ముంబై: మహీంద్రా అండ్ మహీంద్రా ఇవాల్టి (బుధవారం) మార్కెట్లో దూసుకుపోతోంది. క్యూ4 ఫలితాలు, 2018 ఆర్థిక సంవత్సరానికి మెరుగైన గైడెన్స్ అంచనాల నేపథ్యంలో ఎంఅండ్ ఎం 6 శాతానికిపైగా లాభపడింది. మార్చి క్వార్టర్‌లో 26.3 శాతం వృద్ధిని, రూ. 874 కోట్ల నికర లాభాలను నమోదు చేయడంతో ఫ్టాట్ మార్కెట్లో టాప్ గెయినర్‌గా నిలిచింది. తద్వారా 8 నెలల గరిష్టాన్ని నమోదుచేసింది.
ఎం అండ్ ఎం మొత్తం ఆదాయం ఇతర ఆదాయంతో సహా 5 శాతం పెరిగి రూ .12,889 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో వార్షిక లాభం రూ .4050 కోట్లకు చేరింది. గత ఏడాది క్వార్టర్‌లో ఇది రూ.3,554 లుగా ఉంది. ఏకీకృత ఆదాయం 10.6 శాతం పెరిగి రూ .88,983 కోట్లకు చేరింది. దాదాపు 130,778 వాహనాలను విక్రయించింది. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది ఫ్లాట్ దేశీయ మార్కెట్లో అమ్మకాలు 13.3 శాతం పెరిగి 46,583 యూనిట్లకు చేరాయి. ట్రాక్టర్ ఎగుమతులు 10, 831 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే సుప్రీంకోర్టు (2017 ఏప్రిల్ 1 నుంచి) ద్వారా బీఎస్-3 వాహనాల విక్రయాలపై ఆంక్షలు విధించటంతో ఈ కంపెనీ ఒక్కసారిగా రూ. 171 కోట్ల నష్టపోయిన సంగతి తెలిసిందే. సెడాన్, యుటిలిటీ వాహన విభాగంలో 30 శాతం మార్కెట్ వాటాలో తాము సంతోషంగా లేమనీ, తీవ్రమైన పోటీతో మార్కెట్ వాటాను కోల్పోయామ ని మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత మెరుగైన పనితీరును నమోదు చేసే అవకాశం ఉందన్నారు.
మరోవైపు ఎంఅండ్‌ఎం షేరులో ట్రేడ్ పండితులు బై కాల్ ఇస్తున్నారు. బ్రోకింగ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ తాజాగా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపుతున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు.
దూసుకుపోయిన ఎం అండ్ ఎం
Published Wed, May 31 2017 12:21 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
Advertisement
Advertisement