న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నీలోనే భారత బాక్సర్లు అదరగొట్టారు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరుల్లో అమిత్ 3–0తో రెనె అబ్రహం (అమెరికా)పై... సోహెబ్ బౌఫియా (అమెరికా)పై సంజీత్ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో జోసెఫ్ జెరోమ్ హిక్స్ (అమెరికా)తో ఆశిష్ కుమార్ తలపడాల్సి ఉండగా... గాయం కారణంగా జోసెఫ్ వైదొలిగాడు. అయితే 57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్ బౌట్‌లో కవీందర్ సింగ్ బిష్త్ 1–2తో సామ్యుల్ కిష్టోరి (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా (63 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (+91 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment