మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈక్విటీలలో పెట్టుబడులు ఉత్తమం
రిటైల్ ఇన్వెస్టర్లకు ఎన్‌ఎస్‌ఈ చీఫ్ ఆశిష్‌కుమార్ చౌహాన్ సూచనలు
న్యూఢిల్లీ: డెరివేటివ్స్(ఎఫ్‌అండ్‌వో)లో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ చీఫ్ ఆశిష్ కుమార్ చౌహాన్ తాజాగా రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. తగినంత సమాచారంతోపాటు రిసు్కలను అర్ధం చేసుకోగల, మేనేజ్‌చేయగల ఇన్వెస్టర్లకు మాత్రమే ఎఫ్‌అండ్‌వో విభాగం పరిమితమని పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌లో ట్రేడ్ చేయడానికి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టడం ఉత్తమమని సూచించారు.
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రదాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ సైతం డెరివేటివ్స్ విభాగంలో పెరుగుతున్న రిసు్కలపై రిటైలర్లను హెచ్చరించిన సంగతి తెలిసిందే. గతేడాది(2023) నవంబర్‌లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ కూడా ఎఫ్‌అండ్‌వోపై అధికంగా దృష్టిపెట్టవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లు హెచ్చరించడం ఈ సందర్భంగా ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌లో పాల్గొనవద్దంటూ రిటైల్ ఇన్వెస్టర్లను ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ తాజాగా హెచ్చరించారు.
ఎంఎఫ్ మార్గంలో ఈక్విటీలలో పెట్టుబడులు చేపట్టమంటూ సలహా ఇచ్చారు. డెరివేటివ్స్ విభాగమే ప్రయోజనమనుకునే ఇన్వెస్టర్లు పూర్తిస్థాయిలో రిసు్కలను అర్ధం చేసుకున్నాకే ట్రేడింగ్‌ను చేపట్టమని చౌహాన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రిసు్కలను మేనేజ్‌చేయగల సామర్థ్యం సైతం కీలకమని పేర్కొన్నారు. ఇలాకాని పక్షంలో ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌ను చేపట్టవద్దని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment