Rights issue
-
రూ.4,419 కోట్ల నిధుల మళ్లింపు.. ఇన్వెస్టర్ల ఆరోపణ
ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటూ బైజూస్ సంస్థ మూలధనం కోసం రైట్స్ ఇష్యూకు వెళ్తుండడం తెలిసిందే. అయితే బైజూస్ అమెరికాలోని ఒక రహస్య హెడ్జ్ ఫండ్‌లోకి 533 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.4,419 కోట్ల)మళ్లించిందని ఆ సంస్థ ఇన్వెస్టర్లు ఆరోపించారు. సంస్థ ఇప్పటికే 200 మిలియన్ డాలర్లు రైట్స్ ఇష్యూ కోసం నమోదు చేసుకున్నందుకు దీనిపై స్టే ఇవ్వాలని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను కోరారు. ఇన్వెస్టర్ల విజ్ఞప్తిపై మూడు రోజుల్లోగా రాతపూర్వక సమాధానం ఇవ్వాలంటూ బైజూస్‌కు ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో తీర్పును రిజర్వ్ చేసింది. రైట్స్ ఇష్యూ ద్వారా వచ్చిన నిధులను కంపెనీలోకి జొప్పించాలని ప్రమోటర్లు భావిస్తున్నారు. బుధవారంతో ఈ రైట్స్ ఇష్యూ ముగియనుంది. ఈ నేపథ్యంలో రైట్స్ ఇష్యూను కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్చలు జరుతున్నట్లు తెలిసింది. అయితే కంపెనీ అధీకృత మూలధనాన్ని పెంచితేనే రైట్స్ ఇష్యూ జరుగుతుందని, అందుకు అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో వాటాదార్లు 51% మెజారిటీతో అంగీకారం తెలపాల్సి ఉంటుందని.. ఇవన్నీ ఇంకా జరగలేదని వాటాదార్లు వాదిస్తున్నారు. ఇదీ చదవండి: ‘డ్యూడ్.. కాస్త రెస్ట్ తీసుకోండి’ నితిన్ కామత్‌ను కోరిన వ్యాపారవేత్త కంపెనీ రైట్స్ ఇష్యూకు వెళ్లడం చట్టవ్యతిరేకమని.. అందుకే స్టే కోరుతున్నామని ఇన్వెస్టర్లు ఎన్సీఎల్టీ విచారణలో తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీకి ఇన్వెస్టర్లు అవాంతరాలు సృష్టిస్తున్నారని బైజూస్ యాజమాన్యం వాదించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. -
ఐవోసీ రైట్స్‌కు బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) రైట్స్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా రూ. 22,000 కోట్లు సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇటీవల రైట్స్ ఇష్యూకి వెళ్లేందుకు మరో చమురు పీఎస్‌యూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) బోర్డు సైతం అనుమతినివ్వగా.. నంబర్ వన్ కంపెనీ ఐవోసీ తాజాగా జత కలిసింది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా భారీగా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్ర్‌స్కయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల (జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపా దించిన సంగతి తెలిసిందే. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్.. ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా ప్రభుత్వ పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. కాగా.. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. జేవీ బాటలో దేశీయంగా బ్యాటరీ స్వాపింగ్ బిజినెస్ నిర్వహించేందుకు భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ పేర్కొంది. ఇందుకు బోర్డు తాజాగా అనుమతించినట్లు వెల్లడించింది. సన్ మొబిలిటీ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌తో సమాన భాగస్వామ్యాన(50:50 శాతం వాటా) ప్రయివేట్ రంగ జేవీకి తెరతీయనున్నట్లు వివరించింది. 2026–27 ఆర్థిక సంవత్సరంవరకూ రూ. 1,800 కోట్ల ఈక్విటీ పెట్టుబడులతో జేవీని ఏరా>్పటు చేయనున్నట్లు తెలియజేసింది. సొంత అనుబంధ సంస్థ ఐవోసీఎల్ సింగపూర్ పీటీఈ లిమిటెడ్, సింగపూర్‌లో ఫ్రిఫరెన్స్ షేర్లు, వారంట్ల ద్వారా 78.31 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు సైతం బోర్డు ఓకే చెప్పినట్లు వెల్లడించింది. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 99.40 వద్ద ముగిసింది. 13న ఎన్ఎస్ఈలో త్రిధ్య లిస్టింగ్ ఐపీవోతో రూ. 26 కోట్లు సమీకరణ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంస్థ త్రిధ్య టెక్ ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 13న లిస్ట్‌కానుంది. కంపెనీ షేరుకి రూ. 35–42 ధరలో చేపట్టిన పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 26.41 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా 62.88 లక్షల షేర్లను విక్రయించింది. జూన్ 30– జూలై 5 మధ్య చేపట్టిన ఇష్యూకి 72 రెట్లు అధిక స్పందన లభించింది. ప్రధానంగా సంస్థాగతేతర, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు కంపెనీ వెల్లడించింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 183 రెట్లు, రిటైలర్ల నుంచి 68 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలైనట్లు కంపెనీ వెల్లడించింది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 16 రెట్లు అధిక స్పందన నమోదైంది. కాకా ఇండస్ట్రీస్ ఐపీవో 10న షేరుకి రూ. 55–58 ధరల శ్రేణి న్యూఢిల్లీ: పాలిమర్ ఆధారిత ప్రొఫైల్స్ తయారీ కంపెనీ కాకా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10న(సోమవారం) ప్రారంభంకానుంది. 12న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రే ణి రూ. 55–58కాగా.. చిన్న, మధ్యతరహా సంస్థ ల కోసం ఏర్పాటైన బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫా మ్ ద్వారా లిస్ట్‌కానుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 36.6 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ.21.23 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
రైట్స్ ఇష్యూ బాటలో ఐవోసీ
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు రైట్స్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. ఇటీవలే భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ఇందుకు బోర్డు అనుమతిని సాధించగా.. నంబర్ వన్ చమురు కంపెనీ ఐవోసీ ఇందుకు తెరతీయనుంది. రైట్స్ ఇష్యూ చేపట్టే ప్రతిపాదనపై బోర్డు ఈ నెల 7న సమావేశంకానున్నట్లు బీపీసీఎల్ తాజాగా పేర్కొంది. వెరసి రెండు సంస్థలూ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా తాజా పెట్టుబడులను సమకూర్చుకోనున్నాయి. కర్బన ఉద్గారరహిత ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చమురు పీఎస్‌యూలకు పెట్టుబడులు అందించే ప్రణాళికల్లో ఉన్న నేపథ్యంలో రైట్స్ ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా.. రైట్స్ జారీ ద్వారా వివిధ ప్రాజెక్టుల పెట్టుబడి వ్యయాలకు నిధులు సమకూర్చుకోనున్నట్లు ఐవోసీ పేర్కొంది. వెరసి కంపెనీలో ప్రమోటర్‌గా కేంద్ర ప్రభుత్వం సైతం రైట్స్‌కు సబ్స్క్రయిబ్ చేయడం ద్వారా పెట్టుబడులు సమకూర్చనుంది. రూ. 18,000 కోట్లకు సై పీఎస్‌యూ దిగ్గజం బీపీసీఎల్ బోర్డు గత నెల(జూన్) 28న రైట్స్ ఇష్యూకి అనుమతించింది. తద్వారా కంపెనీ రూ. 18,000 కోట్లు సమీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో ఇంధన రంగ పీఎస్‌యూలు బీపీసీఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్లకు మొత్తం రూ. 30,000 కోట్ల పెట్టుబడులు సమకూర్చుకునేందుకు ప్రతిపాదించింది. తద్వారా కర్బన ఉద్గార రహిత సన్నాహాలకు మద్దతిచ్చేందుకు నిర్ణయించింది. ఇక ఓఎన్జీసీకి మెజారిటీ వాటా గల మరో పీఎస్‌యూ హెచ్‌పీసీఎల్ ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ షేర్ల జారీ ద్వారా పెట్టుబడులు సమకూర్చుకునే వ్యూహాల్లో ఉంది. గత నెలలో ఐవోసీ అధీకృత వాటా మూలధనాన్ని రెట్టింపునకు అంటే రూ. 30,000 కోట్లకు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో ఐవోసీ షేరు ఎన్ఎస్ఈలో 0.8 శాతం బలపడి రూ. 95.40 వద్ద ముగిసింది. -
సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ 11న
న్యూఢిల్లీ: పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ వచ్చే వారం(11న) ప్రారంభంకానుంది. కంపెనీ వ్యవస్థాపకులు, సీఎండీ తులసి తంతి ఇటీవల కన్ను మూసిన నేపథ్యంలో రైట్స్ ఇష్యూ అంశంపై సుజ్లాన్ తాజాగా స్పష్టతనిచ్చింది. రైట్స్ ద్వారా కంపెనీ రూ. 1,200 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ప్రమోటర్లు సైతం రైట్స్‌లో పాలుపంచుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రమోటర్ల కోటాలో రైట్స్‌కు పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ చేసేందుకు ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్ సంసిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. వెరసి గత నెల 28న ప్రతిపాదించిన ఎల్‌వోఎఫ్ ప్రకారం రైట్స్ ఇష్యూని చేపట్టనున్నట్లు వివరించింది. ఎల్‌వోఎఫ్ ప్రకారం షేరుకి రూ. 5 ధరలో 240 కోట్ల పాక్షిక చెల్లింపుల షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 1,200 కోట్లు సమకూర్చుకోనుంది. రైట్స్‌లో భాగంగా అక్టోబర్ 4కల్లా(రికార్డ్ డేట్) అర్హతగల వాటాదారుల వద్దగల ప్రతీ 21 షేర్లకుగాను 5 షేర్లను జారీ చేయనుంది. రైట్స్ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. రైట్స్ వార్తల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 1.25 శాతం నీరసించి రూ. 7.90 వద్ద ముగిసింది. -
ఆసియన్ గ్రానిటో రైట్స్ ఇష్యూ సెప్టెంబరు 23 నుంచి
న్యూఢిల్లీ: టైల్స్ తయారీలో ఉన్న ఆసియన్ గ్రానిటో రూ.224.65 కోట్ల రైట్స్ ఇష్యూ సెపె్టంబరు 23న ప్రారంభం కానుంది. అక్టోబరు 7న ముగియనుంది. ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.100గా నిర్ణయించారు. ఇష్యూ తదనంతరం మొత్తం షేర్లు 3.42 కోట్ల నుంచి 5.67 కోట్లకు చేరతాయి. రుణాల చెల్లింపులకు, వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. 2–3 ఏళ్లలో రుణ రహిత కంపెనీగా నిలవాలన్నది ఆసియన్ గ్రానిటో లక్ష్యం. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
ఐషర్ మోటార్స్ స్పీడ్- మిండా.. స్కిడ్
ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ సాధించగా.. నిఫ్టీ 60 పాయింట్లవరకూ ఎగసింది. కాగా.. షేర్ల విభజనకు రికార్డ్ డేట్ తదుపరి దేశీ ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభంకానుండటంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. వెరసి ఐషర్ లాభాలతో సందడి చేస్తుంటే.. మిండా నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం.. ఐషర్ మోటార్స్ షేర్ల విభజనకు రికార్డ్ డేట్(25) కావడంతో ఐషర్ మోటార్స్ కౌంటర్ ఎక్స్ స్ప్లిట్‌కు చేరింది. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుతఎన్ఎస్ఈలో ఈ షేరు రూ. 2,387ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 7 శాతం జంప్‌చేసి రూ. 2,320 వద్ద ట్రేడవుతోంది. రూ. 10 ముఖ విలువల ఒక్కో షేరునీ రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా(10:1) విభజిస్తున్న విషయం విదితమే. షేరు ధర భారీగా పెరిగిన కారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు సైతం అందుబాటులో ఉండే విధంగా కంపెనీ షేర్ల విభజనను చేపట్టినట్లు నిపుణులు పేర్కొన్నారు. తద్వారా ఈ కౌంటర్లో లిక్విడిటీ పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. మిండా ఇండస్ట్రీస్ మంగళవారం(25) నుంచి రైట్స్ ఇష్యూ ప్రారంభంకానున్న నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. తొలుత ఎన్ఎస్ఈలో ఈ షేరు 4 శాతం పతనమై రూ. 326కు చేరింది. ప్రస్తుతం 3.2 శాతం క్షీణతతో రూ. 332 దిగువన ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో మిండా ఇండస్ట్రీస్ రూ. 53 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో రూ. 5 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 73 శాతం పడిపోయి రూ. 228 కోట్లకు పరిమితమైంది. కాగా.. సెప్టెంబర్ 8న ముగియనున్న రైట్స్ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 250 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. -
మిండా రైట్స్ @250- లెమన్ ట్రీ జోరు
ఈ నెల 25 నుంచీ చేపట్టనున్న రైట్స్ ఇష్యూకి ధరను ప్రకటించడంతో ఆటో విడిభాగాల కంపెనీ మిండా ఇండస్ట్రీస్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క రెండు మూడు త్రైమాసికాలలో రికవరీ బాటనున్నట్లు బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తుండటంతో ఆతిథ్య రంగ కంపెనీ లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి నష్టాల మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం.. మిండా ఇండస్ట్రీస్ ఒక్కో షేరుకి రూ. 250 ధలో రైట్స్ ఇష్యూని చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు మిండా ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి ప్రారంభంకానున్న రైట్స్ ఇష్యూ సెప్టెంబర్ 8న ముగియనుంది. ఇప్పటికే 1:27 నిష్పత్తిలో రైట్స్ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ 27 షేర్లకుగాను 1 షేరుని కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. ఇందుకు ఈ నెల 17.. రికార్డ్ డేట్‌కాగా.. తద్వారా రూ. 250 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో మిండా ఇండస్ట్రీస్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 7 శాతం దూసుకెళ్లి రూ. 301 వద్ద ట్రేడవుతోంది. లెమన్ ట్రీ హోటల్స్ కోవిడ్-19 కారణంగా డీలాపడిన ఆతిథ్య రంగం తిరిగి రెండు మూడు క్వార్టర్లలో రికవరీ బాట పట్టగలదని పలు బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. దీంతో వరుసగా మూడో రోజు లెమన్ ట్రీ హోటల్స్ కౌంటర్ జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 8.2 శాతం జంప్‌చేసి రూ. 29 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే హోటల్ రంగంలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడగా.. కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఐసీఐసీఐ డైరెక్ట్ సైతం ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. -
బోనస్, రైట్స్ ఇష్యూ- ప్రయోజనాలేంటి?
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లలో రైట్స్ ఇష్యూల సందడి కనిపిస్తోంది. ఇదే విధంగా కొన్ని కంపెనీలు బోనస్ ఇష్యూలను సైతం ప్రకటిస్తుంటాయి. నిజానికి ఇవి రెండూ వాటాదారులకు లబ్ది చేకూర్చేవే. అయితే ఈ రెంటి మధ్య ప్రధాన తేడా ఏవిటంటే.. బోనస్ అంటే వాటాదారులకు ఫ్రీగా షేర్లులభిస్తాయి. రైట్స్ అంటే మార్కెట్ ధర కంటే తక్కువలో షేర్లను కొనుగోలు చేసేందుకు వీలు కలుగుతుంది. బోనస్, రైట్స్ ఇష్యూలపై మార్కెట్ విశ్లేషకులు ఇలా వివరిస్తున్నారు... రైట్స్- బోనస్ ఇలా శుక్రవారం సమావేశమైన బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి అనుమతించినట్లు అనుహ్ ఫార్మా తాజాగా ప్రకటించింది. అంటే వాటాదారులకు తమ వద్దగల ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఫ్రీగా జారీ చేయనుంది. ఇందుకు సెప్టెంబర్ 11 రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఈ తేదీలోగా కంపెనీలో వాటా కలిగిన వాటాదారులకు ఫ్రీగా షేర్లు లభిస్తాయి. ఇక నెల రోజుల క్రితం ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ 1:1 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూ చేపట్టింది. ఇందుకు మార్కెట్ ధర కంటే 70 శాతం తక్కువగా రూ. 50 ధరను నిర్ణయించింది. జులై3 రికార్డ్ డేట్. అయితే వాటాదారులు తప్పనిసరిగా రైట్స్ ద్వారా షేర్లను కొనుగోలు చేయాలన్న నిబంధనేమీ లేదు. సర్దుబాటు ఇలా బోనస్ లేదా రైట్స్‌కు రికార్డ్ డేట్ దాటాక ఆయా కంపెనీల షేర్లు సర్దుబాటుకు లోనవుతుంటాయి. ఉదాహరణకు అనుహ్ ఫార్మా షేరు రికార్డ్ డేట్‌కు మందురోజు రూ. 300 వద్ద ముగిసిందనుకుందాం. తదుపరి రోజు నుంచీ రూ. 150 వద్ద ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. ఎందుకంటే.. బోనస్ షేర్ల జారీతో కంపెనీ ఈక్విటీ రెట్టింపునకు చేరుతుంది కదా! ఇదే విధంగా రైట్స్ జారీ తదుపరి ఎంఅండ్ఎం ఫైనాన్స్ ఈక్విటీ సైతం డబుల్ అవుతుంది. దీంతో షేరు ధర సగానికి సర్దుబాటు అవుతుంది. రిజర్వ్ నిధులు సాధారణంగా పటిష్ట క్యాష్‌ఫ్లో కలిగి, నగదు నిల్వలు అధికంగా ఉన్న కంపెనీలు బోనస్ షేర్లను జారీ చేస్తుంటాయి. తద్వారా వాటాదారులకు కంపెనీపట్ల విశ్వాసం, బ్రాండ్ విలువ పెరుగుతుంది. ఇక మరోవైపు రైట్స్ చేపట్టడం ద్వారా కంపెనీలు చౌకగా నిధులను సమకూర్చుకోగలుతాయి. బ్యాంకు రుణాలైతే వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ఉదాహరణకు రైట్స్ ద్వారా ఎంఅండ్ఎం ఫైనాన్స్ రూ. 3,089 కోట్లు సమకూర్చుకుంది. ఈ నిధులను కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. తద్వారా కంపెనీ పనితీరు మరింత మెరుగయ్యే వీలుంది. ఇందువల్లనే రికార్డ్ డేట్ తదుపరి రోజునే ఎంఅండ్ఎం ఫైనాన్స్ షేరు 10 శాతం జంప్‌చేసింది. దీర్ఘకాలంలో ఉదాహరణకు 1:1 నిష్పత్తిలో బోనస్ లేదా రైట్స్ ఇష్యూలను చేపట్టినప్పుడు కంపెనీల ఈక్విటీ క్యాపిటల్ రెట్టింపునకు పెరుగుతుంది. దీంతో కంపెనీల షేరువారీ ఆర్జన(ఈపీఎస్) సగానికి తగ్గిపోతుంది. అంటే ఇష్యూకి ముందు రూ. 20 ఈపీఎస్ ఉంటే తదుపరి రూ. 10కు చేరుతుంది. ఇందువల్లనే షేరు ధర సైతం ఇదే విధంగా సర్దుబాటుకు లోనవుతుంది. అయితే ఇష్యూల తరువాత కంపెనీలు మెరుగైన పనితీరు చూపగలిగితే.. తిరిగి ఆయా షేర్ల ధరలు జోరందుకుంటాయి. దీర్ఘకాలంలో అంటే రిజర్వ్ నిధులను వినియోగించుకోవడం.. లేదా రైట్స్ ద్వారా సమకూర్చుకున్న నిధులను సమర్ధవంతంగా వెచ్చించడం ద్వారా కంపెనీలు స్థూల అమ్మకాలు, నికర లాభాలను పెంచుకోగలిగితేనే వాటాదారులకు లబ్డి చేకూరుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఆర్థిక పనితీరు నీరసిస్తే.. ఈక్విటీ పెరగడంతో షేర్ల విలువలు మరింత క్షీణించే రిస్కులు సైతం ఉంటాయని తెలియజేస్తున్నారు. -
టెక్ మహీంద్రా- ఎంఅండ్ఎం ఫైనాన్స్ స్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టెక్ మహీంద్రా లిమిటెడ్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం అధికంగా రూ. 972 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో త్రైమాసిక ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం 33 శాతం వృద్ధి చూపి రూ. 1283 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు స్వల్పంగా బలపడి 14.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 703కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 11.3 మిలియన్ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో చేతులు మారడం గమనార్హం! ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 3089 కోట్ల సమీకరణకు నేటి నుంచి రైట్స్ ఇష్యూ చేపట్టిన నేపథ్యంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల 61.78 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వాటాదారుల వద్ద గల ప్రతీ 1 షేరుకీ మరొక షేరుని కేటాయించనుంది. ఆగస్ట్ 11న ముగియనున్న రైట్స్ ఇష్యూకి రూ. 50 ధరను నిర్ణయించిన విషయం విదితమే. -
ఎంఅండ్ఎం ఫైనాన్షియల్.. భలే జోరు
మహీంద్రా గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 159ను సైతం అధిగమించింది. గత రెండు వారాల్లో ఈ షేరు 34 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కంపెనీ రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు ఇటీవలే బోర్డు అనుమతించింది. దీనిలో భాగంగా రైట్స్ పొందేందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 23గా ప్రకటించింది. దీంతో నేటి నుంచి ఎక్స్‌రైట్స్‌లో ఈ కౌంటర్ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. 1:1 నిష్పత్తిలో.. రైట్స్ ఇష్యూలో భాగంగా ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులకు తమదగ్గరున్న ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఆఫర్ చేస్తోంది. ఇందుకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 50 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనుంది. రైట్స్ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. క్యూ1 ఓకే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. -
ఆర్ఐఎల్లో 12ఏళ్ల గరిష్టానికి ముకేశ్ వాటా
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వాటా 12ఏళ్ల గరిష్ట స్థాయి 49.14శాతానికి చేరుకుంది. ఇటీవల ఆర్ఐల్ జారీ చేసిన రైట్స్ ఇష్యూలో భాగంగా ముకేశ్ కొన్ని షేర్లను సొంతం చేసుకోవడంతో కంపెనీలో వాటా పెరిగింది. ఆర్ఐఎల్కు చెందిన రూ.53,124 కోట్ల రైట్స్ ఇష్యూలో ముకేశ్ అంబానీ, ఇతర ప్రమోటర్ గ్రూప్ సభ్యులు కలిపి రూ.28,286 కోట్లు వెచ్చించి 2.25 కోట్ల షేర్లను దక్కించుకున్నారు. కంపెనీలో జూన్ 2008 నాటికి ప్రమోటర్ల వాటా 51.37 శాతంగా ఉండేది. అది 2011 సెప్టెంబర్ నాటికి 44.71శాతానికి దిగివచ్చింది. అప్పటి నుంచి ప్రమోటర్లు వివిధ రూపాల్లో క్రమంగా కంపెనీలో వాటాలను పెంచుకుంటున్నారు. రైట్స్ ఇష్యూలో భాగంగా అన్సబ్స్క్రైబ్డ్ పోర్షన్లో ప్రమోటర్ గ్రూప్ దాదాపు 50శాతం అదనపు వాటాను సొంతం చేసుకున్నట్లు రెగ్యూలేటరీ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల్లో ఒక ప్రమోటర్ తన కంపెనీలో వాటాను పెంచుకోవడం, భారీ ఎత్తున నిధులను సమీకరించడటం లాంటి అంశాలు సంస్థ భవిష్యత్తు వృద్ధిపై ప్రమోటర్ నిబద్ధతను చాటి చెబుతాయి. అలాగే ఇన్వెస్టర్లలో మరింత విశ్వాసాన్ని పెంచుతాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఛైర్మన్ రామ్‌దియో అగర్వాల్ తెలిపారు. ఈ ఏడాది మార్చి 24న సూచీలు ఏడాది కనిష్టాన్ని తాకిన నాటి నుంచి శుక్రవారం వరకు రిలయన్స్ షేరు 82శాతం లాభపడింది. కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.10.07లక్షల కోట్లుగా ఉంది. గురువారం ఆర్ఐల్ పాక్షిక పెయిడ్-అప్ రైట్స్ ఇష్యూ షేర్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసింది. రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు: రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసుకున్నారు. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతా అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. -
రైట్స్ ఇష్యూలో ముకేశ్‌కు 5.52లక్షల షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల జారీ చేసిన రూ.53వేల కోట్ల రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసున్నారు. కంపెనీ రెగ్యూలేటరీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతూ అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఇదే రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ గ్రూప్ 22.50కోట్ల ఈక్విటీ షేర్లను దక్కించుకుంది. తద్వారా షేర్‌హోల్డింగ్ వాటా 50.07శాతం నుంచి 50.29శాతానికి పెంచుకుంది. మరోవైపు పబ్లిక్ హోర్‌హోల్డింగ్ వాటా 49.93శాతం నుంచి 49.71శాతానికి దిగివచ్చింది. ఎల్ఐసీ 2.47 కోట్ల ఈక్విటీ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. ఈ కొనుగోలుతో ఎల్ఐసీ వద్ద మొత్తం ఈక్విటీ షేర్లు 37.18 కోట్లకు చేరుకున్నాయి. తద్వారా రిలయన్స్‌లో ఎల్ఐసీ షేర్‌హోల్డింగ్ వాటా 6శాతానికి చేరుకుంది. కొత్త పబ్లిక్ షేర్హోల్డర్లు 19.74 కోట్ల ఈక్వటీ షేర్లను దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్లు సమీకరణ లక్ష్యంతో రైట్స్ ఇష్యూ ద్వారా 42.26 షేర్లను విక్రయానికి పెట్టింది. ప్రతిషేరు ధరను రూ.1,257 నిర్ణయించింది. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. గతవారం జూన్ 3న రైట్స్ ముగిసింది. ఈ ఇష్యూకు 1.59 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. ఈ దెబ్బకు ఆర్ఐఎల్ ఏకంగా రూ.84 వేల కోట్లను సమకూర్చుకుంది. -
ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూకు భారీ స్పందన
ముంబై : రూ 53,124 కోట్లతో తాము జారీచేసిన దేశంలోనే అతిపెద్ద రైట్స్ ఇష్యూ విజయవంతంగా ముగిసిందని రిలయన్స్ ఇండస్ర్టీస్ (ఆర్ఐఎల్) వెల్లడించింది. రైట్స్ ఇష్యూకు మదుపుదారుల నుంచి అనూహ్య స్పందన రావడంతో ఇష్యూ 1.59 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని తెలిపింది. దేశ, విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లతో పాటు లక్షలాది చిన్న మదుపుదారులు ఈ ఇష్యూ పట్ల ఆసక్తి కనబరిచారు. రైట్స్ ఇష్యూలో ప్రజల వాటా 1.22 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయిందని ఆర్ఐఎల్ ప్రకటించింది. ఈనెల 10 నుంచి షేర్ల కేటాయింపు జరగనుంది. జూన్ 12న రైట్స్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వద్ద లిస్ట్ కానున్నాయి. రైట్స్ ఇష్యూపై కంపెనీ చేపట్టిన వినూత్న ప్రచారం మంచి ఫలితాలను రాబట్టింది. రైట్స్ ఇష్యూ విజయవంతం కావడంతో ఆర్ఐఎల్ చీఫ్ ముఖేష్ అంబానీ స్పందిస్తూ రైట్స్ ఇష్యూలో పాల్గొన్న వాటాదారులకు ధన్యవాదాలు తెలిపారు. భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో రైట్స్ ఇష్యూ మైలురాయిలా నిలిచిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారితో సతమతమవుతున్న సమయంలో ఆర్ఐఎల్ రైట్స్ ఇష్యూ విజయవంతం కావడం భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు సంకేతమని ముఖేష్ అన్నారు. చదవండి : మరో మెగా డీల్: అంబానీ కల నెలవేరినట్టే! -
రిలయన్స్ రైట్స్ ఇష్యూ నేటి నుంచి
డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) రైట్స్ ఇష్యూ నేటి(20) నుంచి ప్రారంభంకానుంది. ఇందుకు 1:15 నిష్పత్తిలో ఒక్కో షేరుకి రూ. 1257 ధరను కంపెనీ నిర్ణయించింది. అంటే కంపెనీలో ఇన్వెస్ట్‌చేసిన వాటాదారులు తమ వద్దగల ప్రతీ 15 షేర్లకుగాను 1 షేరుకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ జూన్ 3న ముగియనుంది. ఇష్యూలో భాగంగా 42.26 కోట్ల షేర్లను జారీ చేయనుంది. తద్వారా కంపెనీ రూ. 53,125 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. మంగళవారం ఎన్ఎస్ఈలో ఆర్ఐఎల్ షేరు 2.2 శాతం నీరసించి రూ. 1409 వద్ద ముగిసింది. ఈ ధరతో పోలిస్తే రైట్స్ ధర రూ. 152 డిస్కౌంట్లో లభిస్తోంది. కాగా.. రైట్స్‌కు దరఖాస్తు చేసుకునే ఇన్వెస్టర్లు తొలుత 25 శాతం అంటే రూ. 314.25 చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన రూ. 628.5ను 2021 నవంబర్‌లోగా కంపెనీ పేర్కొన్న విధంగా చెల్లించవలసి ఉంటుంది. ఆర్ఐఎల్ను 2021 మార్చికల్లా రుణరహిత కంపెనీగా నిలిపే యోచనలో ఉన్నట్లు చైర్మన్ ముకేశ్ అంబానీ గతంలోనే పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ఇటీవల డిజిటల్, మొబైల్ అనుబంధ విభాగం రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లో స్వల్ప సంఖ్యలో వాటాలను విక్రయిస్తున్నారు కూడా. గత నెల రోజుల్లో రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తోపాటు.. పీఈ సంస్థలు విస్టా పార్టనర్స్, సిల్వర్ లేక్, జనరల్ అట్లాంటిక్ సంయుక్తంగా 14.81 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 67,195 కోట్లను సమీకరించగలిగింది కూడా. -
జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో విదేశీ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం అంతర్జాతీయ ఈక్విటీ సంస్థ, జనరల్ అట్లాంటిక్ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నది. నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.67,195 కోట్ల పెట్టుబడులు వస్తాయి. జనరల్ అట్లాంటిక్ డీల్ పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ.5.16 లక్షల కోట్లుగానూ ఉందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. మరిన్ని డీల్స్: కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటిదాకా 14.8% వాటా ను విక్రయించింది. వ్యూహాత్మక, ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లకు 20% వాటాను ఈ కంపెనీ విక్రయించనున్నదని సమాచారం. అందుకని భవిష్యత్తులో మరిన్ని డీల్స్ ఉండొచ్చని అంచనా. వచ్చే ఏడాది మార్చికల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణరహిత కంపెనీగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ గత ఏడాది ఆగస్టులో పేర్కొన్నారు. తాజా డీల్స్‌తో పాటు రూ.53,125 కోట్ల రైట్స్ ఇష్యూ ద్వారా ఈ లక్ష్యం ఈ ఏడాది డిసెంబర్‌కే సాకారం కానున్నది. మార్చి నాటికి రిలయన్స్ నికర రుణ భారం రూ.1,75,259 కోట్లు. -
భారీ పెట్టుబడులు, రైట్స్ ఇష్యూ : రిలయన్స్ దూకుడు
సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూకు తేదీ ప్రకటన, సంస్థకు పెట్టుబడుల వెల్లువ వార్తలతో ఇన్వెస్టర్ల ఆసక్తి భారీగా నెలకొంది. దీంతో సోమవారం నాటి మార్కెట్లో ఆర్ఐఎల్ షేర్లు రికార్డు స్థాయివైపు దూసుకుపోతోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు చర్చలు నేపథ్యంలో రిలయన్స్ రెండున్నర శాతం పైగా లాభంతో కొనసాగుతోంది. 2021 మార్చి నాటికి రిలయన్స్ సంస్థను రుణ రహిత సంస్థగా రూపొందించే ప్రణాళికలో ఉన్నట్టు ప్రకటించిన అధినేత ముకేశ్ అంబానీ ఆ దిశలో శరవేగంగా ముందుకు పోతుండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. (మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ) వరుస మెగా డీల్స్ ప్రకటిస్తున్న రిలయన్స్ లో ట్రేడర్లు కొనుగోళ్లతో వరుసగా ఐదో రోజూ షేరు లాభాల్లో ఉంది. గత 3 నెలల్లో రిలయన్స్ వరుసగా ఐదు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 3శాతం పైగా లాభపడిన షేర్ 52 వారాల గరిష్ట స్థాయి(రూ.1617.80)కి సమీపానికి వచ్చింది. ఇంట్రాడే గరిష్టం రూ.1615. మార్కెట్ క్యాప్ రూ.10 లక్షలకోట్ల ఎగువన స్థిరంగా వుంది. కాగా సౌదీ అరేబియాకు చెందిన వెల్త్ ఫండ్, జనరల్ అట్లాంటిక్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకుఆసక్తి కనబరుస్తోందన్న వార్తలు మార్కెట్ వర్గాల్లో నెలకొన్నాయి. మరో 2-3 రోజుల్లో ఈ డీల్‌కు అనుమతి లభించే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్‌తో పాటు, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పాట్నర్స్లు జియోలో మైనార్టీ వాటాను కొనుగోలు చేశాయి.సౌదీ డీల్ కూడా పూర్తియితే ఒక నెలరోజుల వ్యవధిలోనే రిలయన్స్ నాలుగు మెగా డీల్‌ను పూర్తి చేసినట్టు అవుతుంది. మరోవైపు దాదాపు 30 ఏళ్లలో తొలిసారిగా రూ.53,125 కోట్ల నిధుల్ని సమీకరించే ఉద్దేశంతో 1:15 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 14న ఇది ప్రారంభం కానుంది. -
జియో వన్స్‌మోర్..ముకేశ్ హ్యాట్రిక్!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ .. పెట్టుబడుల సమీకరణలో జోరుగా దూసుకుపోతోంది. తాజాగా మరో అంతర్జాతీయ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్‌తో జట్టు కట్టింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో విస్టా 2.32 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఈ డీల్ విలువ రూ. 11,367 కోట్లు. దీంతో మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 60,596 కోట్లు సమీకరించినట్లయింది. ‘ఈ పెట్టుబడులతో జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఫేస్బుక్ తర్వాత విస్టా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉంటుంది. దీంతో కేవలం మూడు వారాల కన్నా తక్కువ వ్యవధిలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్టర్ల నుంచి రూ. 60,596.37 కోట్లు సమీకరించినట్లవుతుంది‘ అని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఇప్పటికే రూ. 43,574 కోట్లతో 9.99 శాతం, మరో టెక్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిల్వర్ లేక్ రూ. 5,666 కోట్లతో 1.15% వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లుగా ఉంటుంది. 20 శాతం వాటా విక్రయం దిశగా... డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తెస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్.. జియో ప్లాట్‌ఫామ్స్‌ను ఏర్పాటు చేసింది. దాదాపు 38.8 కోట్ల సబ్‌స్క్రయిబర్స్‌తో అత్యంత తక్కువ కాలంలోనే టెలికం దిగ్గజంగా ఎదిగిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇందులో భాగంగా ఉంది. వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్ 20 శాతం వాటాలు విక్రయించాలని నిర్దేశించుకుంది. ఇప్పటికే మూడు ఒప్పందాల ద్వారా 13.46 శాతం వాటాలను విక్రయించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని పెట్టుబడులు సమీకరించనుంది. డిసెంబర్ నాటికే రుణాలు తీర్చేసే దిశగా.. 2021 మార్చి నాటికి రుణ రహిత సంస్థగా ఆవిర్భవించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ గతేడాది ఆగస్టులో నిర్దేశించుకుంది. ప్రస్తుతం జోరు చూస్తుంటే ఈ ఏడాది డిసెంబర్లోనే దాన్ని సాధించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పెట్టుబడులు, రూ. 53,125 కోట్ల ప్రతిపాదిత రైట్స్ ఇష్యూ, సౌదీ ఆరామ్కో వంటి దిగ్గజాలకు గ్రూప్ సంస్థల్లో వాటాల విక్రయం వంటివి ఇందుకు దోహదపడనున్నాయి. మార్చి ఆఖరు నాటికి రిలయన్స్ రుణభారం రూ. 3,36,294 కోట్లుగా ఉండగా, నగదు నిల్వలు రూ. 1,75,259 కోట్లు. సర్దుబాట్లు చేస్తే నికర రుణం రూ. 1,61,035 కోట్లు. రుణాలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్ నాటికి రైట్స్ ఇష్యూ వంటివన్నీ కలిపి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించవచ్చని కంపెనీ భావిస్తోంది. మూడు డీల్స్‌లో జియోకి వచ్చిన మొత్తం ఇన్వెస్ట్మెంట్: 60,596 కోట్లు ఫేస్బుక్ పెట్టుబడి (9.99% వాటా) : 43,574 కోట్లు విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ (2.32% వాటా) : 11,367కోట్లు సిల్వర్ లేక్ పెట్టుబడి (1.15 % వాటా) : 5,666 కోట్లు జియో ఎంటర్ప్రైజ్ విలువ :5.16 లక్షల కోట్లు విస్టా సహ వ్యవస్థాపకుడు మనోడే..! అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం విస్టా ప్రధానంగా సాఫ్ట్వేర్, డేటా, టెక్నాలజీ ఆధారిత కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. దాదాపు 57 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం విస్టా పోర్ట్‌ఫోలియోలో భారత కంపెనీల్లో సుమారు 13,000 పైచిలుకు ఉద్యోగులున్నారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్‌కి భారతీయ మూలాలు ఉన్నాయి. ముకేశ్ అంబానీలాగే ఆయన తండ్రి కూడా గుజరాత్‌కు చెందినవారు. అంతే గాకుండా విస్టా వ్యవస్థాపకుడు రాబర్ట్ స్మిత్‌తో ముకేశ్‌కు వ్యక్తిగత పరిచయం కూడా ఉంది. ముకేశ్‌కు అత్యంత సన్నిహితులైన మనోజ్ మోదీ, బ్రయాన్ సేథ్ ఈ డీల్ చర్చల్లో కీలక పాత్ర పోషించారు. విస్టా సహ వ్యవస్థాపకుడు బ్రయాన్ సేథ్ ప్రపంచంలోనే దిగ్గజ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ సంస్థల్లో ఒకటైన విస్టాతో భాగస్వామ్యం కుదరడం సంతోషకరం. రాబర్ట్ స్మిత్‌తో పాటు గుజరాత్‌కి చెందిన కుటుంబ నేపథ్యమున్న బ్రయాన్ సేథ్.. ఇద్దరూ అంతర్జాతీయంగా ప్రముఖ టెక్నాలజీ లీడర్లు. డిజిటల్ భారతదేశ వృద్ధి సామర్థాలపైగట్టి నమ్మకం ఉన్నవారు. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్ కోసం జియో నిర్మిస్తున్న డిజిటల్ సమాజం సామర్ధ్యంపై మాకు నమ్మకం ఉంది. ముకేశ్ అంబానీ దార్శనికత, ప్రపంచస్థాయి జియో నాయకత్వ బృందం కలిసి ప్రారం భించిన డేటా విప్లవాన్ని మరింత ముం దుకు తీసుకెళ్లగలవు. – రాబర్ట్ స్మిత్, విస్టా వ్యవస్థాపకుడు, చైర్మన్, సీఈవో -
జిల్ జిల్ జియో!
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ సంస్థల్లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫేస్బుక్ బాటలో సిల్వర్ లేక్ పార్ట్నర్స్ సంస్థ.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.15 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం రూ. 5,655.75 కోట్లు వెచ్చిస్తోంది. ‘ తాజా డీల్ ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ విలువ రూ. 4.90 లక్షల కోట్లుగాను, ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.15 లక్షల కోట్లుగాను ఉంటుంది‘ అని జియో ప్లాట్‌ఫామ్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలే జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల కోసం ఫేస్బుక్ చెల్లించిన రేటుతో పోలిస్తే సిల్వర్ లేక్ 12.5 శాతం అధిక ప్రీమియం చెల్లిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్ విలువను రూ. 4.62 లక్షల కోట్ల కింద లెక్కించి 9.99 శాతం వాటాల కోసం ఫేస్బుక్ రూ. 43,574 కోట్లు చెల్లించింది. టెలికం కార్యకలాపాలు సహా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటినీ కలిపి జియో ప్లాట్‌ఫామ్స్ కింద రిలయన్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ‘ ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో సిల్వర్ లేక్ ఎంతో విలువైన భాగస్వామిగా ఉంది. సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నా. దేశప్రజలందరికీ ప్రయోజనాలు చేకూరేలా భారతీయ డిజిటల్ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చేందుకు ఇది దోహదపడగలదని ఆశిస్తున్నాను‘ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు. ‘జియో ప్లాట్‌ఫామ్స్‌కు ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో విశిష్ట స్థానముంది. సాహసోపేతమైన లక్ష్యాన్ని సుసాధ్యం చేసే దిశగా పటిష్టమైన మేనేజ్మెంట్ సారథ్యంలో నడుస్తోంది‘ అని సిల్వర్ లేక్ కో–సీఈవో ఎగాన్ డర్బన్ పేర్కొన్నారు. 20 శాతం దాకా వాటాలను వ్యూహాత్మక, ఆర్థిక ఇన్వెస్టర్లకు జియో ప్లాట్‌ఫామ్స్ విక్రయిస్తోంది. ఇప్పటికే ఇందులో సగభాగం ఫేస్బుక్ కొనుగోలు చేసింది. మిగతా వాటాలను సిల్వర్ లేక్‌తో పాటు ఇతర ఇన్వెస్టర్లు కొనుగోలు చేయనున్నారు. సిల్వర్ లేక్ కథ ఇదీ.. భారీ టెక్నాలజీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడంలో సిల్వర్ లేక్ పార్ట్నర్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. దీని నిర్వహణలోని ఆస్తులు, పెట్టుబడుల పరిమాణం 40 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. ఎయిర్‌బీఎన్‌బీ, ఆలీబాబా, యాంట్ ఫైనాన్షియల్, ఆల్ఫాబెట్లో భాగమైన వెరిలీ.. వేమో విభాగాల్లో, డెల్ టెక్నాలజీస్, ట్విటర్ తదితర గ్లోబల్ దిగ్గజ సంస్థల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తింది. భారత్‌లో సిల్వర్‌లేక్ ఇంత భారీ పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం. రుణభారం తగ్గించుకునే దిశగా అడుగులు 2021 నాటికి రుణరహిత సంస్థగా మారాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్దేశించుకుంది. మార్చి త్రైమాసికం ఆఖరు నాటికి సంస్థ నికర రుణభారం రూ. 1,61,035 కోట్లుగా ఉంది. రుణ భారం తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా జూన్ నాటికి రూ. 1.04 లక్షల కోట్లు సమీకరించాలని రిలయన్స్ భావిస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్, ఇంధన రిటైలింగ్ వ్యాపారంలో వాటాల విక్రయంతో పాటు రైట్స్ ఇష్యూ తదితర మార్గాల్లో సమీకరించనుంది. -
రిలయన్స్ లాభం 39 శాతండౌన్
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో 39 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) క్యూ4లో రూ.10,362 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,348 కోట్లకు తగ్గిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. గత మూడేళ్లలో ఇదే అత్యల్ప త్రైమాసిక లాభం. సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ3లో నికర లాభం రూ.11,640 కోట్లు) 45 శాతం తగ్గిందని పేర్కొంది. ఇంధన, పెట్రో కెమికల్స్ వ్యాపారాలు బలహీనంగా ఉండటం వల్ల నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ముడి చమురు ధరలు తగ్గడం, డిమాండ్ పడిపోవడంతో రూ.4,267 కోట్ల అసాధారణ నష్టాలు నికర లాభంపై ప్రభావం చూపించాయని వెల్లడించింది. అయితే టెలికం విభాగం, రిలయన్స్ జియో ఫలితాలు బాగా ఉండటంతో లాభ క్షీణత తగ్గిందని తెలిపింది. కార్యకలాపాల ఆదాయం 2 శాతం క్షీణించి రూ.1,36,240 కోట్లకు చేరిందని పేర్కొంది. సీక్వెన్షియల్‌గా చూస్తే, ఆదాయం 11 శాతం తగ్గిందని తెలిపింది. ఒక్కో షేర్‌కు రూ.6.50 డివిడెండ్‌ను ప్రకటించింది. ఆర్థిక ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు.... ► స్థూల రిఫైనరీ మార్జిన్(జీఆర్ఎమ్) 8.9 డాలర్లుగా ఉంది. ► కరోనా వైరస్ కల్లోలం ఇంధన, పెట్రో రసాయనాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ► చమురు–గ్యాస్ వ్యాపారంలో రూ.485 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ► రిలయన్స్ రిటైల్ స్థూల లాభం 20% వృద్ధితో రూ.2,062 కోట్లకు పెరిగింది. అనుకున్న దానికంటే ముందుగానే రుణ రహిత కంపెనీ... వచ్చే ఏడాది మార్చి కల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రుణ రహిత కంపెనీగా నిలపాలన్న ముకేశ్ లక్ష్యం ముందే సాధించే అవకాశాలున్నాయని నిపుణులంటున్నారు. మొత్తం రూ.1.04 లక్షల కోట్ల నిధుల సమీకరణ ప్రయత్నాలను ఈ ఏడాది జూన్‌కల్లా పూర్తి చేయాలని కంపెనీ బావిస్తోంది. రూ.53.125 కోట్ల రైట్స్ ఇష్యూతో పాటు జియోలో ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేయనున్న రూ.43,574 కోట్లు, ఇంధన రిటైల్ విభాగంలో 49% వాటాను బ్రిటిష్ పెట్రోలియమ్ రూ.7,000 కోట్లకు విక్రయించడం.... ఈ జాబితాలో ఉన్నాయి. ఫేస్‌బుక్‌లాగానే ఎన్నో కంపెనీలు, ఆర్థిక సంస్థలు రిలయన్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. మార్చి క్వార్టర్ చివరినాటికి రిలయన్స్ కంపెనీ మొత్తం రుణ భారం రూ.3,36,294 కోట్లుగా ఉంది. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.1,75,259 కోట్లుగా ఉన్నాయి. నికర రుణ భారం రూ.1,61,035 కోట్లు. రిలయన్స్ జియో లాభం 177 శాతం అప్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం విభాగం రిలయన్స్ జియో ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. గత క్యూ4లో ఈ కంపెనీ నికర లాభం 177 శాతం ఎగసి రూ.2,331కు పెరిగింది. వినియోగదారులు పెరగడం, టారిఫ్‌లు కూడా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో ఎగసింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో నికర లాభం రూ. 840 కోట్లుగా ఉంది. కార్యకలాపాల ఆదాయం రూ.14,835 కోట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 38.75 కోట్ల మంది వినియోగదారులతో ప్రపంచంలోనే అతి పెద్ద మొబైల్ కంపెనీ ఇదే. వినియోగదారుల సంఖ్యలో 26 శాతం వృద్ధి సాధించింది. ఒక్క నెలకు ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.130.6గా ఉంది. ఇటీవలే కుదిరిన ఫేస్బుక్ డీల్ పరంగా రిలయన్స్ జియో విలువ రూ.4.62 లక్షల కోట్లని అంచనా. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 88% వృద్ధితో రూ.5,562 కోట్లకు, కార్యకలాపాల ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.54,316 కోట్లకు చేరాయి. ∙7,500 కోట్ల డాలర్ల విలువైన ఆయిల్ టు కెమికల్స్ వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా విడగొట్టగానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఈ విభాగంలో 20% వాటాను సౌదీ ఆరామ్కో కంపెనీకి రిలయన్స్ విక్రయించనున్నది. వేతనాల్లో కోత కంపెనీ ఉద్యోగులకు, డైరెక్టర్లకు, ఉన్నతాధికారులకు వేతనాల్లో 10–50 శాతం కోత విధించనున్నామని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఎదురవుతున్న పరిస్థితులను అధిగమించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తానికి తన పారితోషికం మొత్తాన్ని(రూ.15 కోట్లు) వదులుకోవడానికి చైర్మన్ ముకేశ్ అంబానీ సిద్ధపడ్డారని పేర్కొంది. వార్షిక వేతనం రూ.15 లక్షలలోపు ఉన్న వారికి వేతనాల్లో ఎలాంటి కోతలు ఉండవని, అంతకు మించిన వేతనాలు పొందే వారికి 10 % కోత ఉంటుందని పేర్కొంది. రైట్స్ ఇష్యూ @ 53,125 కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ రైట్స్ ఇష్యూను ప్రకటించింది. ఇన్వెస్టర్లు తమ వద్దనున్న ప్రతి 15 షేర్లకు ఒక షేర్‌ను (1:15) రైట్స్ షేర్‌గా పొందవచ్చు. రైట్స్ ఇష్యూలో షేర్లు జారీ చేసే ధర రూ.1,257. గురువారం నాటి ముగింపు ధర (రూ.1,467)తో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. రైట్స్ ఇష్యూ విలువ రూ.53,125 కోట్లు. భారత్‌లో ఇదే అతి పెద్ద రైట్స్ ఇష్యూ.మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. రైట్స్ ఇష్యూ ఇతర అంశాలపై అంచనాల కారణంగా బీఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 3 శాతం లాభంతో రూ.1,467 వద్ద ముగిసింది. వినియోగ వ్యాపారాలు... రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియోలు నిర్వహణ, ఆర్థిక పరమైన అంశాల్లో జోరుగా వృద్ధిని సాధించాయి. కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత మన దేశం, మా రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ కూడా మరింత బలం పుంజుకుంటాయన్న ధీమా నాకు ఉంది. –ముకేశ్ అంబానీ, చైర్మన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ -
అడివంటుకుంటుంది
ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. బ్రిటిష్ కాలం నుంచి దోపిడి మరో రూపం తీసుకున్నది. 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి. ఆదివాసీల జీవితం అడవి చుట్టూతా అల్లుకొని ఉంటుంది. ప్రతి చెట్టూ, ప్రతి పుట్టా, అడవిలోని అణువణువూ వారి పాదముద్రలతో పునీతమై ఉంటుంది. అడవిలేనిదే ఆదివాసీలు లేరు, ఆదివాసీలు లేనిదే అడవీ మనలేదు. అంతెందుకు వారి భాష, వారి యాస, వారి కట్టూ, బొట్టూ, ఇంకా చెప్పాలంటే వారి సంస్కృతే ఒక ప్రత్యేకమైన సంస్కృతి. ఒక ప్రత్యేకమైన జీవన విధానం వారి సొంతం. అడవిలో పుట్టి అడవిపైనే ఆధారపడి, అక్కడ దొరికే ఆకులూ అలములూ తిని, రోగమొస్తే, రొప్పొస్తే ఆసుపత్రి కూడా అందుబాటులో లేక ఏ ఆకుపసరుతోనో సరిపెట్టుకొని ఆ అడవిలో పిల్లో, పిట్టో, పందో దొరికినా నిండు రాతిరిలో పండు వెన్నెల్లో ఊరుమ్మడిగా వండుకు తినేసి హాయిగా ఏ అరమరికలూ లేకుండా బతికే స్వేచ్ఛాపరులు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఆదివాసీలే. తమ ఆకలితీర్చి ఆదరించిన అడవినే నమ్ముకొని చలికి వణికీ, వానకి తడిసీ, ఎండకు ఎండినా శతాబ్దాలుగా ఆ అడవిని వీడి బతకడం చేతకాని వారు ఆదివాసీలే. మనం మరిచిపోయిన సహజీవనం, సమానత్వ భావనలకి చిహ్నం ఆదివాసీలే. ఇప్పటికింకా ఆ ఉమ్మడి జీవితం వారిలో తప్ప మరెక్కడా మచ్చుకైనా అగుపించదు. ఆదివాసీలతో పాటు అక్కడి జంతువులూ సహజీవనం చేస్తాయి. పురుగూ, పుట్టా, పక్షీ, పిట్టా అన్నీ వారికి మచ్చికే. ఒక్కమాటలో చెప్పాలంటే వారున్నంత వరకూ అక్కడి ఏ చెట్టునీ, ఏ కొమ్మనీ ఎవ్వరూ నరకలేరు. అలాగే, ఏ జంతువునీ ఎవ్వరూ చంపలేరు. వారి వల్లైతే ఏ అడవి మృగానికీ హానీ జరగదు. అంతగా వారు ప్రకృతిలో కలిసిపోయారు. చివరకు వారి దేవతలూ, దేవుళ్ళూ సైతం ప్రకృతి తప్ప మరొకటి కాదు. ఆదివాసీలకు అడవి తల్లి లాంటిది కనుకనే వారిని అడవిబిడ్డలన్నారు. ఇది ఈనాటి చరిత్రకాదు. వందల సంవత్సరాల ఆదివాసీల సంస్కృతే ఇది. ఆధునిక యుగం ఆ అడవినే మింగేసే ప్రయత్నం చేస్తోంది. అందుకే మరోమారు ఆ అడవిబిడ్డల ప్రస్తావన ఇప్పుడు తప్పనిసరి అయ్యింది. ఒకప్పుడు ఆదివాసీ ఉత్పత్తులను మైదాన ప్రాంతాల నుంచి వెళ్ళిన చిన్నా చితకా వ్యాపారులు దోచుకునే వారు. వారి శ్రమను కొల్లగొట్టేవారు. కానీ ఇప్పుడు ఆదివాసీల పాదాల కింద ఉన్న మట్టినే తొలిచేయాలని చూస్తున్నారు బడా పెట్టుబడీదారులు, అభివృద్ధి పేరిట అడవిలో ఉన్న ఖనిజాలను, ఇతర ఉత్పత్తులనూ దోచుకోవడానికి ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు మూకుమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు ఆదివాసీలు జంతువులను వేటాడితే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు ఆదివాసీలను వేటాడటం మొదలు పెట్టారు. వేదకాలంలో మొదలైన ఈ వేట ఈనాటికీ కొనసాగుతున్నది. అప్పుడు యజ్ఞయాగాలను రక్షించుకోవడానికి అడవిని తమ అధీనం లోకి తెచ్చుకోవడానికి రాక్షసులనే ముద్రవేసి, శ్రీరాముడు, పాండవులు అరణ్యవాసాల పేరిట వేటసాగించారు.ఆ తర్వాత మనకు అందిన చరిత్ర ప్రకారం కాకతీయ రాజులు సమ్మక్క, సారక్కల రాజ్యం మీద దాడిచేసి రక్తపాతం సృష్టించారు. బ్రిటిష్ కాలం నుంచి ఈవేట మరో రూపం తీసుకున్నది. అప్పటి వరకూ ఆదివాసీలు తమకుతామే రాజులు, పాలకులు. కానీ బ్రిటిష్ వారు ప్రభుత్వాలపేరిట స్వేచ్ఛగా ఉండే ఆదివాసులను చట్టాల చట్రంలోకి తీసుకువచ్చారు. ఇందుకు భారత దేశంలోని ఆధిపత్య కులాలు, సంస్థానాధీశులతో కలిసి ఆదివాసీల దోపిడీకి సహకరించారు. ఆ దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు తిరుగుబాట్లు చేసారు. అందులో బీహార్ ప్రాంతంలోని జార్ఖండ్‌లో బిర్సా ముండా నాయకత్వంలో సాగిన తిరుగుబాటు చరిత్రలో ఒక పెనుతుఫాను. అదే విధంగా బెంగుళూరు ప్రాంతంలో, మహారాష్ట్రలో అనేక చోట్ల ఆదివాసులు తమ తిరుగుబాటు జెండాలు ఎగురవేశారు. అదేవిధంగా ఆంధ్రప్రాంతంలో అల్లూరి సీతారామరాజు, తెలంగాణ ప్రాంతంలో కొమురంభీం, ప్రతిఘటనా పోరాటాలు ఆనాటి పాలకులను గడగడలాడించాయి. అయితే కొమురంభీం పోరాటాన్ని చవిచూసిన నిజాం ప్రభుత్వం హేమన్డార్స్ అనే బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తను ఆహ్వానించి, ఆది వాసీల ఆందోళనకి కారణాలను వెతకాలని, పరిష్కారాలను సూచించాలని ఆదేశించింది. 1947లో స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం రాజ్యాంగ సభ ఏర్పాటైంది. దానితో బాబాసాహెబ్ అంబేడ్కర్‌తో సహా ఎంతో మంది దళితులతో పాటు, ఆదివాసీల హక్కుల కోసం రాజ్యాంగంలో ఎన్నో సూచనలనూ, నిబంధనలనూ పొందుపరిచారు. వారి రక్షణ కోసం చేసిన నిబంధనలన్నింటినీ రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్లో చేర్చి మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 1950 లో రాజ్యాంగం అమలులోకి వస్తే, 1965–66 వరకు ఆదివాసీల గురించి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతేకాకుండా ఆదివాసీయేతర వ్యక్తులు ముఖ్యంగా కాంట్రాక్టర్లు, వ్యాపారస్తులు, షావుకార్లు తమ దృష్టినంతా ఆదివాసీప్రాంతాల మీదకు మళ్ళించారు. అడవిలో ఉన్న వృక్ష సంపదను కాంట్రాక్టర్లు దోచుకొని పోతే, షావుకార్లు తమ దగ్గర ఉన్న నిత్యావసర వస్తువులను ఉద్దెరకు ఇచ్చి, అటవీ ఉత్పత్తులను ఆదివాసీలనుంచి కాజేయడం మొదలుపెట్టారు. ఈ దోపిడీయే ఆదివాసీల మరో పోరాటానికి ఊపరిలూదింది. అదే నక్సలైట్ పోరాటం. పశ్చిమబెంగాల్లోని నక్సల్బరీ, శ్రీకాకుళంలోని ఉద్దానం, ఏజెన్సీ ప్రాంతాలు, ఖమ్మం, వరంగల్ జిల్లాలూ, గోదావరీ లోయ అంతా ఫారెస్టు కాంట్రాక్టర్లు, షావుకార్లకు వ్యతిరేకంగా ఆదివాసీలు తిరుగుబాటు చేశారు. ఇది ఆనాటి ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేసింది. ఆలోచింపజేసింది. దాని ఫలితంగానే ఆదివాసీల భూములను ఆదివాసీ యేతరులు కొల్లగొట్టకుండా ఉండేందుకు, ఆదివాసీ భూములపై సర్వహక్కులూ ఆదివాసీలకే ఇస్తూ, ఆదివాసీ భూములను ఆది వాసీ యేతరులు కొనకూడదు, అమ్మకూడదు అంటూ ఒక చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు తీసుకొచ్చాయి. దానితో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఐటీడీఏ, ట్రైబల్ సబ్‌ప్లాన్ లాంటి పథకాలను తీసుకొచ్చారు. ఇది ఆదివాసీల తిరుగుబాటు ఫలితమేనని అందరూ అంగీకరించి తీరాల్సిందే. అయితే ఆదివాసీల జీవితాల్లో ఒక అడుగు ముందుకు పడినప్పటికీ వారికి దున్నుకునే భూమి మీద హక్కులేకుండా పోయింది. ఆదివాసీలు దున్నుకుంటున్న భూములకు పట్టాలివ్వడానికి మాత్రం ఏ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో ఆదివాసీ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం పెనుఉప్పెనలా దూసుకొచ్చింది. దాని ఫలితమే 1981లో ఏప్రిల్ 20న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఘటన. తాము సాగుచేసుకొని బతుకుతున్న భూములకు పట్టాలివ్వాలని ఆదివాసీలు డిమాండ్ చేసారు. ఏప్రిల్ 20న జరపతలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా వాళ్ళు పట్టు వదలకుండా ఇంద్రవెల్లి తరలివచ్చారు. పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి వందమం దికి పైగా ఆదివాసీలను కాల్చి చంపారు. ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొందరికి పట్టాలు దక్కాయి. అయితే 1990 తర్వాత ఆదివాసీలు కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. అడవిలో ఉండే ఖనిజసంపదను కొల్లగొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు పథకాలు తయారుచేశాయి. దానికి కాంగ్రెస్‌తో సహా బీజేపీ దాకా అన్ని పార్టీలూ వత్తాసు పలికాయి. కానీ ఆదివాసీలు మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోలేదు. వాళ్ళ తరఫున కొంత మంది స్వచ్ఛంద కార్యకర్తలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆదివాసీలకు అనుకూలమైన తీర్పులు పొందగలిగారు. ఈ క్రమంలోనే 2006లో అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పీ.ఏ ప్రభుత్వం ఆదివాసీల రక్షణ కోసం అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది కార్పొరేట్ కంపెనీలకు కొరక రాని కొయ్యగా తయారైంది. దానితో కార్పొరేట్ కంపెనీలు కొత్త కుట్రలకు తెరతీశాయి. ఆదివాసీలు అడవుల్లో జీవించడం వల్ల వన్యప్రాణి రక్షణకు భంగం కలుగుతుందనే వాదనలు లేవనెత్తారు. ఇది కార్పొరేట్ కంపెనీలు ప్రత్యక్షంగా చేయకుండా, వన్యప్రాణి సంరక్షకుల పేరుతో కొన్ని ఎన్జీఓలను సృష్టించారు. అటువంటిదే ఒక సంస్థ ఇటీవల సుప్రీంకోర్టులో వన్యప్రాణి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అనేక మంది అక్రమంగా అడవుల్లో ఉంటున్నారనీ, వారిని అక్కడినుంచి పంపించి వేయాలనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానితో తక్షణమే ఆదివాసీలను అడవినుంచి ఖాళీచేయించాలంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది. కానీ ప్రభుత్వాలు ఈ కేసుని ఆదివాసీల తరఫున వాదించాల్సింది పోయి చాలా నిరాసక్తతను ప్రదర్శించాయి. తత్ఫలితంగా ఫిబ్రవరి 13 వ తేదీన సుప్రీంకోర్టు ఏకపక్షంగా తీర్పునిచ్చింది. అక్రమంగా అడవుల్లో ఉన్న వాళ్లను జూలై 24 లోగా ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాదాపు అన్ని రాష్ట్రాలూ కలిపి కొన్ని లక్షల మంది ఆదివాసీలుంటారు. నిజానికి ఇప్పటికే ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ భూములను కబ్జా చేసుకొని అక్రమంగా ఉంటున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. అయిదు లక్షల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటి గురించి విచారణాలేదు. తీర్పులూ లేవు. అయితే సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైనది. దీనిని అమలు చేయడం ప్రభుత్వాలకు అంత సులువుకాదు. ఒకవేళ కార్పొరేట్ కంపెనీలకు వెసులుబాటు కల్పించడానికి ఉపయోగపడే ఈ తీర్పును అమలు చేయాలని ప్రభుత్వాలు భావిస్తే అడవి అడవి అంతా భగ్గుమంటుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని సుప్రీంకోర్టు తీర్పును సవరించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే తదుపరి పరిణామాలు ప్రభుత్వం చేయిదాటిపోవడం ఖాయం. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
ప్రభుత్వ బ్యాంకులకు భారీ నిధులు
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.17,800 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. బాండ్ల జారీ, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ తదితర మార్గాల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు సమీకరించాలని ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు యోచిస్తున్నాయి. టైర్–వన్, టైర్–టూ బాండ్ల ద్వారా రూ.6,350 కోట్లు సమీకరించడానికి శుక్రవారం జరిగిన యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ లేదా రైట్స్ ఇస్యూ ద్వారా మరో రూ.4,950 కోట్లు సమీకరించాలని కూడా ఈ బ్యాంక్ యోచిస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాసిల్–త్రి అదనపు టైర్–వన్ బాండ్ల ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఎఫ్‌పీఓ/రైట్స్ ఇష్యూ/క్విప్ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించే విషయం వచ్చే వారం జరిగే డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో పరిశీలనకు రానున్నదని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెల్లడించింది. షేర్ల ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు సమీకరించనున్నట్లు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ పేర్కొంది. -
రిలయన్స్ జియో కోసం రూ.15 వేల కోట్ల రైట్స్ ఇష్యూ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ తన టెలికం విభాగం రిలయన్స్ జియోలో మరో 15,000 కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. రైట్స్ ఇష్యూ ద్వారా ఈ నిధులు సమీకరిస్తామని, ఈ నెల 14న జరిగిన డెరైక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని సంస్థ తెలియజేసింది. రైట్స్ ఇష్యూలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుత వాటాదారులకు ఒక్కోటి రూ.10 విలువ గల 1,500 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. మూడు నెలల్లో ఈ రైట్స్ ఇష్యూ పూర్తవుతుందని పేర్కొంది. ఈ తాజా రైట్స్ ఇష్యూతో రిలయన్స్ జియో ఈక్విటీ రూ.45,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్లకు పెరగనున్నది. స్పెక్ట్రంకోసం వెచ్చించిన మొత్తంతో సహా రిలయన్స్ జియో కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే రూ.1,30,000 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు చెబుతోంది. మొత్తం పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్ల మేరకు ఉంటాయని తెలియజేసింది. -
ఏపీ, టీ కంపెనీల నిధుల వేట..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లు నూతన శిఖరాలకు చేరి కళకళలాడుతుండటంతో దేశంలోని పలు కంపెనీలు నిధుల సేకరణపై దృష్టిసారిస్తున్నాయి. కొత్త కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూల(ఐపీఓలు) ద్వారా, ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీలు రైట్స్ ఇష్యూ, ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 10 కంపెనీలు వచ్చే బడ్జెట్లోగానే మార్కెట్ నుంచి రూ. 6,000 కోట్ల నిధులు సమీకరించే యోచనలో ఉన్నాయి. వైజాగ్ స్టీల్, పవర్‌మెక్, పెబ్స్ పెన్నార్, ఎంఈఐఎల్ కంపెనీలు తొలి పబ్లిక్ ఇష్యూకి రావడానికి సిద్ధపడుతుండగా, రైట్స్ లేదా ఇతర మార్గాల్లో నిధులు సేకరించే ప్రయత్నాల్లో జీఎంఆర్, ఐవీఆర్సీఎల్, మోల్డ్‌టెక్, న్యూలాండ్ వంటి కంపెనీలున్నాయి. మార్కెట్ పరిస్థితులు అనుకూలించక కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లలో మూడుసార్లు వాయిదా వేసిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్- వైజాగ్ స్టీల్) తొలి పబ్లిక్ ఆఫర్ త్వరలో రానుంది. ఈ ఆఫర్ కోసం కంపెనీ ఇటీవలే సెబీకి దరఖాస్తు చేసుకుంది. వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వం ఈ ఆఫర్ రూపంలో 10 శాతం వాటా విక్రయించుకోవడం ద్వారా సుమారు రూ. 2,500 కోట్లు సేకరించవచ్చని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫ్రా కంపెనీ పవర్‌మెక్ ఐపీవోకి రావడానికి అక్టోబర్ 31న సెబీకి దరఖాస్తు చేసుకుంది. విద్యుత్ కంపెనీల మౌలిక వసతులను కల్పించే పవర్‌మెక్ ఈ ఇష్యూ ద్వారా రూ. 145 కోట్లు సమీకరించనున్నట్లు మార్కెట్ వర్గాల సమాచారం. 2009లో పవర్మెక్లో మోతిలాల్ ఓస్వాల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ రూ. 40 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఇష్యూ ద్వారా ఈ పీఈ ఇన్వెస్టింగ్ సంస్థ మెజార్టీ వాటాను విక్రయించుకోనుంది. అలాగే ప్రి ఇంజనీర్డ్ బిల్డింగ్ వ్యాపారంలో ఉన్న పెబ్స్ పెన్నార్ ఐపీవో ద్వారా నిధులు సేకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ఇష్యూ విధివిధానాలు, ఎంత సేకరించాలన్న దానిపై చర్చిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు తెలియచేస్తామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అలాగే గతంలో మార్కెట్ పరిస్థితులు బాగోలేక ఐపీవో ఆలోచనలు విరమించుకున్న మరో ఇన్ఫ్రా కంపెనీ మెఘా ఇంజనీరింగ్ (ఎంఈఐఎల్) మళ్లీ ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మార్కెట్ పరిస్థితులు బాగుంటే వచ్చే మూడు నాలుగు నెలల్లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. మరోవైపు జీఎంఆర్ ఇన్ఫ్రా రూ. 1,500 కోట్లు, ఐవీఆర్సీఎల్ రూ. 300 కోట్లు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించనున్నాయి. న్యూలాండ్ ల్యాబ్ రూ. 25 కోట్ల రైట్స్ ఇష్యూకి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకుంది. రూ. 60 కోట్ల నిధుల సమీకరణకు బుధవారం సమావేశమైన మోల్డ్ టెక్ బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం మీద చూస్తే వచ్చే ఏడాది ప్రారంభంలో పెద్ద ఎత్తున వివిధ కంపెనీల ఇష్యూలు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆరునెలల్లో 25 కంపెనీల ఇష్యూలు... ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనివిధంగా గత సెప్టెంబర్ నెలలో 14 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రావడం ద్వారా రూ. 562 కోట్లు సమీకరించాయి. అలాగే గడచిన ఆరు నెలల్లో మొత్తం 25 కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,019 కోట్లు సమీకరించినట్లు నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా చిన్న కంపెనీలే ఉండటం విశేషం. గత రెండు నెలల్లో ఐపీవో ద్వారా నిధులు సేకరించడానికి అనుమతి కోరుతూ సెబీకి దరఖాస్తు చేసుకున్నాయి. పెద్ద ఇష్యూలు విజయవంతం కావడంతో కంపెనీలకు మార్కెట్‌పై నమ్మకం ఏర్పడింది. శారదా కార్ప్కెమ్ రూ. 352 కోట్ల పబ్లిక్ ఇష్యూకి, ఎన్సీసీ రూ. 600 కోట్ల రైట్స్‌కి ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.