న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 188 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 360 కోట్ల నష్టం నమోదైంది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1,212 కోట్ల నుంచి రూ. 2,056 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,702 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ. 2,431 కోట్లను తాకాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 1,226 కోట్ల నుంచి తగ్గి రూ. 971 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 7,079 కోట్లకు జంప్‌చేసింది.
2021–22లో రూ. 4,192 కోట్ల ఆదాయం నమోదైంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈవోగా రాకేష్ రంజన్, సీవోవోగా రిన్షుల్ చంద్రను ఎంపిక చేసినట్లు జొమాటో పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్ సీఈవోగా రిషి అరోరాను నియమించినట్లు తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment