
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విరించి లిమిటెడ్ తాజాగా తమ షేర్లను నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీలో (ఎన్‌ఎస్‌ఈ) లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఎక్సే్చంజీలో నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ ప్రమోటర్లు మాధవీ లత కొంపెల్ల, లోపాముద్ర కొంపెల్ల, ఈడీ వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గంటను మోగించడం ద్వారా షేర్ల లిస్టింగ్‌ను ప్రకటించారు. మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువయ్యేందుకు ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ దోహదపడగలదని వారు పేర్కొన్నారు. ఐటీ, హెల్త్ కేర్, పేమెంట్ తదితర సర్వీసులు అందించే విరించి షేర్లు ఇప్పటికే బీఎస్‌ఈలో ట్రేడవుతున్నాయి. సంస్థ షేరు బుధవారం ఎన్‌ఎస్‌ఈలో రూ. 35.70 వద్ద క్లోజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment