M&M
-
ఎస్‌యూవీల జోరు.. లాభాల్లో మహీంద్రా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎం అండ్ ఎం) ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 44% జంప్‌చేసి రూ. 2,773 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ.1,929 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 21,470 కోట్ల నుంచి రూ.29,870 కోట్లకు ఎగసింది. ఆటోమోటివ్ విభాగం టర్నోవర్ రూ.8,245 కోట్ల నుంచి రూ.15,231 కోట్లకు దూసుకెళ్లగా.. వ్యవసాయ పరికరాల బిజినెస్ రూ. 6,723 కోట్ల నుంచి రూ.7,506 కోట్లకు బలపడింది. ఇది సరికొత్త రికార్డుకాగా.. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.2,974 కోట్లకు చేరింది. ఎస్‌యూవీల జోరు: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎం అండ్ ఎం స్టాండెలోన్ నికర లాభం 46% జంప్‌చేసి రూ. 2,090 కోట్లను తాకగా.. మొత్తం ఆదాయం 57% వృద్ధితో రూ. 20,839 కోట్లకు చేరింది. ఈ కాలంలో వాహన విక్రయాలు 75% దూసుకెళ్లి 1,74,098 యూనిట్లను తాకగా, ట్రాక్టర్ల అమ్మకాలు 5% బలపడి 92,590కు చేరాయి. ఎక్స్‌యూవీ 700, స్కార్పియో–ఎన్ వాహనాలకు భారీ డిమాండ్ వలకల వీటి ఉత్పత్తిని పెంచుతున్నట్లు కంపెనీ ఈడీ రాజేష్ జెజూరికర్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా ఎస్యూవీ తయారీ సామ ర్థ్యాన్ని నెలకు 39,000 యూనిట్లకు, తదుపరి వచ్చే ఏడాది చివరికల్లా 49,000 యూనిట్లకు పెంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 2.6 లక్షల యూనిట్లకు బుకింగ్స్ ఉన్నట్లు తెలియజేశారు. 2027కల్లా ఎస్‌యూవీల అమ్మకాలలో 20–30 శాతం ఎలక్ట్రిక్ వాహనాలు ఆక్రమించవచ్చని అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు 0.8% నీరసించి రూ. 1,287 వద్ద ముగిసింది. -
జేవీకి.. ఫోర్డ్, మహీంద్రాల ‘టాటా’
న్యూఢిల్లీ, సాక్షి: దేశీయంగా భాగస్వామ్య సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు తెరదించినట్లు తాజాగా ఆటో రంగ దిగ్గజాలు ఫోర్డ్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించాయి. కోవిడ్-19 నేపథ్యంలో గత 15 నెలలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జేవీ ఆలోచనను విరమించుకున్నట్లు రెండు కంపెనీలూ విడిగా తెలియజేశాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే వ్యాపార వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు ఫోర్డ్ మోటార్ ప్రతినిధి టీఆర్ రీడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. జేవీ ఏర్పాటుకు ఏడాది కాలంగా రెండు కంపెనీలూ ప్రణాళికలు వేస్తూ వచ్చాయి. ఇందుకు గడువు డిసెంబర్ 31తో ముగియనుండటంతో జేవీ ఆలోచనకు స్వస్తి చెప్పాయి. నిజానికి తొలి ప్రణాళికల ప్రకారం పెట్టుబడులకు సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదా గడువును పెంచుకోవడం వంటివి చేపట్టవలసి ఉన్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. అయితే కోవిడ్-19 కారణంగా మారిన పరిస్థితులతో వెనకడుగు వేసినట్లు పేర్కొన్నాయి. (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా) వర్ధమాన మార్కెట్లకు వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా చౌక వ్యయాలతో వాహనాల తయారీ కోసం ఫోర్డ్, ఎంఅండ్ఎం జేవీని ఏర్పాటు చేయాలని 2019లో ప్రణాళికలు వేశాయి. వీటిలో భాగంగా మూడు కొత్త యుటిలిటీ వాహనాలను అభివృద్ధి చేయాలని భావించాయి. మధ్యతరహా ఎస్యూవీ తయారీతో వీటిని ప్రారంభించాలని యోచించాయి. అంతేకాకుండా వర్ధమాన మార్కెట్లలో విక్రయించేందుకు వీలుగా ఎలక్ట్రిక్ వాహనాలను సైతం రూపొందించాలని ప్రణాళికలు వేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాహన తయారీ ప్రణాళికలపై ఎలాంటి వివరాలనూ వెల్లడించలేమని రీడ్ స్పష్టం చేశారు. (యాపిల్ నుంచి సెల్ఫ్‌డ్రైవింగ్ కారు!) ఒత్తిడి పెరుగుతోంది మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీపై ఇటీవల పలు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. అయితే వీటి అభివృద్ధికి వీలుగా ప్రత్యేకంగా నిధులను వెచ్చించవలసి ఉండటంతో పలు కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొన్నారు. ఇందువల్లనే ఫ్రాన్స్ కంపెనీలు పీఎస్ఏ, ఫియట్ క్రిస్లర్ మధ్య విలీనానికి బాటలు పడినట్లు అభిప్రాయపడ్డారు. 2021 మార్చిలోగా ఈ రెండు కంపెనీల మధ్య 38 బిలియన్ డాలర్ల విలువైన విలీనం జరగనున్న విషయం విదితమే. కాగా.. మహీంద్రా, తదితర కంపెనీలతో జత కట్టడం ద్వారా వాహన తయారీలో వ్యయాలను తగ్గించుకోవాలని ఫోర్డ్ తొలుత భావించింది. తద్వారా ప్రపంచ స్థాయిలో 8 శాతం నిర్వహణ మార్జిన్లను సాధించాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ఈ వ్యూహాలను కొనసాగించనున్నట్లు రీడ్ తాజాగా స్పష్టం చేశారు. ఇందుకు దక్షిణాసియాలోని మరో కంపెనీపై జత కట్టే వీలున్నట్లు ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పీఎన్బీకి క్విప్ దెబ్బ- ఎంఅండ్ఎం స్పీడ్
ముంబై, సాక్షి: మార్కెట్లు మరోసారి ర్యాలీ బాటలో సాగుతున్నాయి. ఫలితంగా రికార్డ్ గరిష్టాలను తాకాయి. ఈ నేపథ్యంలో అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్) కారణంగా పీఎస్‌యూ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. అయితే మరోపక్క వచ్చే జనవరి 1 నుంచి వివిధ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి పీఎన్బీ కౌంటర్ నష్టాలతో డీలాపడగా..ఎంఅండ్ఎం లాభాలతో సందడి చేస్తోంది. వివరాలు చూద్దాం.. (నేటి నుంచి బెక్టర్స్ ఫుడ్.. పబ్లిక్ ఇష్యూ) పంజాబ్ నేషనల్ బ్యాంక్ మంగళవారం సమావేశమైన మూలధన పెట్టుబడుల సమీకరణ కమిటీ క్విప్ ఇష్యూకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు పీఎన్బీ వెల్లడించింది. ఇందుకు రూ. 37.35 ఫ్లోర్ ధరను ప్రకటించింది. క్విప్‌లో భాగంగా అర్హతగల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. తద్వారా రూ. 7,000 కోట్లు సమీకరించేందుకు బ్యాంక్ ఇప్పటికే అనుమతులు పొందింది. అయితే ఫ్లోర్ ధరకు 5 శాతానికి మించి డిస్కౌంట్ ఇవ్వబోమని బ్యాంక్ తెలియజేసింది. క్విప్ ధర, షేర్ల జారీ తదితర అంశాలపై శుక్రవారం సమావేశంకానున్న పెట్టుబడుల కమిటీ నిర్ణయాలు తీసుకోనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో తొలుత ఎన్ఎస్ఈలో పీఎన్బీ షేరు 8.3 శాతం పతనమై రూ. 37.25ను తాకింది. ప్రస్తుతం 5 శాతం నష్టంతో రూ. 38.60 వద్ద ట్రేడవుతోంది. (మార్కెట్ డౌన్- ఈ షేర్లు జూమ్) మహీంద్రా అండ్ మహీంద్రా జనవరి 1 నుంచి ప్రయాణికుల, వాణిజ్య వాహన ధరలను పెంచనున్నట్లు ఎంఅండ్ఎం తాజాగా వెల్లడించింది. ముడిసరుకులు, తదితర వ్యయాలు పెరగడంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలియజేసింది. పెంపు వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంఅండ్ఎం షేరు తొలుత ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 746ను అధిగమించింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం ఎగసి రూ. 740 వద్ద ట్రేడవుతోంది. -
టెక్ మహీంద్రా- ఎంఅండ్ఎం ఫైనాన్స్ స్పీడ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్బీఎఫ్సీ ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. టెక్ మహీంద్రా లిమిటెడ్ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం అధికంగా రూ. 972 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో త్రైమాసిక ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం 33 శాతం వృద్ధి చూపి రూ. 1283 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు స్వల్పంగా బలపడి 14.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు తొలుత ఎన్ఎస్ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 703కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 11.3 మిలియన్ షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో చేతులు మారడం గమనార్హం! ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ. 3089 కోట్ల సమీకరణకు నేటి నుంచి రైట్స్ ఇష్యూ చేపట్టిన నేపథ్యంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల 61.78 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వాటాదారుల వద్ద గల ప్రతీ 1 షేరుకీ మరొక షేరుని కేటాయించనుంది. ఆగస్ట్ 11న ముగియనున్న రైట్స్ ఇష్యూకి రూ. 50 ధరను నిర్ణయించిన విషయం విదితమే. -
ఎంఅండ్ఎం ఫైనాన్షియల్.. భలే జోరు
మహీంద్రా గ్రూప్ ఎన్బీఎఫ్సీ.. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ప్రస్తుతం ఈ షేరు 13 శాతంపైగా దూసుకెళ్లి రూ. 157 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 159ను సైతం అధిగమించింది. గత రెండు వారాల్లో ఈ షేరు 34 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! కంపెనీ రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు ఇటీవలే బోర్డు అనుమతించింది. దీనిలో భాగంగా రైట్స్ పొందేందుకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 23గా ప్రకటించింది. దీంతో నేటి నుంచి ఎక్స్‌రైట్స్‌లో ఈ కౌంటర్ ట్రేడవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇతర వివరాలు చూద్దాం.. 1:1 నిష్పత్తిలో.. రైట్స్ ఇష్యూలో భాగంగా ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులకు తమదగ్గరున్న ప్రతీ 1 షేరుకీ మరో షేరుని ఆఫర్ చేస్తోంది. ఇందుకు రూ. 2 ముఖ విలువగల ఒక్కో షేరుకీ రూ. 50 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనుంది. రైట్స్ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు కంపెనీ ఇప్పటికే తెలియజేసింది. క్యూ1 ఓకే ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. -
ఎంఅండ్ఎం ఫైనాన్స్ రైట్స్@ రూ. 50
వరుసగా మూడో రోజు హుషారుగా కదులుతున్న మార్కెట్లలో ఎన్బీఎఫ్సీ.. ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతోపాటు రైట్స్ ఇష్యూ చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో ఈ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. వెరసి భారీ లాభాలతో కళకళలాడుతోంది. వివరాలు చూద్దాం.. 300 శాతం ప్లస్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 300 శాతం జంప్‌చేసి రూ. 432 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతమే పెరిగి రూ. 2838 కోట్లకు చేరింది. స్టాండెలోన్ ప్రాతిపదికన జూన్ చివరికల్లా నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 14 శాతం వృద్ధితో రూ. 81,436 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 9.3 శాతం దూసుకెళ్లి రూ. 227 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 234 వరకూ ఎగసింది. 1:1 రైట్స్ వాటాదారులకు 1:1 నిష్పత్తిలో రైట్స్ ఇష్యూ జారీకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ తాజాగా వెల్లడించింది. ఒక్కో షేరుకీ రూ. 50 ధరలో చేపట్టనున్న రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 3089 కోట్లవరకూ సమీకరించనున్నట్లు తెలియజేసింది. ఇష్యూకి ఈ నెల 23(గురువారం) రికార్డ్ డేట్‌గా ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై ఆగస్ట్ 11న ముగియనున్నట్లు తెలియజేసింది. రైట్స్‌లో భాగంగా వాటాదారులు తమ వద్దనున్న ప్రతీ 1 షేరుపై మరొక షేరుని పొందేందుకు వీలుంటుంది. ఇందుకు రూ. 50 ధరను చెల్లించవలసి ఉంటుంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల దాదాపు 62 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. -
చైర్మన్‌గా వైదొలగనున్న ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఏప్రిల్ 1, 2020 నుంచి ఆయన నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటారని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం తెలిపిందందని ఎం అండ్ ఎండ్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, పవన్ కుమార్ గోయెంకా, కొత్త సీఈవోగా ఒక సంవత్సరం పాటు అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.. 2020 ఏప్రిల్ 1 నుండి ప్రస్తుత పదవీకాలం ముగిసే వరకు (11 నవంబర్, 2020) ఆయన ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ వెల్లడించింది. అలాగే అనీష్ షా ఏప్రిల్ 2021 వరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్ఓ) గా నియమితులయ్యారు. ఏప్రిల్ 2, 2021 తరువాత, అతను గోయెంకా స్థానంలో నాలుగేళ్ల కాలానికి కంపెనీ సీఎండీ బాధ్యతలు స్వీకరిస్తారు.. అతని పదవీకాలం 2025 మార్చి 31 తో ముగుస్తుంది. ఈ మార్పులను కంపెనీ ప్రకటించడంతో ఎం అండ్ ఎం షేరు స్వల్ప నష్టంతో కొనసాగుతోంది. -
ఎం అండ్ ఎండ్‌కు పేటెంట్ షాక్
అమెరికాలో దేశీయ ఆటో మేజర్ మహీంద్ర అండ్ మహీంద్రకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై విచారణ చేపట్ట నున్నామని అమెరికా రెగ్యులేటరీ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్ మంగళవారం ప్రకటించింది. జీప్ డిజైన్ విషయంలో అమెరికా వాహన దిగ్గజం ఫియట్ క్రిస్లర్ ఫిర్యాదు నేపథ్యంలో ఈ విచారణ చేయనున్నట్టు తెలిపింది. జీప్ రూపకల్పనలో మేధోసంపత్తి హక్కులను ఉల్లంఘించిన వివాదంలో మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ ఉత్పత్తి చేసిన ఆఫ్-రోడ్ యుటిలిటీ వాహనం రోక్సార్కి సంబంధించి పేటెంట్-సంబంధిత దర్యాప్తును ప్రారంభించనున్నట్టు ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ITC) ఒక ప్రకటనలో తెలిపింది. 45 రోజుల వ్యవధిలో దాని దర్యాప్తును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే మొదట్లో ఈ వార్తలను కొట్టి పారేసిన ఎంఅండ్‌ఎండ్ ఈ అంశాన్ని ధృవీకరించింది. ఫియట్ క్రిస్లెర్ ఫిర్యాదుపై ఐటిసి దర్యాప్తు చేపట్టనుందని మహీంద్ర ఆటోమోటివ్ ఉత్తర అమెరికా మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రిచ్ అన్సెల్ వెల్లడించారు. అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు ఫియట్ క్రిస్లర్ అందుబాటులో లేదు. మరోవైపు ఈ వార్తల నేపథ్యంలో ఎం అండ్ ఎం షేరు 2 శాతానికిపైగా నష్టపోయింది. కాగా అమెరికాలో మహీంద్రా రోక్సార్ విక్రయాలను నిలిపివేయాలని అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కమిషన్‌ను ఫియట్ క్రిస్లర్ ఇటీవల ఆశ్రయించింది. తమ అనుబంధ సంస్థ జీప్ డిజైన్లను మహీంద్రా వాడుకుందని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
అంచనాలను మించిన ఎం అండ్ ఎం
సాక్షి,ముంబై: దేశీయ ఆటో రంగ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. గత ఆర్థిక సంవత్సరం(2017-18) చివరి త్రైమాసికంలో 50 శాతం వృద్ధితో రూ. 1,155 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కాగా నికర లాభం 1,037 కోట్ల రూపాయలుగా ఉండనుందని విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 13,189 కోట్లకు నమోదైంది. నిర్వహణ లాభం మరింత అధికంగా 70 శాతం ఎగసి రూ. 1995 కోట్లను తాకింది. ఇబిటా మార్జిన్లు 15.1 శాతంగా నమోదుకాగా.. ఆటో విభాగం ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9105 కోట్లకు చేరింది. -
ఎం అండ్ ఎం ఛైర్మన్ వేతనం ఎంత పెరిగిందంటే..
ముంబై: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్ర వేతనం భారీగా పెరిగింది. గత ఏడాది తో పోలిస్తే మహీంద్రా జీతం 16.38 శాతం పెరిగింది. దీంతో ఆయన వార్షిక వేతనం దాదాపు రూ.8 కోట్లకు చేరింది. 2016-17 సం.రానికి 7.67 కోట్ల రూపాయల జీతం అందుకోనున్నారనీ, అంతకుముందు ఆర్థిక సంవత్సరం నుంచి 16.38 శాతం పెరిగినట్లు కంపెనీ వార్షిక నివేదిక తెలిపింది. తమ మధ్యస్థ ఉద్యోగుల వేతనాలకంటే ఇది 108.27 శాతం ఎక్కువ అని పేర్కొంది అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంక రూ. 7.6 కోట్ల వేతనం అందుకున్నారని తెలిపింది. ఉంది. 2016-17లో అమలుచేసిన ఈఎస్ఓపీ కారణంగా ఇది 15.86 శాతం పెరిగిందని పేర్కింది. ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోలిస్తే గోయెంకా యొక్క వేతనం నిష్పత్తి 104.43. సంస్థ అందించిన నివేదిక ప్రకారం, 2016-17లో సంస్థ ఉద్యోగుల సగటు వేతనం రూ.7.08 లక్షలు. ఈ ఆర్థిక సంవత్సరంలో, ఉద్యోగుల సగటు వేతనం లో 0.43 శాతం పెరిగింది. 2016-17లో నిర్వహణాధికారుల కంటే వేరే ఉద్యోగుల వేతనాల్లో సగటు తగ్గుదల 1.46 శాతంగా ఉంది, అదే సంవత్సరంలో నిర్వహణ వేతనం తగ్గి 7.35 శాతంగా ఉంది. ఎం అండ్ ఎం గ్రూప్ సిఎఫ్ఓ, సిఐఓ వి.ఎస్. పార్థసారథిలకు రూ. 3.52 కోట్లు లభించాయని, గత ఏడాది నుంచి 19.74 శాతం మేర పెరిగిందని నివేదిక పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వేతనాలను వారి వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణం, వ్యాప్తిలో ఉన్న పరిశ్రమ పోకడలు , బెంచ్ మార్క్ నిర్ణయాల ఆధారంగా నిర్ణయించబడతాయని కంపెనీ తన రిపోర్టులో వెల్లడించింది. కాగా ఇటీవల ప్రకటించిన మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. స్టాండ్ అలోన్ ప్రాతిపదికన కంపెనీ రూ.766 కోట్ల లాభాలను, 3.29 శాతం వృద్ధితో రూ.12,335 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. -
దూసుకుపోయిన ఎం అండ్ ఎం
ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాల్టి (బుధవారం) మార్కెట్లో దూసుకుపోతోంది. క్యూ4 ఫలితాలు, 2018 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన గైడెన్స్ అంచనాల నేపథ్యంలో ఎంఅండ్ ఎం 6 శాతానికిపైగా లాభపడింది. మార్చి క్వార్టర్లో 26.3 శాతం వృద్ధిని, రూ. 874 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో ఫ్టాట్ మార్కెట్లో టాప్ గెయినర్‌గా నిలిచింది. తద్వారా 8 నెలల గరిష్టాన్ని నమోదుచేసింది. ఎం అండ్ ఎం మొత్తం ఆదాయం ఇతర ఆదాయంతో సహా 5 శాతం పెరిగి రూ .12,889 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక లాభం రూ .4050 కోట్లకు చేరింది. గత ఏడాది క్వార్టర్లో ఇది రూ.3,554 లుగా ఉంది. ఏకీకృత ఆదాయం 10.6 శాతం పెరిగి రూ .88,983 కోట్లకు చేరింది. దాదాపు 130,778 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది ఫ్లాట్ దేశీయ మార్కెట్లో అమ్మకాలు 13.3 శాతం పెరిగి 46,583 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ ఎగుమతులు 10, 831 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు (2017 ఏప్రిల్ 1 నుంచి) ద్వారా బీఎస్-3 వాహనాల విక్రయాలపై ఆంక్షలు విధించటంతో ఈ కంపెనీ ఒక్కసారిగా రూ. 171 కోట్ల నష్టపోయిన సంగతి తెలిసిందే. సెడాన్, యుటిలిటీ వాహన విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాలో తాము సంతోషంగా లేమనీ, తీవ్రమైన పోటీతో మార్కెట్ వాటాను కోల్పోయామ ని మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎంఅండ్ఎం షేరులో ట్రేడ్ పండితులు బై కాల్ ఇస్తున్నారు. బ్రోకింగ్ సంస్థ సీఎల్ఎస్ఏ తాజాగా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపుతున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
స్వల్పలాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మయంగా సాగి ఆఖరికి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 91.03 పాయింట్ల లాభంతో 26,051.81 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8,033.30వద్ద ముగిసింది. బ్యాంక్స్, హెల్త్ కేర్, ఇన్ఫ్రా స్టాక్స్ మద్దతుతో దేశీయ సూచీలు మధ్యాహ్నం ట్రేడింగ్‌లో లాభాల్లోకి ఎగిశాయి. లుపిన్, టాటాస్టీల్, ఏషియన్ పేయింట్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీలు లాభాలనార్జించగా.. మహింద్రా అండ్ మహింద్రా, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సెన్సెక్స్‌లో నష్టాలను గడించాయి. లార్సన్ అండ్ టుబ్రో అంచనాలు మించి క్వార్టర్లీ ఫలితాలను పండించడంతో పాటు, అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల పవనాలు పెట్టుబడిదారులు సెంటిమెంట్‌ను బలపరిచినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ పెద్ద నోట్లను రద్దుచేస్తూ ప్రధాని తీసుకున్న సంచలన నిర్ణయంపై ట్రేడర్లు సెంటిమెంట్ ఇంకా బలహీనంగానే ఉందని, ఆర్థిక ప్రభావంపై వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. గురువారంతో డెరివేటివ్స్ గడువు ముగుస్తుండంతో మార్కెట్లు ఒడిదుడుకులుగా సాగినట్టు విశ్లేషకులు చెప్పారు. అటు వాల్ స్ట్రీట్ కూడా మంగళవారం వరుసగా రెండో సెషన్లో రికార్డు బ్రేక్ చేయడంతో ఆసియన్ స్టాక్స్ వారం గరిష్టంలో నమోదయ్యాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.24 పైసలు నష్టపోయి 68.49వద్ద ముగిసింది. -
అంచనాలకు మించి రాణించిన ఎం అండ్ ఎం
ముంబై: దేశీయ ఆటో దిగ్గజం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి మహీంద్రా అండ్ మహీంద్రా మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. స్ట్రీట్ అంచనాల ఓడించి, జూన్ క్వార్టరు కు రూ 955 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని నమోదుచేసింది. దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ ఎం అండ్ ఎం నికర విక్రయాల్లో 14 శాతం వృద్ధితో రూ 11, 942 కోట్ల సాధించినట్టు బుధవారం వెల్లడించింది. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న వినియోగ వాహనాల తయారీ లో 9.7 శాతం వృద్ధి సాధించింది. జూన్ త్రైమాసికంలో సమయంలో 1,10,959 యూనిట్లు విక్రయించింది. యుటిలిటీ వాహనాల అమ్మకాలు 13 శాతం ప జంప్ అయ్యాయి. ఈ త్రైమాసికంలో 55.909 యూనిట్లను విక్రయించి, 31.6 శాతం మార్కెట్ వాటాతో విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ట్రాక్టర్ అమ్మకాలు 21 శాతం పెరిగాయి. 71, 785 యూనిట్ల అమ్మకాలతో ఎం అండ్ ఎం జూన్ త్రైమాసికం ముగిసేనాటికి ట్రాక్టర్ విభాగంలో 44 శాతం మార్కెట్ షేర్ సాధించింది. క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎంఅండ్ఎం నికర లాభం రూ. 955 కోట్లను తాకగా, నిర్వహణ లాభం(ఇబిటా)11 శాతం పెరిగి రూ. 1489 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 10,525 కోట్లుగా నమోదైంది. 14.1 శాతం ఇబిటా మార్జిన్లు సాధించింది. క్యూ1లో దేశీ ట్రాక్టర్ మార్కెట్లో రెండంకెల వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఆటో విభాగం మార్జిన్లు 5.9 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గినట్లు తెలియజేసింది. దేశీయ మార్కెట్లో తమకు మంచి వృద్ధి ఉందని, మంచి భవిష్యత్తు ఉందని ఎంఅండ్ ఎం ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, మార్కెట్లలో నెలకొన్న నష్టాల పరంపరలో ఎంఅండ్ఎం షేరు అనంతరం నష్టాల్లోకి జారుకుంది. -
300 పాయింట్ల నష్టంలో మార్కెట్లు
ముంబై: స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు మరోసారి ఊపందుకోవడంతో దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. 275 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, నిఫ్టీ 95 పాయింట్లనష్టంతో కొనసాగుతున్నాయి. దీంతో ఇప్పటికే 28,000 మైలురాయి దిగువకు చేరిన సూచీ తాజాగా 27,800 స్థాయిని కూడా కోల్పోయింది. అట నిఫ్టీ కూడా బాటలో 8600 స్థాయి దిగువకు పతనమైంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫార్మా, ఆటో, రియల్టీ రంగాలు దెబ్బకొడుతున్నాయి. సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. అయితే భారీ లాభాలతో టాటా కెమికల్స్ ఆల్ టైమ్ ని హైని తాకింది. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా క్యూ 1 లో రూ. 962 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో 3 శాతానికి పైగా లాభ పడింది. అనంతరం నష్టాల్లోకి జారుకుని 2.09 నష్టంతో 1,450 దగ్గర ఉంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ పాజిటివ్ గా ఉంది. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. -
అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో మార్కెట్లు
ముంబై : స్వల్ప లాభాలతో ప్రారంభమైన బుధవారం నాటి స్టాక్ మార్కెట్లు, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెలక్టెడ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ, హెల్త్ కేర్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 54.91 పాయింట్లు కోల్పోయి 28,030 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 20.35 పాయింట్లు కోల్పోయి 8700 కీలక మార్కుకు దిగువన 8657 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకు టాప్ గెయినర్లుగా ఉండగా.. బీహెచ్ఈల్, గెయిల్, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్ నష్టాలను చవిచూస్తున్నాయి. భారతీ ఇన్ఫ్రాటెల్ 1.7 శాతం పడిపోయి నిఫ్టీలో టాప్ లూజర్‌గా కొనసాగుతోంది. అయితే ప్రారంభంలో సెన్సెక్స్ 21 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు లాభంలో ట్రేడ్ అయింది. అనంతరం అమ్మకాల ఒత్తిడి ప్రారంభం కావడంతో మార్కెట్లు పడిపోయాయి. కార్పొరేట్ ఆదాయాలపై ఇన్వెస్టర్ ఫోకస్ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో మేజర్ కంపెనీ మహింద్రా అండ్ మహింద్రా తన తొలి త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల కానున్నాయి. అదేవిధంగా ఇండియన్ హోటల్స్, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు, మింద కార్పొ, మదర్సన్ సుమీ, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వంటి కంపెనీ ఫలితాలు కూడా నేడే రానున్నాయి. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 16పైసలు బలపడి 66.68గా ఓపెన్ అయింది. ఈ ఏడాదిలో ఫెడరల్ రిజర్వు రేట్లను పెంచనున్న సంకేతాలు వెలువడుతుండటంతో, రూపాయి విలువ బలపడుతుందని మార్కెట్ విశ్లేషకుడు ఎన్ఎస్ వెంకటేష్ చెప్పారు. నేటి ట్రేడింగ్‌లో డాలర్ మారకం విలువతో రూపాయి 66.85-67.05 మధ్య కొనసాగొచ్చని అంచనావేస్తున్నారు. -
టాప్‌లో టయోటా
న్యూఢిల్లీ: జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కార్ల అమ్మకాల్లో మొదటి స్థానంలో నిలిచింది. టయోటా కిర్లోస్కర్ అనేక దిగ్గజ కార్ల కంపెనీల వెనక్కి నెట్టి వాహనాల అమ్మకాల్లో టాప్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం అమ్మకాల్లో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ లను ఘోరంగా ఓడించింది. తక్కువ వాల్యూమ్ కలిగి ఉన్నప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద కార్ మేకర్ హ్యుందాయ్ ను వెనక్కి నెట్టేసింది. మారుతి సుజుకి తరువాత టయాటా హయ్యస్ట్ సెగ్మెంట్ లీడర్ గా అవతరించింది. అయితే హ్యుందాయ్ ఒక సెగ్మెంట్ లో లీడ్ లో ఉండగా టాటా మోటార్స్ కు అది కూడా దక్కలేదు. టయోటా కంపెనీకి ఉన్న మొత్తం 7 ప్రధాన ఉత్పత్తులో మూడు రారాజుల్లా నిలిచాయి. ఎగ్జిక్యూటివ్ సెడాన్ యూవీ2 ( రూ .15 లక్షలు లోపు) యూవీ 4 ( రూ .25 లక్షలులోపు), ప్యాసింజర్ వాహనాల కేటగిరిలో కరోల్లా, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ టాప్ లో నిలిచాయి. అలాగే భారతదేశం లో ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ క్రూజర్ ప్రదోలను కూడా విక్రయిస్తోంది. అయితే, ప్రీమియం విభాగాలపైనే దృష్టి సారించి కంపెనీ మాస్ కారు సెగ్మెంట్లో మాత్రం ప్రవేశించలేకపోయింది. ఎగ్జిక్యూటివ్ సెగ్మెంట్లో నెలకు 1,200 యూనిట్లు, యూవీ2,యూవీ 4 మార్కెట్ పరిమాణం వరుసగా 20,000, 15,00 యూనిట్లు విక్రయిస్తున్నట్టుకంపెనీ పేర్కొంది. 2010 నుంచి ఎతియోస్ సిరీస్‌లో తమఉత్పత్తుల ద్వారా బి హాచ్, బి సెడాన్ విభాగాలలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నామని టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్ అండ్ సేల్స్ డైరెక్టర్ ఎన్ రాజా చెప్పారు. రూ .10 లక్షల ధర బ్యాండ్ , ఆ పై విభాగాలలో ప్రధానంగా ఉన్నామనీ, ఇతియోస్ సిరీస్ లో ఇతియోస్ లివా, క్రాస్ వాహనాలకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభించిందనీ, తమ సేవలు ఇకముందు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. 2000 సీసీ డీజిల్ వాహనాలపై నిషేధం ఉన్నప్పటికీ 2017 ఆర్థిక సంవ్సతరంలో మరింత అధిగమిస్తామని కంపెనీ ప్రకటించింది. కాగా టయోటా భారతదేశం లో అమ్మకాల పరంగా టాప్ 10 కార్ల తయారీ కంపెనీల్లో 5 వ స్థానంలో టయాటో నిలుస్తుంది. -
తగ్గనున్న చిన్న కార్ల ధరలు?
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కోలకతాలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సాధికారిక కమిటీ సమావేశాలు రెండురోజుల పాటు జరిగాయి. ఈక్రమంలో మళ్లీ జీఎస్ టీ బిల్లు చర్చకు వచ్చింది. పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడితే చిన్న కార్లు, ద్విచక్రవాహనాలు ధరలు మరింత దిగిరానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో ఆయా షేర్లు మార్కెట్లో లాభాల బాటపట్టాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ లేదా జీఎస్టీ బిల్లు ఆమోదించబడితే ఆటో రంగం ప్రముఖమైన లబ్దిదారుగా మారునుందని విశ్లేషకులు అంటున్నారు. 18 శాతం ప్రతిపాదిత రేటు ప్రకారం కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఇతర కమర్షియల్ వాహనాల ధరలు కూడా కిందికి దిగిరానున్నాయని భావిస్తున్నారు. చిన్న కార్లు (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,200 సిసి / 1,500 పెట్రోల్ / డీజిల్ మోడళ్ల సిసి), ద్విచక్రవాహనాలపై ప్రస్తుతం 24 శాతంగా ఉన్న పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. అంటే వాహనాల ధరల్లో ప్రస్తుత శాతం నుంచి 7శాతం తగ్గనున్నాయి. అయితే 40 శాతం జీఎస్ టీ రేటు ఒకే అయితే..మధ్య తరహా కార్లు,ఎస్యూవీ (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,500 సిసి) లో ప్రస్తుత మిశ్రమ పన్ను రేటు 6 శాతానికి పెరుగనుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీల (1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ పరిమాణం తో వాహనాల ధరలు) మటుకు ఈ యథాయథంగా ఉండనున్నాయి. అలాగే ట్రాక్లర్ల ధరలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశంలేదు. 12 శాతం రేటుతో ట్రాక్టర్లపై ప్రస్తుత ఒవర్ ఆల్ టాక్స్ తో ఎక్కువగా పోలి ఉంది. ప్యాసింజర్ వాహన విభాగంలోని డిమాండ్, కాంపాక్ట్ సెడాన్ మరియు ఎస్యూవీ ల డిమాండ్ మధ్య తరహా , పెద్ద కార్లు, లేదా ఎస్ యూవీ ల వైపు మళ్లే అవకాశం ఉందని కోటక్ ప్రతినిధి హితేష్ గోయెల్ చెప్పారు.మొత్తంగా ఈ జీఎస్ టీ బిల్లు ఆమెదం భారతదేశంలోని అతి పెద్ద కార్ల తయారీసంస్థ మారుతి సుజుకి, అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, యుటిలిటీ వాహనం తయారీదారు ఎం అండ్ ఎం చాలా సానుకూలంగా ఉండన్నాయని బ్రోకరేజ్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ అంచనాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్లు 2.61 శాతం లాభాలతో రూ. 4,211 దగ్గర ముగిసింది. 30 శాతం లాభాలతో మొదలైన ఎం అండ్ ఎం శాతం నష్టంతో 1353రూ. దగ్గర ముగిసింది. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్టీ వ్యవస్థలో భాగంగా ఉండటాన్ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. రాష్ట్రాలకు రాబోయే రెవెన్యూ నష్టం పట్ల ఆందోళన వ్యక్తచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధికారత కమిటీ అభిప్రాయాలను ఆర్థిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లు పరిగణనలోకి తీసుకోవాలని తమిళనాడు వాదిస్తోంది. -
ఒడిదుడుకుల్లో మార్కెట్లు
ముంబై : వరుసగా నాలుగురోజుల నుంచి నష్టాల పాలవుతూ వస్తున్న స్టాక్ మార్కెట్లు నేటి(మంగళవారం)ట్రేడింగ్ లో కూడా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. సెన్సెక్స్ కేవలం 1 పాయింట్ల లాభంతో 25,232 వద్ద, నిఫ్టీ 1 పాయింట్ల లాభంతో 7,732వద్ద ట్రేడ్ అవుతోంది. ఎన్టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, సిప్లా, టాటా మోటార్స్ లాభాల్లో కొనసాగుతుండగా...ఇన్ఫోసిస్, ఎమ్ అండ్ ఎమ్, సన్ ఫార్మా, టీసీఎస్ లు బలహీనంగా నమోదవుతున్నాయి. నిఫ్టీలో మేజర్ ఇండెక్స్ లుగా ఉన్న ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, వినియోగదారుల వస్తువులు, క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ నష్టాలను నమోదుచేస్తున్నాయి. భారత్ లో లభ్యమయ్యే బ్రెడ్ లో కెమికల్ శాతాలు ఎక్కువగా ఉన్నాయని, వాటివల్ల బ్రెడ్ తో తయారీ చేసే జంక్ ఫుడ్, బర్గర్లను తినడం వల్ల థైరాయిడ్, క్యాన్సర్ లకు దారితీయవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ హెచ్చరికలు జారిచేసింది. దీంతో ప్రముఖ ఆహార దిగ్గజ షేర్లు పడిపోతున్నాయి. జూబ్లియంట్ ఫుడ్ వర్క్స్ షేర్లు 8 శాతం, బ్రిటానియా షేర్లు 1 శాతం పడిపోతున్నాయి. కేఎఫ్ సీ, పిజ్జా హట్, డామినోస్, సబ్ వే, మెక్ డొనాల్డ్స్, స్లైస్ ఆఫ్ ఇటలీ ఆఫర్ చేసే ఆహార ఉత్పత్తులో కూడా ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయని సీఎస్ఈ రిపోర్టు విడుదల చేసింది. దీంతో డామినోస్ పిజ్జా, డన్ కిన్ డొనట్స్ షేర్లు నేటి ఇంట్రా డ్రేట్ లో 12.35శాతం పతనమయ్యాయి. అయితే తాము ఆఫర్ చేసే బ్రెడ్ ఉత్పత్తుల్లో అన్ని పదార్థాలు తగిన మోతాదుల్లో ఉన్నాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అనుమతులు ఇచ్చిందని బ్రిటానియా, జూబ్లియంట్ చెబుతున్నాయి. ఆహారభద్రత నిబంధనలను పాటిస్తున్నామని పేర్కొంటున్నాయి. మరోవైపు రూపాయి విలువ కూడా రెండు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ మారకం విలువతో పోల్చుకుంటే రూపాయి 14 పైసలు నష్టపోయి 67.63గా కొనసాగుతోంది. యూఎస్ ఫెడరల్ రిజర్వు నుంచి తర్వాత వచ్చే సంకేతాల కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తూ ఆసియన్ మార్కెట్లో ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో ఆసియన్ మార్కెట్లు కూడా నష్టాలు పాలవుతున్నాయి. పసిడి, వెండి ధరలు సైతం నష్టాలే పాలవుతున్నాయి. పసిడి రూ.69 నష్టంతో రూ.29,615 వద్ద, వెండి రూ.190నష్టంతో రూ.39,475వద్ద ట్రేడ్ అవుతోంది. -
అయినా క్షీణతే...
న్యూఢిల్లీ: ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా వాహన కంపెనీలు ధరలను తగ్గించినప్పటికీ, ‘ఆ ఫలితం పూర్తిగా అందకపోవడం కారణంగా’ ఫిబ్రవరిలో వాహన విక్రయాలు నిరాశమయంగానే ఉన్నాయి. అధికంగా ఉన్న ఇంధనం ధరలు, వడ్డీ రేట్లు వంటి అంశాలు వాహన అమ్మకాలపై తీవ్రంగానే ప్రభావం చూపుతున్నాయని వాహన కంపెనీలు వాపోతున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఎంక్వైరీలైతే పెరిగాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో వాహన అమ్మకాల తీరు.. కంపెనీ 2014 2013 వృ/క్షీ(%లో) హోండా కార్స్ 14,543 6,510 123 ఫోర్డ్ ఇండియా 12,253 7,253 69 మారుతీ సుజుకి 1,09,104 1,09,567 -0.4 హ్యుందాయ్ 46,505 54,665 -15 టాటా మోటార్స్ 39,951 61,998 -36 మహీంద్రా 42,166 47,824 -12 టయోటా 11,284 13,979 -19 మహీంద్రా ట్రాక్టర్ 17,592 14,861 18 టీవీఎస్ 1,77,762 1,65,696 7 హోండా మోటార్ సైకిల్ 3,28,521 2,28,444 44 -
మార్కెట్లోకి M&M కొత్త XUV 500