కోల్‌కతా: నాలుగో త్రైమాసికంలో బంధన్ బ్యాంక్ నికర లాభం రూ. 55 కోట్లకు పరిమితమైంది. క్రితం క్యూ4లో ఇది రూ. 808 కోట్లు. తాజాగా రైటాఫ్‌లు, మొండిబాకీలకు అధిక కేటాయింపులు జరపాల్సి రావడం వంటి అంశాలు లాభాలు తగ్గడానికి కారణం.
జనవరి–మార్చి త్రైమాసికంలో ప్రొవిజనింగ్ రూ. 735 కోట్ల నుంచి రూ. 1,774 కోట్లకు పెరిగిందని బ్యాంక్ ఎండీ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. అలాగే రూ. 3,852 కోట్లు రైటాఫ్ చేయాల్సి వచ్చిందని వివరించారు. క్యూ4లో నికర వడ్డీ మార్జిన్ 7.6 శాతంగా ఉంది.
స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 4.9 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు 1.1 శాతంగా ఉన్నాయి. జూలైలో ఎండీ, సీఈవో పదవి నుంచి రిటైర్ కానున్న ఘోష్.. రిటైర్మెంట్ తర్వాత హోల్డింగ్ కంపెనీ బంధన్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌లో వ్యూహాత్మక బాధ్యతలు పోషించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment