![Vikram Limaye says will not seek second term as NSE CEO - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/10/vikram-limaye.jpg.webp?itok=vfHZ331U)
న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత రెండోసారి బాధ్యతలను చేపట్టాలని కోరుకోవడం లేదని నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టం చేశారు. లిమాయే పదవీకాలం జూలైలో ముగుస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో పాలనా పరమైన లోపాలు, కో–లొకేషన్ వ్యవహారంపై సెబీ, సీబీఐ విచారణలు, మాజీ చీఫ్ చిత్రా రామకృష్ణ అరెస్ట్ నేపథ్యంలో లిమాయే ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘నేను రెండవ టర్మ్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు.
అందువల్ల తిరిగి దరఖాస్తు చేయడంకానీ, ప్రస్తుతం జరుగుతున్న నియామకం ప్రక్రియలో పాల్గొనడం కానీ చేయడం లేదు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాను. నా పదవీకాలం 2022 జూలై 16వ తేదీతో ముగుస్తుంది’’ అని లిమాయే తెలిపారు. చాలా క్లిష్టమైన కాలంలో సంస్థను నడిపించడానికి, సంస్థను స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి, పాలనా ప్రక్రియ, సమర్థతను మరింత పటిష్టంగా మార్చడానికి, సాంకేతిక పురోగతికి, వ్యాపార వృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment