12 రెట్లు పెరిగిన బీఎస్‌ఈ లాభం
జూన్ త్రైమాసికంలో రూ.523 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్సే్చంజీల్లో ఒకటైన బీఎస్‌ఈ లాభం జూన్ క్వార్టర్లో 12 రెట్లు పెరిగింది. రూ.523 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.43.70 కోట్లు. సీడీఎస్‌ఎల్‌లో వాటాల విక్రయంతో వచ్చిన రూ.461.75 కోట్లు లాభంలో కలిసింది. అందుకే అన్ని రెట్లు పెరిగినట్టు కనిపిస్తోంది. సీడీఎస్‌ఎల్ వాటాల విక్రయం ద్వారా వచ్చిన రూ.461 కోట్లను మినహాయించి చూస్తే లాభం రూ.62 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది.
అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.43.70 కోట్లు. ఈ లెక్కన వాస్తవ వృద్ధి 42 శాతంగా కనిపిస్తోంది. మొత్తం ఆదాయం 11 శాతం పెరిగి రూ.142.73 కోట్ల నుంచి రూ.158.38 కోట్లకు చేరింది. ఇటీవల ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఎక్సే్చంజీ ఆన్వెస్టర్లను ఆకర్షిస్తోందని బీఎస్‌ఈ ఎండీ ఆశిష్‌కుమార్ అన్నారు. కగా, ఈక్విటీ నగదు విభాగంలో రోజువారీ టర్నోవర్ గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 51 శాతం పెరిగి రూ.4,133 కోట్లకు చేరినట్టు బీఎస్‌ఈ తెలిపింది.