సెబీ అనుమతి తర్వాత ప్రాస్పెక్టస్ దాఖలు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్‌ఎస్‌ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు.
వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు.
ఇప్పటికే బీఎస్‌ఈ
బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్‌ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్‌ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్‌ఎస్‌ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్‌లో ఎన్‌ఎస్‌ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్‌ఎస్‌ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు.
Comments
Please login to add a commentAdd a comment