస్టర్లు సొమ్ము నష్టపోతున్నట్లు వెల్లడించారు. -
ఎన్ఎస్ఈలో విరించి లిస్టింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్‌ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్ఎస్ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్ఎస్ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది. -
వడ్డీ రేట్ల డెరివేటివ్స్ వేళల పొడిగింపు
న్యూఢిల్లీ: వడ్డీ రేట్ల డెరివేటివ్స్ ట్రేడింగ్ వేళలను కాంట్రాక్టు ఎక్స్పైరీ తేదీల్లో సాయంత్రం 5 గం.ల వరకూ పొడిగించాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) నిర్ణయించింది. దీన్ని గురువారం నుంచి అమలు చేయనుంది. ప్రస్తుతం కాంట్రాక్టుల ట్రేడింగ్ సమయం ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు ఉంటోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల ట్రేడింగ్ వేళలు ఫిబ్రవరి 23న (ఎక్స్పైరీ తేదీ) సాయంత్రం 5 గం. వరకు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. ఆ రోజున మిగతా వడ్డీ రేట్ల డెరివేటివ్ కాంట్రాక్టుల వేళల్లో మాత్రం మార్పులేమీ ఉండవని తెలిపింది. ఆయా కాంట్రాక్టుల ఎక్స్పైరీ తేదీల్లో మాత్రం సాయంత్రం 5 గం. వరకు ట్రేడింగ్ అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడింగ్ వేళలను పొడిగించాలని ఎన్ఎస్ఈ యోచిస్తోందన్న వార్తల నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలు ఉదయం 9.15 గం. నుంచి సాయంత్రం 3.30 గం. వరకు, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్ వేళలు ఉదయం 10 గం. నుంచి రాత్రి 11.55 గం. వరకు ఉంటున్నాయి. రిస్కుల హెడ్జింగ్‌కు ఉపయోగపడుతుంది.. దేశీ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ వేళలను పొడిగిస్తే .. క్రితం రోజు అంతర్జాతీయంగా చోటు చేసుకునే పరిణామాల వల్ల తలెత్తే రిస్కులను హెడ్జింగ్ చేసుకునేందుకు ఉపయోగపడగలదని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అంతర్జాతీయంగా మార్కెట్లు ఒకదానికి మరొకటి మరింతగా అనుసంధానమవుతున్నాయి. అమెరికా, యూరప్ వంటి పెద్ద మార్కెట్లలో పరిణామాలకు మన స్టాక్ మార్కెట్లు స్పందిస్తున్నాయి. కాబట్టి ఆయా రిస్కులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ట్రేడింగ్ వేళల పెంపు ఉపయోగపడగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈడీ ఎ. బాలకృష్ణన్ తెలిపారు. ఈక్విటీ సెగ్మెంట్లో వేళల పెంపుతో మార్కెట్ వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లకూ ప్రయోజనం చేకూరగలదని వివరించారు. అంతర్జాతీయ అనిశ్చితుల రిస్కులను ఎదుర్కొనేందుకు ఈక్విటీ ఎఫ్‌అండ్‌వో, కరెన్సీ సెగ్మెంట్స్ ట్రేడింగ్ వేళలను పెంచడం చాలా అవసరమని ఫైయర్స్ సీఈవో తేజస్ ఖోడే చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తే మన క్యాపిటల్ మార్కెట్ల వృద్ధికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ట్రేడింగ్ వేళల పెంపుతో అంతర్జాతీయ ట్రేడర్లకు దీటుగా దేశీ ట్రేడర్లకు కూడా సమాన అవకాశాలు లభించగలవని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ట్వీట్ చేశారు. -
మళ్లీ ఎన్ఎస్ఈ టాప్, వరుసగా నాలుగో ఏడాది రికార్డ్
న్యూఢిల్లీ: డెరివేటివ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్సే్ఛంజీగా వరుసగా నాలుగో ఏడాది నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) నిలిచింది. ట్రేడైన కాంట్రాక్టుల సంఖ్యరీత్యా 2022లోనూ రికార్డ్ నెలకొలి్పంది. ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్(ఎఫ్ఐఏ) వెల్లడించిన వివరాలివి. మరోవైపు నాలుగో ఏడాదిలోనూ టాప్ ర్యాంకులో నిలిచినట్లు ఎన్ఎస్ఈ సైతం ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతేకాకుండా లావాదేవీల సంఖ్య(ఎల్రక్టానిక్ ఆర్డర్ బుక్) రీత్యా 2022లో ఈక్విటీ విభాగంలో ఎన్ఎస్ఈ మూడో స్థానానికి మెరుగుపడినట్లు ఎక్సే్ఛంజీల వరల్డ్ ఫెడరేషన్(డబ్ల్యూఎఫ్ఈ) వెల్లడించింది. 2021లో ఎన్ఎస్ఈ నాలుగో ర్యాంకులో నిలిచింది. గత క్యాలండర్ ఏడాది(2022)లో ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ–50 18,887ను అధిగమించడం ద్వారా చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్‌లో లిక్విడిటీ భారీగా పెరిగింది. ఈక్విటీ విభాగంలో ఈటీఎఫ్‌ల రోజువారీ సగటు టర్నోవర్ 2022లో 51 శాతం జంప్‌చేసి రూ. 470 కోట్లను తాకింది. ఇక సెకండరీ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్ల రోజువారీ సగటు టర్నోవర్ 59% ఎగసి రూ. 7 కోట్లకు చేరింది. ప్రభుత్వ సెక్యూరిటీలలోనూ గత నెలలో సగటు టర్నోవర్ రూ. 3 కోట్లకు చేరడం గమనార్హం! చదవండి: గత ఎన్నికల ముందు బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి? -
పెరుగుతున్న మహిళా డైరెక్టర్లు
న్యూఢిల్లీ: కంపెనీల బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యం నిదానంగా అయినా కానీ క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి ఎన్ఎస్ఈ టాప్ 500 కంపెనీల బోర్డుల్లో మహిళా డైరెక్టర్లు 18 శాతానికి చేరారు. ఇనిస్టిట్యూట్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) అనే సంస్థ ఇందుకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. అంతర్జాతీయంగా చూస్తే కార్పొరేట్ బోర్డుల్లో మహిళల స్థానం 24 శాతానికి చేరుకున్నట్టు తెలిపింది. ‘‘భారత్ సైతం కంపెనీ బోర్డుల్లో మహిళల నియామకాల పరంగా పురోగతి చూపిస్తోంది. 2014లో 6 శాతం ఉంటే, 2017 నాటికి 14 శాతం, 2022 మార్చి నాటికి 17.6 శాతానికి (ఎన్ఎస్ఈ–500 కంపెనీలు) పెరిగింది. మహిళా డైరెక్టర్ల సంఖ్య పెరిగినప్పటికీ, ఏటా వారి నియామకాల్లో వృద్ధి ఒక శాతం మించి లేదు. ఇదే రేటు ప్రకారం చూస్తే కంపెనీ బోర్డుల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని 30 శాతానికి చేర్చడానికి 2058 వరకు సమయం పడుతుంది’’అని ఈ నివేదిక వివరించింది. ఈ ఏడాది మార్చి నాటికి ఎన్ఎస్ఈ 500 కంపెనీల్లో మొత్తం 4,694 డైరెక్టర్ల పోస్ట్‌లు ఉంటే, అందులో మహిళలు 827 మంది ఉన్నారు. సగం కంపెనీల్లో కనీసం ఇద్దరు.. ఈ ఏడాది మార్చి నాటికి నిఫ్టీ–500 కంపెనీల్లో సగం మేర, అంటే 48.6 శాతం కంపెనీల్లో కనీసం ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది మహిళా డైరెక్టర్లు ఉన్నారు. 2021 మార్చి నాటికి ఇది 45 శాతం కంపెన్లీలోనే ఉండడం గమనించాలి. అంటే 3.6 శాతం కంపెనీలు మరింత మంది మహిళలకు గత ఏడాది కాలంలో చోటు కల్పించాయి. 2020 మార్చి నాటికి ఇది 44 శాతంగా ఉంది. ఇక 159 కంపెనీల్లో మహిళల భాగస్వామ్యం 20 శాతంకంటే ఎక్కువే ఉంది. 2021 మార్చి నాటికి 146 కంపెనీల్లోనే 20 శాతానికి పైగా మహిళా డైరెక్టర్లు ఉన్నారు. మహిళా డైరెక్టర్ల సగటు వయసు 58 ఏళ్లుగా ఉంది. అదే పురుష డైరెక్టర్ల సగటు వయసు 62 సంవత్సరాలు కావడం గమనార్హం. నిఫ్టీ–500లో 22 కంపెనీల బోర్డులకు మహిళలు చైర్మన్‌గా ఉన్నారు. 25 కంపెనీలకు మహిళలు సీఈవోలుగా పనిచేస్తున్నారు. మరో 62 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక లింగ సమానత్వంలో (స్త్రీ/పురుషుల నిష్పత్తి) ప్రభుత్వరంగ సంస్థలు వెనుకబడి ఉన్నాయి. చాలా సంస్థలు ఇందుకు సంబంధించి నిబంధనలు పాటించడం లేదు. ఫ్రాన్స్‌లో ఎక్కువ.. యూరప్, నార్త్ అమెరికాలో అంతర్జాతీయ సగ టు కంటే ఎక్కువగా మహిళల భాగస్వామ్యం ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. యూరప్ కంపెనీల్లో 34.4 శాతం, నార్త్ అమెరికా కంపెనీల్లో 28.6 శాతం మేర మహిళా డైరెక్టర్లు పనిచేస్తున్నారు. దేశం వారీగా విడిగా చూస్తే.. ఫ్రాన్స్ లో అత్యధికంగా 44.5 శాతం మేర మహిళలకు కంపెనీ బోర్డుల్లో ప్రాతినిధ్యం దక్కింది. -
ఎన్ఎస్ఈ సీఈఓగా ఆశిష్ కుమార్ నియామకానికి ఆమోదం
ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈఓ అశిష్‌కుమార్ చౌహాన్ నియామకానికి షేర్‌హోల్డర్ల అనుమతి లభించింది. ‘‘ఆగస్టు 11వ తేదీన నిర్వహించిన అసాధారణ స్వర్వసభ్య సమావేశం(ఈఓజీఎం)లో చౌహాన్ నియామకానికి మద్దతుగా 99.99 శాతం ఓట్లతో షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు’’ అని ఎక్స్ఛేంజ్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 16తో ముగిసిన నేపథ్యంలో., ఈ పదవికి చౌహాన్ ఎంపికయ్యారు. సెబీ జూలై 18న ఆమోదం తెలిపింది. అదే నెల 27 తేదీన ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే! -
ఎన్ఎస్ఈ చీఫ్‌గా చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్ చౌహాన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం పాటు బీఎస్ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసిన నేపథ్యంలో, ఈ పదవికి చౌహాన్ ఎంపిక కావడం తెలిసిందే. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. 2000 సంవత్సరంలో ఎన్ఎస్ఈని వీడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు కంపెనీల్లో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. తిరిగి 2009లో బీఎస్ఈ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపట్టి, 2012లో సీఈవో అయ్యారు. మరోవైపు బీఎస్ఈ కొత్త చీఫ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ బీఎస్ఈ రోజువారీ వ్యవహారాలు చూస్తుందని పేర్కొంది. కీలక బాధ్యతలు.. ఎన్ఎస్ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ ముందు పరిష్కరించాల్సిన పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో తరచూ సాంకేతిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆశిష్ కుమార్ చౌహాన్ దీనికి పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే, కోలొకేషన్ స్కామ్‌లో ఎన్ఎస్ఈ తనపై పడ్డ మరకను కడిగేసుకోవాల్సి ఉంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్ఎస్ఈని విజయవంతంగా ఐపీవోకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అలాగే, పాలనా లోపాలకు చెక్ పెట్టాల్సి ఉంది. బీఎస్ఈ బాస్‌గా ఆశిష్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎక్సేంజ్‌గా తీర్చిదిద్దారు. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫామ్ బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్‌ను ఏర్పాటు చేశారు. -
రెండోసారి బాధ్యతలు కోరుకోవడం లేదు: లిమాయే
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు. అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టండి
ముంబై: దేశీ, అంతర్జాతీయ పరిణామాలతో పలు సవాళ్లు తలెత్తుతున్న నేపథ్యంలో ఆర్థిక రంగంపై నిరంతరం నిఘా పెట్టాలని నియంత్రణ సంస్థలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. అలాగే సమ్మిళిత వృద్ధి సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం 25వ ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. ఈ భేటీలో ఆర్థిక రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా నెలకొన్న పరిస్థితులను సమీక్షించారు. ‘ఎఫ్ఎస్డీసీ లక్ష్యాలు, దేశ విదేశ పరిణామాలతో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై కౌన్సిల్ చర్చించింది. అలాగే ఎకానమీలో పరిస్థితులు, కీలక ఆర్థిక సంస్థల పనితీరుపై అన్ని నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం నిరంతరం ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది‘ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్, సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ (సెబీ) చైర్మన్ అజయ్ త్యాగి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్, ఆర్థిక విభాగం కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేఠ్, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక సర్వీసుల విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ అత్యున్నత స్థాయి మండలి సమావేశం కావడం ఇదే ప్రథమం. చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ 3న ఇది భేటీ అయ్యింది. ఆర్థిక స్థిరత్వ నిర్వహణకు, నియంత్రణ సంస్థల మధ్య సమన్వయాన్ని పెంచేందుకు, ఆర్థిక రంగ అభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ మార్కెట్ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఎస్డీసీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం.. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్ఎస్ఈ) చోటు చేసుకున్న పాలనాపరమైన అవకతవకలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్.. విలేకరులకు తెలిపారు. దీని గురించి పూర్తిగా సమాచారం తనకు వచ్చే వరకూ, ఈ విషయంలో విధించిన జరిమానాలు, తీసుకున్న దిద్దుబాటు చర్యలు మొదలైనవి సరైన స్థాయిలోనే ఉన్నాయా అన్న అంశంపై తాను స్పందించలేనన్నారు. ఎల్ఐసీ ఇష్యూపై మార్కెట్లో ఆసక్తి.. ప్రతిపాదిత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూపై మార్కెట్ వర్గాల్లో భారీగా ఆసక్తి నెలకొందని మంత్రి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవో పూర్తి కాగలదని ఆమె సూత్రప్రాయంగా తెలిపారు. మార్చిలోనే లిస్ట్ చేయాలని భావిస్తున్నప్పటికీ.. భౌగోళిక, రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామంటూ ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్ కుమార్ చెప్పిన నేపథ్యంలో సీతారామన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
చిత్రా రామకృష్ణ ఇంట్లో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ/ముంబై: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ, గ్రూప్ మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌కి చెందిన ముంబై, చెన్నై నివాసాల్లో ఆదాయ పన్ను శాఖ గురువారం సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణలపై విచారణలో భాగంగా సోదాలు నిర్వహించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముంబై విచారణ విభాగం ఇందులో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. ఎక్సే్చంజీకి సంబంధించిన కీలక సమాచారాన్ని ఇతరులకు చేరవేయడం ద్వారా వీరిద్దరూ అక్రమంగా లబ్ధి పొంది ఉంటా రన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరిపై ఆర్థిక అవకతవకలు, పన్ను ఎగవేత ఆరోపణలను నిర్ధా రించేందుకు అవసరమైన ఆధారాలు సేకరించేందుకు నిర్వహించిన ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ నేపథ్యం..: 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య కాలంలో ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా చిత్రా రామకృష్ణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలోనే నిబంధనలను పక్కన పెట్టి, ఎవరో అజ్ఞాత, అదృశ్య హిమాలయ యోగి సూచనల మేరకు ఆనంద్ సుబ్రమణియన్‌ను జీవోవోగా, ఆ తర్వాత ఎండీకి సలహాదారుగా నియమించారంటూ చిత్రపై ఆరోపణలు ఉన్నాయి. పైపెచ్చు ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక సమాచారమంతటినీ సదరు యోగికి చేరవేయడంతో పాటు ఉద్యోగుల పనితీరు మదింపులోనూ ఆయన సలహాలు తీసుకుని, వాటిని అమ లు చేశారని సెబీ తన విచారణలో నిర్ధారించింది. ఇంత జరిగినా ఆ యోగి వివరాలను వెల్లడించని చిత్రా రామకృష్ణ.. ఆ అజ్ఞాత వ్యక్తి నిరాకారులని, తనకు ఆధ్యాత్మిక శక్తిలాంటి వారని మాత్రమే విచారణలో చెప్పారు. దీంతో, ఈ మొత్తం వ్యవహారంలో తీవ్ర స్థాయిలో పాలనా లోపాలు జరిగాయంటూ ఆమెతో పాటు మరికొందరు అధికారులను సెబీ ఆక్షేపించింది. చిత్రాకు రూ.3 కోట్లు, ఎన్ఎస్ఈ, సుబ్రమణియన్, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్‌పై తలో రూ.2 కోట్ల జరిమానా వి ధించింది. దీంతోపాటు పలు ఆంక్షలు విధించింది. -
ఎన్ఎస్ఈ ’యోగి’ వివాదంపై ట్విట్టర్ వార్..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణని గుర్తుతెలియని హిమాలయా యోగి ప్రభావితం చేసిన అంశం.. సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపింది. పరిశ్రమ దిగ్గజాల మధ్య వాగ్యుద్ధానికి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ వేదికగా మారింది. ఎన్ఎస్ఈ బోర్డు మాజీ సభ్యుడు టీవీ మోహన్‌దాస్ పాయ్, ఫార్మా దిగ్గజం బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్–షా మధ్య ట్వీట్ల యుద్ధం నడించింది. ఎన్ఎస్ఈలో అవకతవకలకు సంబంధించి, యోగి ప్రభావంతో చిత్రా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారంటూ సెబీ ఇచ్చిన ఆదేశాల వార్తాకథనాన్ని ట్విట్టర్లో కిరణ్ ప్రస్తావించారు. దాని లింక్‌ను షేర్ చేసిన మజుందార్–షా, నియంత్రణ సంస్థను ప్రస్తావిస్తూ ‘భారత్‌లో టాప్ స్టాక్ ఎక్సే్చంజీని ఒక యోగి తోలుబొమ్మలాట ఆడించారు. ప్రపంచ స్థాయి స్టాక్ ఎక్సే్చంజీగా చెప్పుకునే ఎన్ఎస్ఈలో గవర్నెన్స్ లోపాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. అసలు తనిఖీలు, పర్యవేక్షణే లేకుండా పోయిందా‘ అని ఫిబ్రవరి 13న వ్యాఖ్యానించారు. పాయ్ కౌంటర్..: అయితే, ఎక్సే్చంజీని ఏ యోగీ నడిపించలేదని, దుష్ప్రచారాలు చేయొద్దని 14న పాయ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘ఎన్ఎస్ఈని ఏ యోగీ నడిపించలేదు! దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని ఆపండి! ఎంతో అధునాతనమైన టెక్నాలజీతో పని చేసే స్టాక్ ఎక్సే్చంజీలో ఇలా జరిగిందని మీరు నిజంగానే నమ్ముతున్నారా? ఎక్సే్చంజీ కోసం ఇరవై నాలుగు గంటలూ పనిచేసే అద్భుతమైన ఉద్యోగులను మీరు అవమానిస్తున్నారు‘ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మరుసటి రోజున పాయ్ వ్యాఖ్యలపై మజుందార్–షా మళ్లీ స్పందించారు. -
హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ వివాదాస్పద నియామకం కేసులో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్ఎస్ఈ మాజీ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణకు రూ. 3 కోట్లు, ఎన్ఎస్ఈకి .. సుబ్రమణియన్‌కు.. మరో మాజీ ఎండీ, సీఈవో రవి నారాయణ్‌కు తలో రూ. 2కోట్లు, మాజీ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ వీఆర్ నరసింహన్‌కు రూ. 6 లక్షల జరిమానా విధించింది. అంతే కాకుండా రామకృష్ణ, సుబ్రమణియన్ .. మూడేళ్ల పాటు మార్కెట్ ఇన్ఫ్రా సంస్థ లేదా సెబీ దగ్గర నమోదైన ఇతర మధ్యవర్తిత్వ సంస్థతో కలిసి పనిచేయకుండా నిషేధం విధించింది. నారాయణ్ విషయంలో ఇది రెండేళ్లుగా ఉంది. అటు కొత్త ఉత్పత్తులేమీ ప్రవేశపెట్టకుండా ఎన్ఎస్ఈపై సెబీ ఆరు నెలలు నిషేధం విధించింది. కుట్ర కోణం.. ఈ మొత్తం వ్యవహారంలో చిత్రా రామకృష్ణ నిర్ణయాలను హిమాలయాల్లోని ఒక యోగి ప్రభావితం చేశారని సెబీ వ్యాఖ్యానించింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన గోప్యనీయమైన సమాచారం (ఆర్థిక, వ్యాపార ప్రణాళికలు, ఆర్థిక ఫలితాలు మొదలైనవి) అన్నింటినీ యోగికి ఆమె చేరవేసేవారని, ఆఖరుకు ఉద్యోగుల పనితీరు మదింపు విషయంలో కూడా ఆయన్ను సంప్రదించేవారని.. సెబీ 190 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. యోగి సూచనల మేరకే ఆనంద్‌ను నియమించారని, ఎండీ.. సీఈవో స్థాయి అధికారాలన్నీ కూడా కట్టబెట్టారని, అడ్డగోలుగా జీతభత్యాలు పెంచారని తెలిపింది. ‘ముగ్గురి మధ్య జరిగిన ఈమెయిల్ సంప్రదింపులను చూస్తే గుర్తు తెలియని వ్యక్తితో (యోగి) చిత్ర, ఆనంద్ కుమ్మక్కై చేసిన కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఆనంద్‌కు చిత్ర జీతభత్యాలు పెంచేవారు, అందులో నుంచి కొంత భాగాన్ని సదరు గుర్తు తెలియని వ్యక్తికి ఆనంద్ చెల్లించేవారు‘ అని వ్యాఖ్యానించింది. ఈ అవకతవకలన్నీ తెలిసినా, ఎన్ఎస్ఈ మాజీ ఎండీ రవి నారాయణ్ సహ ఇతరత్రా అధికారులెవరూ గోప్యనీయ సమాచారం పేరిట ఆ వివరాలేవి రికార్డుల్లో పొందుపర్చలేదని సెబీ ఆక్షేపించింది. వివరాల్లోకి వెడితే.. చిత్రా రామకృష్ణ 2013 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ వరకు ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా పని చేశారు. ఆ సమయంలోనే 2013లో ఆనంద్ సుబ్రమణియన్ రూ.1.68 కోట్ల వార్షిక వేతనంతో ఎన్ఎస్ఈలో చీఫ్ స్ట్రాటెజిక్ అడ్వైజరుగా నియమితులయ్యారు. అప్పుడు ఆయన బామర్ అండ్ లారీ అనే సంస్థలో రూ. 15 లక్షల వార్షిక వేతనం తీసుకునే మధ్య స్థాయి మేనేజరుగా ఉన్నారు. పైగా క్యాపిటల్ మార్కెట్లలో ఎటువంటి అనుభవం లేదు. అయినా ఆయన్ను పిలిచి మరీ ఎన్ఎస్ఈలో కీలక హోదా కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత ఆయన వేతనం విడతల వారీగా 2016 నాటికి రూ. 4.21 కోట్లకు పెరిగింది. అప్పటికి ఆయన గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా కూడా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన్ను ఎప్పటికప్పుడు అత్యుత్తమ పనితీరు కనపర్చిన ఉద్యోగిగా ప్రచారం చేసినా, ఎక్కడా ఆయన పనితీరు మదింపు చేసిన ఆధారాలేమీ లేవని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
గో ఫ్యాషన్ ఐపీవోకు భారీ స్పందన
న్యూఢిల్లీ: మహిళల దుస్తుల బ్రాండ్ గో కలర్స్ మాతృ సంస్థ గో ఫ్యాషన్ ఇండియా పబ్లిక్ ఇష్యూకు (ఐపీవో) భారీ స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే 2.46 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ) డేటా ప్రకారం 80.79 లక్షల షేర్లను ఆఫర్ చేస్తుండగా 1.99 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ల (ఆర్ఐఐ) విభాగంలో భారీ డిమాండ్ కనిపించింది. ఇది 12.14 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవో ద్వారా గో ఫ్యాషన్ రూ. 1,013.6 కోట్లు సమీకరిస్తోంది. ఇష్యూకి షేరు ధర శ్రేణి రూ. 655–690గా ఉంది. సమీకరించే నిధుల్లో కొంత భాగాన్ని 120 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు మొదలైన వాటి కోసం కంపెనీ వినియోగించుకోనుంది. గో కలర్స్ బ్రాండ్ కింద మహిళలకు సంబంధించిన చుడీదార్లు, లెగ్గింగ్‌లు మొదలైన వాటిని గో ఫ్యాషన్ విక్రయిస్తోంది. -
డిజిటల్ గోల్డ్ సేవలకు చెక్
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్లు, సభ్యులు డిజిటల్ గోల్డ్ విక్రయించకుండా నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ నిషేధం విధించింది. సెప్టెంబర్ 10 నాటికి తమ ప్లాట్‌ఫామ్‌లపై డిజిటల్ గోల్డ్ విక్రయాలు నిలిపివేయాల్సిందిగా ఆదేశించింది. కొందరు సభ్యులు తమ క్లయింట్లకు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు, విక్రయాలకు వీలుగా వేదికలను అందుబాటులో ఉంచుతున్నట్టు గుర్తించిన సెబీ ఈ మేరకు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు లేఖ రాసింది. ‘‘ఈ తరహా కార్యకలాపాలు సెక్యూరిటీల కాంట్రాక్టుల నిబంధనలు (ఎస్సీఆర్ఆర్) 1957కు వ్యతిరేకమంటూ, సభ్యులను ఈ కార్యకలాపాలకు దూరంగా ఉంచాలంటూ ఆగస్ట్ 3న రాసిన లేఖలో సెబీ కోరింది’’అంటూ ఎన్ఎస్ఈ పేర్కొంది. సెక్యూరిటీలు, కమోడిటీ డెరివేటివ్‌లు మినహా ఇతర ఏ కార్యకలాపాలు నిర్వహించడానికి లేదని ఎస్సీఆర్ఆర్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తన సభ్యులు అందరూ డిజిటల్ గోల్డ్ తరహా కార్యకలాపాలు నిర్వహించకుండా నియంత్రణపరమైన నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘డిజిటల్ గోల్డ్ సేవల్లో ఉన్న సభ్యులు ఇందుకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేయాలి. ఈ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి నెలలోపు అమలు చేయాలి’’ అంటూ ఎన్ఎస్ఈ ఈ నెల10నే ఆదేశాలు జారీ చేసింది. నియంత్రణల పరిధిలో లేదు.. దీనిపై ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా స్పందిస్తూ.. డిజిటల్ గోల్డ్ యూనిట్లను నియంత్రణపరమైన సంస్థలు జారీ చేయడం లేదన్న విషయాన్ని ప్రస్తావించారు. దీంతో డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్లకు సరిపడా భౌతిక బంగారాన్ని నిల్వ చేస్తున్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. -
ఒక్కరోజులో 5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన అంబానీ
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒక్కరోజులో భారీగా పతనమయ్యాయి. సోమవారం ఒక్కరోజే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో (ఎన్ఎస్ఈ) రిలయన్స్ షేర్ ఐదు శాతానికి పైగా నష్టపోవడంతో, రిలయన్స్ సంస్థ 5.2 బిలియన్ల డాలర్ల మేర నష్టపోయింది. నిఫ్టీ ఇంట్రా ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు నిమిషానికి 12 మిలియన్ల డాలర్ల మేరకు సంపదను కోల్పోగా, రిలయన్స్ సంస్థ మరింత నష్టాన్ని చవి చూసింది. సోమవారం చవిచూసిన నష్టాల కారణంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానం నుంచి 12వ స్థానానికి పడిపోయారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. అతని సంపద 79.2 బిలియన్ల డాలర్ల వద్ద స్థిరపడిందని ఆ సంస్థ వెల్లడించింది. మూడో త్రైమాసికంలో రిలయన్స్ నిర్వహణ ప్రగతి బలహీనంగా ఉందని, ఇదే కొనసాగితే ఆ సంస్థ మార్కెట్ అంచనాలను చేరుకోలేదని కోటక్ ఈక్విటీస్ సంస్థ వ్యాఖ్యానించింది. సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో రిలయన్స్ సంస్థ మార్కెట్ లీడర్ హోదాను కూడా కోల్పోయింది. -
ఎన్ఎస్ఈపై సెబీ రూ.6 కోట్ల జరిమానా!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే ్చంజ్(ఎన్ఎస్ఈ)పై మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ రూ.6 కోట్ల జరిమానా విధించింది. క్యామ్స్ కంపెనీతో సహా మొత్తం ఆరు కంపెనీల్లో వాటా కొనుగోలు చేసినందుకు ఈ జరిమానా విధించింది. సెబీ ఆమోదం పొందకుండానే ఈ కంపెనీల్లో వాటాలను పొందినందుకు ఎన్ఎస్ఈ ఈ స్థాయిలో జరిమానాను భరించాల్సి వచ్చింది. క్యామ్స్, పవర్ ఎక్సే ్చంజ్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎస్ఈ ఐటీ లిమిటెడ్, ఎన్ఎస్డీఎల్ ఈ–గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మార్కెట్ సింప్లిఫైడ్ ఇండియా లిమిటెడ్, రిసీవబుల్స్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇండియా కంపెనీల్లో ఎన్ఎస్ఈ వాటాలను కొనుగోలు చేసింది. -
ఒడిదుడుకుల వారం!
ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్ తరువాత, ట్రేడింగ్ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు. ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్ తీవ్రత అధికంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్ గమనం ఉంటుందని రెలిగేర్ బ్రోకింగ్ వీపీ రీసెర్చ్ అజిత్ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో బౌన్స్ బ్యాక్ ఉండొచ్చని ఇండియానివేష్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ హెడ్ వినయ్ పండిట్ తెలిపారు. ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి.. భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్ మార్కెట్ నుం చి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు. -
ఎన్ఎస్ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్బీఐ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్ఎస్ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఎస్బీఐకు 5.19 % వాటా ఉంది. 2016లో ఎన్ఎస్ఈలో 5 శాతం వాటాను మారిషస్‌కు చెందిన వెరాసిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.911 కోట్లకు ఎస్బీఐ విక్రయించింది. ఎన్ఎస్ఈలో వాటా విక్రయంతో పాటు మరో రెండు కంపెనీల్లో కూడా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని ఎస్బీఐ యోచిస్తోంది. -
అక్షరాలా... రూ. 1.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం నాటికి గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్ డాలర్ల నికర విలువతో (దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. ఏడాది కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లడం .. ముకేశ్ అంబానీ సంపద వృద్ధికి కారణమైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ (ఎన్ఎస్ఈ) గణాంకాల ప్రకారం.. గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ వ్యాపార విభాగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. తాజాగా జియో గిగాఫైబర్ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ దూసుకెడుతోంది. ఇక రిటైల్ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ–కామర్స్ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీనివ్వనుంది. టాప్‌లో బిల్ గేట్స్.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. -
కార్వీ కేసులో బ్యాంకులకు చుక్కెదురు
న్యూఢిల్లీ: క్లయింట్ల షేర్లు సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వ్యవహారంలో సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యునల్‌లో (శాట్) బ్యాంకులకు చుక్కెదురైంది. తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించకుండా తక్షణం ఆదేశాలివ్వాలన్న బ్యాంకుల అభ్యర్థనను శాట్ తోసిపుచ్చింది. దీనిపై డిసెంబర్ 6లోగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీనే ఆశ్రయించాలని ఆదేశించింది. అలాగే ఆయా బ్యాంకుల వాదనలు విని, డిసెంబర్ 12లోగా తగు ఆదేశాలివ్వాలని సెబీకి సూచించింది. దీంతోపాటు, కార్వీ ట్రేడింగ్ లైసెన్సును రద్దు చేసిన అంశానికి సంబంధించి డిసెంబర్ 6లోగా తగు నిర్ణయం తీసుకోవాలని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ (ఎన్ఎస్ఈ)ని ఆదేశించింది. కాగా, కార్వీ తనఖా పెట్టిన షేర్లపై రుణదాతలు మొత్తం రూ.1,400 కోట్ల మేర రుణాలిచ్చినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 95,000 క్లయింట్లకు చెందిన దాదాపు రూ. 2,800 కోట్ల విలువ చేసే షేర్లను తనఖా పెట్టి కార్వీ పెద్దమొత్తంలో రుణాలు తీసుకుందన్న ఆరోపణలు రావటం తెలిసిందే. ఈ షేర్లను ఆయా క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించాలన్న సెబీ ఆదేశాలను ఎన్ఎస్డీఎల్ అమలు చేస్తోంది. సుమారు 83వేల మంది క్లయింట్లకు ఇప్పటికే షేర్ల బదిలీ జరిగింది. అయితే, కార్వీ తనఖా ఉంచిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి బదిలీ చేయరాదని, వాటిని ఎస్క్రో ఖాతాలోకి మళ్లించాలని కోరుతూ బజాజ్ ఫైనాన్స్ వంటి ఆర్థిక సంస్థలు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఐసీఐసీఐ బ్యాంక్ శాట్‌ను ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం శాట్ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
‘అనైతిక’ ఆరోపణలకు ఆధారాల్లేవు
న్యూఢిల్లీ: కంపెనీ టాప్ మేనేజ్మెంట్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతోందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంకా ప్రాథమిక ఆధారాలేమీ లభించలేదని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వెల్లడించింది. ‘ప్రస్తుతం ప్రాథమిక ఆధారాలేమీ లేవు. గుర్తు తెలియనివారు చేసిన ఆరోపణలపై విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సదరు ఆరోపణల విశ్వనీయత, నిజానిజాల గురించి కంపెనీ వ్యాఖ్యానించే పరిస్థితిలో లేదు‘ అని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీకి (ఎన్ఎస్ఈ) తెలియజేసింది. ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కంపెనీని నియమించుకున్నామని, అలాగే అంతర్గతంగా స్వతంత్ర ఆడిటర్ ఎర్న్స్ట్ అండ్ యంగ్‌తో కూడా చర్చలు జరుపుతున్నామని పేర్కొంది. ఆరోపణల్లో ప్రస్తావించిన నిర్దిష్ట ప్రక్రియలను సమీక్షించాల్సిందిగా స్వతంత్ర ఆడిటర్‌ను కోరినట్లు ఇన్ఫీ వివరించింది. భారీ ఆదాయాలు చూపించడం కోసం ఇన్ఫీ సీఈవో సలిల్ పరీఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ’అనైతిక’ విధానాలకు పాల్పడుతున్నారంటూ పేరు వెల్లడించని కొందరు ఉద్యోగులు కంపెనీ బోర్డుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై సత్వరం ఇన్ఫోసిస్ యాజమాన్యం విచారణ ప్రారంభించింది. అటు అమెరికాలో కూడా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజీ (ఎస్ఈసీ) దీనిపై విచారణ జరుపుతోంది. ఈ ఆరోపణల గురించి ముందుగానే ఎందుకు వెల్లడించలేదన్న దానిపై ఎన్ఎస్ఈ వివరణ కోరిన మీదట.. ఇన్ఫోసిస్ తాజా అంశాలు తెలియజేసింది. సోమవారం ఇన్ఫోసిస్ షేరు 3 శాతం పెరిగి రూ. 709 వద్ద క్లోజయ్యింది. -
ఎన్ఎస్ఈలో అక్షయ తృతీయ స్పెషల్ ట్రేడింగ్
అక్షయ తృతీయ సందర్భంగా ఈనెల 7న (మంగళవారం) కాపిటల్ మార్కెట్ విభాగంలో ట్రేడింగ్ సమయాన్ని పొడిగించినట్లు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) ప్రకటించింది. ఈ విభాగంలోని గోల్డ్ ఈటీఎఫ్‌లు (ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్), ప్రభుత్వ గోల్డ్ బాండ్ల ప్రత్యక్ష ట్రేడింగ్ సమయాన్ని పెంచినట్లు వివరించింది. మార్కెట్ సాధారణ ట్రేడింగ్ మార్కెట్ సమయం ఎప్పటిలానే ఉండనుండగా.. గోల్డ్ ఈటీఎఫ్‌లకు మాత్రం క్లోజింగ్ సెషన్ రోజువారీలా ఉండదని తెలిపింది. వీటి ప్రీ–ఓపెన్ సమయం 4 గంటల 25 నిమిషాల నుంచి 4:30 వరకు కొనసాగనుండగా.. ఈ సమయంలో ఆర్డర్లు రద్దు చేసుకోవడానికి, క్యారీ ఫార్వార్డ్ చేయడానికి అవకాశం ఉన్నట్లు ఎన్ఎస్ఈ స్పష్టంచేసింది. ప్రీ–ఓపెన్ తరువాత 4:30 నిమిషాలకు ట్రేడింగ్ మొదలై ఏడు గంటలకు ముగుస్తుంది. -
విద్యార్థినిలు చదువులో రాణించండి
కర్నూలు (కొండారెడ్డి బురుజు): విద్యార్థినులు చదువులో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. వాసవి మహిళా కళాశాలలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థినులు తీసుకుంటున్న శిక్షణ ముగిసింది. ముగింపు కార్యక్రమాన్ని వాసవీ కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై కోర్సు పూర్తి చేసిన విద్యార్థినిలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని, దీనికి కారణం చదువేనని తెలిపారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించడం ఎంత ముఖ్యమో గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సోమిశెట్టి వెంకట్రామయ్య, ప్రిన్సిపాల్ అరిమతి సరస్వతి, కోర్స్ కరస్పాండెంట్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
గతవారం బిజినెస్
ఎఫ్ఐఐల వాటా రూ.20 లక్షల కోట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ) పెట్టుబడుల వాటా విలువ జూన్ చివరినాటికి రూ.20.13 లక్షల కోట్లు. మార్చి ముగిసేసరికి ఎఫ్ఐఐ హోల్డింగ్స్ రూ.18.37 లక్షల కోట్లు. ప్రైమ్‌డేటాబేస్ ఈ వివరాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల విలువ శాతాల్లో చూస్తే... 37 శాతంతో అమెరికా మొదటి స్థానంలో ఉంది. మారిషన్ 21 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. తరువాత వరుసలో సింగపూర్ (15 శాతం), బ్రిటన్ (7 శాతం), లగ్జంబర్గ్ (4 శాతం) ఉన్నాయి. విలీనానికి ఎస్బీఐ బోర్డ్ ఓకే! మెగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఏర్పాటు దిశగా మరో కీలక అడుగు పడింది. భారతీయ మహిళా బ్యాంక్‌తో పాటు ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకోడానికి సంబంధించిన ప్రతిపాదనకు ఎస్బీఐ బోర్డ్ ఆమోదముద్ర వేసింది. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ (ఎస్‌బీబీజే), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ (ఎస్బీటీ) ఉన్నాయి. ఇవి లిస్టెడ్ బ్యాంకులు. ఇక వీటితోపాటు అన్‌లిస్టెడ్ సంస్థలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా (ఎస్బీపీ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) విలీన ప్రతిపాదనకూ ఆమోదముద్ర పడింది. టాప్ ఫార్మా సంస్థల్లో 8 హైదరాబాద్‌వే! దేశంలోనే అత్యధికంగా పేరొందిన ఫార్మా బ్రాండ్ల జాబితాలో హైదరాబాద్‌కి చెందిన 8 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4వ స్థానంలో నిలిచింది. ‘భారత్‌లో పరపతి గల ఫార్మా బ్రాండ్స్ 2016’ పేరిట టీఆర్ఏ రీసెర్చ్, బ్లూబైట్స్ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఇందులో అరబిందో 11వ స్థానం, నాట్కో 21వ స్థానం దక్కించుకున్నాయి. అటు సువెన్ లైఫ్‌సెన్సైస్ (40వ ర్యాంకు), దివీస్ ల్యాబ్ (44), జెనోటెక్ ల్యాబ్ (48), ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ (49), బయోలాజికల్-ఇ (52) కూడా జాబితాలో నిలిచాయి. జాబితాలో ముంబైకి చెందిన లుపిన్ అగ్రస్థానంలో, సన్ ఫార్మా రెండు, సిప్లా మూడవ స్థానంలో నిలిచాయి. ఆర్ఐఎల్కు రూ.2,500 కోట్ల జరిమానా పెట్రో దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్ఐఎల్) మరో పిడుగు పడింది. కేజీ డీ6 క్షేత్రంలో లక్ష్యాని కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), దాని భాగస్వామ్య కంపెనీలకు కేంద్రం తాజాగా మరో 38 కోట్ల డాలర్లు (రూ.2,500 కోట్ల మేర) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్ 1 తర్వాత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో లక్ష్యాల మేరకు గ్యాస్ ఉత్పత్తి చేయనందుకు విధించిన మొత్తం జరిమానా 2.76 బిలియన్ డాలర్లకు (రూ.18,492 కోట్లు సుమారు) చేరుకుంది. ఇన్ఫోసిస్‌కు ఆర్బీఎస్ షాక్ భారీ కాంట్రాక్టును రద్దు చేసుకుంటూ రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ (ఆర్బీఎస్) ఇన్ఫోసిస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. ఇన్ఫోసిస్‌లో మూడు వేల ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందని, వచ్చే ఆరు నెలల కాలంలో 4 కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయే అవకాశముంది. బ్రిటన్ వరకు విలియమ్స్ అండ్ గ్లిన్ (డబ్ల్యూఅండ్జీ) బ్యాంకును ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ఆర్బీఎస్ ఉపసంహరించుకోవడమే కాంట్రాక్టు రద్దుకు దారితీసింది. ఏడాది వాలిడిటీతో డేటా ప్యాక్స్ టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజాగా ఏడాది వాలిడిటీతో కూడిన మొబైల్ ఇంటర్నెట్ డేటా ప్యాక్స్‌కి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం డేటా ప్యాక్స్ గరిష్ట వాలిడిటీ 90 రోజులుగా ఉంది. దీర్ఘకాల వాలిడిటీతో కూడిన డేటా ప్యాక్స్‌కు అనుమతించండంటూ యూజర్ల నుంచి పలు విన్నపాలు అందాయని, ఈ మేరకు తాజా నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ పేర్కొంది. డేటాను తక్కువగా ఉపయోగించే యూజర్లను దృష్టిలో ఉంచుకొని, అలాగే కొత్త ఇంటర్నెట్ యూజర్‌ను ఆకర్షించేందుకు తమ తాజా చర్య దోహదపడుతుందని వివరించింది. హైక్ మెసెంజర్ నిధుల సమీకరణ మెసేజింగ్ ప్లాట్‌ఫాం హైక్ మెసెంజర్ తాజాగా టెన్సెంట్ హోల్డింగ్స్, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ తదితర సంస్థల నుంచి 175 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ప్రస్తుత ఇన్వెస్టర్లు టైగర్ గ్లోబల్, భారతి, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌లు కూడా మరో దఫా నిధులు సమకూర్చాయి. దీంతో కంపెనీ ఇప్పటిదాకా 250 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు కాగా.. సంస్థ విలువ 1.4 బిలియన్ డాలర్లకి చేరింది. -
ఎన్ఎస్ఈ డివిడెండ్ 730 శాతం
ఒక్కో షేర్‌కు రూ.73 హైదరాబాద్: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ)కి గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.240 కోట్ల నికర నష్టం వచ్చింది. సెటిల్మెంట్ గ్యారంటీ ఫండ్(ఎస్జీఎఫ్)కు రూ.694 కోట్ల బదిలీ కారణంగా ఈ స్థాయిలో నష్టం వచ్చిందని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2014-15) ఇదే క్వార్టర్లో రూ.121 కోట్ల నికర లాభం సాధించామని తెలిపింది. మొత్తం ఆదాయం రూ.389 కోట్ల నుంచి రూ.411 కోట్లకు పెరిగిందని వివరించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే... 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.780 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.439 కోట్లకు తగ్గిందని ఎన్ఎస్ఈ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.1,364 కోట్ల నుంచి రూ.1,480 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరానికి రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.73 డివిడెండ్(730 శాతం) ఇవ్వడానికి డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పేర్కొంది. -
గతవారం బిజినెస్
నియామకాలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చైర్మన్‌గా అశోక్ చావ్లా నియమితులయ్యారు. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. చావ్లా నియామకానికి ఆమోదం తెలిపింది. ఈయన 2019 మార్చి 27 వరకు పదవిలో కొనసాగనున్నారు. చావ్లా నియామకం మే 3 నుంచి అమల్లోకి వచ్చింది. పరిశ్రమల పేలవ పనితీరు పరిశ్రమల ఉత్పత్తి గడచిన ఆర్థిక సంవత్సరం (2015-16, ఏప్రిల్-మార్చి) నత్తనడకన సాగింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 2.4 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. 2014-15లో ఈ రేటు 2.8 శాతం. గురువారం మార్చి గణాంకాలు వెళ్లడికావడంతో... ఆర్థిక సంవత్సరం మొత్తం పనితీరు స్పష్టమైంది. ఒక్క మార్చిని చూస్తే... వృద్ధి రేటు కేవలం 0.1 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం పైకి వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో మళ్లీ మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. 5.39 శాతంగా నమోదయ్యింది. జనవరిలో 5.69 శాతంగా ఉన్న ఈ రేటు అటు తర్వాత రెండు నెలల్లో 5.18 శాతంగా, 4.83 శాతంగా నమోదయ్యింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆహార ధరలు ఎగయడం కారణంగా ఉంది. ఎగుమతులు 17వ ‘సారీ’ భారత్ ఎగుమతులు క్షీణ బాటలో కొనసాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అసలు వృద్ధి లేకపోగా 7 శాతం క్షీణించాయి. 20.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితి నమోదుకావడం వరుసగా ఇది 17వ నెల. గ్లోబల్ డిమాండ్ మందగమనం, పెట్రోలియం, ఇంజనీరింగ్ ప్రొడక్టుల ఎగుమతులు పడిపోవడం దీనికి ప్రధాన కారణం. దిగుమతులు 23 శాతం క్షీణతతో 25.41 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పరోక్ష పన్ను వసూళ్ల శుభారంభం పరోక్ష పన్నుల విభాగం కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో (2016-17 ఏప్రిల్-మార్చి) శుభారంభాన్ని ఇచ్చింది. వసూళ్లు 42 శాతం పెరిగాయి. 2015-16 ఇదే నెలలో రూ. 45,417 కోట్లుగా ఉన్న ఈ విభాగం వసూళ్లు తాజా సమీక్షా నెలలో రూ.64,394 కోట్లకు చేరాయని ఒక అధికార ప్రకటన పేర్కొంది. టాటా యూకే ప్లాంట్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ప్లాంట్ల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది. వృద్ది వ్యూహంలో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. యూకే ప్లాంట్ల కొనుగోలుకు ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది. మాల్యాను బహిష్కరించలేం బ్యాంకింగ్ రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే ఆయనపై ఉన్న కేసులు, తీవ్ర అభియోగాలకు సంబంధించి ఆయన ‘అప్పగింత’ను భారత్ కోరవచ్చని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. కాల్ డ్రాప్స్‌పై టెల్కోలకు ఊరట కాల్ డ్రాప్స్ విషయంలో సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. కాల్ డ్రాప్స్‌కు వినియోగదారులకు పరిహారం చెల్లించాల్సిందేనని ట్రాయ్ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ నిబంధన చట్ట విరుద్ధమైనదని, ఏకపక్షంగా ఉందని, తగిన కారణాలు లేవని, పారదర్శకత లోపించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారీగా తగ్గిన పసిడి డిమాండ్ భారత్‌లో పసిడి డిమాండ్ 2016 మొదటి త్రైమాసికంలో (జనవరి-మార్చి) భారీగా పడిపోయింది. 2015 ఇదే కాలంలో డిమాండ్ 192 టన్నుల డిమాండ్ ఉంటే.. 2016 ఇదే కాలంలో ఈ డిమాండ్ 39 శాతం తగ్గి 117 టన్నులకు పడిపోయింది. వెండి యేతర ఆభరణాలపై ఒకశాతం ఎకై ్సజ్ సుంకం విధింపు, దీనిని నిరసిస్తూ ఆభరణాల వర్తకుల సమ్మె వంటి కారణాలు పెళ్లిళ్ల సీజన్ కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. కరువు భారం రూ.6.5 లక్షల కోట్లు! భారత్‌లోని 10 రాష్ట్రాల్లోని కరువు ఆర్థిక వ్యవస్థపై కనీసం రూ.6.5 లక్షల కోట్ల భారం మోపనున్నదని అసోచామ్ అంచనా వేస్తోంది. ఈ 10 రాష్ట్రాల్లోని 256 జిల్లాల్లో 33 కోట్ల మంది కరువు బారిన పడ్డారని అసోచామ్ రూపొందించిన తాజా నివేదిక పేర్కొంది. వరుసగా రెండేళ్ల పాటు వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్లలో నీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటడం.. కరువు పీడిత ప్రాంతాలపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని వివరించింది. డీటీఏసీ సవరణకు భారత్-మారిషస్ ఓకే ద్వంద్వ పన్ను నివారణా ఒప్పందం (డీటీఏసీ) సవరణ ఒప్పందంపై భారత్-మారిషస్ సంతకాలు చేశాయి. మారిషస్‌లో రిజిస్టర్ అయిన కంపెనీ భారత్ రెసిడెంట్ కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా పొందే క్యాపిటల్ గెయిన్‌పై పన్ను విధించే అవకాశం భారత్‌కే లభిస్తుండడం ఈ ఒప్పందంలో ప్రధానాంశం. 2017 ఏప్రిల్ 1 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. డీల్స్.. * మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్.. అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు). * సౌందర్య సంబంధిత సేవలందించే సలోస సంస్థను ఆన్లైన్ క్లాసిఫైడ్స్ సంస్థ క్వికర్ కొనుగోలు చేసింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. * ఫెయిర్అసెట్స్ టెక్నాలజీస్‌లో 9.84 శాతం వాటాను తమ అనుబంధ సంస్థ జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసిందని జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. * జపాన్‌కు చెందిన మిత్సుబిషి మోటార్స్ కార్పొరేషన్లో 34 శాతం వాటాను అదే దేశానికి చెందిన నిస్సాన్ మోటార్ కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ వాటాను 200 కోట్ల డాలర్లకు నిస్సాన్ కొనుగోలు చేయనున్నది. -
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని 50 షేర్ల సూచీ నిఫ్టీ... గతేడాది మార్చిలో నమోదు చేసిన 9,119 పాయింట్ల గరిష్ట స్థాయి నుంచి 23 శాతం కంటే ఎక్కువే నష్టపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ వాతావరణమంతా నిస్తేజంగా మారింది. దేశీ మదుపుదారులంతా ఆందోళనతో ఉన్నారు. కాకపోతే కొంత మంది ఎనలిస్టులు మాత్రం ఈ సమయంలోనే కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. రిటైల్ ఇన్వెస్టర్లలో గందరగోళం మాత్రం పోలేదు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక మరింత పతనం జరిగే వరకు ఆగాలా? అన్న విషయంపై ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘వివేకం’ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికరమైన అంశాలు వెలువడ్డాయి. వాటినిప్పుడు పరిశీలిద్దాం.. చౌకగా లభిస్తాయి.. మనం పుస్తకాల్లో చదువుకున్న దాని ప్రకారం మార్కెట్ సూచీలు నూతన గరిష్ట స్థాయిల నుంచి 20 శాతం మించి పతనమైతే ఇంచుమించు మాంద్యంలోకి జారినట్లే. గత 13 ఏళ్ల స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సూచీలు మరింత పతనమయ్యాయనేది పరిశీలించాం. మార్కెట్లో భయాందోళన పరిస్థితులు ఉన్నప్పుడు కొనుగోలు చేసి.. ఇంకా పెరుగుతుందని ఆశపడేంత పరిస్థితులున్న సమయంలో విక్రయించాలని ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు ఎప్పుడూ సలహా ఇస్తుంటారు. మన ఇన్వెస్టర్లు కూడా చాలా ధైర్యవంతులని సూచీలు 20 శాతం పైగా పతనమై భయాందోళనలు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తారనుకుంటున్నాం. ఇలాంటి సమయాల్లో మంచి పనితీరు కనబర్చే చాలా షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తాయి. ఒక్కసారే నష్టపోయారు.. షేర్ల కదలికలు కంపెనీని, రంగాన్ని బట్టి రకరకాలుగా ఉండొచ్చు. అందుకని వ్యక్తిగత షేర్ల జోలికి పోకుండా గత 13 ఏళ్లలో ఇండెక్స్‌లు ఎలా కదిలాయో పరిశీలిస్తే పలు ఆసక్తికరమైన అంశాలు గమనించవచ్చు. 2003 నుంచి ఫిబ్రవరి 19, 2016 వరకు గమనిస్తే నిఫ్టీ గరిష్ట స్థాయి నుంచి 20 శాతానికిపైగా నష్టపోయి 929 రోజులు ఉంది. (వివరంగా పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది). ఈ సమయంలో కొనుగోలు చేసి... దీర్ఘకాలం వేచి ఉన్న వారు మంచి లాభాలు పొందారు. 20 శాతం పైగా నష్టపోయిన తర్వాత కొని రెండేళ్లు వేచి చూసిన వారికి 53 శాతం, మూడేళ్లు ఉన్న వారికి 74 శాతం, 5 ఏళ్లు ఉన్న వారికి 138 శాతం లాభాలొచ్చాయి. ఇలా కొనుగోలు చేసినప్పుడు కేవలం లాభాలే కాదు! నష్టాలొచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలం వేచి ఉండే కొద్దీ ఈ నష్టం వచ్చిన సందర్భాలు తగ్గడం విశేషం. ఇన్వెస్ట్ చేసి రెండేళ్లు వేచి చూసినా 39 సార్లు నష్టాలు వచ్చాయి. అదే మూడేళ్లలో వేచి ఉన్న సందర్భాల్లో 26 సార్లు, 5 ఏళ్లు వేచి ఉంటే ఒకేసారి మాత్రమే నష్టం వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే... పెట్టుబడి పెట్టిన సమయంతో సంబంధం లేకుండా ఈ సమయంలో ప్రతీ ఇన్వెస్టరు కనీసం ఒకసారి లాభాలొచ్చే అవకాశాన్ని పొందారు. తక్కువ సమయంలో.. ఈ దీర్ఘకాలిక లెక్కలపై సందేహాలు వ్యక్తం చేసేవారి కోసం... విశ్లేషణ సమయాన్ని మరింత కుదించాం. ఇప్పుడు 2008 నుంచి జనవరి, 2016 వరకు నిఫ్టీ కదలికలను తీసుకొని పరిశీలిద్దాం. ఈ సమయంలో రెండు అతిపెద్ద బేర్ ర్యాలీలు, ఒక మోస్తరు మార్కెట్ రికవరీ జరిగింది. ఇలాంటి సమయంలో కూడా నిఫ్టీ 20 శాతానికిపైగా పతనమైనప్పుడు కొనుగోలు చేసి రెండేళ్లు ఉంటే 35 శాతం, మూడేళ్లు ఉంటే 41 శాతం, ఐదేళ్లుంటే 56 శాతం లాభం వచ్చింది. ఒక ఏడాది దాటి ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ భారం ఉండదు కాబట్టి వార్షిక సగటు రాబడి కింద చూస్తే వరుసగా 17.5 శాతం, 13.7 శాతం, 11.2 శాతం పొందినట్లు లెక్క. ఈ రాబడి ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లు 7-8 శాతం కంటే చాలా ఎక్కువ. స్థూలంగా చూస్తే మనం సరైన షేరును ఎంచుకుంటే బుల్ మార్కెట్లో బ్యాంకు డిపాజిట్ల కంటే అధిక రాబడులను పొందే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పొచ్చు. ఇలా షేర్లను ఎంచుకోవడం కష్టం అనుకున్న వారికిప్పుడు మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిఫ్టీ, సెన్సెక్స్ వంటి ఇండెక్స్ ఫండ్లను అందిస్తున్నాయి. వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌గా పిలుస్తారు. వీటి రాబడి ఇంచుమించు సూచీల కదలికలకు అనుగుణంగానే ఉంటుంది. వీటిల్లో రూ.1,000 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి. 2008 నుంచి సూచీలు 20 శాతం కంటే నష్టపోయిన సందర్భాల్లో సిప్ ఇన్వెస్ట్మెంట్స్ రాబడి వరుసగా రెండేళ్లకు 13.5%, మూడేళ్లకు 9.51%, ఐదేళ్లకు 10.41%గా ఉంది. అంటే ప్రతినెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేసిన వారికి రెండేళ్లలో రూ. 2.75 లక్షలు, మూడేళ్లలో రూ. 4.16 లక్షలు, ఐదేళ్లలో రూ.7.82 లక్షలు చొప్పున లాభాలు పొందారు. - వి.వి.కె.ప్రసాద్ వివేకం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -
గతవారం బిజినెస్
కొత్తగా ఐదు నిఫ్టీ స్టాక్ సూచీలు ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా కొత్తగా ఐదు స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) గ్రూప్ సంస్థ ఇండియా ఇండెక్స్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్(ఐఐఎస్ఎల్) తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న సూచీలతో కలుపుకొని స్టాక్ సూచీల సంఖ్య 11కు చేరుతుందని పేర్కొంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250, నిఫ్టీ ఫుల్ మిడ్‌క్యాప్ 100, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 50, నిఫ్టీ పుల్ స్మాల్ క్యాప్ 100-ఈ ఐదు కొత్త స్టాక్ సూచీలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ 50, నిఫ్టీ 500, నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 సూచీలున్నాయి. కార్డులతో చెల్లింపులకు సర్‌చార్జీలు రద్దు! క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ ద్వారా జరిపే చెల్లింపులపై ఇకపై సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీలు, కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ తొలగిపోనుంది. అలాగే నిర్దిష్ట పరిమితికి మించిన మొత్తాలను కార్డు లేదా డిజిటల్ మాధ్యమంలోనే చెల్లించడం తప్పనిసరి కానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించింది. మళ్లీ మారుతీ టాప్ దేశీ ప్యాసెంజర్ వాహన మార్కెట్లో మారుతీ సుజుకీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరిలోనూ కంపెనీకి చెందిన ఆరు మోడళ్లు టాప్-10 దేశీ ప్యాసెంజర్ వాహనాల జాబితాలో స్థానం ద క్కించుకున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం.. అత్యధికంగా కొనుగోళ్లు జరిగిన దేశీ టాప్-10 ప్యాసెంజర్ వాహనాల్లో మారుతీ సుజుకీ ‘ఆల్టో’ (21,462 యూనిట్ల విక్రయాలు) అగ్రస్థానంలో ఉంది. పీఎన్బీ రుణ ఎగవేతదార్ల జాబితా విడుదల ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)... భారీ మొండిబకాయిల చిట్టాను ప్రకటించింది. తమ బ్యాంకులో రుణాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసిన(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) కంపెనీలు 904 ఉన్నాయని వెల్లడించింది. ఈ మొత్తం సంస్థల రుణ బకాయిల విలువ గతేడాది డిసెంబర్ చివరినాటికి 10,870 కోట్లుగా పీఎన్బీ పేర్కొంది. జాబితాలో విన్సమ్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ, జూమ్ డెవలపర్స్, నాఫెడ్ వంటివి ప్రధానంగా ఉన్నాయి. బ్యాంక్ షేర్లు తగ్గించుకుంటున్న ఫండ్స్ మొండి బకాయిలు భారీగా పెరిగిపోతుండటడంతో బ్యాంక్ షేర్లను మ్యూచువల్ ఫండ్స్ తగ్గించుకుంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీల బ్యాంక్ షేర్ల నుంచి గత నెలలో రూ.6,662 కోట్లు ఉపసంహరించుకోవడంతో ఆ షేర్లలో పెట్టుబడులు రూ.78,600 కోట్లకు పడిపోయాయని వెల్త్‌ఫోర్స్‌డాట్‌కామ్ తెలిపింది. ఐటీ హార్డ్‌వేర్‌తో 4 లక్షల ఉద్యోగాలు! దేశీ ఐటీ హార్డ్‌వేర్ రంగం ఉపాధి కొలువుగా మారనున్నది. కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో నోట్‌బుక్, డెస్క్‌టాప్ పర్సనల్ కంప్యూటర్లు సహా తదితర వస్తువుల తయారీకి చేయూతనందించేలా పన్ను సుంకాలను తగ్గిస్తే.. ఐటీ హార్డ్‌వేర్ రంగంలో వచ్చే ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగే అవకాశముందని పరిశ్రమ సమాఖ్య ‘మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఎంఏఐటీ) తన నివేదికలో పేర్కొంది. ఎన్టీపీసీ ఆఫర్‌తో 5 వేల కోట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)కి రూ. 5,030 కోట్ల విలువ చేసే షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఇష్యూలో మూడింట రెండొంతుల షేర్లను బీమా సంస్థలు దక్కించుకున్నాయి. సింహభాగం షేర్లకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ), బీమా కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్, సంపన్న ఇన్వెస్టర్ల నుంచి బిడ్లు వచ్చాయి. అయితే, స్టాక్ మార్కెట్ల క్షీణత నేపథ్యంలో రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. కుబేర భారతీయుడు.. ముకేశ్ అంబానీ అత్యంత ధనవంతుడైన భారతీయుడిగా రిలయన్స్ ముకేశ్ అంబానీ నిలిచారు. ఆయన సంపద 30 శాతం వృద్ధితో 2,600 కోట్ల డాలర్లకు పెరిగిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2016 వెల్లడించింది. ప్రపంచవ్యాప్త అత్యంత ధనవంతుల జాబితాలో ఆయన 21వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో 8,000 కోట్ల డాలర్ల సంపదతో మైక్రోసాఫ్ట్ బిల్‌గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో బిలియనీర్ల సంఖ్య 111కు పెరిగిందని, అధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా, చైనా తర్వాతి స్థానం మనదేనని ఈ జాబితా తెలిపింది. వృద్ధికి రైల్వే కూత కేంద్ర ప్రభుత్వం 2016-17కు సంబంధించి గురువారం పార్లమెంట్లో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేవిధంగా ఉందని కార్పొరేట్ ఇండియా అభిప్రాయపడింది. రైల్వే బడ్జెట్లో అటు ప్రయాణికుల చార్జీలతో పాటు సరుకు రవాణా చార్జీలను కూడా పెంచలేదు. మూడు కొత్త సూపర్ ఫాస్ట్ రైళ్లను ప్రకటించడంతో పాటు నార్త్-సౌత్(ఢిల్లీ-చెన్నై), ఈస్ట్-వెస్ట్(ఖరగ్‌పూర్-ముంబై), ఈస్ట్‌కోస్ట్(ఖరగ్‌పూర్-విజయవాడ).. ఈ మూడు కొత్త ఫ్రైట్ కారిడార్లను 2019 కల్లా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించారు. 30 నెలల కనిష్టానికి రూపాయి డాలర్‌తో రూపాయి మారకం గురువారం 30 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ నుంచి నిధులు ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో బ్యాంక్‌లు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతుండటంతో గురువారం రూపాయి 15 పైసలు క్షీణించి 68.72 వద్ద ముగిసింది. నెల చివర కావడంతో దిగుమతిదారులు.. ముఖ్యంగా చమురు దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ బాగా ఉందని ఒక ఫారెక్స్ డీలర్ వ్యాఖ్యానించారు. ఎల్ఐసీ.. సెన్సెక్స్ షేర్ల కొనుగోలు జోరు ప్రభుత్వ రంగానికి చెందిన బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ క్యూ3లో సెన్సెక్స్ కంపెనీ షేర్లను జోరుగా కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక కాలానికి రూ.10,415 కోట్ల విలువైన 18 సెన్సెక్స్ కంపెనీల షేర్లను ఎల్ఐసీ కొనుగోలు చేసింది. అలాగే రూ.7,300 కోట్ల విలువైన సెన్సెక్స్ కంపెనీల షేర్లను విక్రయించింది. దీంతో నికర కొనుగోళ్లు రూ.3,115 కోట్లుగా ఉన్నాయి. కాగా ఐసీఐసీఐ బ్యాంక్‌లోనే ఎల్ఐసీ అత్యధికంగా తన వాటాను పెంచుకుంది. ఈ కంపెనీలో 4.26 శాతం వాటాకు సమానమైన షేర్లను కొనుగోలు చేసింది. జికా కాదు టియాగో టాటా మోటార్స్ కంపెనీ తన కొత్త హ్యాచ్‌బాక్ జికా పేరును ‘టియాగో’గా మార్చింది. ఇటీవల కాలంలో జికా వైరస్ ప్రబలడంతో ఈ హ్యాచ్‌బాక్‌కు అంతకు ముందు నిర్ణయించిన జికా పేరును మార్చాలని టాటా మోటార్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫెంటాస్టికో నేమ్ హంట్ పేరుతో కొత్త పేర్లను కంపెనీ నెటిజన్ల నుంచి ఆహ్వానించింది. అందులో టియాగో, సివెట్, అడోర్ పేర్లను షార్ట్‌లిస్ట్ చేసి, ఓటింగ్ ద్వారా టియాగో పేరును ఖరారు చేశామని పేర్కొంది. వచ్చే నెల చివరికల్లా టియాగో(జికా) హ్యాచ్‌బాక్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ పేర్కొంది. ఐవీఆర్‌సీఎల్‌లో బ్యాంకులకు మెజార్టీ వాటా ఇచ్చిన రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకొని ఐవీఆర్‌సీఎల్‌లో మెజార్టీ వాటాను తీసుకోవాలని బ్యాంకులు నిర్ణయించాయి. స్ట్రాటజిక్ డెట్ రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా కంపెనీలో 51 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం వాటాను తీసుకోవాలని ఎస్బీఐ నేతృత్వంలోని 20 బ్యాంకుల జాయింట్ లెండర్స్ ఫోరమ్ (జేఎల్ఎఫ్) నిర్ణయించినట్లు ఐవీఆర్సీఎల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియ చేసింది. డీల్స్.. * మహేంద్ర నహతా ప్రమోట్ చేసిన మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో దాదాపు 5 శాతం వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ఓజస్వి ట్రేడింగ్ కంపెనీ మీడియా మెట్రిక్ వరల్డ్‌వైడ్‌లో 5.25 కోట్ల షేర్లను గత వారంలో మూడు వేర్వేరు బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసింది. దీంతో మీడియా మెట్రిక్స్ వరల్డ్‌వైడ్‌లో ఓజస్వి ట్రేడింగ్ వాటా 4.63 శాతానికి చేరింది. * రిలయన్స్ క్యాపిటల్.. కమర్షియల్ ఫైనాన్స్ విభాగాన్ని తన అనుబంధ కంపెనీకి బదలాయిస్తోంది. ఈ బదలాయింపు తర్వాత కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ(సీఐసీ)గా తమను నమోదు చేయాలని ఆర్బీఐకు దరఖాస్తు చేస్తామని రిలయన్స్ క్యాపిటల్ తెలిపింది. ఫలితంగా, భవిష్యత్తులో ఆర్బీఐ నిబంధనలను సరళీకరిస్తే బ్యాంక్ లెసైన్స్ పొందే వీలు కలుగుతుందని రిలయన్స్ క్యాపిటల్ గ్రూప్ సీఈఓ శామ్ ఘోష్ చెప్పారు. -
ఎన్ఎస్ఈలో ఎస్బీఐ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) లో తనకున్న వాటాను విక్రయించాలని ఎస్బీఐ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తమ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై విలువ పొందే ప్రయత్నాల్లో ఎన్ఎస్ఈలో వాటా విక్రయం ఒకటని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెప్పారు. బ్యాంకింగ్‌కు సంబంధించిన వ్యాపారాలపైనే దృష్టిసారించనున్నామని తెలియజేశారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కీలకం కాని తమ ఇన్వెస్ట్మెంట్లను విక్రయించాలని, ఇలా చేస్తే బ్యాంక్‌ల పెట్టుబడులు తిరిగి లాభాలతో బ్యాంకులకే వస్తాయని ఇటీవలే ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. ఎన్ఎస్ఈ ప్రారంభమైనప్పుడు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశామని, ఇప్పుడు ఎన్ఎస్ఈ భారీ సంస్థగా ఎదిగిందని, ఇప్పుడు తమ ఇన్వెస్ట్మెంట్ విలువను పొందాలనుకుంటున్నామని అరుంధతీ భట్టాచార్య ఒక ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎన్ఎస్ఈలో ఎస్బీఐకు 15% వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా ఎస్బీఐకు బిలియన్ డాలర్లు వస్తాయని అంచనా. -
అపోలో టైర్స్ చేతికి జర్మనీ సంస్థ
రూ.301 కోట్లతో టైర్ల పంపిణీ కంపెనీ రిఫిన్‌కమ్ కొనుగోలు న్యూఢిల్లీ: భారత్ ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్.. జర్మనీలోని ప్రముఖ టైర్ పంపిణీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన రిఫిన్‌కమ్ జీఎంబీహెచ్‌ను కొనుగోలు చేసింది. ఒప్పందం విలువ దాదాపు రూ.301 కోట్లు (45.6 మిలియన్ యూరోలు). రిఫిన్‌కమ్ ఆరు దేశాల్లో (జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్) ఆన్లైన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనితోపాటు జర్మనీలో 37 స్టోర్లు, సర్వీసు కేంద్రాలను నిర్వహిస్తోంది. యూరోప్‌లో వృద్ధి లక్ష్యం...: యూరోప్‌లో వ్యాపారం మరింత వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందని అపోలో టైర్స్ వైస్ చైర్మన్, ఎండీ నీరజ్ కన్వర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ రిటైల్ విభాగంలో కంపెనీ వ్యాపార అవకాశాలను మెరుగుపరచుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని అన్నారు. అన్ని కాలాల్లో అత్యంత సమర్థవంతమైన లాజిస్టిక్స్ వ్యవస్థ (సరఫరా నెట్వర్క్) రిఫిన్‌కమ్ విజయానికి ప్రధాన కారణం. ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలు, సేవలను కస్టమర్లకు అందించడానికి అపోలో టైర్స్‌కు పూర్తిగా సహకరిస్తామని రిఫిన్‌కమ్ మేనేజింగ్ డెరైక్టర్లు ఓలాఫ్ స్కాయిల్, హికో నిగ్స్ తెలిపారు. తాజా పరిణామం నేపథ్యంలో సోమవారం నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో అపోలో టైర్స్ షేర్ ధర క్రితం ముగింపుతో పోల్చితే 1.68 శాతం ఎగసి (రూ.2.60) రూ.157.70కి చేరింది. -
ఐదేళ్లలో లక్ష కోట్లకు ఈటీఎఫ్ ఆస్తులు
ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ ముంబై: దేశంలో ఈక్విటీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ (ఈటీఎఫ్) ఫండ్స్ వేగంగా విస్తరిస్తున్నాయని, త్వరలోనే వీటి ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎఎస్‌ఈ) అంచనా వేస్తోంది. గత 12 ఏళ్లలో ఈటీఎఫ్ ఆస్తుల విలువ 12 రెట్లు పెరిగాయని, వచ్చే ఐదేళ్లలో ఈటీఎఫ్‌లు నిర్వహిస్తున్న ఆస్తుల విలువ లక్ష కోట్ల మార్కును అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో చిత్రా రామకృష్ణ అన్నారు. సోమవారం ముంబైలో జరిగిన ‘ఈటీఎఫ్ కాన్ఫరెన్స్ 2015’ సదస్సులో ఆమె మాట్లాడుతూ ఈక్విటీ ఈటీఎఫ్‌ల్లో 97 శాతం ఆస్తులను ఎన్ఎస్ఈ నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం ఈక్విటీ ఈటీఎఫ్ ఆస్తుల నిర్వహణ విలువ రూ. 10,000 కోట్ల లోపునకే పరిమితమయ్యింది. ఈటీఎఫ్‌లకు డిమాండ్ పెరగనుండటంతో రానున్న కాలంలో కమోడిటీ విభాగంలో కూడా ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈమధ్యనే గవర్నమెంట్ సెక్యూరిటీస్, గిల్ట్ విభాగాల్లో ఈటీఎఫ్‌లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సెబీ చీఫ్ యు.కె. సిన్హా మాట్లాడుతూ ఈటీఎఫ్‌ల్లో మరింత పారదర్శకత తీసుకురానున్నట్లు తెలిపారు. పెట్టుబడి సాధనాల్లో ఈటీఎఫ్‌లు అతి ముఖ్యమైనవని, కానీ కొత్త పథకాలను సృష్టించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. బయట దేశాలవలే రిస్క్‌తో కూడుకున్న పథకాలు ప్రవేశపెట్టడానికి దూరంగా ఉండాలన్నారు. -
ఎస్ఎంఈ లిస్టింగ్‌తో చిన్న సంస్థలకు పెట్టుబడులు
విజయవాడ: స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగంలో పబ్లిక్ ఇష్యూ జారీచేయడం ద్వారా చిన్న కంపెనీలు వ్యాపారాభివృద్ధికి బయట నుంచి పెట్టుబడులు పొందవచ్చని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) బిజినెస్ డెవలప్మెంట్ చీఫ్ రవి వారణాసి చెప్పారు. సోమవారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఎస్ఎంఈ లిస్టింగ్‌తో చేకూరే ప్రయోజనాలను వివరించారు. రూ. 25 కోట్లలోపు చెల్లింపు మూలధనం ఉండే సంస్థలు ఎన్ఎస్ఈకి చెందిన ఎస్ఎంఈ విభాగంలో లిస్ట్ కావొచ్చని చెప్పారు. ఎస్ఎంఈలోకి వచ్చే కంపెనీలకు సంబంధించి గత మూడేళ్ల ట్రాక్ రికార్డు పరిశీలిస్తారన్నారు. పబ్లిక్ ఇష్యూలకు వచ్చే చిన్న కంపెనీలు దీని ద్వారా వస్తే మేలు జరుగుతుందని చెప్పారు. విజయవాడలో 20 కంపెనీలు ఎస్ఎంఈ ఫండింగ్‌లోకి రావటానికి ఆసక్తి చూపాయని చెప్పారు. వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధికి బ్యాంకు లోన్లు లేకుండా ఎస్‌ఎంఈకి అనుగుణంగా అన్నీ సిద్ధం చేసుకుంటే దీని ద్వారా ఇష్యూకి వెళ్ళి నిధుల్ని సమీకరించుకోవొచ్చని చెప్పారు. -
151 షేర్ల లాట్ సైజుల్లో మార్పులు
- ఈ నెల 28 నుంచి అమల్లోకి - ఎన్ఎస్ఈ వెల్లడి ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్ఎస్ఈ) 151 షేర్లకు సంబంధించిన డెరివేటివ్ కాంట్రాక్టుల లాట్సైజుల్లో మార్పులు, చేర్పులు చేసింది. వీటిల్లో పలు బ్లూ చిప్ కంపెనీలు ఉన్నాయి. ఈక్విటీ డెరివేటివ్‌ల కనీస మొత్తాన్ని రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని జూలైలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఈ మార్పులు, చేర్పులు చేసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించింది. ఈ మొత్తాన్ని పెంచడం వల్ల నష్టభయం అధికంగా ఉన్న డెరివేటివ్ కాంట్రాక్టుల నుంచి చిన్న ఇన్వెస్టర్లను రక్షించినట్లవుతుందని సెబీ భావిస్తోంది. నవంబర్‌లో ముగిసే కాంట్రాక్టులకు ఈ లాట్సైజుల మార్పులు, చేర్పులు వర్తిస్తాయని, ఈ లాట్లు ఆగస్టు 28 నుంచి అమల్లోకి వస్తాయని ఎన్ఎస్ఈ పేర్కొంది. సెప్టెంబర్, అక్టోబర్ కాంట్రాక్టులు ప్రస్తుతమున్న లాట్సైజ్లతోనే కొనసాగుతాయని వివరించింది. ముఖ్యాంశాల్లో... నాలుగు షేర్ల మార్కెట్ లాట్ సైజ్‌ను ఎన్ఎస్ఈ తగ్గించింది. బాష్, ఐషర్ మోటార్స్, ఎంఆర్ఎఫ్, పేజ్ ఇండస్ట్రీస్.. (ఇవన్నీ ఐదంకెల (రూ.పదివేలకు మించి ఉన్న) షేర్లు) వీటి లాట్ సైజు ప్రస్తుతం 125గా ఉంది. ఆ సైజ్ నుంచి ఐషర్ మోటార్స్, బాష్ లాట్ సైజులను 25కు, ఎంఆర్ఎఫ్ 15కు, పేజ్ ఇండస్ట్రీస్ 50కు తగ్గించింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఇన్ఫ్రా, పీఎస్ఈ, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50, డో జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఎఫ్టీఎస్ఈ 100 తదితర ఎనిమిది సూచీల లాట్ సైజులను పెంచింది. -
మార్కెట్ పరుగుకు బ్రేక్..
8 రోజుల దూకుడుకు పగ్గాలు ముంబై : ఎనిమిది రోజుల మార్కెట్ ర్యాలీకి బుధవారం బ్రేక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్లు నష్టపోయి, 27,730 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 21 పాయింట్లు నష్టంలో 8,361 వద్ద ముగిసింది. గడచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్‌లో సెన్సెక్స్ 1,433 పాయింట్లు లాభపడింది. కారణం..!: రుణ సంక్షోభం నుంచి బయటపడటానికి గ్రీస్ ప్రతిపాదనలు ఫలిస్తాయన్న అంచనాలు గత ట్రేడింగ్ సెషన్స్‌లో భారత్‌కు కలసివచ్చింది. అంచనాలను మించి వర్షాలు కురుస్తుండటంతో రేట్ల కోత ఉండొచ్చన్న సానుకూల అంచనాలు కొనసాగాయి. అయితే రుణ సంక్షోభం పరిష్కార దిశలో గ్రీస్ ప్రతిపాదనను రుణదాతలు తిరస్కరించారన్న తాజా వార్త మార్కెట్ సెంటిమెంట్‌ను బుధవారం దెబ్బతీసింది. ట్రేడింగ్‌లో అధికభాగం సానుకూలంగానే సాగిన మార్కెట్ గ్రీస్ వార్తతో చివరి గంటలో మైనస్‌లోకి జారిపోయింది. మొత్తంగా గురువారం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ జూన్ కాంట్రాక్ట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటుచేసుకుంది. వెరసి బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే 27,948 గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్, ట్రేడింగ్ ముగిసే సరికి దాదాపు 200 పాయింట్లు పతనమయ్యింది. నిఫ్టీ సైతం నేటి ట్రేడింగ్‌లో 8,421 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. లాభనష్టాల్లో...: 30 సెన్సెక్స్ షేర్లలో 24 నష్టపోయాయి. ట్రేడయిన స్టాక్స్‌లో 1,496 నష్టపోయాయి. 1,222 లాభపడ్డాయి. 134 స్థిరంగా ఉన్నాయి. లాభపడిన సెన్సెక్స్ షేర్లలో బీహెచ్ఈఎల్ (4%), హిందుస్తాన్ యునిలివర్ (2.40%), లుపిన్ (2%), సన్ ఫార్మా (2%), విప్రో (1.5%), ఐసీఐసీఐ బ్యాంక్ (1%) ఉన్నాయి. టర్నోవర్... బీఎస్ఈలో టర్నోవర్ రూ.2,629 కోట్లుగా నమోదయ్యింది. ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.16,050 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,19,991 కోట్లుగా నమోదైంది. -
సెన్సెక్స్ నిరోధ శ్రేణి 27,345-27,570 పాయింట్లు
మార్కెట్ పంచాంగం భారత్ మార్కెట్‌పై విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గిందన్న సంకేతాల్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) డెరివేటివ్స్ డేటా వెల్లడిస్తున్నది. చాలా నెలల తర్వాత మే నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్‌కు రోలోవర్స్ పరిమితంగా జరిగాయి. ఈ విభాగంలో చురుగ్గా వ్యవహరించే విదేశీ ఇన్వెస్టర్లు వారి పొజిషన్లను తగ్గించుకోవడమే ఇందుకు కారణం. అయితే వారు లాంగ్ పొజిషన్లతో (పెరుగుతాయనే అంచనాలతో తీసుకునేవి) పాటు షార్ట్ పొజిషన్లను (తగ్గుతాయన్న అంచనాలతో తీసుకునేవి) కూడా తగ్గించుకున్నట్లు ఆ డేటా ద్వారా వెల్లడవుతోంది. కానీ ఇప్పటికే వారు భారత్ మార్కెట్లో భారీగా నగదు పెట్టుబడులు చేసివున్నందున, త్వరలో డెరివేటివ్స్ విభాగంలో కూడా వారు పొజిషన్లను పెంచుకోకతప్పదు. విదేశీ ఇన్వెస్టర్లు రాబోయే కొద్దిరోజుల్లో తీసుకోబోయే పొజిషన్లకు అనుగుణంగా మార్కెట్ భారీగా పెరగవచ్చు. లేదా తీవ్రంగా పతనం కావొచ్చు. ఇక సాంకేతికాంశాలకొస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 30తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్ వారంలో గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 26,897 పాయింట్ల కనిష్టస్థాయివరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 427పాయింట్ల నష్టంతో 27,011 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ పెరిగిన కారణంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో ఇక్కడి మార్కెట్ మొదలైతే 27,345 పాయింట్ల నిరోధస్థాయిని చేరవచ్చు. అటుపైన స్థిరపడితే 27,570 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఈ వారం సెన్సెక్స్‌కు 27,345-27,570 పాయింట్ల నిరోధశ్రేణి కీలకం. ఈ శ్రేణిని బలంగా ఛేదిస్తే వేగంగా 27,830 స్థాయికి పెరగవచ్చు. సెన్సెక్స్ తిరిగి అప్ట్రెండ్లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధశ్రేణిని దాటలేకపోతే మరోదఫా 26,880 స్థాయికి తగ్గవచ్చు. ఆ లోపున క్రమంగా 26,470 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ నిరోధ శ్రేణి 8,270-8,335 ఎన్ఎస్ఈ నిఫ్టీ గత శుక్రవారం 8,145 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన తర్వాత, చివరకు 123 పాయింట్ల నష్టంతో 8,182 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో ప్రారంభమైతే తొలుత 8,270 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 8,335 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ రెండు స్థాయిలూ...అంటే...8,270-8,335 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి ముఖ్యమైన అవరోధం. ఈ వారం ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని అధిగమించలేకపోతే మరోదఫా 8,145 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఆ లోపున 8,080 స్థాయికి క్షీణించవచ్చు. ఈ లోపున ముగిస్తే 7,960 పాయింట్ల స్థాయికి తగ్గవచ్చు. -
అమ్మకాల రూట్లోనే ఎఫ్ఐఐలు
మూడు నెలల కనిష్టానికి సెన్సెక్స్.. ⇒ ఇన్ఫోసిస్ ఫలితాలు, వర్షాభావ అంచనాల దెబ్బ కూడా... ముంబై: బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ గురువారం 297 పాయింట్లు నష్టపోయి, 27,438 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు నెలల కనిష్ట స్థాయి ఇది. గత ఎనిమిది ట్రేడింగ్ దినాల్లో 7 రోజులు మార్కెట్ నష్టాల్లోనే ఉంది. ఇంకా చెప్పాలంటే... ఈ వారంలో సెన్సెక్స్ ఏకంగా 1,004 పాయింట్లు (3.53 శాతం) నష్టపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం శుక్రవారం 93 పాయింట్ల పతనంతో 8,305 పాయింట్ల వద్దకు దిగింది. మూడు ప్రధాన కారణాలు! ⇒ పన్ను అంశాలకు సంబంధించి విదేశీ పెట్టుబడిదారు విశ్వాసం దెబ్బతినడం మార్కెట్‌పై తన ప్రభావాన్ని చూపిస్తోంది. దాదాపు రూ. 40,000 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను ఉపసంహరించుకోవాలంటూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) చేస్తున్న డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గే ప్రసక్తే లే దని రెండు రోజుల క్రితం ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎఫ్ఐఐల అమ్మకాలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. ⇒ శుక్రవారం విడుదలైన ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో ఈ షేర్ ధర దాదాపు 6 శాతం నష్టపోయింది. మార్కెట్ నష్టంలో 150 పాయింట్ల మేర కేవలం ఈ షేర్ పతనం వల్లే చోటుచేసుకోవడం గమనార్హం. మొదటినుంచీ అప్రమత్తంగా సాగిన ట్రేడింగ్‌పై చివరి మూడు గంటల్లో ఇన్ఫోసిస్ ఫలితాల ప్రభావమూ కనిపించింది. ⇒ వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలూ మార్కెట్ పతనానికి ఒక కారణం. టర్నోవర్ చూస్తే..: ఎన్ఎస్ఈలో రూ.19,630 కోట్లుగా, ఎన్ఎన్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.3,31,143 కోట్లుగా నమోదైంది. బీఎస్ఈలో ఈ పరిమాణం రూ. 3,664కోట్లు. జూన్‌లో రూ.15,000 కోట్ల ఎస్బీఐ ఇష్యూ ! ముంబై: దాదాపు రూ. 15,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తలపెట్టిన షేర్ల ఇష్యూ.. జూన్‌లో రావొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అనువుగా లేనందువల్ల అప్పటిదాకా వేచి ఉండే అవకాశం ఉందని సమాచారం. -
మొబైల్ ఫోన్ల ద్వారా జోరుగా ట్రేడింగ్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ల ద్వారా ట్రేడింగ్ జోరుగా పెరుగుతోందని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. మొబైల్ ఫోన్ల ద్వారా స్టాక్ మార్కెట్ లావాదేవీలు గత ఏడాది మూడురెట్లు పెరిగాయని పేర్కొంది. టెక్నాలజీ వినియోగం వృద్ధి చెందుతోందనడానికి ఇది నిదర్శనమని వివరించింది. ఎన్ఎస్ఈ వెల్లడించిన గణాంకాల ప్రకారం.,, - మొబైల్ ద్వారా 2014లో రోజుకు సగటున రూ.156 కోట్ల టర్నోవర్ జరిగింది. అంతకు ముందటి ఏడాదితో పోల్చితే ఇది 64 శాతం అధికం. - ఇంటర్నెట్ ఆధారిత ట్రేడింగ్ లావాదేవీలు 52 శాతం పెరిగాయి. 2013లో రూ.1,206 కోట్లుగా ఉన్న రోజువారీ సగటు టర్నోవర్ 2014లో 52 శాతం వృద్ధితో రూ.1,836 కోట్లకు పెరిగింది. - స్టాక్ మార్కెట్ లావాదేవీలు -ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే వారి సంఖ్య 17 శాతం, మొబైల్స్ ద్వారా నిర్వహించే వారి సంఖ్య 101 శాతం చొప్పున పెరిగాయి. -
సర్ప్రైజ్ బ్యాగ్
తన గారాలపట్టి అన్నప్రాశనను అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనే ఓ తల్లి ఆలోచన నయా ట్రెండ్‌గా సెట్ అయింది. ఆ రోజు ఇంటికొచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చింది. గిఫ్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. బహుమతులు ఉంచిన బ్యాగులపైనే అందరి దృష్టి పడింది. కొంగొత్తగా ఉన్న ఆ బ్యాగులను చూసిన అందరి ముఖాల్లో ఆశ్చర్యాన్ని చూసి.. అంతకు పదిరెట్ల ఆనందాన్ని పొందింది ఆ తల్లి. తాను పొందిన అనుభూతినే అందరు తల్లులకు అందించాలనుకుంది. అప్పటికే పేపర్ బ్యాగుల తయారీలో ఉన్న ఆ వనిత.. డిఫరెంట్ థీమ్స్‌తో కస్టమైజ్డ్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టింది. - భువనేశ్వరి బర్త్ డే ఇన్విటేషన్ కార్డుపై మీ బుజ్జాయి ఫొటోను చూసి ముచ్చటపడి సరిపెట్టుకునే పేరెంట్స్‌కు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నారు వసంత చిగురుపాటి. మీ చిట్టి పాపాయి పుట్టిన రోజు వేడుకకు గుర్తుగా ఇచ్చే బహుమతుల బ్యాగులపై కూడా ఆ బంగారు తల్లి ఫొటోను చూసి మురిసి పోయేలా చేస్తున్నారామె. పిల్లలపై ఉన్న ప్రేమను, మీ దర్పాన్ని ప్రతిబింబించే విధంగా నయా బ్యాగులు డిజైన్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన వసంత ఇక్కడ నయా కాన్సెప్ట్‌తో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తున్నారు. న్యూ థీమ్.. బర్త్‌డే పార్టీ థీమ్‌ను బట్టి బ్యాగుల రంగు, డిజైన్ ఉంటుంది. థీమ్ ఏంటి? డిజైన్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఈవెంట్ మేనేజర్లు బర్తెడే పార్టీలను ఒక థీమ్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు. వేడుక కోసం ఉపయోగించే పూలు, బెలూన్లు.. వాటి రంగులు ఇతర అలంకరణ.. అంతా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేస్తారు. అందుకు సూటయ్యే డిజైన్‌నే బ్యాగుపై ముద్రించడం వసంత ప్రత్యేకత. అబ్బాయి బర్త్ డే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలానో.. బొమ్మలతో కలిసున్న ఫొటోనో బ్యాగ్‌పై వేసి టాక్ ఆఫ్ ది ఈవెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రమోషన్ అదుర్స్.. ‘నేను మొదలుపెట్టింది మామూలు బ్యాగుల కంపెనీనే. మా పాప పుట్టాక తన కోసం పర్సనలైజ్డ్ బ్యాగులను తయారు చేశాను. పాప ఫొటో, నాకు నచ్చిన కొటేషన్‌తో అందమైన డిజైన్‌తో బ్యాగ్ తయారు చేశాను. మా చిట్టితల్లి అన్నప్రాశన రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఆ బ్యాగుల్లో పెట్టి ఇచ్చాను. వచ్చినవారంతా ఆ గిఫ్ట్‌ని పక్కనపెట్టి బ్యాగ్ గురించే మాట్లాడుకున్నారు. వారి వారి ఇళ్లల్లో పిల్లల వేడుకలకు అలాంటి బ్యాగులు కావాలని ఆర్డర్ చేశారు. అందరూ నాలాంటి తల్లులే.. బిడ్డ ఆనందం కోసం ఇలాంటివి చేయడానికి అసలు వెనుకాడరు. అదే నా బ్యాగుల ప్రమోషన్‌కు సహకరించింది’ అని చెప్పారు వసంత చిగురుపాటి. కామిక్ బ్యాగ్స్.. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఉద్యోగం చేసిన వసంత తర్వాత యూకేలోని విప్రో కంపెనీలో కూడా కొంతకాలం పని చేసి ఇండియాకు వచ్చేశారు. పెళ్లయిన తర్వాత ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారం చేయాలని భావించారామె. భర్త వంశీ కూడా వసంత ఆలోచనకు ఓటేయడంతో ప్లాస్టిక్ రహిత ఇండియా నినాదానికి పునాదిగా 2010లో పేపర్ బ్యాగుల కంపెనీని స్థాపించారు. రెండేళ్ల కిందట బిజినెస్ ట్రెండ్ మార్చేశారు. ‘ఈ బ్యాగుల తయారీకి ఆర్డర్లు వచ్చిన కొత్తలో చాలా వరకూ బర్త్‌డే పిల్లల ఇష్టానికి అనుగుణంగా డిజైన్లు చేశాను. వారి ఫొటోలతో పాటు టెడ్డిబేర్లు, బెన్‌టెన్ బొమ్మలు.. వారు చూసే కార్టూన్ చానెల్స్ కనుక్కొని అందులోని క్యారెక్టర్లను వారి ఫొటో పక్కన ఉండేలా ప్రింట్ చేశాను. ఈ మధ్య ధనికుల ఇళ్లలో బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేకులను తయారు చేయించుకుంటున్నారు. ఆ కేక్ నేపథ్యాన్ని బట్టే మా బ్యాగులు డిజైన్ ఉంటుందన్నమాట’ అని వివరించారు వసంత. సిటీలోనే కాదు విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ ఈ బ్యాగులను పంపిస్తున్నారు. నేను సైతం.... వైజాగ్ హుద్‌హుద్ బాధితుల కోసం నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం గురించి తెలుసు కదా! దాని కోసం వసంత తయారు చేసిన బ్యాగులు ఫుల్ పాపులర్ అయ్యాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ నటుల ఫొటోలతో తయారు చేసిన బ్యాగులు ‘మేము సైతం’ కార్యక్రమం ప్రచారానికి బాగా ఉపయోగపడింది కూడా. టాప్ కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు కూడా సంపాదిస్తున్నారు. కెనాన్, కోకాకోలా ఇండియా, సోనీ, హ్యుందయ్ మోటర్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్.. వంటి ప్రముఖ కంపెనీలకు వసంత కస్టమైజ్డ్ బ్యాగులు తయారు చేసి ఇస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ ఆన్లైన్లో దూసుకుపోతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
2030కల్లా 1,30,00కు నిఫ్టీ!
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అంచనా ముంబై: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ నిఫ్టీ 2030కల్లా 1,30,000 పాయింట్లను తాకుతుందని ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా తాజాగా అంచనా వేశారు. గత పదిహేనేళ్లలో 10 రెట్లు ఎగసిన నిఫ్టీ రానున్న పదిహేనేళ్లలో అతిసులువుగా 10 లేదా 12 రెట్లు జంప్ చేస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎన్‌బీసీ టీవీ18 చానల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఝున్‌ఝన్‌వాలా ఈ అభిప్రాయాలను వెల్లడించారు. దేశీ కంపెనీల ఆర్జన ఏడాదికి 16% చొప్పున వృద్ధి సాధిస్తే రానున్న దశాబ్దంలో నిఫ్టీ 1,30,000 పాయింట్లను చేరుతుందని ఝున్‌ఝన్‌వాలా అంచనా వేశారు. గడిచిన 12 నెలల్లో ట్రేడింగ్ రోజులను పరిగణనలోకి తీసుకుని గంటకి సగటున రూ. 35 లక్షల లాభాన్ని ఆర్జించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన దేశం పురోభివృద్ధి బాటన దూసుకెళుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉన్నదని, చమురు ధరల పతనంవల్ల వినియోగదారులకు పూర్తిస్థాయిలో లబ్ది చేకూరనప్పటికీ, వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. తాజా పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించనందుకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ విచారిస్తారంటూ వ్యాఖ్యానించారు. -
స్వల్ప లాభాలతో రికవరీ
బ్లూచిప్ షేర్ల పెరుగుదలతో దేశీ స్టాక్‌మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాలతో రికవర్ అయ్యాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు పెరిగి 28,386 వద్ద, నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 8,476 వద్ద ముగిసింది. ఢిల్లీలో ఫ్లోర్ ఏరియా నిష్పత్తిని ప్రభుత్వం పెంచిన సానుకూల పరిణామంతో డీఎల్ఎఫ్ తదితర రియల్టీ స్టాక్స్ ఎగిశాయి. అటు వచ్చే నెలలో వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చన్న అంచనాలు, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ నెలవారీ ముగింపు ముందు రోజున షార్ట్‌కవరింగ్ కూడా మార్కెట్ల పెరుగుదలకు దోహదపడ్డాయని ట్రేడర్లు తెలిపారు. బీఎస్ఈలో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 4% పెరగ్గా.. విద్యుత్, మెటల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి. రియల్టీలో అనంత్‌రాజ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ మొదలైన షేర్లు 4-10 శాతం మధ్య పెరిగాయి. క్రితం రోజున 5 శాతం క్షీణించిన ఐటీసీ బుధవారం 2 శాతం మేర పెరిగింది. మరోవైపు, అంతర్జాతీయంగా చాలా మటుకు ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. -
కొత్త గరిష్టం నుంచి కిందకు
ఎఫ్ఐఐల నిరవధిక పెట్టుబడులతో మార్కెట్లు మరోసారి కొత్త గరిష్టాలను తాకాయి. అయితే లాభాల స్వీకరణ కోసం ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో మిడ్ సెషన్లో నష్టాలలోకి మళ్లాయి. ఆపై ఒడిదుడుకుల మధ్య కదిలి చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. వెరసి తొలుత సెన్సెక్స్ 105 పాయింట్లు ఎగసి 28,283ను తాకగా, నిఫ్టీ సైతం 8,454ను దాటింది. ఆపై నష్టాలలోకి మళ్లిన సెన్సెక్స్ చివరికి 15 పాయింట్లు తక్కువగా 28,163 వద్ద నిలిచింది. నిఫ్టీ 5 పాయింట్లు తగ్గి 8,426 వద్ద స్థిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 237 పాయింట్లు పుంజుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 0.3-0.9% మధ్య బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,743 లాభపడితే, 1,366 నష్టపోయాయి. సెసాస్టెరిలైట్ జోరు సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, ఓఎన్జీసీ, టీసీఎస్ 2-1% మధ్య నష్టపోగా, సెసాస్టెరిలైట్ 4%పైగా ఎగసింది. ఈ బాటలో భెల్, ఎల్అండ్టీ, భారతీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2-1.5% మధ్య లాభపడ్డాయి. -
మార్కెట్.. అక్కడక్కడే అడుగులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.5% చొప్పున నమోదుకాగలదని రిజర్వ్ బ్యాంక్ వేసిన అంచనా సెంటిమెంట్‌కు బూస్ట్‌నిచ్చింది. దీంతో మిడ్ సెషన్లో సెన్సెక్స్ 254 పాయింట్లవరకూ ఎగసి 26,851 వద్ద గరిష్టాన్ని తాకింది. అయితే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయించడంతో చివరి గంటన్నరలో అమ్మకాలు పెరిగి లాభాలు కరిగిపోయాయి. వెరసి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభాన్ని మిగుల్చుకుని 26,630 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 9 పాయింట్లు బలపడి 7,965 వద్ద నిలిచింది. గురువారం నుంచి మొదలుకానున్న వరుస సెలవుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. చైనా తయారీ రంగం అంచనాలు అందుకోకపోవడం, హాంకాంగ్ అనిశ్చితులు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపాయని చెప్పారు. ప్రధానంగా రియల్టీ, పవర్, మెటల్ రంగాలు 3-1% మధ్య నీరసించగా, హెల్త్‌కేర్ 1%పైగా లాభపడింది. సెన్సెక్స్ దిగ్గజాలలో భెల్, యాక్సిస్, హిందాల్కో, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ, టీసీఎస్ 3-1% మధ్య క్షీణించాయి. అయితే మరోవైపు సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో, మారుతీ, సిప్లా, రిలయన్స్, ఐటీసీ 3-1% మధ్య పుంజుకుని మార్కెట్లను ఆదుకున్నాయి. ఇక రియల్టీ షేర్లు ఇండియాబుల్స్, యూనిటెక్, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్, మహీంద్రా లైఫ్ 5-2% మధ్య పతనమయ్యాయి. కాగా, ఎఫ్ఐఐలు రూ. 486 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. -
ఒడిదుడుకుల బాటలో
ఆర్బీఐ విధాన సమీక్ష చేపట్టనున్న నేపథ్యంలో మార్కెట్లు పలుమార్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసింది. ప్రధానంగా వడ్డీ ప్రభావిత రంగాలు డీలాపడటం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. దీంతో ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్ నికరంగా 29 పాయింట్లు నష్టపోయి 26,597 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 7,959 వద్ద నిలిచింది. కాగా, రోజు మొత్తంలో సెన్సెక్స్ 26,715-26,518 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లు వెలుగులో నిలవగా, మెటల్స్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ నీరసించాయి. అమెరికా గణాంకాల ఎఫెక్ట్ అమెరికా ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా వెలువడటంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 1-3% మధ్య పుంజుకున్నాయి. వీటికితోడు సన్‌ఫార్మా 3.4% ఎగసింది. అయితే మరోవైపు ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఓఎన్జీసీ, సెసాస్టెరిలైట్, టాటా స్టీల్, బజాజ్ ఆటో, హీరోమోటో, కోల్ ఇండియా తదితరాలు 1%పైగా నష్టపోవడంతో మార్కెట్లు బలహీనపడ్డాయి. సెంటిమెంట్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లకు డిమాండ్ కనిపించింది. -
చిన్న షేర్లు ముద్దు
కొత్త ప్రభుత్వం ఆర్థికాభివృద్ధికి చర్యలు చేపడుతుందన్న అంచనాలు మార్కెట్లలో ఊపందుకున్నాయి. సంస్కరణల జోరు పెరుగుతుందన్న ఆశలు ఇందుకు జత కలిశాయి. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సిమెంట్, మైనింగ్, బ్యాంకింగ్ తదితర రంగాలకు జవసత్వాలు కల్పించే బాటలో పటిష్ట విధాన నిర్ణయాలుంటాయని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో ఇన్ఫ్రా, పవర్ రంగాల షేర్లు కొనుగోళ్ల వెల్లువతో రేసు గుర్రాల్లా దూసుకెళ్లాయి. బీఎస్ఈలో స్మాల్ క్యాప్ 6% జంప్‌చేయగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ సైతం 4% ఎగసింది. ట్రేడైన షేర్లలో 2,154 లాభపడితే, 698 నష్టపోయాయి. రాష్ట్ర కంపెనీల హవా... చిన్న షేర్లలో జేపీ పవర్ 30%పైగా దూసుకెళ్లగా, రాష్ర్ట కంపెనీల షేర్లు జీవీకే పవర్, కేఎస్కే ఎనర్జీ, ఐవీఆర్సీఎల్ ఇన్ఫ్రా, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా 20% స్థాయిలో ఎగశాయి. ఈ బాటలో ఇతర మిడ్ క్యాప్స్ జేకే లక్ష్మీ సిమెంట్, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా, ఇండియాబుల్స్ పవర్, సుజ్లాన్ ఎనర్జీ, జేకే సిమెంట్, హెచ్‌సీసీ, బీఈఎంఎల్, జేపీ ఇన్ఫ్రా, పుంజ్‌లాయిడ్, గేట్‌వే డిస్ట్రిపార్క్స్, సింటెక్స్, బీఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్, బీజీఆర్ ఎనర్జీ, ఓరియంట్ సిమెంట్, ఇండియా సిమెంట్, కల్పతరు పవర్, ఇండియన్ బ్యాంక్, వోల్టాస్, జేపీ అసోసియేట్స్, ఎన్సీసీ, శ్రేఈ ఇన్ఫ్రా, క్రాంప్టన్ గ్రీవ్స్, దేనా బ్యాంక్, స్టెరిలైట్ టెక్, ఐఆర్బీ ఇన్ఫ్రా, సద్భావ్ ఇంజినీరింగ్, జిందాల్ సా తదితరాలు 20-12% మధ్య పురోగమించాయంటే వీటికి ఏ స్థాయిలో డిమాండ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు! మార్కెట్ల దూకుడుకు అనుగుణంగా రిటైల్ ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులకు ఉపక్రమిస్తుండటంతో బ్రోకింగ్ షేర్లు మోతీలాల్ ఓస్వాల్, ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సైతం 20% జంప్ చేయడం విశేషం! -
ఐఎస్బీలో ఎన్ఎస్ఈ ట్రేడింగ్ ల్యాబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న, వర్ధమాన దేశాల్లో ఇన్వెస్టింగ్ తీరుతెన్నుల గురించి అవగాహన పెంచే దిశగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) చేతులు కలిపింది. హైదరాబాద్‌లోని ఐఎస్బీ క్యాంపస్‌లో ట్రేడింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఎన్ఎస్ఈ ఎండీ చిత్రా రామకృష్ణ బుధవారం ఇక్కడ దీన్ని ప్రారంభించారు. అంతర్జాతీయంగా మారుతున్న ట్రేడింగ్ తీరుతెన్నులు, సంపన్న దేశాల్లో పాటిస్తున్న విధానాలు, వర్ధమాన దేశాల్లో విధానాలు మొదలైన వాటిని అధ్యయనం చేసేందుకు ఈ ల్యాబ్ ఉపయోగపడగలదని ఈ సందర్భంగా చిత్రా తెలిపారు. బిజినెస్ స్కూల్స్‌తో ఎన్ఎస్ఈ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే ప్రథమం అని ఆమె చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలకు పరిమితం కాకుండా విద్యార్థులు ఎప్పటికప్పుడు ప్రపంచ మార్కెట్ల పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ ల్యాబ్‌లో 34 ట్రేడింగ్ టెర్మినల్స్ ఉన్నాయని ఐఎస్బీ డీన్ అజిత్ రంగ్నేకర్ తెలిపారు. బ్లూమ్‌బర్గ్, థామ్సన్ రాయిటర్స్ వంటి ప్రీమియం బిజినెస్ సంస్థల డేటాబేస్లు కూడా వారికి అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేందుకు ఈ ల్యాబ్ తోడ్పడగలదని రంగ్నేకర్ వివరించారు. -
చిన్న షేర్లు విలవిల
భారీ హెచ్చుతగ్గులకు లోనైన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే అధిక శాతం చిన్న షేర్లు అమ్మకాలతో డీలాపడ్డాయి. సెన్సెక్స్ 48 పాయింట్లు క్షీణించి 22,418 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 19 పాయింట్లు తగ్గి 6,696 వద్ద నిలిచింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, సెన్సెక్స్ తొలుత 214 పాయింట్ల వరకూ లాభపడింది. ఆపై ఉన్నట్టుండి పతనబాటపట్టి 180 పాయింట్ల వరకూ దిగజారింది. ఎన్డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చన్న అంచనాలు మిడ్ సెషన్లో సెంటిమెంట్‌ను దెబ్బకొట్టినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, మార్కెట్లను మించుతూ బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పతనమయ్యాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,704 నష్టపోగా, 973 మాత్రమే బలపడ్డాయి. రియల్టీ బోర్లా రియల్టీ షేర్లు డీఎల్ఎఫ్, యూనిటెక్, హెచ్‌డీఐఎల్, అనంత్‌రాజ్, డీబీ, ఇండియాబుల్స్, ఒబెరాయ్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్ 9-3% మధ్య పతనంకావడంతో రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5.3% పడిపోయింది. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, పవర్, వినియోగ వస్తు రంగాలు సైతం 2% చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో టాటా పవర్, భెల్, సెసాస్టెరిలైట్, భారతీ, ఎల్అండ్టీ, హిందాల్కో, ఐసీఐసీఐ 3.5-1.5% మధ్య తిరోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ 3-1.5% మధ్య లాభపడ్డాయి. బుధవారం ఎఫ్ఐఐలు రూ. 454 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
మరో 149 పాయింట్లు డౌన్
వరుసగా రెండో రోజూ మార్కెట్లు నష్టపోయాయి. గత నెల రోజుల్లోలేని విధంగా సెన్సెక్స్ 149 పాయింట్లు క్షీణించి 22,359 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 42 పాయింట్లు తగ్గి 6,694 వద్ద స్థిరపడింది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలు చేపడుతుండటంతో సెంటిమెంట్ బలహీనపడుతున్నదని నిపుణులు తెలిపారు. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 42, నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోవడంతో పది రోజుల మార్కెట్ ర్యాలీకి తొలిసారి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం ట్రేడింగ్‌లో దేశీ సంస్థల భారీ అమ్మకాలు కూడా మార్కెట్లను పడగొట్టాయి. ఎఫ్ఐఐలు రూ. 232 కోట్లు ఇన్వెస్ట్‌చేసినప్పటికీ, దేశీ ఫండ్స్ రూ. 1,125 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. అంతర్గత సమస్యల కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొనడం కూడా ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. కాగా, సెన్సెక్స్ గరిష్టంగా 22,522, కనిష్టంగా 22,339 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. హెచ్‌డీఐఎల్ హైజంప్ బీఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ రంగాలు 1% డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ 3.4% ఎగసింది. మార్కెట్లకు విరుద్ధమైన రీతిలో రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్ 16%పైగా దూసుకెళ్లగా, కోల్టేపాటిల్, ఇండియాబుల్స్, యూనిటెక్, డీబీ, ప్రెస్జీజ్, డీఎల్ఎఫ్, అనంత్‌రాజ్ 10-2.5% మధ్య జంప్‌చేయడం విశేషం. ఆ ఐదు మినహా సెన్సెక్స్-30లో ఐదు షేర్లు మినహా మిగిలినవన్నీ నీర సించడం గమనార్హం. సిప్లా 2% పుంజుకోగా, టాటా స్టీల్, ఎస్బీఐ, హిందాల్కో, కోల్ ఇండియా 0.5% స్థాయిలో బలపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఎన్టీపీసీ, భారతీ, టాటా మోటార్స్, గెయిల్, విప్రో, టీసీఎస్, సన్ ఫార్మా, ఎల్ అండ్ టీ తదితర దిగ్గజాలు 2-1% మధ్య నష్టపోవడంతో మార్కెట్లు నీరసించాయి. కాగా, మిడ్ క్యాప్స్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. దీంతో ట్రేడైన షేర్లలో 1,648 లాభపడితే, కేవలం 1,135 నష్టపోయాయి. చిన్న షేర్లలో వీనస్ రెమిడీస్ 20% దూసుకెళ్లగా, ఎంఎంటీసీ, సుజ్లాన్, బీఈఎంఎల్, బజాజ్ హిందుస్తాన్, ఎల్డర్ ఫార్మా, యూఫ్లెక్స్, ఎస్టీసీ తదితరాలు 11-8% మధ్య జంప్‌చేశాయి. ఈటీఎఫ్ లిస్టింగ్ జోరు ప్రభుత్వ సంస్థల వాటాలతో కూర్చిన సీపీఎస్ఈ ఈటీఎఫ్ లిస్టింగ్ తొలిరోజు జోరు చూపింది. ఇష్యూ ధర రూ. 17.45కాగా, 11% ఎగసి రూ. 19.40 వద్ద ముగిసింది. 8 కోట్ల షేర్లకుపైగా లావాదేవీలు జరిగాయి. ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, కంటెయినర్ కార్పొరేషన్ తదితర పది పీఎస్‌యూ షేర్లతో ఈటీఎఫ్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. -
కొపాక్సోన్పై నాట్కో ఫార్మాకి దెబ్బ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌ను అమెరికా మార్కెట్లోకి విడుదల చేసి అధికాదాయం పొందుదామనుకున్న నాట్కో ఫార్మా ఆశలపై టెవా ఫార్మా నీళ్లు జల్లింది. నాడీ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగించే కొపొక్సొన్ పేటెంట్ హక్కులపై టెవా ఫార్మా లేవనెత్తిన వాదనలు వినడానికి అమెరికా సుప్రీంకోర్టు సమ్మతించింది. వచ్చే రెండు నెలల్లో మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ఫార్మా రంగం సిద్ధం చేసుకుంటుండగా ఇప్పుడు టెవా సుప్రీంకోర్టుకు ఎక్కడంతో జాప్యం తప్పకపోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ గత ఏడాది అమెరికాలోని కింది కోర్టు ఇతర కంపెనీలతో కలిసి ఈ ఔషధాన్ని విక్రయించడానికి నాట్కోకి అనుమతి మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కొపాక్జోన్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి నాట్కో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ప్రపంచ జెనరిక్ ఔషధ కంపెనీల్లో మొదటి స్థానంలో ఉన్న టెవా వ్యాపారంలో 20 శాతం కొపాక్జోన్ నుంచి వస్తుండటమే కాకుండా, లాభాల్లో 50 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది అమెరికాలో కొపాక్సొన్ అమ్మకాల విలువ రూ. 25,200 కోట్లుగా నమోదయ్యింది. నమ్మకం ఉంది టెవాకి చెందిన 808 పేటెంట్ చెల్లదన్న నమ్మకాన్ని నాట్కో ఫార్మా వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. మైలాన్, మొమెంటా ఫార్మాస్యూటికల్స్‌తో కలిసి కొపాక్సొన్ను అమెరికాలో విక్రయించడానికి నాట్కోకి గతేడాది అనుమతి లభించింది. ప్రస్తుత వార్తల నేపథ్యంలో మంగళవారం నాట్కో ఫార్మా షేరు భారీ ట్రేడింగ్ పరిమాణంతో 14శాతం నష్టపోయి రూ.685 వద్ద ముగి సింది. కొపాక్సొన్ జెనరిక్ వెర్షన్‌పై నాట్కో హక్కులు పొందినప్పటి నుంచి ఆదాయం బాగా పెరుగుతుం దన్న అంచనాతో నాట్కో ఫార్మా షేరు దూసుకుపోయింది. ఇప్పుడు ఈ అంశం తిరిగి కోర్టు పరిధిలోకి వెళ్ళడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారని, ప్రస్తుత స్థాయి నుంచి 10 శాతం మించి పతనం అయ్యే అవకాశాలు కనిపించడం లేదని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి అభిప్రాయపడ్డారు. -
సెన్సెక్స్ రికార్డు హై, ఆవిరైన లాభాలు!
హైదరాబాద్: బ్లూ చిప్ కంపెనీ షేర్లను విదేశీ సంస్థాగత మదుపుదారులు కొనుగోళ్లు జరపడంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు బుధవారం సానుకూలంగా స్పందించాయి. ఇంట్రాడే ట్రేడింగ్ లో జీవిత కాలపు గరిష్ట స్థాయిని సెన్సెక్స్ నమోదు చేసుకుంది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఒడిగట్టడంతో ప్రధాన సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. ఓ దశలో సెన్సెక్స్ 22172 పాయింట్ల రికార్డు గరిష్ట స్థాయిని తాకింది. సెన్సెక్స్ చివరికి 40 పాయింట్ల లాభంతో 22095 వద్ద ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది. నిన్నటి ముగింపుకు నిఫ్టీ 11 పాయింట్ల వృద్ధితో 6601 వద్ద క్లోజైంది. సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో సెసా స్టెరిలైట్ అత్యధికంగా 4.23 శాతం, హిండాల్కో, జిందాల్ స్టీల్, ఐడీఎఫ్ సీ 3 శాతానికి పైగా లాభపడగా, టాటా మోటార్స్ 2.76 శాతం వృద్ధిని సాధించింది. డాక్టర్ రెడ్డీస్ అత్యధికంగా 3.30 నష్టపోగా, లుపిన్, టీసీఎస్, సన్ ఫార్మా, జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీల షేరు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి. -
ఒడిదుడుకుల వారము
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో మార్చి నెల ఎఫ్ అండ్ వో కాంట్రాక్ట్‌ల ముగింపు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకోవడానికి ప్రాధాన్యమిచ్చే అవకాశమున్నదని తెలిపారు. వచ్చే నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్షను చేపట్టనున్న నేపథ్యంలో వడ్డీ ప్రభావిత రంగాలలో లావాదేవీలు పుంజుకుంటాయని అంచనా వేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నందున ట్రేడర్ల కార్యకలాపాలు ఊపందుకుంటాయని దీంతో ఇండెక్స్‌లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని అభిప్రాయపడ్డారు. వెరసి ఇన్వెస్టర్లు రక్షణాత్మక రంగాల షేర్లవైపు దృష్టిసారిస్తారని పేర్కొన్నారు. వెలుగులో చిన్న షేర్లు : నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లో మార్చి డెరివేటివ్స్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదుడుకులు చవిచూస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ విభాగం ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. ఇందుకు లోక్‌సభ ఎన్నికలు, రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష వంటి అంశాలు కూడా కారణంకానున్నట్లు తెలిపారు. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగాలు వెలుగులో నిలుస్తాయని, వీటికితోడు చిన్న షేర్లకు డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. ఇకపై క్యూ4 ఫలితాలు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్లను నడిపిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,475 స్థాయి కీలకంగా నిలవనున్నదని తెలిపారు. ఈ స్థాయికి దిగువన అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలపై అంచనాలు: వచ్చే నెల 7 నుంచి మే 12 మధ్య కాలంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఇది విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్ఐఐలు) ప్రోత్సాహాన్నిస్తున్నదని చెప్పారు. దీంతో గడిచిన నెల రోజుల్లో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్, నిఫ్టీ 5%పైగా పురోగమించాయని వివరించారు. ఫెడ్ ఎఫెక్ట్: వచ్చే ఏడాది(2015) ద్వితీయార్థంలో వడ్డీ రేట్లను పెంచనున్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో సంకేతాలిచ్చింది. మరోవైపు నెలకు 10 బిలియన్ డాలర్ల చొప్పున సహాయక ప్యాకేజీలో కోతను పెంచుతూ వస్తోంది. దీంతో ప్రస్తుతం ప్యాకేజీ 55 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా, త్వరలో పూర్తిస్థాయిలో ప్యాకేజీని ఉపసంహరించే అవకాశం కూడా ఉంది. ఈ పరిణామాలు విదేశీ పెట్టుబడుల రాకపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ అంటోంది. ఎఫ్ఐఐల జోష్ న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌పై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆసక్తి కొనసాగుతోంది. వెరసి ఈ నెలలో ఇప్పటి వరకూ దాదాపు రూ. 9,600 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు ఎఫ్ఐఐలకు ప్రోత్సాహమిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. సెబీ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మార్చి నెలలో (21 వరకూ) ఎఫ్ఐఐలు నికరంగా రూ. 9,600 కోట్లను(156 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇక ఇదే కాలంలో రుణ(డెట్) సెక్యూరిటీలలో మరింత అధికంగా రూ. 12,816 కోట్లను(200 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. -
నాలుగో రోజూ నష్టాలే
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా భారత్ స్టాక్ సూచీలు వరుసగా నాలుగోరోజూ తగ్గాయి. క్యూ 3 ఫలితాల సీజన్ దగ్గరపడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంకావడం, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశపు మినిట్స్ వెల్లడికానుండటం, భారత్ సర్వీసుల రంగం నెమ్మదించిందంటూ హెచ్ఎస్బీసీ సూచి వెల్లడించడం వంటి అంశాలతో తాజా అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు వివరించాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 64 పాయింట్ల నష్టంతో 20,787 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 20 పాయింట్ల క్షీణతతో 6,191 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజి వున్న ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్‌లు 1-2% మధ్య నష్టపోవడంతో సెన్సెక్స్, నిఫ్టీలు తగ్గాయి. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 383 పాయింట్లు కోల్పోయింది. బ్యాంకింగ్, రియల్టీ, పవర్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. కొద్ది రోజుల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లు దృష్టిపెడుతున్న మిడ్‌క్యాప్ షేర్ల ర్యాలీ మాత్రం కొనసాగింది. ఎఫ్ఐఐలు రూ. 318 కోట్లు వెనక్కు తీసుకున్నారు. దేశీయ సంస్థలు రూ. 22 కోట్ల షేర్లను విక్రయించాయి. నిఫ్టీ 6,200 పుట్ ఆప్షన్లలో బిల్డప్... వరుసగా రెండోరోజూ 6,170 సమీపంలో నిఫ్టీ మద్దతు పొందడంతో 6,200 స్ట్రయిక్ వద్ద ఇన్వెస్టర్లు పుట్ ఆప్షన్లను విక్రయించారు. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో మరో 3 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 43.42 లక్షల షేర్లకు పెరిగింది. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్లో కూడా 3.98 లక్షల షేర్లు యాడ్‌అయినా, మొత్తం ఓఐ పరిమితంగా 22.34 లక్షలే వుంది. కానీ 6,300 స్ట్రయిక్ వద్ద భారీగా కాల్ రైటింగ్ జరగడంతో 8.47 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 49.21 లక్షల షేర్లకు పెరిగింది. ఏదైనా ప్రతికూల వార్త వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200పైకి తిరిగి చేరవచ్చని, రానున్న రోజుల్లో 6,300 స్థాయి నిరోధించవచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నట్లు ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. ఫలానా స్థారుుని మించి షేరు లేదా ఇండెక్స్ పెరగదన్న అంచనాలతో కాల్ ఆప్షన్‌ను, లేదా తగ్గదన్న అంచనాలతో పుట్ ఆప్షన్‌ను విక్రరుుంచడాన్ని ఆప్షన్ రైటింగ్‌గా వ్యవహరిస్తారు. వారి అంచనాలకు తగ్గట్లు షేరు పెరగకపోతే కాల్ ఆప్షన్ ప్రీమియుం, తగ్గకపోతే పుట్ ఆప్షన్ ప్రీమియుం తగ్గిపోతుంది. ఎక్కువ ప్రీమియుంకు విక్రరుుంచిన ఆప్షన్ కాంట్రాక్టును ప్రీమియుం తగ్గిన తర్వాత కొంటే, అవ్ముకం కొనుగోలు ధర వుధ్య వ్యత్యాసం లాభంగా మిగులుతుంది. అంచనాలకు భిన్నంగా ప్రీమియుం పెరిగితే ఆప్షన్లు రైట్ చేసినవారు నష్టపోతారు. అలా అమ్మకందార్లు రైట్ చేసిన కాంట్రాక్టులను కొన్నవారు లాభపడతారు. -
ఫెడ్ ఎఫెక్ట్... ఎగసిపడిన మార్కెట్
వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌వేస్తూ రిజర్వుబ్యాంక్ ఇన్వెస్టర్లకు ఇచ్చిన ఊరట ఒక్కరోజుకే పరిమితమయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ టాపరింగ్‌కు శ్రీకారం చుట్టడంతో తిరిగి మార్కెట్లు క్షీణించాయి. ఆర్బీఐ చర్యతో క్రితం రోజు 248 పాయింట్లు ర్యాలీ జరిపిన సెన్సెక్స్ ఫెడ్ ఎఫెక్ట్‌తో 151 పాయింట్లు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ కోసం ప్రతీ నెలా ఉద్దేశించిన 85 బిలియన్ డాలర్ల ప్యాకేజీ నుంచి 10 బిలియన్ డాలర్లు ఉపసంహరించాలన్న నిర్ణయాన్ని గతరాత్రి ఫెడ్ తీసుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న సంకేతాన్ని ఈ టాపరింగ్ ద్వారా ఫెడ్ అందించడంతో అమెరికా సూచీలు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ ప్రభావంతో గురువారం ఉదయం 20,959 స్థాయికి గ్యాప్‌అప్‌తో మొదలైన బీఎస్ఈ సెన్సెక్స్, తదుపరి కొన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో పడిపోయింది. చివరకు 20,708 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51 పాయింట్ల నష్టంతో 6,166 వద్ద క్లోజయ్యింది. పెరిగిన బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్. షేర్లలో విక్రయాలు జరిగాయి. అమెరికా రికవరీతో లబ్దిచేకూరవచ్చన్న అంచనాలతో ఐటీ, ఫార్మా షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోలుచేయడంతో ఆ షేర్లు పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎస్బీఐలు 2-3 శాతం మధ్య తగ్గాయి. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు కొత్త రికార్డుస్థాయికి చేరాయి. విప్రో 13యేళ్ల గరిష్ట స్థాయిలో రూ. 530 వద్ద, టెక్ మహీంద్రా ఆరేళ్ల గరిష్ట స్థాయి రూ. 1,799 వద్ద ముగిసాయి. ఫార్మా దిగ్గజాలు సిప్లా, ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు 2-3 శాతం మధ్య ఎగిసాయి. ఆటోమొబైల్ షేరు మారుతి సైతం కొత్త రికార్డుస్థాయి రూ. 1,798 స్థాయికి పెరిగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఒకే రోజున భారీగా రూ. 2,264 కోట్ల పెట్టుబడుల్ని కుమ్మరించారు. నిఫ్టీలో లాంగ్ ఆఫ్‌లోడింగ్: ఫెడ్ టాపరింగ్ నిర్ణయంతో నిఫ్టీ 6,200 మద్దతుస్థాయిని కోల్పోయినా, సమీప భవిష్యత్తులో పెద్ద పతనం జరగకపోవొచ్చని డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. 6,263 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 6,150 పాయింట్ల కనిష్టస్థాయివరకూ నిఫ్టీ క్షీణించడానికి లాంగ్ ఆఫ్‌లోడింగ్ కారణం. షార్టింగ్ వల్ల ఈ తగ్గుదల జరగలేదు. ఈ ప్రక్రియను సూచిస్తూ నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 30.69 లక్షల షేర్లు (14%) కట్ అయ్యాయి దాంతో మొత్తం ఓఐ 1.89 కోట్ల షేర్లకు తగ్గింది. 6,200 స్ట్రయిక్ వద్ద కాల్‌రైటింగ్ జరగడంతో ఈ కాల్ ఆప్షన్ ఓఐలో 18.18 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం బిల్డప్ 54.79 లక్షల షేర్లకు చేరింది. 6,200, 6,100 స్ట్రయిక్స్ వద్ద స్వల్పంగా పుట్ కవరింగ్ జరిగింది. 6,200 వద్ద ఏర్పడిన తాజా నిరోధాన్ని దాటితేనే అప్‌ట్రెండ్ సాధ్యమని, ఈ స్థాయి దిగువన బలహీనంగా రేంజ్బౌండ్లో ట్రేడ్‌కావొచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
ఆ బాధ్యతంతా పీఎస్యూలదే
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న మొండి బకాయిల (ఎన్పీఏ) బాధ్యత ప్రభుత్వ రంగ బ్యాంకులదేనని ఆర్థిక మంత్రి పి.చిదంబరం స్పష్టంచేశారు. ఇందుకు ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించటం సమంజసం కాదన్నారు. శనివారమిక్కడ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) 20వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్పీఏల బాధ్యత ఆయా బ్యాంకుల బోర్డులదే. రికవరీ విధానాలు ప్రస్తుతం కొంత సరళంగా ఉన్న మాట నిజం. అవి మారాల్సి ఉంది. అయితే బ్యాంకుల రుణ రేటు పెరుగుతోంది కనక ఎన్పీఏలు పెరిగినా సరే ప్రభుత్వం వాటికి తాజా మూలధనాన్ని అందిస్తోంది’’ అని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... మార్కెట్ అక్రమాలను నిరోధించడానికి వీలుగా రెగ్యులేటర్ సెబీకి మరిన్ని అధికారాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి సంబంధించి సభా సంఘం తన నివేదికను ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు సమర్పించకపోతే మూడో సారి సైతం ఆర్డినెన్స్‌ను పొడిగించాల్సి ఉంటుంది. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫారసుల ప్రకారం ద్రవ్య పరపతి విధానం రూపకల్పన, బ్యాంకింగ్ రెగ్యులేషన్ మినహా ఆర్బీఐ నిర్వహిస్తున్న ఇతర కార్యకలాపాలు కొన్నింటిని సమీక్షించాల్సి ఉంది. వీలైతే ఆయా అధికారాలను ప్రభుత్వం లేదా ఇతర నియంత్రణ సంస్థలకు అప్పగించాలి. -
సెన్సెక్స్ 590 పాయింట్ల పతనం
స్టాక్ మార్కెట్లను మంగళవారం అమంగళమై ఉరిమింది. దీనికి రూపాయి మహా పతనం పిడుగుపాటులా జత కలిసింది. ఇదిచాలదన్నట్లు ఆహార భద్రత బిల్లువల్ల పెరగనున్న సబ్సిడీ ఆందోళనలు పెనుతుపానులా చెలరేగాయి. ఇంకేముంది? ఒక్కసారిగా దెబ్బతిన్న సెంటిమెంట్‌తో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్రారంభంనుంచీ అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో సెన్సెక్స్ 590 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ ఏడాది కనిష్టాన్ని తాకింది. ఒక్క రోజులో రూ. 1.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది!! నిరంతర పతనంతో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న దేశీ కరెన్సీ స్టాక్ మార్కెట్లను కూడా వణికిస్తోంది. ఇదివరకు ఎన్నడూ ఎరుగని విధంగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతుండటంతో ఉదయం నుంచీ అమ్మకాలు వెల్లువెత్తాయి. చరిత్రలోలేని విధంగా మిడ్ సెషన్లో 2.7% పతనమై 66కుపైగా పడిపోయిన రూపాయి దెబ్బకు సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు సోమవారం రాత్రి లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందడంతో ఇప్పటికే కరెంట్ ఖాతాలోటుతో కుదేలైన ప్రభుత్వంపై సబ్సిడీ భారం మరింత పెరుగుతుందన్న ఆందోళనలు కూడా దీనికి జత కలిశాయి. వెరసి సెన్సెక్స్ 590 పాయింట్లు కుప్పకూలి 18,000 దిగువ కు చేరింది. గత మూడు రోజుల్లో ఆర్జించిన లాభాలు తుడిచిపెట్టుకుపోయి 17,968 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 189 పాయింట్లు కోల్పోయి 5,300 దిగువన 5,287 వద్ద స్థిరపడింది. ఇది ఏడాది కనిష్టం. నిఫ్టీ అంతక్రితం 2012 సెప్టెంబర్ 6న మాత్రమే ఈ స్థాయిలో ముగిసింది. కాగా, ఏ దశలోనూ కోలుకోని రూపాయి ట్రేడింగ్ ముగిసేసరికి ఏకంగా 3%(194 పైసలు) పడిపోయి కొత్త రికార్డును నెలకొల్పింది! ఫలితంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 66.24 వద్ద నిలిచింది!! చమురు మంటలు... మధ్యప్రాచ్యంలో చెలరేగిన అశాంతి నేపథ్యంలో చమురు ధరలు 5 నెలల గరిష్టానికి చేరడంతో దిగుమతుల బిల్లు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్యాకేజీల ఉపసంహరణ త్వరలో మొదలుకావచ్చునన్న అంచనాలు కూడా మూకుమ్మడి అమ్మకాలకు కారణమయ్యాయని విశ్లేషించారు. కాగా, రూ. 1.83 లక్షల కోట్ల విలువైన 27 ప్రాజెక్ట్‌లకు కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేయడాన్ని ప్రస్తావించిన ఆర్థిక మంత్రి చిదంబరం ఆర్థిక వ్యవస్థ త్వరలోనే పుంజుకుంటుందన్న భరోసా ఇచ్చినప్పటికీ మార్కెట్లు పెడచెవిన పెట్టాయి. తయారీ రంగంతోపాటు, పెట్టుబడుల వాతావరణం మెరుగుపడటం మొదలైతే ఆర్థిక వృద్ధి జోరందుకుంటుందని ఆశావహంగా చెప్పినప్పటికీ ఇన్వెస్టర్లు అమ్మకాలను ఆపకపోవడం గమనార్హం. పాతాళమే హద్దు... బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ 0.5-5.5% మధ్య కుప్పకూలాయి. ఐటీ ఒక్కటే కాస్త నిలదొక్కుకుంది. మొండి బకాయిల భారంతో బ్యాంకింగ్ ఇండెక్స్ అత్యధికంగా 5.5% పతనంకాగా, బ్యాంక్ షేర్లన్నీ నష్టపోయాయి. ఇక క్యాపిటల్ గూడ్స్, పవర్, రియల్టీ, మెటల్, ఎఫ్ఎంసీజీ రంగాలు సైతం 5-3% మధ్య పడిపోయాయి. బ్యాంక్ షేర్లలో యస్ బ్యాంక్, హెచ్ డీఎఫ్సీ, ఇండస్ఇండ్, ఫెడరల్, బీవోఐ, యాక్సిస్, యూనియన్, కెనరా, పీఎన్బీ, ఐసీఐసీఐ, ఎస్బీఐ 10-2.5% మధ్య పడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సెన్సెక్స్‌లో కేవలం ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, సెసా గోవా నిలదొక్కుకోగా, భెల్ 10% కుప్పకూలింది. ఈ బాటలో హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, జిందాల్ స్టీల్, హిందాల్కో, భారతీ, మారుతీ 8-4% మధ్య దిగజారగా, ఇండెక్స్ హెవీవెయిట్స్ ఐటీసీ, ఓఎన్జీసీ, హెచ్‌యూఎల్, ఆర్ఐఎల్ సైతం 3.5-2% మధ్య తిరోగమించాయి. ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే మొత్తం స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో రూ. 1.7 లక్షల కోట్లు హరించుకుపోయింది. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 2% క్షీణించాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 1,538 నష్టపోగా, కేవలం 719 బలపడ్డాయి. సోమవారం రూ. 607 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 1,374 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం. దేశీయ ఫండ్స్ రూ. 480 కోట్లను ఇన్వెస్ట్‌చేశాయి. మిడ్ క్యాప్స్‌లో ఐడీఎఫ్సీ మరోసారి 17% నేలకూలగా, జేపీ పవర్, పటేల్ ఇంజినీరింగ్, జేపీ అసోసియేట్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, పీఎఫ్సీ, సింటెక్స్, ఫైనాన్షియల్ టెక్, ఆర్ఈసీ, స్పైస్‌జెట్, శ్రీరాం ట్రాన్స్, ఆదిత్యబిర్లా నువో, హింద్ కాపర్ తదితరాలు 9-7% మధ్య పడ్డాయి. బీఎస్ఈలో 177 షేర్లు ఏడాది కనిష్టాన్ని తాకాయి. వీటిలో హెచ్డీఎఫ్సీ ద్వయం, అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్టీపీసీ, ఏసీసీ వంటి బ్లూచిప్స్ ఉన్నాయి! బీఎస్ఈలో రూ. 2,065 కోట్లు, ఎన్ఎస్ఈలో రూ. 12,078 కోట్లు చొప్పున టర్నోవర్ జరిగింది. ఎన్ఎస్ఈ ఎఫ్అండ్ఓలో రూ. 2,93,346 కోట్లు నమోదైంది. కడపటి వార్తలందేసరికి యూఎస్‌లోని డోజోన్స్, ఎస్అండ్పీ-500, నాస్డాక్ సూచీలు 1% క్షీణించి ట్రేడవుతున్నాయి. ఇక యూరప్‌లోని యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మార్కెట్లు 1-3% మధ్య నష్టపోయాయి. -
వెలుగులో పవర్, ఫార్మా షేర్లు
పవర్, ఫార్మా, మెటల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో వరుసగా మూడోరోజు స్టాక్ సూచీలు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ట్రేడింగ్ తొలిదశలో 208 పాయింట్లు పెరిగి 18,728 పాయింట్ల గరిష్టస్థాయికి చేరింది. అయితే బ్యాంకింగ్, ఆయిల్ షేర్లలో అమ్మకాల కారణంగా తొలి లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ చివరకు 39 పాయింట్ల లాభంతో 18,558 పాయింట్ల వద్ద ముగిసింది. తొలుత 5,528 పాయింట్ల గరిష్టస్థాయివరకూ ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 5 పాయింట్ల స్వల్పలాభంతో 5,476 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. షార్ట్ రోలోవర్స్ యాక్టివిటీ.... నిఫ్టీ ఆగస్టు కాంట్రాక్టులో షార్ట్ పొజిషన్ల స్క్వేర్‌ఆఫ్ చేయడం, ఆ పొజిషన్లను వచ్చే నెలకు రోలోవర్ చేసుకోవడంలో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు నిమగ్నమైనట్లు డెరివేటివ్ డేటా సూచిస్తోంది. మరో మూడురోజుల్లో ఆగస్టు ఫ్యూచర్ కాంట్రాక్టులు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల నిఫ్టీ ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ల స్క్వేరింగ్ ఆఫ్ యాక్టివిటీ జరగడంతో ఆ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 19.12 లక్షల షేర్లు కట్ అయ్యాయి. దాంతో మొత్తం ఓఐ 2.13 కోట్ల షేర్లకు దిగింది. సెప్టెంబర్ డెరివేటివ్ సెటిల్మెంట్ ప్రారంభంకాబోయే శుక్రవారంనాడు జీడీపీ గణాంకాలు వెలువడనుండటం, రూపాయి మారకపు విలువ తిరిగి 64.30 స్థాయికి తగ్గడం వంటి అంశాల కారణంగా ఇన్వెస్టర్లు షార్ట్ పొజిషన్లను వచ్చే నెల ఫ్యూచర్లోకి రోలోవర్ చేసివుండవచ్చు. షార్ట్ రోలోవర్స్ను ప్రతిబింబిస్తూ సెప్టెంబర్ నిఫ్టీ కాంట్రాక్టు ప్రీమియం 10 పాయింట్లకే పరిమితంకావడంతో పాటు ఓఐలో 24.96 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. గతంలో విక్రయించిన ఈ నెల ఫ్యూచర్ కాంట్రాక్టును తిరిగి కొనుగోలు చేయడాన్ని షార్ట్ స్క్వేర్ఆఫ్గా, వచ్చే నెలకు సంబంధించిన అదే కాంట్రాక్టును మళ్లీ విక్రయించడాన్ని షార్ట్ రోలోవర్గా పరిగణిస్తారు. ఇక స్టాక్ ఫ్యూచర్లలో 9 శాతం ర్యాలీ జరిపిన సేసా గోవా కాంట్రాక్టులో అసాధారణమైన ట్రేడింగ్ జరిగింది. సేసా గోవాలో విలీనం కానున్న స్టెరిలైట్ ఇండస్ట్రీస్ షేరుకు సోమవారం చివరి ట్రేడింగ్రోజు కావడంతో ఈ రెండు షేర్లకు సంబంధించిన ఫ్యూచర్ కాంట్రాక్టుల యాక్టివిటీ అంతా సేసా గోవాలోనే జరిగింది. ఫలితంగా ఆగస్టు సేసా గోవా ఫ్యూచర్లో 3.28 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 87.78 లక్షల షేర్లకు పెరిగింది. షార్ట్ సెల్లింగ్‌ను సూచిస్తూ ఆగస్టు కాంట్రాక్టు క్యాష్ ధరతో పోలిస్తే రూ. 8 డిస్కౌంట్‌తో ముగిసింది. సెప్టెంబర్ ఫ్యూచర్లో భారీగా 76.72 లక్షల షేర్ల మేర షార్ట్స్ రోలోవర్ అయ్యాయి. దాంతో ఆ నెల ఫ్యూచర్లో ఓఐ 1.75 కోట్ల షేర్లకు పెరిగింది. ఇది సేసా గోవా కౌంటర్లో రికార్డు. కొద్ది రోజుల నుంచి క్యాష్ మార్కెట్లో షేర్లను కొంటున్న ఇన్వెస్టర్లు, ఆ షేర్లను హెడ్జ్ చేసుకునే ప్రక్రియలో ఫ్యూచర్ కాంట్రాక్టును షార్ట్ చేస్తున్నట్లు ఈ డేటా సూచిస్తోంది. -
మిడ్‌క్యాప్స్ హవా సెన్సెక్స్ 124 పాయింట్లు
గురువారం ట్రేడింగ్‌లో అటు రూపాయితోపాటు ఇటు స్టాక్ మార్కెట్లు కూడా పుంజుకున్నాయి. కరెన్సీకి మద్దతుగా ప్రభుత్వం మరిన్ని చర్యలను తీసుకోనుందన్న అంచనాలు రూపాయికి బలాన్నివ్వగా, జూలై నెలకు చైనా వాణిజ్య గణాంకాలు ఊపందుకోవడంతో స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహం లభించింది. వెరసి సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 18,789 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 47 పాయింట్లు బలపడి 5,566 వద్ద స్థిర పడింది. కాగా, ఇటీవల అమ్మకాల వెల్లువతో బేర్‌మంటున్న చిన్న షేర్లు వెలుగులో నిలవడం విశేషం! దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5% స్థాయిలో పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,381 లాభపడగా, కేవలం 867 నష్టపోయాయి. ఇక బుధవారం ట్రేడింగ్ ముగిశాక ఫలితాలను ప్రకటించిన ఫార్మా దిగ్గజం ర్యాన్‌బాక్సీ షేరు దాదాపు 28% దూసుకెళ్లి రూ. 359 వద్ద ముగిసింది. ఒక దశలో 34% జంప్‌చేసి రూ. 377 వద్ద గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 3,279 కోట్లు పెరిగి రూ. 15,206 కోట్లకు చేరింది. అంచనాలకు మించి నష్టాలను తగ్గించుకోవడంతో ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారని, మరోవైపు షార్ట్ కవరింగ్ కూడా ఇందుకు జతకలసిందని నిపుణులు పేర్కొన్నారు. గత నెల రోజుల్లో ఈ షేరు దాదాపు 18% పతనమైంది. ఎఫ్ఐఐల అమ్మకాలు వరుసగా రెండో రోజు ఎఫ్ఐఐలు నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. బుధవారం రూ. 351 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, తాజాగా రూ. 396 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 516 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. మెటల్, రియల్టీ రంగాలు 2.5% స్థాయిలో పుంజుకోగా, సెన్సెక్స్‌లో హిందాల్కో, టాటా స్టీల్, సిప్లా 5% చొప్పున ఎగశాయి. ఈ బాటలో మారుతీ, భారతీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ 4-2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా, ఎస్బీఐ 3%పైగా తిరోగమించాయి. నేడు మార్కెట్లకు సెలవు ఈద్ఉల్ఫితర్(రంజాన్) సందర్భంగా శుక్రవారం(9న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈలతోపాటు, ఫారెక్స్, కమోడిటీ టోకు మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అయితే బులియన్ మార్కెట్లు యథావిధిగా పనిచేస్తాయి. -
మరో 68 పాయింట్లు డౌన్
డాలరుతో మారకంలో రూపాయి విలువ మరో కొత్త కనిష్టాన్ని తాకడంతో స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. దీంతో వరుసగా రెండో రోజు సెన్సెక్స్ ఒడిదొడుకులను ఎదుర్కొంది. 18,811-18,551 పాయింట్ల మధ్య ఊగిసలాడి చివరకు 18,665 వద్ద స్థిరపడింది. ఇది 68 పాయింట్ల నష్టంకాగా, నిఫ్టీ కూడా 23 పాయింట్లు క్షీణించింది. 17 వారాల కనిష్టమైన 5,519 వద్ద నిలిచింది. అయితే మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో చిన్న షేర్లు పుంజుకున్నాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.3% లాభపడగా, మిడ్ క్యాప్ 0.7% బలపడింది. వెరసి ట్రేడైన మొత్తం షేర్లలో 1,249 లాభపడగా, 1,042 నష్టపోయాయి. ఏప్రిల్-జూన్ కాలానికి కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.7% స్థాయిలో వృద్ధి చెందడంతో ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలలో కోత విధించవచ్చునన్న అంచనాలు బలపడుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో డాలర్ల పెట్టుబడులు వెనక్కుమళ్లుతాయన్న ఆందోళనతో అమ్మకాలు కొనసాగుతున్నాయని విశ్లేషించారు. రియల్టీ హైజంప్ ప్రధానంగా ఐటీ, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు 1.5% స్థాయిలో డీలాపడగా, రియల్టీ ఇండెక్స్ అత్యధికంగా 5% ఎగసింది. ఐటీ షేర్లపై ఫండ్స్ మక్కువ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల కంపెనీలపై దేశీయ మ్యూ చువల్ ఫండ్స్‌కు మక్కువ పెరుగుతోంది. జూన్ చివరికి ఐటీ రంగ షేర్లలో ఫండ్స్ మొత్తం పెట్టుబడులు రూ. 18,430 కోట్లకు చేరాయి. ఇవి మూడు నెలల గరిష్టంకాగా, ఫండ్స్ నిర్వహణలోగల మొత్తం ఆస్తులలో(ఏయూఎం) 10% వాటాకు సమానం. సెబీ గణాంకాల ప్రకారం జూన్ 30కల్లా ఫండ్స్ ఏయూఎం రూ. 1.80 లక్షల కోట్లుగా నమోదైంది.