మహీంద్రా గ్రూప్ ఎన్‌బీఎఫ్‌సీ.. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 159ను సైతం అధిగమించింది. గత రెండు వారాల్లో ఈ షేరు 34 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కంపెనీ రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు ఇటీవలే బోర్డు అనుమతించింది. దీనిలో భాగంగా రైట్స్ పొందేందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 23గా ప్రకటించింది. దీంతో నేటి నుంచి ఎక్స్‌రైట్స్‌లో ఈ కౌంటర్ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం..
1:1 నిష్పత్తిలో..
రైట్స్ ఇష్యూలో భాగంగా ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులకు తమదగ్గరున్న ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఆఫర్ చేస్తోంది. ఇందుకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 50 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనుంది. రైట్స్ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది.
క్యూ1 ఓకే
ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment