న్యూఢిల్లీ: టూవీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ కంపెనీకి గత ఆర్థిక సంవత్సరం (2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.621 కోట్ల నికర లాభం(స్డాండ్‌అలోన్) సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్‌లో రూ.730 కోట్ల నికర లాభం ఆర్జించామని, 15 శాతం క్షీణించిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.7,885 కోట్ల నుంచి 21 శాతం పతనమై రూ.6,235 కోట్లకు తగ్గిందని పేర్కొంది. అమ్మకాలు తక్కువగా ఉండటం వల్ల నికర లాభం, ఆదాయాలు తగ్గాయని వెల్లడించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.25 తుది డివిడెండ్‌ను ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. వాహన అమ్మకాలు 25 శాతం తగ్గాయని కంపెనీ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 17.81 లక్షలుగా ఉన్న వాహన విక్రయాలు గత క్యూ4లో 13.35 లక్షలకు తగ్గాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో హీరో మోటో షేరు స్పల్ప లాభంతో రూ.2,386 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment