Ashish Kumar
-
డెరివేటివ్స్‌లో ట్రేడింగ్ వద్దు
న్యూఢిల్లీ: డెరివేటివ్స్(ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. తగినంత సమాచారంతోపాటు రిసు్కలను అర్ధం చేసుకోగల, మేనేజ్‌చేయగల ఇన్వెస్టర్లకు మాత్రమే ఎఫ్‌అండ్‌వో విభాగం పరిమితమని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేయడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టడం ఉత్తమమని సూచించారు. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రదాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ సైతం డెరివేటివ్స్ విభాగంలో పెరుగుతున్న రిసు్కలపై రిటైలర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది(2023) నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కూడా ఎఫ్‌అండ్‌వోపై అధికంగా దృష్టిపెట్టవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరించడం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌లో పాల్గొనవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లను ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ తాజాగా హెచ్చరించారు. ఎంఎఫ్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టమంటూ సలహా ఇచ్చారు. డెరివేటివ్స్ విభాగమే ప్రయోజనమనుకునే ఇన్వెస్టర్లు పూర్తిస్థాయిలో రిసు్కలను అర్ధం చేసుకున్నాకే ట్రేడింగ్‌ను చేపట్టమని చౌహాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రిసు్కలను మేనేజ్‌చేయగల సామర్థ్యం సైతం కీలకమని పేర్కొన్నారు. ఇలాకాని పక్షంలో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను చేపట్టవద్దని స్పష్టం చేశారు. -
ఐపీవోవైపు ఎన్ఎస్ఈ చూపు
ముంబై: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ యోచనలో ఉంది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించిన తదుపరి సవరించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వెరసి సెబీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించాక మరోసారి ఐపీవో సన్నాహాలు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అధిక రిస్కులుగల డెరివేటివ్స్‌లో లావాదేవీలు చేపట్టవద్దంటూ ఈ సందర్భంగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ఈ విభాగంలో తగినంత సమాచారమున్న ఇన్వెస్టర్లు మాత్రమే ట్రేడింగ్ చేయగలరని తెలియజేశారు. సెబీ పరిశీలన ప్రకారం 10మంది ట్రేడర్లలో 9మంది నష్టపోయినట్లు ప్రస్తావించారు. ఇప్పటికే బీఎస్ఈ బొంబాయి స్టాక్ ఎక్సే్ఛంజీ(బీఎస్ఈ) 2017లోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. సెబీ నిబంధనల ప్రకారం ఎన్ఎస్ఈలో లిస్టయ్యింది. అయితే లిస్టింగ్ సమయంలో చౌహాన్ బీఎస్ఈ సీఈవోగా బాధ్యతలు నిర్వహించడం గమనార్హం! ఎక్సే్ఛంజీ సుపరిపాలన విషయంలో కొంతమంది మాజీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన ఆరోపణలతో ఎన్ఎస్ఈపై సెబీ దర్యాప్తునకు తెరతీసిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈ లిస్టింగ్ ప్రణాళికలకు బ్రేక్ పడింది. కోలొకేషన్ సౌకర్యాలను అక్రమంగా వినియోగించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తద్వారా కొంతమంది ట్రేడింగ్ సభ్యులకు ముందస్తు ప్రవేశం కలి్పంచినట్లు ఆరోపణలు తలెత్తాయి. కాగా.. 2016 డిసెంబర్లో ఎన్ఎస్ఈ ఐపీవో చేపట్టేందుకు వీలుగా సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసింది. దీనిలో భాగంగా ఎన్ఎస్ఈ వాటాదారులు 22 శాతం ఈక్విటీని విక్రయించేందుకు ఆసక్తి చూపారు. అయితే 2020లోనూ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే సెబీ అనుమతుల తదుపరి ఐపీవో ప్రాసెస్‌ను ప్రారంభించేందుకు ప్రణాళికలు వేసినప్పటికీ ముందుకుసాగలేదు. -
ఎన్ఎస్ఈ చీఫ్‌గా చౌహాన్ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) ఎండీ, సీఈవోగా ఆశిష్‌కుమార్ చౌహాన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇంత కాలం పాటు బీఎస్ఈ ఎండీ, సీఈవోగా వ్యవహరించగా, సోమవారంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఎన్ఎస్ఈ సీఈవో, ఎండీగా విక్రమ్ లిమాయే పదవీ కాలం జూలై 15తో ముగిసిన నేపథ్యంలో, ఈ పదవికి చౌహాన్ ఎంపిక కావడం తెలిసిందే. ఎన్ఎస్ఈ వ్యవస్థాపక బృందంలో ఆశిష్ కుమార్ కూడా ఒకరు. 2000 సంవత్సరంలో ఎన్ఎస్ఈని వీడారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూపు కంపెనీల్లో కీలక బాధ్యతల్లోకి వెళ్లారు. తిరిగి 2009లో బీఎస్ఈ డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపట్టి, 2012లో సీఈవో అయ్యారు. మరోవైపు బీఎస్ఈ కొత్త చీఫ్ కోసం అన్వేషణ మొదలు పెట్టింది. అప్పటి వరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ బీఎస్ఈ రోజువారీ వ్యవహారాలు చూస్తుందని పేర్కొంది. కీలక బాధ్యతలు.. ఎన్ఎస్ఈ చీఫ్‌గా ఆశిష్‌కుమార్ ముందు పరిష్కరించాల్సిన పలు కీలక అంశాలు ఉన్నాయి. ఎన్ఎస్ఈలో తరచూ సాంకేతిక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన వ్యక్తిగా ఆశిష్ కుమార్ చౌహాన్ దీనికి పరిష్కారం చూపిస్తారని భావిస్తున్నారు. అలాగే, కోలొకేషన్ స్కామ్‌లో ఎన్ఎస్ఈ తనపై పడ్డ మరకను కడిగేసుకోవాల్సి ఉంది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎన్ఎస్ఈని విజయవంతంగా ఐపీవోకు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది. అలాగే, పాలనా లోపాలకు చెక్ పెట్టాల్సి ఉంది. బీఎస్ఈ బాస్‌గా ఆశిష్‌కుమార్ తనదైన ముద్ర వేశారు. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ఎక్సేంజ్‌గా తీర్చిదిద్దారు. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫామ్ బీఎస్ఈ స్టార్ ఎంఎఫ్‌ను ఏర్పాటు చేశారు. -
విభజన సమస్యల పరిష్కారానికి.. ఇక ప్రతి నెలా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉప కమిటీ ఇకపై ప్రతి నెలా సమావేశమై పురోగతిని సమీక్షించాలని నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ తొలి సమావేశం గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. సుమారు గంటన్నరకు పైగా జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలను వినిపించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్ ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వాణిజ్యపన్నుల శాఖ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, ఎస్ఎఫ్సీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.గుల్జార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పెండింగ్ అంశాలపై చర్చించేందుకు ఇకపై ప్రతి నెలా సమావేశాన్ని నిర్వహిస్తామని ఆశిష్ కుమార్ తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి రావాల్సిన పలు రకాల బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని సమావేశంలో కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. సమస్యలు వేగంగా పరిష్కారమయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీ ఇద్దరికీ ఇవ్వాల్సిందే ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజనకు సంబంధించి కేంద్రానికి ప్రణాళిక అందచేశామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు కోరారు. దీనిపై న్యాయ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలం జాప్యం చేసి ఇటీవలే కౌంటర్ దాఖలు చేయగా, కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని ఏపీ అధికారులు పేర్కొన్నారు. డబ్బులకు బదులుగా ఇచ్చిన ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలన్నారు. కరెంట్ బకాయిలపై.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలపై ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర హోంశాఖను ఆంధ్రప్రదేశ్ కోరింది. అయితే ఏపీ ప్రభుత్వం దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించినందున ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. న్యాయపరంగా పరిశీలన చేసి విభజన చట్టప్రకారం ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీ అధికారులు పేర్కొన్నారు. రూ.3,800 కోట్ల పన్నులు రావాలి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో నమోదైన పలు కంపెనీలు పన్నులు కూడా అక్కడే చెల్లించాయి. ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన రూ.3,800 కోట్ల పన్నులను ఇప్పించాలని ఏపీ అధికారులు ఉప కమిటీ సమావేశంలో కోరారు. ధాన్యం డబ్బులు, సబ్సిడీ.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణకు కోసం వినియోగించిన రూ.400 కోట్ల ఏపీ నిధులను తిరిగి చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీని విడుదల చేయాలని సమావేశంలో ఏపీ అధికారులు కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైనా ఏపీ అధికారులు వాదనలు వినిపించారు. -
మరో సంచలనం.. బాహుబుల్ 60000
ముంబై: స్టాక్ మార్కెట్లో శుక్రవారం మరో సంచలనం చోటుచేసుకుంది. సెన్సెక్స్ సూచీ తన 42 ఏళ్లలో సుదీర్ఘ ప్రయాణంలో తొలిసారి 60 వేల మైలురాయిని అధిగమించింది. కొంతకాలంగా దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ప్రాథమిక మార్కెట్లు ఐపీఓలతో కళకళలాడుతున్నాయి. ఆర్బీఐ సరళతర ద్రవ్య విధానానికి కట్టుబడింది. ప్రపంచ మార్కెట్ల నుంచీ సానుకూల సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్‌తో కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం అన్ని రంగాలకు రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. దీంతో దలాల్ స్ట్రీట్ కొన్ని వారాలుగా కొనుగోళ్ల పర్వం కొనసాగుతుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ కొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. మార్కెట్లో పండుగ వాతావరణం... దేశీయ మార్కెట్లోని సానుకూలతలతో స్టాక్ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 60 వేలపైన 60,159 వద్ద, నిఫ్టీ 74 పాయింట్లు ఎగసి 17,897 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సూచీలు ఆరంభంలోనే సరికొత్త చరిత్ర సృష్టించడంతో స్టాక్ మార్కెట్లలో పండుగ వాతావరణం కనిపించింది. ఆటో, ఆర్థిక, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సెన్సెక్స్ మిడ్‌సెషన్‌లో కొంతసేపు మినహా రోజంతా 60 వేల స్థాయిపైనే ఉంది. ఇంట్రాడేలో 448 పాయిం ట్లు పెరిగి వద్ద 60,315 జీవితకాల గరిష్టాన్ని నమోదుచేసింది. చివరికి 163 పాయింట్ల లాభంతో 60,048 వద్ద ముగిసింది. నిఫ్టీ 18 వేల స్థాయిని అందుకునే ప్రయత్నం చేసినా... గరిష్టాల వద్ద నిరోధం ఎదురవడంతో ఈ స్థాయిని అందుకోవడంలో విఫలమైంది. ట్రేడింగ్‌లో 125 పాయింట్లు పెరిగి 17,948 పాయింట్ల వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 30 పాయింట్ల లాభంతో 17,853 వద్ద స్థిరపడింది. ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్ షేర్లలో అమ్మకాలు జరగడంతో సూచీలు ఆరంభలాభాల్ని కోల్పో యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.422 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.516 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. సూచీలకు ఐదోవారామూ లాభాలే... బుల్ రన్లో భాగంగా సూచీలు ఐదోవారమూ లాభాలను గడించాయి. ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు 1.5% చొప్పున ర్యాలీ చేశాయి. సెన్సెక్స్ 1033 పాయింట్లు, నిఫ్టీ 268 పాయింట్లు ఎగిశాయి. సెన్సెక్స్ 60,000 స్థాయిని అందుకోవడమనేది భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోంది. కోవిడ్ సమయంలో సంపన్న దేశాలు అనుసరించిన సరళీకృత ద్రవ్యపాలసీ విధాన వైఖరి, వడ్డీరేట్ల సడలింపు తదితర అవకాశాలను అందిపుచ్చుకున్న భారత్ ప్రపంచంలో ఆర్థిక అగ్రగామి రాజ్యంగా ఎదుగుతోంది. – అశిష్‌కుమార్ చౌహాన్, బీఎస్ఈ ఎండీ, సీఈవో -
భారత బాక్సర్ల పసిడి పంచ్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరుల్లో అమిత్ 3–0తో రెనె అబ్రహం (అమెరికా)పై... సోహెబ్ బౌఫియా (అమెరికా)పై సంజీత్ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో జోసెఫ్ జెరోమ్ హిక్స్ (అమెరికా)తో ఆశిష్ కుమార్ తలపడాల్సి ఉండగా... గాయం కారణంగా జోసెఫ్ వైదొలిగాడు. అయితే 57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్ బౌట్లో కవీందర్ సింగ్ బిష్త్ 1–2తో సామ్యుల్ కిష్టోరి (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా (63 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (+91 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. -
గ్యాంగ్‌స్టర్ కాల్పుల్లో పోలీసు మృతి
ఖగారియా(బిహార్): గ్యాంగ్స్టర్లకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆశిష్ కుమార్(32) అనే పోలీసు అధికారి మృతిచెందారు. ఈ సంఘటన ఖగారియా జిల్లాలోని గంగా నదిలో ఉన్న సలార్పూర్ డైరా అనే చిన్న దీవిలో చోటుచేసుకుంది. ఆ దీవిలో కరడుగట్టిన నేరస్తుడు దినేష్ ముని గ్యాంగ్ సభ్యులు తలదాచుకున్నారని సమాచారం రావడంతో ఆశిష్ కుమార్, మరో నలుగురు పోలీసులతో కలిసి సలార్పూర్ దీవి వద్దకు బయలుదేరారు. పోలీసులు రావడం గమనించి దినేష్ ముని గ్యాంగ్ కాల్పులుకు దిగింది. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ముని గ్యాంగ్ జరిపిన కాల్పుల్లో ఒక బుల్లెట్ ఆశిష్ కుమార్ ఛాతీలోకి దూసుకెళ్లటంతో ఆయన అక్కడిక్కడే చనిపోయినట్లు తోటి పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో కూడా దినేష్ ముని గ్యాంగ్ సభ్యుడొకరు కూడా చనిపోయినట్లు తెలిసింది. కాల్పులు విషయం తెలియడంతో మరిన్ని బలగాలు సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. సాధారణంగా సలార్పూర్ డైరా దీవిలో ఎక్కువగా కరడుగట్టిన నేరస్తులు దాక్కుంటారని సమాచారం. గ్యాంగ్‌స్టర్ దినేష్ మునిని పట్టుకున్నారా లేదా అనేది పోలీసులు వెల్లడించలేదు. స్థానిక గ్యాంగ్స్టర్లకు, పోలీసులకు మధ్య ఇదే దీవిలో గత సంవత్సరం కాల్పులు జరిగాయి. ఆ దాడిలో ఓ పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలు కూడా అయ్యాయి. ఆశిష్ కుమార్ ఒక ధైర్యవంతుడైన పోలీసుల అధికారి అని తోటి పోలీసులు తెలిపారు. ఆయన తల్లి కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆశిష్ సోదరుల్లో ఒకరు బీఎస్ఎఫ్లో పనిచేస్తుండగా..మరొకరు సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశిష్ సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని స్ధానిక మీడియా కొనియాడింది. -
సమీప భవిష్యత్తులోనే రెండంకెల వృద్ధి
ముంబై: ఈక్విటీ మార్కెట్లలో అస్థిరతలు, బ్యాంకింగ్ రంగంలో సమస్యలు ఉన్నప్పటికీ స్థూల ఆర్థిక పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని బీఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ అన్నారు. ‘‘బ్యాంకుల పుస్తకాల ప్రక్షాళన జరుగుతోంది. ఎన్పీఏల గుర్తింపు పారదర్శకంగా మారింది. వృద్ధి చెందే జీడీపీకి తోడు, జీఎస్టీ, ఐబీసీ వంటి సంస్కరణలతో భారత వృద్ధి త్వరలోనే రెండంకెలకు చేరుతుంది’’ అని చౌహాన్ పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యయాలు పెరగడంతో 2016 డిసెంబర్ నుంచి వృద్ధి వేగాన్ని అందుకుందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, చమురు ధరలతో ఐపీవోలపై ప్రభావం పడిందన్నారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా చూస్తే భారత ఎక్స్ఛేంజ్ల్లో అధిక ఐపీవో కార్యకలాపాలు ఉన్నాయని, 2018 మొదటి ఆరు నెలల్లో 90 ఐపీవోలు 3.9 బిలియన్ డాలర్ల (రూ.26,520 కోట్లు) మేర నిధులు సమీకరించాయని ఆయన తెలిపారు. -
వికాస్ అరెస్ట్.. 'నా కొడుకైనా శిక్ష పడాల్సిందే'
చండీగఢ్ : ఎట్టకేలకు వేధింపుల కేసులో హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా తనయుడు వికాస్ బరాలాను పోలీసులు అరెస్టు చేశారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26 పోలీస్ స్టేషన్లో అతడిని కట్టుదిట్టమైన భద్రత మధ్య అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయమే 11గంటలకు అతడు స్టేషన్‌కు హాజరుకావాలని సమన్లు ఇచ్చినప్పటికీ దాదాపు మూడు గంటలపాటు ఆలస్యంగా చివరకు పోలీసుల ముందుకు రావడంతో అతడిని అరెస్టు చేశారు. దీంతో ఐదు రోజులపాటు సాగిన ఉత్కంఠ ఇక విచారణ దశకు చేరింది. వికాస్ స్టేషన్‌కు రావడానికి ముందే మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన తండ్రి సుభాష్ బరాలా తన కుమారుడిని విచారణకు హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు. అతడు మార్గం మద్యలో ఉన్నాడని వివరించారు. 'నేరస్తులను తప్పనిసరిగా శిక్షించాలి.. అది నా కుమారుడైనా సరే. ఆ అమ్మాయి నా కూతురితో సమానం. విచారణకు వెళ్లాల్సిందేనని నేను చాలా స్పష్టంగా మా వాడికి చెప్పాను' అని చెప్పారు. మరోపక్క, పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ వికాస్ నేరం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అతడిని అరెస్టు చేసేందుకు సరిపోతాయని అన్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పేందుకు వికాస్ సిద్ధంగా ఉన్నాడట. కావాలని ఆ రోజు వెంబడించలేదని డ్రైవింగ్ చేసే వ్యక్తి పురుషుడా, యువతినా అనే విషయంపై బెట్ కాయడం వల్లే అది తెలుసుకునేందుకు కారును అనుసరించినట్లు చెప్పాడని సమాచారం. వికాస్ బరాలా, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్ ఓ ఐఏఎస్ అధికారి కూతురు అయిన వర్ణికా కుందును కారులో వెంబడించి వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసు పెను ధుమారాన్ని రేపింది. -
ఐఏఎస్ కుమార్తెకు వేధింపులు!
చండీగఢ్: హరియాణా బీజేపీ చీఫ్ సుభాష్ బరాలా కుమారుడు వికాస్(23), అతని స్నేహితుడు ఆశిష్ కుమార్(27) తనను వెంటాడి వేధించారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కిడ్నాప్ చేసేందుకు యత్నించారని వెల్లడించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మోటారు వాహనాల చట్టం కింద కేసు పెట్టి, బెయిల్‌పై విడుదల చేశారు. శుక్రవారం రాత్రి చండీగఢ్‌లో ఈ ఉదంతం చోటుచేసుకుంది. నిందితులు న్యాయశాస్త్ర విద్యార్థులు. రేడియో వ్యాఖ్యాతగా పనిచేస్తున్న బాధితురాలు(28) తెలిపిన వివరాల ప్రకారం.. కారులో వెళ్తున్న ఆమెను మద్యం సేవించిన నిందితులు టాటా సఫారీ వాహనంలో 5 కిలోమీటర్లు వెంటాడారు. ఆమె కారుకు తమ వాహనాన్ని అడ్డంగా నిలిపి వేధించారు. దీంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి సాయం కోరింది. తర్వాత పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేస్తానని బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి సోమవారం చెప్పారు. కేంద్రం, బీజేపీ దర్యాప్తును నీరుగారుస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. మరోపక్క.. తాను ఐఏఎస్ కుమార్తెను కాకుండా గ్రామీణ యువతినై ఉంటే దుండగులతో పోరాడలేకపోయి ఉండేదాన్నని బాధితురాలు పేర్కొన్నారు. -
12 రెట్లు పెరిగిన బీఎస్ఈ లాభం
జూన్ త్రైమాసికంలో రూ.523 కోట్లు న్యూఢిల్లీ: దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన బీఎస్ఈ లాభం జూన్ క్వార్టర్లో 12 రెట్లు పెరిగింది. రూ.523 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.43.70 కోట్లు. సీడీఎస్‌ఎల్‌లో వాటాల విక్రయంతో వచ్చిన రూ.461.75 కోట్లు లాభంలో కలిసింది. అందుకే అన్ని రెట్లు పెరిగినట్టు కనిపిస్తోంది. సీడీఎస్ఎల్ వాటాల విక్రయం ద్వారా వచ్చిన రూ.461 కోట్లను మినహాయించి చూస్తే లాభం రూ.62 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.43.70 కోట్లు. ఈ లెక్కన వాస్తవ వృద్ధి 42 శాతంగా కనిపిస్తోంది. మొత్తం ఆదాయం 11 శాతం పెరిగి రూ.142.73 కోట్ల నుంచి రూ.158.38 కోట్లకు చేరింది. ఇటీవల ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఎక్సే్చంజీ ఆన్వెస్టర్లను ఆకర్షిస్తోందని బీఎస్ఈ ఎండీ ఆశిష్‌కుమార్ అన్నారు. కగా, ఈక్విటీ నగదు విభాగంలో రోజువారీ టర్నోవర్ గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 51 శాతం పెరిగి రూ.4,133 కోట్లకు చేరినట్టు బీఎస్ఈ తెలిపింది. -
యూఎస్‌లో దూసుకెళ్తున్న ఢిల్లీ ఐఐటీ స్టూడెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఐఐటీకి చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ పూర్వ విద్యార్థి ఆశిష్ కుమార్ అమెరికాలో దూసుకెళుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని కిర్క్లాండ్ అనే సంస్థను స్థాపించడమే కాకుండా దానికి సీఈవోగా పనిచేస్తున్న అతడు అమెరికాలో హైబ్రిడ్ విమానాలను తయారుచేయబోతున్నాడు. ఈ విమానాలు కూడా తిరిగి భారతదేశానికి విక్రయించాలని అనుకుంటున్నాడు. జునుమ్ ఎయిరో అనే సంస్థ ఆధారంగా ప్రాంతీయ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ విమానాలు రూపొందిస్తున్నాడు. దాదాపు 1,100 కిలోమీటర్ల వరకు హైబ్రిడ్ విమానాలను 2020లోగా, 1,600 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవాటిని 2030లోగా తయారు చేయనున్నారు. ‘బోయింగ్ అండ్ జెల్‌బ్లూ సంస్థలు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. మేం తొలుత 20 సీట్లు ఉండే హైబ్రిడ్ విమానాలతో వస్తాం. ప్రొటోటైప్ విమానాలను మరో రెండేళ్లలో తీసుకొస్తామని నమ్ముతున్నాము. వాణిజ్య విమానాలను 2020నాటిలోగా తీసుకొస్తాము’ అని ఆశిష్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం అతడు మెకానికల్ అండ్ ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో కార్నెల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు. -
న్యాయం కావాలి
బరంపురం: సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి తన జీవితాన్ని నాశనం చేసిన మృగాళ్లను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయండి. ఎస్పీ సార్.. అంటూ ఓ బాలిక మంగళవారం మధ్యాహ్నం బరంపురం ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా బాధిత బాలిక, ఆమె బంధువు విలేకరులతో మాట్లాడుతూ గంజాం జిల్లా చికిటి సమితి జరడా పోలీసుస్టేషన్ పరిధిలో గల ధన్నగొడా గ్రామానికి చెందిన తాను గతనెల 9వ తేదీన రాత్రి ఇంటిలో పడుకున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఐదుగురు దుర్మార్గులు కిడ్నాప్ చేసి దగ్గరలో ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి సాముహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారని రోదించింది. అలా ఈ నెల 18వ తేదీ వరకు ఆ మృగాళ్లు సాముహికంగా లైంగికదాడికి పాల్పడుతూ నరకయాతన పెట్టారంటూ కన్నీటి పర్యంతమైంది. జరడా పోలీసులందరూ తమకు తెలుసని ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్పీకి తన మొర వినిపించి ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు చెప్పింది. అనంతరం ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్‌కు ఫిర్యాదు కాపీని అందజేశారు. ఎస్పీకి అందజేసిన ఫిర్యాదు కాపీలో లైంగిక దాడితో సంబంధం ఉన్న వారిలో ధన్నమోర గ్రామానికి చెందిన శ్రీధర్ ప్రధాన్, వాలి ప్రధాన్, కన్ను ప్రధాన్, కొంబలి ప్రధాన్, కర్జి ప్రధాన్ పేర్లు ఉన్నాయి. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టి సంబంధిత నిందితులను అరెస్టు చేస్తామని ఎస్పీ ఆశిష్ కుమార్ సింగ్ బాధితులకు హామీ ఇచ్చారు. -
'కోటక్' బ్యాంక్ మేనేజర్ ఎన్నికోట్లు వెనకేశాడంటే..
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో ఈడీ అధికారులు అరెస్టు చేసిన ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్ మహింద్రా బ్యాంకు శాఖ మేనేజర్ ఆశిష్ కుమార్ గురించి అవాక్కయ్యే అంశం తెలిసింది. అతడికి ఇటీవల అరెస్టయిన రోహిత్ టాండన్ నుంచి ఏకంగా రూ.51 కోట్లు అందినట్లు తెలిసింది. ఈ విషయాన్ని రోహిత్ టాండన్ విచారణ సమయంలో ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. దాదాపు రూ.38 కోట్లను నకిలీ ఖాతాల పేరుమీద మార్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఆ డబ్బు మొత్తానికి కూడా అతడే నకలీ ధ్రువపత్రాలను తయారు చేసినట్లు తెలుసుకున్నారు. పెద్ద నోట్లు రద్దయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం రూ.13 కోట్లు డబ్బు మార్పిడి ద్వారా ఆశిష్ పొందినట్లు ఈడీ అధికారులు తెలుసుకున్నట్లు సమాచారం. నోట్ల మార్పిడి ప్రారంభమైన దగ్గర నుంచి బ్యాంకు అధికారుల అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు సామాన్యులు ఒక్క నోటు కోసం గంటల కొద్ది బ్యాంకులు, ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే.. కొందరు బ్యాంకు అధికారులు మాత్రం కట్టల కొద్ది డబ్బును బడాబాబుల ఇళ్లకు చేర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు బ్యాంకుల పై దాడులు చేస్తున్న ఐటీ అధికారులు ఢిల్లీ కేజీ మార్గ్‌లోని కొటక్ మహింద్రా బ్యాంకు బ్రాంచిపై మంగళవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ బ్యాకు మేనేజర్‌గా పనిచేస్తున్న ఆశిష్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని ఐదు రోజులపాటు విచారించేందుకు ఈడీ అధికారులకు ఢిల్లీలోని సాకెత్ కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈడీ అధికారులు రిమాండ్ కు తీసుకున్నారు. -
ఢిల్లీలో ఆశీష్.. గ్లాస్గోలో దీప సంచలనం
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఎక్కువగా పతకాలు గెలిచే క్రీడాంశాల్లో షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, బాక్సింగ్ ముఖ్యమైనవి. అథ్లెటిక్స్‌లో ఆశించిన స్థాయిలో పతకాలు రావడం లేదు. ఇక జిమ్నాస్టిక్స్‌లో అయితే ఇంతకుముందు భారత క్రీడాకారులు ఫైనల్స్ దాకా పోవడమే గొప్ప. అయితే జిమ్నాస్టిక్స్లోనూ భారత్ శకం ఆరంభమైంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జిమ్నాస్ట్ ఆశీష్ కుమార్, తాజా గ్లాస్గో ఈవెంట్లో దీపా కర్మాకర్ చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా ఆశీష్, తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా దీప రికార్డు నెలకొల్పారు. ఆశీష్ రజత, కాంస్య పతకాలు.. దీప కాంస్య పతకం గెల్చుకుని జిమ్నాస్టిక్స్ పతకాలు గెలిచే సత్తా భారత్‌కు ఉందని నిరూపించారు. ఇది శుభ పరిణామం. గ్లాస్గోలో దీప మహిళల వాల్ట్ విభాగంలో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తి పడింది. అయితే పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
దీప కొత్త చరిత్ర
జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ ఆర్టిస్టిక్ విభాగంలో కాంస్యం గ్లాస్గో: జిమ్నాస్టిక్స్ ఆర్టిస్టిక్లో భారత క్రీడాకారిణి దీప కర్మాకర్ కొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వాల్ట్ విభాగంలో ఆమె కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం గెలిచిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డులకెక్కింది. గురువారం జరిగిన ఫైనల్లో తొలి వాల్ట్‌లో 13,633 పాయింట్లు సాధించిన దీప... రెండో వాల్ట్‌లో అందరికంటే ఎక్కువగా 15,100 పాయింట్లు నమోదు చేసింది. అయితే ఓవరాల్ పాయింట్లలో (14,366) వెనుకబడి మూడో స్థానంతో సంతృప్తిపడింది. ఫ్రాగపనీ (ఇంగ్లండ్-14,633), బ్లాక్ (కెనడా-14,433) వరుసగా స్వర్ణం, రజతం గెలుచుకున్నారు. పురుషుల ఫ్లోర్ ఫైనల్లో ఆశిష్ కుమార్ నిరాశపర్చాడు. 13,800 పాయింట్లతో ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విభాగంలో వైట్లాక్ (ఇంగ్లండ్-15,533), మెర్గాన్ (కెనడా-15,133), బిషప్ (న్యూజిలాండ్-14,550) వరుసగా స్వర్ణం, రజతం, కాంస్యం సాధించారు. -
జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు ఏడు పతకాలు
అంతర్జాతీయ కామన్వెల్త్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ కామన్వెల్త్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు ఏడు పతకాలు సాధించారు. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు ఒక కాంస్య పతకం ఉన్నాయి. పెర్త్ (ఆస్ట్రేలియా)లో ఇటీవల జరిగిన ఈ పోటీల్లో ఆశిష్ కుమార్ మెరుపు విన్యాసంతో రెండేసి చొప్పున స్వర్ణ, రజత పతకాలతో పాటు టీమ్ ఈవెంట్లో కాంస్యం గెలుపొందాడు. కామన్వెల్త్ గేమ్స్ (2010), ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన ఆశిష్ ఈ ఈవెంట్లో పురుషుల ఫ్లోర్ ఎక్సర్సైజ్, వాల్ట్ విభాగాల్లో ఒక్కో స్వర్ణం గెలిచాడు. మరో స్వర్ణాన్ని దీపా కర్మాకర్ మహిళల వాల్ట్ విభాగంలో చేజిక్కించుకుంది. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, ప్యారలల్ బార్స్‌లో ఆశిష్ రెండు రజతాల్ని సాధించగా, దీప మహిళల బాలెన్సింగ్ బీమ్ ఈవెంట్లో రజతం దక్కించుకుంది. పురుషుల టీమ్ ఈవెంట్లో ఆశిష్, రాకేశ్ పాత్ర, అభిజిత్ షిండే, సంజయ్ బర్మన్, చందన్ పాఠక్‌ల బృందం కాంస్య పతకం సాధించింది. మూడేళ్ల క్రితం భారత జిమ్నాస్ట్ సమాఖ్య (జీఎఫ్ఐ)లో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తడంతో కేంద్ర క్రీడాశాఖ జీఎఫ్‌ఐకి గుర్తింపు రద్దు చేసింది. దీంతో 2011 నుంచి ఎలాంటి జిమ్నాస్టిక్స్ పోటీలు కూడా జరగట్లేదు. అయినా భారత క్రీడాకారులు విదేశీ గడ్డపై సత్తాచాటడం విశేషం.