న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది.
నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్‌లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment