profits and loss
-
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్‌లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
లాభాలు ఒకరోజుకే పరిమితం
ముంబై: దేశీయ స్టాక్ సూచీల లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. బలహీన జాతీయ అంతర్జాతీయ సంకేతాలతో బుధవారం సెన్సెక్స్, నిఫ్టీలు ఒకశాతం మేర నష్టపోయాయి. మార్జిన్ల క్షీణత ఆందోళనలతో బ్యాంకింగ్, ఫైనాన్స్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు నెలకొన్నాయి. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ద్వయం, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 3–1% క్షీణించి సూచీల పతనాన్ని శాసించాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాల భయాలు, పశి్చమాసియా దేశాల్లోని యుద్ధ పరిస్థితుల పరిణామాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 551 పాయింట్లు నష్టపోయి 66 వేల స్థాయి దిగువన 65,877 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు నష్టపోయి 19,671 వద్ద నిలిచింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. ఫార్మా, ఆటో షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 586 పాయింట్లు క్షీణించి 65,842 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 19,660 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.85%, 0.32% చొప్పున నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,832 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,470 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు అరశాతం నుంచి ఒకశాతం నష్టపోయాయి. కాగా అమెరికా మార్కెట్లు అరశాతానికి పైగా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘బలహీన అంతర్జాతీయ సంకేతాలు, పశ్చిమాసియా దేశాల్లోని అనిశ్చిత పరిణామాలు దేశీయ మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయి. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఉద్రికత్తలు మరింత ఎక్కువయ్యాయి. ఫెడ్ చైర్మన్ ప్రసంగానికి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. దేశీయ ఐటీ, ఫైనాన్స్ రంగ కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించకపోవడం ఇన్వెస్టర్లను మరింత నిరాశపరిచింది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జెసానీ తెలిపారు. ► సెప్టెంబర్ క్వార్టర్లో నికరలాభం 28% క్షీణించడంతో బీఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్ షేరు 3% నష్టపోయి రూ.7,871 వద్ద స్థిరపడింది. ఫలితంగా కంపెనీ ఒక్కరోజులో రూ.13,345 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ► యాజమాన్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఆదాయ వృద్ధి అంచనాలు తగ్గించడంతో ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్ షేరు 6% క్షీణించి రూ.4,354 వద్ద స్థిరపడింది. ► జెన్సార్ టెక్నాలజీ క్యూ2 ఆర్థిక ఫలితాలు నిరాశపరడంతో కంపెనీ 6% నష్టపోయి రూ. 517 వద్ద స్థిరపడింది. ► సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లకు గానూ టాటా మోటార్స్ 2%, సన్ ఫార్మా 1.50%, మారుతీ 0.50% షేర్లు మాత్రమే లాభపడ్డాయి. సూచీ ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లకు ఒక్కరోజులో రూ.2.42 లక్షల కోట్ల నష్టంవాటిల్లింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.321.40 లక్షల కోట్లకు దిగివచి్చంది. -
గత ఏడాదితో పోలిస్తే.. జొమాటోకు భారీగా తగ్గిన నష్టాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర నష్టం దాదాపు సగానికి తగ్గి రూ. 188 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 360 కోట్ల నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 1,212 కోట్ల నుంచి రూ. 2,056 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 1,702 కోట్ల నుంచి భారీగా పెరిగి రూ. 2,431 కోట్లను తాకాయి. ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 1,226 కోట్ల నుంచి తగ్గి రూ. 971 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం రూ. 7,079 కోట్లకు జంప్‌చేసింది. 2021–22లో రూ. 4,192 కోట్ల ఆదాయం నమోదైంది. ఫుడ్ డెలివరీ బిజినెస్ సీఈవోగా రాకేష్ రంజన్, సీవోవోగా రిన్షుల్ చంద్రను ఎంపిక చేసినట్లు జొమాటో పేర్కొంది. జొమాటో హైపర్‌ప్యూర్ సీఈవోగా రిషి అరోరాను నియమించినట్లు తెలియజేసింది. -
పోంజీ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త!
పోంజీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పెట్టుబడి దారుల్ని హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం రాబడి అందిస్తామని నమ్మించే ఇలాంటి యాప్స్ నుంచి పెట్టుబడి దారుల్ని సురక్షితంగా ఉంచేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్బీఐతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తుమకూరు (కర్ణాటక)లో జరిగిన థింకర్స్ ఫోరమ్‌లో ఆమె మాట్లాడుతూ.. కొద్ది మొత్తంలో పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో రాబడులు అందిస్తామని హామీల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. డబ్బు ఆశ చూపిస్తూ అది చేస్తాం. ఇది చేస్తామని ప్రజలకు చేరువయ్యేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసే పోంజీ యాప్స్ ఉన్నాయని, వాటిని నియంత్రించాలని అన్నారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు అనధికారిక యాప్స్ నుంచి ప్రజల్ని కాపాడాలని కోరారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లను నియంత్రిస్తున్నారా? అని ప్రశ్నించినప్పుడు..ప్రస్తుతం వారిని నియంత్రించేలా ఎలాంటి ప్రతిపాదనలు లేవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు. అయితే సోషల్ మీడియాలో అలాంటివారిని అనుసరిస్తూ.. వారి సూచనలు పాటించడం వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని , ప్రజలు దీనిపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
తెలంగాణ ఆర్టీసీ ఆశలు ఆవిరి.. పెంచుకుందామంటే పడిపోయింది
ఆక్యుపెన్సీ రేటును భారీగా పెంచుకుని పెద్ద మొత్తంలో అదనపు ఆదాయం ఆర్జించాలన్న ఆర్టీసీ యత్నం ఆదిలోనే బెడిసి కొట్టింది. అదనపు ఆదాయం దేవుడెరుగు సగటున రోజుకు రావాల్సిన ఆదాయానికే గండి పడుతోంది. గతేడాది ఆర్టీసీ నిర్వహించిన 100 రోజుల ప్రణాళిక సూపర్ సక్సెస్ కావడంతో రూ.178 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. ఈ ఏడాది మార్చి చివరి నుంచి అదనపు బస్సులతో అదే తరహాలో రూ. 200 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా 100 రోజుల ప్రణాళిక ప్రారంభించినా.. ఈసారి మాత్రం సగటున రోజుకి వచ్చే ఆదాయం కూడా పడిపోయింది. గతేడాది ఇదే ఎండా కాలంలో చేపట్టిన కార్యక్రమం మంచి ఫలితాన్నిస్తే, ఈసారి అదే వేసవి చుక్కలు చూపిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ రోజువారీ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది. గత నెల సగటున రోజుకి రూ.14 కోట్లకుపైగా ఆదాయం నమోదవుతూ రాగా, ఏప్రిల్ ఒకటి నుంచి అది రూ.11.5 కోట్లకు పడిపోయింది. మార్చి చివరి వరకు ఆక్యుపెన్సీ రేషియో సగటున 68 శాతం వరకు ఉంటే అది ఇప్పుడు 58 శాతం వద్ద దోబూచులాడుతోంది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ గాడిలో పడుతున్న తరుణంలో, ఈ వేసవిలో వంద రోజుల ప్రణాళిక పేరుతో.. స్పేర్‌లో ఉన్నవి సహా అన్ని బస్సులనూ రోడ్డెక్కించి అదనపు కిలోమీటర్లు తిప్పటం ద్వారా మరింత ఆదాయం పొందేందుకు చేసిన ప్రయత్నం ఈ నెలలో విఫలమైందనే చెప్పాలి. కనీసం రోజువారీ రూ.16 కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంటే రూ.12 కోట్లు పొందటం కూడా గగనమైంది. దీంతో ఈ నెలలో నష్టాలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాభాల నుంచి నష్టాల బాటలోకి ఇటీవలి కాలంలో వంద రోజుల ప్రణాళిక, ప్రాఫిట్ ఛాలెంజ్ లాంటి కార్యక్రమాలతో చాలా డిపోలు లాభాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 35 డిపోలు లాభాలు తెస్తుండగా, మరో 20 డిపోలు అతి తక్కువ నష్టాల జాబితాలో ఉన్నాయి. అలాంటిది ప్రస్తుతం రోజుకు రెండుమూడు డిపోలు మాత్రమే లాభాల్లో ఉంటున్నాయి. ఉదాహరణకు ఈ నెల 15వ తేదీని పరిశీలిస్తే.. 94 డిపోలు నష్టాలను చవిచూశాయి. హైదరాబాద్–1 డిపో రూ.2.27 లక్షలు, పికెట్ డిపో 80 వేల లాభాన్ని తెచ్చి పెట్టగా నార్కెట్‌పల్లి డిపో నోప్రాఫిట్/నో లాస్‌గా నిలిచింది(ఏప్రిల్ నెలకు సంబంధించి మిగతా రోజుల్లో నష్టాల్లో ఉంది). మిగతా డిపోలన్నీ నష్టాలు మూటగట్టుకున్నాయి. గతేడాది చివరలో డీజిల్ సెస్‌ను ఆర్టీసీ భారీగా పెంచటం ద్వారా టికెట్ చార్జీలు పెరిగిన విషయం తెలిసిందే. దీంతో భారీ ఆదాయం నమోదవుతోంది. గతేడాది వేసవిలో ఆ చార్జీలు తక్కువే ఉన్నాయి. అయినా గత ఏప్రిల్‌లో ప్రస్తుతం నమోదవుతున్న ఆదాయం కంటే ఎక్కువ ఆదాయం రావటం విశేషం. ఆక్యుపెన్సీ రేషియో అప్పుడే మెరుగ్గా నమోదైంది. శూన్య మాసం వల్లనేనా ప్రస్తుతం శుభముహూర్తాలు లేని శూన్యమాసం నడుస్తోంది. దీంతో శుభకార్యాలు లేక ప్రయాణాలు కూడా బాగా తగ్గాయి. సాధారణంగా ఎండ తీవ్రత పెరిగాక ప్రయాణాలు చేసే వారి సంఖ్య తగ్గుతుంది. కానీ శుభకార్యాలుంటే బస్సులు కిక్కిరిసి ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువగా నమోదవుతుంది. గతేడాది ఏప్రిల్‌లో ఎండలు ఎక్కువే ఉన్నా, శుభకార్యాల వల్ల ఆక్యుపెన్సీ రేషియో మెరుగ్గా నమోదైంది. ఈ నెలాఖరు వరకు శూన్యమాసమే ఉండనున్నందున ఈ నెల అంతా ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది. పరీక్షలు కూడా కారణమే విద్యార్థులకు ఇంకా వేసవి సెలవులు ప్రారంభం కాలేదు. పరీక్షలు కొనసాగుతున్నందున ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా తక్కువగా నమోదవుతోంది. ఈనెలాఖరుకుగాని వేసవి సెలవులు ప్రారంభమయ్యే వీలులేనందున అప్పటి వరకు ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రంజాన్ ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలు తక్కువగా ప్రయాణిస్తారు. ఆ ప్రభావం కూడా ఇప్పుడు ఆర్టీసీపై పడింది. అన్ని బస్సులూ తిప్పడంతో డీజిల్ భారం వంద రోజుల ప్రణాళిక పేరుతో ప్రస్తుతం అన్ని బస్సులనూ తిప్పుతున్నందున డీజిల్ వినియోగం భారీగా పెరిగింది. ఆక్యుపెన్సీ రేషియో తక్కువగా ఉన్నందున, ఆదాయం కంటే డీజిల్ ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితులుండటంతో బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో సర్వీసుకు–సర్వీసుకు మధ్య విరామం పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
భారత్ ఫోర్జ్ లాభంలో క్షీణత
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–2) రెండో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం జులై–సెప్టెంబర్(క్యూ2)లో 48 శాతం క్షీణించి రూ.141 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 270 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 2,386 కోట్ల నుంచి రూ. 3,076 కోట్లకు ఎగసింది. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 1.50 చొప్పున మధ్యంతర డివిడెండును ప్రకటించింది. అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ విక్రయాలు మందగించడంతో యూరోపియన్ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడినట్లు భారత్ ఫోర్జ్ పేర్కొంది. ఉత్తర అమెరికాలో ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్లాంటులో ఉత్పత్తిని దశలవారీగా హెచ్చిస్తున్నట్లు తెలియజేసింది. ప్రస్తుతం నిర్వహణా లాభస్థాయికి దిగువనే వినియోగమున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో అల్యూమినియం ఫోర్జింగ్ బిజినెస్ టర్న్అరౌండ్ సాధించే వీలున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ బీఎన్ కళ్యాణి అభిప్రాయపడ్డారు. ఫలితాల నేపథ్యంలో భారత్ ఫోర్జ్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం క్షీణించి రూ. 853 వద్ద ముగిసింది. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
ఆదాయం పుంజుకున్నా.. స్పైస్‌జెట్ నష్టాలు పెరిగాయ్!
న్యూఢిల్లీ:ప్రయివేట్ రంగ విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 838 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఫారెక్స్ నష్టాలను మినహాయిస్తే రూ. 578 కోట్ల నష్టం నమోదైంది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి పతనం ప్రభావం చూపాయి. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 562 కోట్ల నష్టాలు ప్రకటించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,539 కోట్ల నుంచి 2,105 కోట్లకు పుంజుకుంది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 2,100 కోట్ల నుంచి రూ. 2,943 కోట్లకు ఎగశాయి. ఇదే కాలంలో కార్గో అనుబంధ సంస్థ స్పైస్‌ఎక్స్‌ప్రెస్ రూ. 206 కోట్ల ఆదాయం, రూ. 21 కోట్ల నికర లాభం ఆర్జించడం గమనార్హం! ఫలితాల నేపథ్యంలో స్పైస్‌జెట్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం నీరసించి రూ. 39 వద్ద ముగిసింది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
అదానీ పవర్ లాభాలు అదిరెన్
న్యూఢిల్లీ: అదానీ పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.231 కోట్లతో పోలిస్తే రెట్టింపునకు పైగా పెరిగి రూ.696 కోట్లకు చేరింది. ఆదాయం సైతం 52 శాతం వృద్ధితో రూ.8,446 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి ఆదాయం రూ.5,572 కోట్లుగా ఉండడం గమనార్హం. ఆలస్యపు రుసం సర్‌చార్జీ రూపంలో రూ.912 కోట్ల మొత్తం ఆదాయానికి వచ్చి కలసినట్టు అదానీ పవర్ తెలిపింది. అలాగే, దిగుమతి చేసుకున్న బొగ్గు ధరలు అధికంగా ఉండడం, డిమాండ్ పెరగడం వల్ల దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏలు) టారిఫ్‌లు మెరుగుపడడం సానుకూలించినట్టు పేర్కొంది. సంప్రదాయ ఇంధన ఆధారిత విద్యుత్ ఇప్పటికీ దేశ స్థిరమైన విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు అదానీ పవర్ పేర్కొంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న దేశ ప్రతిష్టాత్మక లక్ష్యాలకు అనుగుణంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై మరిన్ని పెట్టుబడులకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 39.2 శాతంగా, విద్యుత్ విక్రయాలు 11 బిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. -
టాటా మోటార్స్ నష్టాలు, షేర్లు ఢమాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా, దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ పేర్కొన్నారు. ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్‌యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్‌యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్‌యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్‌పీసీఎల్‌కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
ఫ్లిప్‌కార్ట్‌కు భారీ నష్టాలు, రూ.7800 కోట్లకు పైమాటే!
సాక్షి,ముంబై: ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఈ క్వార్టర్లో భారీగా నష్టపోయింది. అయితే ఈ పండుగ సీజన్లో భారతదేశంలో మొత్తం విక్రయాలలో అగ్రగామిగా ఉన్న కారణంగా ఆదాయం బాగా పుంజుకుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. క్యూ2లో ఫ్లిప్‌కార్ట్ నికర ఆదాయం దాదాపు 20 శాతం పెరిగింది. ఆదాయం పుంజుకుని రూ. 61,836 కోట్లుగా ఉంది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?) ఫ్లిప్‌కార్ట్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాని బిజినెస్-టు-బిజినెస్ యూనిట్ ఫ్లిప్‌కార్ట్ ఇండియా, బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్ యూనిట్ మొత్తం నష్టాలు రూ.7,800 కోట్లకు చేరాయి. ఇందులో మింత్రా, ఇన్‌స్టాకార్ట్ మొదలైన ఫిప్కార్ట్ గ్రూప్ సంస్థల ఫలితాలు కూడా ఉన్నాయి. కాగా రెండు సంస్థల ఉమ్మడి నష్టం గత ఏడాది(2020-21) రూ. 5,352 కోట్లుగా ఉంది. 2020-21లో ఫ్లిప్‌కార్ట్ ఆదాయం రూ. రూ. 51,465 కోట్లు. ఫ్లిప్‌కార్ట్ ఇండియా రూ. 43,349 కోట్లు, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సహకారంతో రూ. 8,116 కోట్లుగా ఉంది. సెప్టెంబరు చివరి వారంలో జరిగిన ఫస్ట్ వీక్ పండుగ సీజన్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్ 62 శాతం లేదా 24,800 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. మొత్తం అమ్మకాల విలువ రూ. 40,000 కోట్లుగా ఉంది. ఇదీ చదవండి: నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే? -
క్యూ2లో మదర్సన్ సుమీ వైరింగ్ లాభాలు ఓకే
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో విడిభాగాల కంపెనీ మదర్సన్ సుమీ వైరింగ్ ఇండియా ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. జులై-సెప్టెంబర్ (క్యూ2)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం పుంజుకుని రూ. 116 కోట్లను అధిగమించింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 114 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,835 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,690 కోట్లకు పెరిగాయి. దేశీ ఆటోమోటివ్ పరిశ్రమ తిరిగి జోరందుకున్నట్లు కంపెనీ చైర్మన్ వివేక్ చాంద్ సెహగల్ పేర్కొన్నారు. దీంతో తమ కస్టమర్లు ఉత్పత్తిని పెంచుతున్నట్లు తెలియజేశారు. ఇది వ్యయాలను (వన్‌టైమ్) పెంచినప్పటికీ రానున్న త్రైమాసికాలలో సర్దుబాటు కాగలవని తెలిపారు.అయితే ఈ ఫలితాలు నేపథ్యంలో సోమవారం 6 శాతం నష్టాలనుంచి కోలుకుని మంగళవారం 2 శాతం లాభాలతో కొనసాగుతోంది. -
అయ్యో!.. ఐకియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
మెప్పించిన టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్
న్యూఢిల్లీ: టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (టీసీపీఎల్) సెప్టెంబర్ క్వార్టర్లో పనితీరు పరంగా మెప్పించింది. నికర లాభం 36 శాతం పెరిగి రూ.389 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం ఎగసి రూ.3,363 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి నికర లాభం రూ.286 కోట్లు, ఆదాయం రూ.3,033 కోట్ల చొప్పున ఉన్నాయి. వ్యయాలు 12 శాతం వరకు పెరిగి రూ.3,022 కోట్లకు చేరాయి. భారత్‌లో వ్యాపారం బలమైన పనితీరు చూపించినట్టు టీసీపీఎల్ గ్రూపు సీఎఫ్‌వో ఎల్ కృష్ణకుమార్ తెలిపారు. ముఖ్యంగా ఆహారోత్పత్తుల వ్యాపారం గొప్ప పనితీరు చూపించిందన్నారు. భారత మార్కెట్ నుంచి ఆదాయం 9 శాతం పెరిగి రూ.2,160 కోట్లుగా ఉంది. ఫుడ్స్ బిజినెస్ ఆదాయం 29 శాతం వృద్ధిని చూసింది. టాటా సంపన్న్, నీటి వ్యాపారం ఆదాయం డబుల్ డిజిట్ స్థాయిలో పెరిగింది. ప్యాకేజ్డ్ పానీయాల వ్యాపారం 7 శాతం క్షీణించింది. టాటా స్టార్ బక్స్ ఆదాయం 57 శాతం పెరిగింది. ఉప్పు వ్యాపారంలో మార్కెట్ వాటాను పెంచుకున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సునీల్ డిసౌజ తెలిపారు. చదవండి: ‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు -
నష్టాల్లోకి నెట్వర్క్18 మీడియా
న్యూఢిల్లీ: రెండో త్రైమాసికంలో ఎంటర్టైన్మెంట్ రంగ కంపెనీ నెట్వర్క్18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లాభాలను వీడి నష్టాలలోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో దాదాపు రూ. 29 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 199 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 12 శాతం బలపడి రూ. 1,549 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 1,387 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు సైతం 34 శాతం ఎగసి రూ. 1,592 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో నెట్వర్క్18 మీడియా షేరు బీఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 70 వద్ద ముగిసింది. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! -
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్: వారం/నెలవారీ సిప్ ఏది బెటర్?
ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్న ఓ మ్యూచువల్ ఫండ్ పథకం స్టార్ రేటింగ్ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 స్టార్ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్ విత్ డ్రాయల్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా? – రాజ్‌దీప్ సింగ్ ముందుగా ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. అందుకుని ముందు మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఎందుకు వైదొలుగుతున్నదీ సూక్ష్మంగా విశ్లేషించుకోవాలన్నది నా సూచన. ఆ తర్వాతే ఒకే విడతగానా లేదంటే ఎస్‌డబ్ల్యూపీ రూపంలోనా అన్న అంశానికి రావాలి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని సిస్టమ్యాటిక్‌గా వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్ లోడ్ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా అవుతుంది. సిప్ రూపంలోఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం/నెలవారీ సిప్‌లలో ఏది బెటర్? – అమర్ సహాని వీక్లీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. దీనివల్ల నెలలో నాలుగు సార్లు పెట్టుబడులు పెట్టుకున్నట్టు అవుతుంది. దీని కారణంగా మీ ఖాతాలో లావాదేవీల సంఖ్య చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందికరమే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే ఇన్వెస్టర్లకు సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
అంచనాలకు మించి.. భారీ లాభాల్లో ప్రభుత్వ రంగ సంస్థ!
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజం కోల్ ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం రెండు రెట్లుపైగా ఎగసి రూ. 8,834 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 39 శాతం ఎగసి రూ. 32,498 కోట్లకు చేరింది. గత క్యూ1లో రూ. 23,293 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. ఇక మొత్తం వ్యయాలు రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,985 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో బొగ్గు ఉత్పత్తి 124 మిలియన్ టన్నుల నుంచి దాదాపు 160 ఎంటీకి పెరిగింది. దేశీ బొగ్గు ఉత్పత్తిలో కంపెనీ 80 శాతం వాటాను ఆక్రమిస్తున్న విషయం విదితమే. థర్మల్ విద్యుత్ రంగం నుంచి భారీ డిమాండ్ నెలకొనడంతో 15.4 కోట్ల టన్నుల బొగ్గును విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. మొత్తం 17.75 ఎంటీ బొగ్గును విక్రయించినట్లు తెలియజేసింది. ఇంధన సరఫరా కాంట్రాక్టుల(ఎఫ్ఎస్ఏ) మార్గంలో టన్నుకి రూ. 1,442 చొప్పున ధర లభించినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది(2023–24)కల్లా బిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది 70 కోట్ల టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కోల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో 2% వృద్ధితో రూ. 220 వద్ద ముగిసింది. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
అరబిందో ఫార్మా లాభం రూ. 576 కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 576 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ. 801 కోట్లతో పోలిస్తే లాభం సుమారు 28 శాతం తగ్గింది. మరోవైపు, మొత్తం ఆదాయం రూ. 6,001 కోట్ల నుంచి రూ. 5,809 కోట్లకు పరిమితమైంది. వ్యయాలు రూ. 5,011 కోట్ల నుంచి రూ. 5,098 కోట్లకు పెరిగాయి. పరిశ్రమ పలు సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ నాలుగో త్రైమాసికంలో తాము మెరుగైన పనితీరే కనపర్చగలిగామని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కే. నిత్యానంద రెడ్డి తెలిపారు. సంక్లిష్టమైన జనరిక్స్ విభాగంలో అమ్మకాలు మరింతగా పుంజుకుంటున్నాయని, బయోసిమిలర్స్ వంటి ఉత్పత్తుల అభివృద్ధిలో పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 ముఖ విలువ గల షేరు ఒక్కింటిపై రూ. 4.50 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ ప్రతిపాదించింది. -
మార్కెట్ అక్కడక్కడే...
కొనుగోళ్లకు పురికొల్పే తాజా ట్రిగ్గర్లు ఏమీ లేనందున శుక్రవారం స్టాక్ మార్కెట్ అక్కడక్కడే ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగానే ఉండటంతో స్టాక్ సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. భారత్–చైనాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నివారణకు ఐదు సూత్రాల ఒప్పందం కుదరడం ఒకింత సానుకూల ప్రభావం చూపించింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి 73.53కు చేరింది. సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 38,855 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 11,464 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్‌లో 497 పాయింట్లు, నిఫ్టీ 131 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఆరు గంటలు పరిమిత శ్రేణిలోనే... ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నా మన మార్కెట్ లాభాల్లోనే మొదలైంది. ఆ తర్వాత వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. దాదాపు ఆరుగంటల పాటు సూచీలు చాలా పరిమిత శ్రేణిలో లాభ,నష్టాల మధ్య కదలాడాయి. చివరి అరగంటలోనే నిలకడగా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 128 పాయింట్లు పతనం కాగా, మరో దశలో 139 పాయింట్లు పెరిగింది. మొత్తం మీద రోజంతా 267 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టీసీఎస్, హిందుస్తాన్ యూనిలివర్, ఇన్ఫోసిస్ లాభాలను హెచ్డీఎఫ్సీ జోడీ, భారతీ ఎయిర్టెల్, ఏషియన్ పెయింట్స్ హరించి వేశాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ► ఎస్బీఐ 2.3% లాభంతో రూ.203 వద్ద ముగి సింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో ఐటీ షేర్లు లాభపడ్డాయి. ► దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఎస్బిఐ కార్డ్స్, లారస్ ల్యాబ్స్, ఇమామి, జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, విప్రోలు ఈ జాబితాలో ఉన్నాయి. ► దాదాపు 250కు పైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. ఫ్యూచర్ రిటైల్, యస్‌బ్యాంక్, డిష్ టీవీ తదితర షేర్లు జాబితాలో ఉన్నాయి. -
గణాంకాల నష్టాలు..!
రెండు రోజుల వరుస స్టాక్ మార్కెట్ లాభాలకు గురువారం బ్రేక్‌పడింది. నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో రోజంతా లాభ, నష్టాల మధ్య దోబూచులాడిన స్టాక్ సూచీలు చివరకు నష్టపోయాయి. సేవల రంగం గణాంకాలు వరుసగా ఆరోనెలా నేలచూపులు చూడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా సాగాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 44 పైసలు క్షీణించి 73.47కు చేరడం, ప్రతికూల ప్రభావం చూపించింది. సెన్సెక్స్ 95 పాయింట్లు పతనమై 38,990 వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 11,527 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆరోనెలా అథఃపాతాళమే! లాక్డౌన్ తొలగిన తర్వాత ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నప్పటికీ, దేశీయ సేవల రంగం ఆగస్టులో వరుసగా ఆరో నెలా క్షీణించింది. జూలైలో 34.2గా ఉన్న ఐహెచ్ఎస్ మార్కిట్ సర్వీసెస్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎమ్ఐ) ఆగష్టులో 41.8కు పెరిగింది. సేవల రంగం క్షీణత ఆగస్టులో తగ్గినప్పటికీ, పతన బాటలోనే (50 కంటే తక్కువగా ఉంటే క్షీణతగానే భావిస్తారు) ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఇక ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ► నేడు(శుక్రవారం) జరిగే బోర్డ్ మీటింగ్‌లో నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తల కారణంగా వొడాఫోన్ ఐడియా షేర్ 27 శాతం మేర లాభపడి రూ.12.56 వద్ద ముగిసింది. అమెజాన్, వెరిజాన్ సంస్థలు కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయనున్నాయన్న వార్తలు సానుకూల ప్రభావం చూపించాయి. ► టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.592ను తాకిన ఈ షేర్ చివరకు 5 శాతం లాభంతో రూ.578 వద్ద ముగిసింది. ఈ షేర్‌తో పాటు ఎస్కార్ట్స్, ఎస్బీఐ కార్డ్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్,అదానీ గ్యాస్ తదితర షేర్లు కూడా ఆల్‌టైమ్ హైలను తాకాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 2% నష్టంతో రూ.383 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయింది ఇదే. ► దాదాపు వంద షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి. జుబిలంట్ ఫుడ్‌వర్క్స్, అదానీ గ్యాస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► 280కుపైగా షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. అర్వింద్ ఫ్యాషన్స్, డిష్ టీవీ వీటిలో ఉన్నాయి. భారీ నష్టాల్లో అమెరికా మార్కెట్ అమెరికా స్టాక్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఆల్‌టైమ్ హైలను తాకిన నేపథ్యంలో ఇటీవల బాగా లాభపడిన టెక్నాలజీ షేర్లలో లాభాల స్వీకరణ జరుగుతోందని. ఈ స్థాయి నష్టాలకు ఇదొక కారణమని విశ్లేషకులంటున్నారు. ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ తదితర టెక్నాలజీ షేర్లన్నీ 5% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి 11.30కు డోజోన్స్, నాస్డాక్, ఎస్అండ్పీ 500 సూచీలు 4–5% నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మన నిఫ్టీకి ప్రతీక అయిన ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 150 పాయింట్ల నష్టాల్లో ట్రేడవుతోం ది. ఈ ప్రభావంతో నేడు మన మార్కెట్ భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలవుతుందని అంచనా. -
అద్దె ఇల్లా.. సొంతిల్లా..?
సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం నేటి రోజుల్లో సులభ సాధ్యంగానే మారింది. వేతన జీవులు రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసుకునేందుకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు అవకాశం కల్పిస్తున్నాయి. వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంది. అయితే, కొందరు రుణం అంటే భయంతో వెనుకంజ వేస్తుంటారు. దీనికి బదులు అద్దె ఇంట్లోనే ఉందామనుకుంటుంటారు. కొందరు అయితే అద్దె ఇంటికి చెల్లించేదేదో రుణ ఈఎంఐగా చెల్లిస్తే కొన్నాళ్లకు ఓ ఇల్లు మనదైపోతుందన్న అంచనాతో ధైర్యం చేసి ముందడుగు వేస్తుంటారు. ఇంకొందరు అయితే ఏది లాభం? అనే సంశయంతో ఉండొచ్చు. కానీ, ఈ విషయంలో నిపుణుల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. క్యాపిటల్ కోషెంట్ సీఈవో సౌస్తవ్ చక్రవర్తి అభిప్రాయ కోణం ఇలా ఉంది.. ఓ 20 ఏళ్ల పాటు అద్దె ఇంట్లో ఉంటూ, సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నిధిని సమకూర్చుకుని ఇంటిని కొనుగోలు చేసుకోవచ్చు. లేదా రుణంపై ప్రాపర్టీని కొనుగోలు చేసి 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. మన దేశంలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. వారి ముఖ్యమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒకటి. ఇల్లు సమకూర్చుకుని అందులో నివసించే విషయంలో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉంటాయి. అద్దె ఇంట్లో ఉండడం ప్రతికూల ఆప్షన్ ఏమీ కాదు. అయితే, ఈ రెండు ఆప్షన్లలో ఉండే ప్రయోజనాలు, ప్రతికూలతలను చూద్దాం. ఇంటిని కొనుగోలు చేయడం.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న ధోరణులను పరిశీలిస్తే.. ప్రాపర్టీ ధరలు ఏటా 8 శాతం చొప్పున వచ్చే 20 ఏళ్ల పాటు పెరుగుతాయని అంచనా వేయవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 20 ఏళ్ల కాలానికి గృహ రుణాలపై 8.5 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఓ ఇంటి ఖరీదు రూ.90 లక్షలని అనుకుంటే.. 20 ఏళ్ల తర్వాత ఇదే ప్రాపర్టీ 8 శాతం ఏటా పెరుగుదల అంచనాల ఆధారంగా రూ.4.19 కోట్లు అవుతుంది. అదే ఇప్పుడు రుణం తీసుకుని 20 ఏళ్ల పాటు ప్రతీ నెలా రూ.78,104 చొప్పున చెల్లిస్తూ వెళితే కట్టే మొత్తం రూ.1.87 కోట్లు మాత్రమే. లాభ, నష్టాలు అద్దె ఇంటితో పోలిస్తే సొంత ఇంట్లో ఉండే అనుభవం వేరు. దీన్ని కాదనడం లేదు. కానీ, ఆర్థిక కోణంలో నుంచి చూసేట్టు అయితే ఎన్నో అంశాలపై దృష్టి సారించాలి. రుణం తీసుకుని అద్దె చెల్లించడం వల్ల అతిపెద్ద అనుకూలత.. రుణానికి చేసే అసలు, వడ్డీ చెల్లింపులపై ఆదాయపన్ను మినహాయింపులు ఉండడం. ప్రతికూలత.. వేరే ప్రాంతానికి వెళ్లాలనుకుంటే విక్రయించడంలో ఉండే ఇబ్బంది. ఒకరు ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండిపోతారన్న నమ్మకం తక్కువే. ఇంటి కోసం ఒకే ప్రాంతంలో ఉండి కెరీర్లో ఉన్నత అవకాశాలను నష్టపోలేరు కదా. అద్దె ఇంట్లో ఉండడం... అద్దె ఇంట్లో ఉండే వారు, వేతనంలో మిగిలే మొత్తాన్ని ప్రతీ నెలా లేదా మూడు నెలలకోసారి క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) రూపంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎంచుకున్న కాలానికి అనుగుణంగా క్రమం తప్పకుండా పెట్టుబడి మొత్తం బ్యాంకు నుంచి సంబంధిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి వెళుతుంది. ఎన్ఏవీ ధర ఆధారంగా ఫండ్స్ యూనిట్ల కేటాయింపులు చేస్తారు. ప్రతీ నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని ఇలా ఇన్వెస్ట్ చేస్తుండడం వల్ల మార్కెట్లు పెరుగుదల, పతనాల్లోనూ కొనుగోలుతో సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇప్పుడు పై ఉదాహరణలో ఇంటి రుణంపై ఈఎంఐగా రూ.78,104 చెల్లించాలని చెప్పుకున్నాం కదా.. ఇందులో అద్దె ఇంటికి ప్రతినెలా చెల్లించాల్సిన రూ.25,000ను మినహాయించగా, సిప్ కోసం రూ.53,104 అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రతినెలా సిప్ రూపంలో 20 ఏళ్ల పాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. 12% రాబడి అంచనాతో రూ.5,30,58,751 సమకూరుతుంది. లాభ, నష్టాలు: అద్దె ఇంట్లో ఉండే వారు తమ కెరీర్ అవసరాలకు అనుగుణంగా ఎప్పుడైనా మరో చోటకు (అదే పట్టణంలో మరో చోటుకు లేదా వేరే ప్రాంతానికి) మారిపోయే వెసులుబాటుతో ఉంటారు. ఇంటిని విక్రయించాలన్న ఇబ్బంది ఉండనే ఉండదు. పైగా అద్దె ఇంట్లో ఉండే వారికి హెచ్ఆర్ఏ పేరుతో పన్ను మినహాయింపు ఉండనే ఉంది. వేతనం లేని వారికి కూడా కొంత మేర పన్ను మినహాయింపు లభిస్తుంది. కాకపోతే అద్దె ఇంట్లో ఉండడం వల్ల మీరు ఒక ఇంటి వారు కాలేకపోవచ్చు. ఏంటి కర్తవ్యం..? రెండు ఆప్షన్లలోనూ లాభ, నష్టాలు ఉన్నాయి. రెండింటిలోకి.. అద్దె ఇంట్లో ఉండి, సిప్ ద్వారా 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రూ.5.3 కోట్ల నిధిని సమకూర్చుకోగలరు. మరోవైపు రుణంపై ఇంటిని సమకూర్చుకున్నా కానీ.. 20 ఏళ్ల తర్వాత దాని విలువ రూ.4.19 కోట్లు అవుతుంది. కాకపోతే రూ.కోటి వరకు వడ్డీ రూపేణా ఈ కాలంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం.. ఇంటి అద్దెను 20 ఏళ్ల కాలానికి ఫ్లాట్‌గా ప్రతీ నెలా రూ.25,000గానే పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ వాస్తవంలో ఇంటి అద్దె ఏటేటా పెరుగుతుంది. అయితే, అదే సమయంలో వేతనం పెరుగుతుంటుంది కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటూ వెళ్లొచ్చు. అంతిమంగా తమ అవసరాలు, అనుకూలతలు, సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ రెండింటిలో అనువైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొందరు రుణ ఈఎంఐ అంటే తప్పనిసరి బాధ్యతగా భావించి వేతనంలో కచ్చితంగా ఆ మొత్తాన్ని పక్కన పెడతారు. అదే అద్దె ఇంట్లో ఉండి, మిగులు మొత్తాన్ని అంతే క్రమశిక్షణగా, బాధ్యతగా సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎక్కువ మందికి సాధ్యపడకపోవచ్చు. ఎందుకంటే వారి అవసరాలు ప్రాధాన్యంగా మారి.. పెట్టుబడులు పక్కకు వెళ్లిపోవచ్చు. ఇదే జరిగితే సొంతిల్లు లేక పోగా, చివరికి మంచి నిధి కూడా ఏర్పాటు చేసుకోలేరు. అందుకే క్రమశిక్షణ, దృష్టి కోణం ఆధారంగానూ నిర్ణయం ఉండాలి. -
10,000పైకి నిఫ్టీ
స్టాక్ మార్కెట్ దూసుకుపోతోంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కొనసాగుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభపడింది. వరుసగా ఆరో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు ఎగువకే ఎగిశాయి. గత ఏడు నెలల కాలంలో సూచీలు ఇన్ని రోజులు లాభపడటం ఇదే మొదటిసారి. సెన్సెక్స్ కీలకమైన 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,000 పాయింట్లపైకి ఎగబాకాయి. బ్యాంక్, ఆర్థిక రంగ షేర్ల జోరు కొనసాగింది. అయితే ట్రేడింగ్ చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సగం లాభాలు తగ్గాయి. సెన్సెక్స్ 284 పాయింట్ల లాభంతో 34,110 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 10,062 పాయింట్ల వద్ద ముగిశాయి. సగం తగ్గిన లాభాలు... సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా లాభాలు కొనసాగాయి. చివరి అరగంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 197 పాయింట్ల మేర లాభపడ్డాయి. మే నెల సేవల రంగం గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసల నష్టపోయి 75.47కు చేరడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ఇంట్రాడే లాభాలు దాదాపు సగం తగ్గాయి. నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయికి చేరినందున ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని నిపుణులంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు లాక్‌డౌన్‌ను సడలించడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటుండటం, ఉద్దీపన ప్యాకేజీ వార్తలతో ప్రపంచ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, ప్రపంచ మార్కెట్లు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. చైనాలో తయారీ రంగం కరోనా మహమ్మారి ప్రబలడానికి ముందటి స్థాయికి చేరిందని మే నెల గణాంకాలు వెల్లడించడం మరింత ఊపునిచ్చింది. ఆసియా మార్కెట్లు 1–3 శాతం, యూరప్ మార్కెట్లు 2–3 శాతం లాబాల్లో ముగిశాయి. ► నిధుల సమీకరణ వార్తలతో మహీంద్రా అండ్ మహీంద్రా షేర్ 5 శాతం లాభంతో రూ. 485 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► గత క్యూ4లో రూ.871 కోట్ల నష్టాలు వచ్చినా, భవిష్యత్తుపై ఆశావహ అంచనాలతో ఇండిగో షేర్ 8.4% లాభంతో రూ. 1,026 వద్ద ముగిసింది. ► 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. అరబిందో ఫార్మా, బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆర్తి డ్రగ్స్, ఎస్కార్ట్స్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హోటల్ షేర్ల లాభాలు కొనసాగుతున్నాయి. చాలెట్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్, ఈఐహెచ్, తాజ్‌జీవీకే షేర్లు 1–20% రేంజ్లో లాభపడ్డాయి. ► ఫేస్బుక్ జట్టుతో సారేగమ ఇండియా షేర్ 20% అప్పర్ సర్క్యూట్‌తో రూ.334 వద్ద ముగిసింది. -
టాటా మోటార్స్‌కు ఫలితాల దెబ్బ
సాక్షి, ముంబై: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు ఫలితాల షాక్ తగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో రికార్డ్ స్థాయి నష్టాలను నమోదు చేయడంతో టాటా మోటార్స్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం కావడంతో దాదాపు 30శాతం కుప్పకూలింది. 1993 తరువాత ఒక రోజులో ఇంత భారీ అమ్మకాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో శుక్రవారం ఈ స్థాయిలో పతనంకావండం ఇదే తొలిసారి. అయితే అనంతరం 52 వారాల కనిష్టంనుంచి తేరుకుంది. ఇదే బాటలో టాటా మోటార్స్ డీవీఆర్ సైతం ఏడాది కనిష్టానికి చేరింది. క్యూ3 ఫలితాలు ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టాటా మోటార్స్ రూ. 26,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 1077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అయితే గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్ తెలిపింది . నిర్వహణ లాభం 20 శాతం క్షీణించి రూ. 6381 కోట్లను తాకింది. జేఎల్ఆర్ మార్జిన్లు 2.6 శాతం బలహీనపడి 8.3 శాతంగా నమోదయ్యాయి. లగ్జరీ కార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జేఎల్ఆర్కు సంబంధించి రూ. 27,838 కోట్లను రైటాఫ్ చేయడంతో భారీ నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. చైనా తదితర దేశాలలో జాగ్వార్, ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్) వాహన అమ్మకాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు తెలిపింది. -
ఐసీఐసీఐకు ప్రొవిజన్ల దెబ్బ : లాభాల్లో క్షీణత
సాక్షి,ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఐసీఐసీఐ లిమిటెడ్ క్యూ3 ఫలితాల్లో నిరాశపర్చింది. డిసెంబరు ముగిసిన త్రైమాసికంలో నికర లాభాలు 2.8 శాతం క్షీణించాయి. తద్వారా ఎనలిస్టులు అంచనాలను మిస్ చేసింది. 2017డిసెంబరు క్వార్టర్లో సాధించిన రూ.1650 కోట్ల లాభాలతో పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో రూ. 1605 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 19.8శాతం మేర పుంజుకుంది. రూ. 20,163 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఏడాది ఇది రూ. 16,832 కోట్లుగా ఉంది. ఎసెట్ క్వాలిటీ కూడా పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 8.54 నుంచి 7.75శాతానికి తగ్గాయి. నికర నిరర్ధక ఆస్తుల రేషియో కూడా 3.65 శాతం నుంచి 2.58 శాతానికి దిగి వచ్చింది. అయితే ప్రొవిజన్లు బ్యాంకు ఫలితాలను దెబ్బతీశాయి ఎనలిస్టులు పేర్కొన్నారు. గత క్వార్టర్‌తో పోలిస్తే 6శాతం, వార్షిక ప్రాతిపదికన 19శాతం ఎగిసి రూ. 4, 244కోట్లుగా నిలిచాయి. మరోవైపు రెండవ అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారన్నఆరోపణలతో మాజీ సీఈవో చందా కొచర్‌పై ఎప్ఐఆర్ నమోదైంది. అటు ఐసీఐసీఐ-వీడియోకాన్ కుంభకోణానికి సంబంధించి జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ తన రిపోర్టును దర్యాప్తు సంస్థకు అందించింది. ఈ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచర్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ వార్తలు రేపటి బ్యాంకు షేర్ ట్రేడింగ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది.