
లిస్టెడ్ కంపెనీ లు చేపట్టే రైట్స్ ఇష్యూలను ఇకపై 23 రోజుల్లోగా పూర్తి చేయవలసి ఉంటుంది. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజా చర్యలకు తెరతీసింది. దీంతో ముసాయిదా ఆఫర్‌ను దాఖలు చేయవలసిన అవసరం తప్పుతుంది. ఇందుకు బదులుగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చి సూత్రప్రాయ అనుమతిని పొందవచ్చు.
దీంతో వేగవంత రైట్స్ ఇష్యూలకు సెబీ దారి చూపింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బోర్డు అనుమతించిన 23 పనిదినాల్లోగా రైట్స్ ఇష్యూని పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రస్తుత 317 రోజుల గడువును భారీగా కుదిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసింది. దీంతో 40 రోజుల గడువున్న ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్‌కంటే రైట్స్‌ను వేగవంతం చేసింది. తద్వారా నిధుల సమీకరణకు ప్రాధాన్యతా మార్గంగా రైట్స్‌కు సెబీ మద్దతు పలికింది.
ఎన్‌ఎస్‌ఈలో రోడ్‌స్టార్ ఇన్విట్ లిస్టింగ్
రుణ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రోడ్‌స్టార్ ఇన్‌ఫ్రా ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్(ఇన్విట్)ను ఎన్‌ఎస్‌ఈలో లిస్టింగ్ చేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్)కు చెందిన రోడ్‌స్టార్ ఇన్విట్‌ను రూ. 8,592 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో లిస్ట్ చేసింది. తద్వారా రుణ పరిష్కారంలో గ్రూప్‌నకున్న విభిన్న ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను సమర్ధవంతంగా వినియోగించుకుంటున్నట్లు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ తెలియజేసింది.
ఈ బాటలో రుణదాతలకు రూ. 5,000 కోట్ల మధ్యంతర చెల్లింపులను పూర్తి చేసినట్లు ప్రస్తావించింది. ఇన్విట్ యూనిట్ల ద్వారా రూ. 3,500 కోట్లు, మరో రూ. 1,500 కోట్లకు నగదు చెల్లించినట్లు తెలియజేసింది. రహదారి ఆస్తుల (ప్రాజెక్టులు)పై గరిష్ట రిటర్నులు అందుకోవడం ద్వారా సమర్ధవంత పరిష్కారాలకు తెరతీస్తున్నట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment