IKEA India
-
ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయ్
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియా నష్టాలు పెరిగాయి. రూ.1,299 కోట్లను అధిగమించాయి. అమ్మకాలు 4.5 శాతం బలపడి రూ. 1,810 కోట్లకు చేరాయి. మొత్తం ఆదాయం 5 శాతం పుంజుకుని రూ. 1,853 కోట్లయ్యింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ టోఫ్లర్ వివరాల ప్రకారం అంతక్రితం ఏడాది(2022–23) రూ. 1,732 కోట్ల ఆదాయం సాధించగా.. రూ. 1,133 కోట్ల నష్టం ప్రకటించింది. నెదర్లాండ్స్ దిగ్గజం ఇంకా హోల్డింగ్స్‌కు అనుబంధ సంస్థ ఇది. ఓమ్నిచానల్ ద్వారా కార్యకలాపాల విస్తరణ కోసం భారీ పెట్టుబడులు చేపట్టడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ధరలు పెంచకపోగా.. కొన్ని ప్రొడక్టులపై ధరలు తగ్గించినప్పటికీ అమ్మకాలు పెంచుకోగలిగినట్లు ఐకియా ఇండియా ప్రతినిధి ఒకరు తెలియజేశారు. ప్రకటనలు, ప్రమోషనల్ ఖర్చులు 2 శాతం అధికమై రూ. 196 కోట్లను దాటాయి. గతేడాది మొత్తం వ్యయాలు 9 శాతం పెరిగి రూ. 3,152 కోట్లను తాకాయి. అంతక్రితం ఏడాది రూ. 2,895 కోట్ల వ్యయాలు నమోదయ్యాయి. కంపెనీ హైదరాబాద్, నవీముంబై, బెంగళూరు తదితర నగరాలలో లార్జ్ఫార్మాట్ స్టోర్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈకామర్స్ కార్యకలాపాల ద్వారా ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు చేపడుతోంది. -
ఐకియా 365 రోజుల ఎక్స్చేంజ్ పాలసీ
న్యూఢిల్లీ: కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ ఐకియా ఇండియా తాజాగా 365 రోజుల వరకు వర్తించే ఎక్స్చేంజ్, రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టింది.దీని ప్రకారం ఐకియాలో హోమ్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ యాక్సెసరీలను కొనుగోలు చేసిన కస్టమర్లు తమ మనస్సు మార్చుకున్న పక్షంలో వాటిని ఒరిజినల్ ప్యాకేజింగ్ స్థితిలోనైనా లేదా అసెంబుల్ చేసిన స్థితిలోనైనా స్టోర్‌లో వాపసు చేయొచ్చు లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం హోమ్ కలెక్షన్ సర్వీసును కూడా అందిస్తున్నట్లు సంస్థ కంట్రీ కస్టమర్ మేనేజర్ అలెక్జాండ్రా షెస్టాకోవా తెలిపారు. -
భారత్‌లో ఐకియా విస్తరణ.. కొత్త స్టోర్ నిర్మాణం.. ఎక్కడంటే..
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని స్వీడన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఐకియా యోచిస్తోంది. తాజాగా ఇండియాలో పెట్టుబడులు పెంచాలని భావిస్తోంది. పదేళ్ల క్రితం భారత్‌లో వ్యాపారం ప్రారంభించిన సమయంలో ప్రకటించిన రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఐకియా ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ పేర్కొన్నారు. 2018 ఆగస్టులో కంపెనీ హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ-ఎన్సీఆర్లో కొత్త స్టోర్ నిర్మాణంలో ఉండగా, 2025లో దీన్ని ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్తో కలిపి రూ.10,500 కోట్ల పెట్టుబడులు పూర్తవుతాయన్నారు. భారత్‌లో ఐకియా విస్తరణ కోసం మరిన్ని నిధులు వెచ్చించనున్నామని చెప్పారు. అమ్మకాలను మరింత పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో ఏమేరకు నిధులు పెట్టుబడి పెట్టనున్నామో ప్రకటిస్తామన్నారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. 2013లో 10 ఏళ్లలో 10 స్టోర్లు ఏర్పాటు చేసేందుకు ఐకియా రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, బెంగళూరుల్లో కంపెనీ స్టోర్లు ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడాల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. -
అయ్యో!.. ఐకియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
ఐకియా: ఇదెక్కడి క్రేజ్‌రా బాబోయ్! వైరల్ వీడియోస్
బెంగళూరు: స్వీడిష్ ఫర్నిచర్ రిటైలర్ ఐకియా ఇటీవల (జూన్ 22న) బెంగళూరులో తొలి అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. అప్పటినుంచి బెంగళూరు ప్రజలు ఈ మాల్‌కు క్యూ కట్టారు. ఒకేసారి వందల సంఖ్యలో కస్టమర్లు ఐకియాకు తరలి వచ్చారు. అందులోనూ వీకెండ్ కావడంతో శనివారం మరింత రద్దీ నెలకొంది. భారీగా నెలకొన్న క్యూలతో వినియోగదారులను కట్టడి చేయడం,సెక్యూరిటీ కల్పించడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారిపోయింది. దీనిపై ఫోటోలు, ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా షేర్ అవుతూ సందడి చేస్తున్నాయి. గంటలకొద్దీ పెద్ద పెద్ద క్యూలైన్లలో కస్టమర్లు వేచి ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో సందడి చేశాయి. దీంతో దెబ్బకి ఐకియా స్పందించి ట్విటర్లో ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. తమ స్టోర్‌కు వస్తున్న స్పందన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అయితే ప్రస్తుతం స్టోర్‌లో వేచి ఉండే సమయం 3 గంటలకు చేరింది. దయచేసి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి మహానుభావా.. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయండి అని వేడుకుంటూ ఐకియా ఇండియా తన అధికారిక ఖాతాలో ట్వీట్ చేయడం గమనార్హం. Bengaluru, we are overwhelmed by your response❣️ Current wait time at Nagasandra store is 3 hours. Please plan accordingly or shop online. For latest wait time updates, visit: — IKEAIndia (@IKEAIndia) June 25, 2022 మరోవైపు దీనిపై వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ఇది మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్యూలో ఉన్న ఎమ్మెల్యేలు కాదు, ఇమ్మిగ్రేషన్ క్యూ కాదు, కోవిడ్ టీకా క్యూ కానే కాదు, దర్శనం కోసం తిరుపతిలో క్యూలో నిల్చున్న భక్తుల క్యూ అంతకన్నాకాదు. ఇది బెంగళూరులో ఐకియా స్టోర్ ప్రారంభోత్సవం! అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. It’s not MLAs queuing in Maharashtra to form government, It’s not an immigration queue to enter our country, It’s not a vaccination queue to avoid Covid wave, It’s not pilgrims queueing in Tirupati for darshan, It’s the opening of IKEA store in Bangalore! — Harsh Goenka (@hvgoenka) June 26, 2022 Nothing Just Bangalore people going to IKEA — Anish (@Aniiiiish) June 26, 2022 -
ఐకియా ఇండియాకి కొత్త చీఫ్.. తొలిసారి మహిళకు అవకాశం
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా కీలక నిర్ణయం తీసుకుంది. ఐకియా ఇండియాకి కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా సుసాన్నే పుల్‌వీరర్‌ను నియమిస్తున్నట్టు ప్రకటించింది. సీఈవో పోస్టులో ఓ మహిలను ఐకియా నియమించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సీఈవోగా ఉన్న పీటర్ బెడ్జెట్ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వీడన్‌కి చెందిన ఈ సంస్థ భారత్‌లో మార్కెట్ విస్తరణపై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మిగిలిన నగరాల్లోకి విస్తరించింది. తాజాగా మెగా స్టోర్లకు బదులు మినీ స్టోర్లు కూడా ఏర్పాటు చేయాలి ఐకియా నిర్ణయించింది. ఈ తరుణంలో ఇండియాకి కొత్త సీఈవోగా సుసాన్నే పుల్‌వీరర్‌ను నియమించింది. 1997లో ఐకియాలో చేరిన సుసాన్నే అంచెలంచెలుగా ఎదుగుతూ ఐకియా ఇండియా సీఈవో స్థాయికి చేరుకున్నారు. చదవండి: కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ -
కోవిడ్ బాధితులకు ఐకియా సాయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ‘ఏ ప్లేస్ కాల్డ్ హోమ్’ పేరుతో కోవిడ్–19 బాధిత కుటుంబాలకు తన వంతుగా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులు, దినసరి కూలీలు, మురికివాడల్లో నివసించే వారికి ఆశ్రయం, సురక్షితమైన పారిశుధ్యం కల్పించడం, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపడుతుంది -
ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐకియా బ్రాండ్ పేరుతో ఫర్నీచర్ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన ఇంగ్కా గ్రూప్ ఔదార్యం చాటుకుంది. కోవిడ్–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్కా సెంటర్స్, ఇంగ్కా ఇన్వెస్ట్మెంట్స్ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్‌నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్లెట్లను తెరిచే పనిలో ఉంది. -
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్‌తో మొదలు స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్‌లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
ఐకియా ఇండియా నష్టం రూ. 720 కోట్లు
న్యూఢిల్లీ, సాక్షి: ఫర్నీచర్ రిటైలింగ్ దిగ్గజం ఐకియా ఇండియాకు గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో రూ. 720 కోట్ల నష్టాలు వాటిల్లాయి. అంతక్రితం ఏడాది(2018-19) నమోదైన రూ. 685 కోట్లతో పోలిస్తే నష్టాలు స్వల్పంగా పెరిగాయి. ఇదేకాలంలో అమ్మకాలు 65 శాతం ఎగసి రూ. 566 కోట్లను తాకాయి. వెరసి మొత్తం ఆదాయం 63 శాతం వృద్ధితో రూ. 666 కోట్లకు చేరింది. 2019లో అమ్మకాలు రూ. 344 కోట్లుగా నమోదుకాగా.. రూ. 408 కోట్ల ఆదాయం మాత్రమే సాధించింది. గతేడాది ఇతర ఆదాయం రూ. 64 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెరిగింది. మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ టోఫ్లర్ అందించిన వివరాలివి. (మార్కెట్లు భళా- ఈ మూడు కంపెనీలూ స్పీడ్) ప్రాధాన్య మార్కెట్ భారత్ తమకు ప్రాధాన్యత కలిగిన మార్కెట్ అని ఫలితాలపై స్పందిస్తూ ఐకియా ఇండియా సీఎఫ్‌వో ప్రీత్ ధుపర్ పేర్కొన్నారు. ఇక్కడ దీర్ఘకాలంపాటు కొనసాగే ప్రణాళికలున్నట్లు తెలియజేశారు. ఇక్కడి కార్యకలాపాలు తొలిదశలో ఉన్నట్లు తెలియజేశారు. అందుబాటు ధరలు, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల ద్వారా దేశీ మార్కెట్లో మరింత విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు. (రియల్మీ నుంచి స్మార్ట్ వాచీలు రెడీ) తొలి స్టోర్ .. స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా 2018 ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో తొలి రిటైల్ స్టోర్‌ను ఏర్పాటు చేసిన విషయం విదితమే. అంతేకాకుండా ముంబై, హైదరాబాద్, పుణేలలో ఆన్లైన్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఇటీవలే ముంబైలోనూ రెండో రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ బాటలో డిమాండుకు అనుగుణంగా మరో రెండు సిటీ స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు ప్రీత్ తెలియజేశారు. 2022కల్లా 10 కోట్ల మంది కస్టమర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా ఆన్లైన్ వ్యవస్థపై ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్ పట్టణాలలో అమ్మకాలపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. -
తిరిగి తెరుచుకోనున్న ఐకియా స్టోర్
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మూతపడిన ఐకియా స్టోర్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనుంది. భౌతిక దూరం పాటించడంతో పాటు సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్టోర్ మేనేజర్ అరెలీ రెయిమన్ వెల్లడించారు. తమ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం, ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేయడం, శానిటైజర్ యంత్రాల వంటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
భారత్‌లో 15వేల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: స్వీడన్‌కి చెందిన ఫర్నిచర్ తయారీ దిగ్గజం ఐకియా... భారత్‌లో తమ కార్యకలాపాలను గణనీయంగా విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా భవిష్యత్‌లో భారత్‌లో తమ ఉద్యోగుల సంఖ్యను దాదాపు పది రెట్లు పెంచుకుని.. సుమారు 15,000 స్థాయికి చేర్చనున్నట్లు ఐకియా బుధవారం తెలిపింది. అదే సమయంలో కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అంతర్జాతీయంగా 7,500 ఉద్యోగాలను కుదించనున్నట్లు వెల్లడించింది. ‘‘భారత మార్కెట్లో 1.5 బిలియన్ యూరోల మేర పెట్టుబడులు పెడుతున్నాం. రాబోయే రోజుల్లో పలు నగరాల్లో కార్యకలాపాలు విస్తరించనున్నాం. మా గ్రూప్‌నకు కొత్తదైన భారత మార్కెట్లో గణనీయంగా అవకాశాలున్నట్లు భావిస్తున్నాం. వచ్చే మూడేళ్లలో వివిధ మార్గాల్లో 20 కోట్ల మందికి పైగా ప్రజలకు చేరువ కావాలని నిర్దేశించుకున్నాం’’ అని ఐకియా ఇండియా ఒక ప్రకటనలో తెలియజేసింది. అంతర్జాతీయంగా ఐకియా టాప్ 30 మెగా సిటీ వ్యూహాల్లో 3 భారత నగరాలున్నాయని (ముంబై, బెంగళూరు, ఢిల్లీ), భారత్‌లోని వ్యాపారావకాశాలపై తమకున్న నమ్మకానికి ఇది నిదర్శనమని వివరించింది. ‘భారత్‌లో విస్తరణతో మరిన్ని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగనుంది. ప్రస్తుతం 1,500 దాకా ఉన్న ఉద్యోగుల సంఖ్య భవిష్యత్‌లో 15,000కు పైగా చేరవచ్చు. వీరిలో 50 శాతం మంది మహిళలే ఉంటారు‘ అని ఐకియా వివరించింది. ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌ను ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో ముంబైలోనూ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటు స్టోర్స్‌తో పాటు అటు ఆన్లైన్లో కూడా విక్రయాలు చేపట్టే ప్రయత్నాల్లో ఉంది. వినూత్న ఉద్యోగావకాశాలు.. విస్తరణతో స్టోర్స్‌లో ఉద్యోగాలే కాకుండా డిజిటల్, డేటా అనలిటిక్స్, ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్స్ వంటి విభాగాల్లో కొత్త ఉద్యోగాల కల్పన జరగనున్నట్లు ఐకియా పేర్కొంది. ‘ప్రస్తుతమున్న కొన్ని ఉద్యోగాల స్వభావం మారుతుంది. కొత్త రూపు సంతరించుకున్న సంస్థలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవడానికి అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాం. సంస్థ వృద్ధి ప్రణాళికలు, పరిణామ క్రమంలో భాగంగా 3,000 పైచిలుకు కొత్త ఉద్యోగాల కల్పన జరగవచ్చని అంచనా‘ అని ఐకియా వివరించింది. కొత్తగా తీర్చిదిద్దుతున్న తమ అంతర్జాతీయ వ్యవస్థతో భారత విభాగాన్ని అనుసంధానించనున్నట్లు, భవిష్యత్‌లో పోటీపడేందుకు అవసరమైన నైపుణ్యాలతో సంసిద్ధంగా ఉండేట్లు చర్యలు తీసుకోనున్నట్లు ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెజెల్ తెలిపారు. ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐకియా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఇక డిజిటైజేషన్ ప్రక్రియతో విభిన్న నైపుణ్యాలున్న మరింత మందిని నియమించుకోనున్నాం. కొత్త ఉద్యోగ విధులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మరింత మెరుగుపర్చుకునేందుకు ప్రస్తుత సిబ్బందికి తగిన అవకాశాలు లభిస్తాయి‘ అని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపారం పునర్వ్యవస్థీకరణ.. ఐకియా మాతృ సంస్థ ఇంగా గ్రూప్ అంతర్జాతీయంగా తమ కార్యకలాపాలను పెద్ద ఎత్తున పునర్వ్యవస్థీకరిస్తోంది. వేగవంతంగా కొత్త స్టోర్స్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఏర్పాటుతో పాటు ఇప్పటికే ఉన్న వాటిపైనా మరింత ఇన్వెస్ట్ చేస్తోంది. వివిధ నగరాలకు అనువైన ఫార్మాట్స్‌లో స్టోర్స్‌ను అభివృద్ధి చేయడం, ఈ–కామర్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటు మొదలైన వాటిపై దృష్టి సారిస్తోంది. కస్టమర్స్ అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులు, సేవలను సులభతరంగా, చౌకగా మరింత మందికి అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని ఐకియా వెల్లడించింది. ‘వచ్చే రెండేళ్లలో అంతర్జాతీయంగా కొత్తగా 11,500 కొత్త ఉద్యోగాల కల్పన జరగనుంది. కొత్తగా 30 ఐకియా టచ్ పాయింట్స్‌ను ప్రారంభించడం, ఫుల్ఫిల్మెంట్ నెట్‌వర్క్‌పై పెట్టుబడులు, డిజిటల్ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోవడం మొదలైన వ్యూహాల ద్వారా దీన్ని సాధించనున్నాం. కీలకమైన 30 మార్కెట్లలో కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నాం. దీంతో ప్రస్తుతమున్న 1,60,000 పైచిలుకు ఉద్యోగాల్లో సుమారు 7,500 ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది‘ అని వివరించింది. -
ఐకియా స్టోర్ : నిన్న వెజ్ బిర్యానీ.. నేడు కేక్
సాక్షి, హైదరాబాద్ : వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు రేపిన కలకలం సద్దుమణగకముందే ఐకియాలో మరో పురుగు బయటకొచ్చింది. ఈ సారి చాక్లెట్ కేక్‌లో, అది కూడా బతికున్న పురుగు. కిషోర్ అనే కస్టమర్ ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా తెలియజేశాడు. వివరాలు.. కిషోర్ అనే కస్టమర్ ఈ నెల 12న తన కూతురితో కలిసి ఐకియా రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఆ సమయంలో కిషోర్ కూతురు చాక్లెట్ కేక్‌ని ఆర్డర్ చేసింది. తీరా కేక్‌ని తీసుకొచ్చాక చూస్తే దాని మీద ఓ పురుగు పాకుతుంది. ఇది గమనించిన కిషోర్ తన ఆర్డర్ కాపీ, బిల్ పే చేసిన కాపీతో పాటు చాక్లెట్ మీద ఉన్న పురుగును కూడా వీడియో తీసి మున్సిపల్ అధికారులకు, హైదరాబాద్ పోలీస్‌లకు ట్యాగ్ చేశాడు. #Ikeahyderbad I found an insect inside the chocolate cake which came out while my daughter was eating the cake at IKEA store today in Hyderabad. https://t.co/zrQnMX8rOI @TV9Telugu @KTRTRS sir @hydcitypolice @THHyderabad @Abnandhrajyothi pic.twitter.com/9rtQduiiV7 pic.twitter.com/UOqSB72ETs — Kishore2018 (@Kishore20181) September 12, 2018 కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రెండు రోజుల క్రితం మరో వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో జీహెచ్ఎంసీ అధికారులు తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని తెలియజేశాడు. దాంతో స్పందించిన మున్సిపల్ అధికారులు ఈ స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీకి 5 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ విషయం గురించి ఐకియా అధికారి ఒకరి మాట్లాడుతూ ‘మా రెస్టారెంట్లో ఓ కస్టమర్ ఆర్డర్ చేసిన చాక్లెట్ కేక్‌లో పురుగు వచ్చిందని తెలిసింది. దీని గురించి మేం ఎంతో చింతిస్తున్నాం. అందుకు క్షమించమని కోరుకుంటున్నాం. ఇది అనుకోకుండా జరిగింది. ఇక మీదట ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని తెలిపారు. గతంలో వెజ్ బిర్యానీలో గొంగళి పురుగు వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు ఐకియాకు 11, 500 రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసింది. అయితే ఈ సంఘటన తర్వాత ఐకియా ఇక మీదట తన స్లోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని అమ్మడం మానేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘ఇక మీదట ఐకియా కేక్‌లను కూడా అమ్మడం మానేస్తుందా..?’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఐకియా స్టోర్ : వెజ్ బిర్యానీ, సమోసా అమ్మకం బంద్
హైదరాబాద్ : నెల రోజుల క్రితమే హైటెక్‌సిటీ ప్రాంతంలో గ్రాండ్‌గా ప్రారంభమైన ప్రఖ్యాత అంతర్జాతీయ ఐకియా స్టోర్‌కు చెందిన ఫుడ్‌కోర్టులో వెజిటేబుల్ బిర్యానీలో గొంగళిపురుగు వచ్చిన ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. బాధితుడు సామాజిక మాధ్యమం ద్వారా చేసిన ఫిర్యాదుకు స్పందించి జీహెచ్ఎంసీ అధికారులు నిర్వాహకులకు రూ.11,500 జరిమానా కూడా విధించారు. తాజాగా ఐకియా ఇండియా, తన స్టోర్‌లో వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం నిలిపివేసింది. తనకు తానుగా వీటి విక్రయాలను ఐకియా స్టోర్ క్లోజ్ చేసింది. నాణ్యత కలిగిన ఆహారాన్ని అందించేందుకు బలమైన అంతర్గత ప్రక్రియను పాటిస్తున్న ఐకియా, తన సప్లయ్ చైన్ పూర్తి బాధ్యతను తన తలపైనే వేసుకుంది. ఈ క్రమంలోనే వెజిటేబుల్ బిర్యానీని, సమోసాను అమ్మడం మానేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సరియైన పరిష్కార చర్యలు తీసుకోవడానికి అంతర్గత సమీక్ష చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతేకాక తమ లోపాలను సరిచేసుకుంటామని ఐకియా తెలిపింది. రివ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ రెండింటి అమ్మకాలను చేపడతామని కంపెనీ తెలిపింది. ఆహారంలో నాణ్యతను, భద్రతను ఈ కంపెనీ చాలా సీరియస్‌గా తీసుకుంది. వినియోగదారుల ఆరోగ్యానికి ఇది పెద్ద పీట వేస్తుంది. తొలి నెల కార్యకలాపాల్లో భాగంగా ఐకియా ఇండియాకు వినియోగదారుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. -
హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ లాంచ్
-
ఐకియా స్టోర్ వచ్చేసింది.. ఇక పండుగే
సాక్షి, హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసింది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఐకియా స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మన సొంత హైదరాబాద్, తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్, భారత్‌లో స్వీడన్ అంబాసిడర్ క్లాస్ మోలిన్, ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్‌లు పాలుపంచుకున్నారు. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్ వెల్లడించారు. హైదరాబాద్ స్టోర్ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో 40 నగరాల్లో.. దేశంలో 40 నగరాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రూ.200 కంటే తక్కువకే వెయ్యి ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నో రోజులుగా వేచిచూస్తున్న స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజ రిటైలర్ ఐకియా స్టోర్, రేపే భారత్‌లో లాంచ్ కాబోతుంది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసేందుకు ఐకియా సిద్ధమైంది. స్థానిక వనరుల నిబంధనలతో ఐకియా ఇండియా స్టోర్ లాంచింగ్ కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పాటు తమ కార్యకలాపాల్లో సుమారు 30 శాతం, స్థానిక ముడి సరుకులనే వాడనున్నట్టు ఐకియా తెలిపింది. దేశీయ వినియోగదారుల అన్ని అవసరాలను అందిపుచ్చుకోవడం, ధరల్లో మార్పులు చేపట్టడం, వివిధ ప్రొడక్ట్‌లను ఆఫర్ చేయడం వంటివి చేపట్టనున్నట్టు ఐకియా పేర్కొంది. హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతున్న ఐకియా తొలి స్టోర్ హైటెక్ సిటీ, రాయ్‌దుర్గ్, శేరిలింగంపల్లి మండలం, సర్వే నెంబర్. 83/1, ప్లాట్ నెంబర్. 25,26, రంగారెడ్డి జిల్లాలో ఉంది. ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్యలో ఐకియా హైదరాబాద్ స్టోర్ తెరిచి ఉంచుతారు. 13 ఎకరాల కాంప్లెక్స్‌లో ఏర్పాటైన ఈ స్టోర్‌కు ఏడాదికి 60 లక్షల మంది విచ్చేసే అవకాశముందని తెలుస్తోంది. 4 లక్షల చదరపు అడుగుల ఈ షోరూంలో 7500 ఉత్పత్తులను ఆఫర్ చేయబోతుంది. వీటిలో వెయ్యికి పైగా ఉత్పత్తుల ధర రూ.200 కంటే తక్కువే. హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, ముంబై, గుర్గామ్ ప్రాంతాల్లో కూడా ఐకియా స్టోర్ ఏర్పాటు కోసం ఆ కంపెనీ భూమిని కొనుగోలు చేసింది. సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై, పుణే ప్రాంతాలకు ఈ స్టోర్‌ను విస్తరించనుంది. 2025 నాటికి 25 స్టోర్లను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. బెడ్స్, కుర్చీలు, కుక్వేవ్, కర్టైన్లు, టేబుల్స్, లైటింగ్, కిచెన్ ట్రోలీ, ఓవెన్స్, హ్యాంగర్స్ వంటి పలు ప్రొడక్ట్‌లను ఈ స్టోర్ ఆఫర్ చేయనుంది. అర్బన్‌క్లాస్ అనే యాప్‌తో కూడా ఐకియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా కార్పెంటర్స్ వంటి పలువురు సర్వీసు ప్రొవైడర్లకు వినియోగదారులను కనెక్ట్ చేయనుంది. ఈ స్టోర్‌లో వెయ్యి సీట్ల రెస్టారెంట్ కూడా ఉంది. ప్రతి రోజూ ఉదయం తొమ్మిదన్నర నుంచి రాత్రి పదిన్నర వరకు ఈ రెస్టారెంట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో సగం వెజిటేరియన్‌కు సంబంధించినవే. ఇడ్లీ, సమోసా, వెజిటేబుల్ బిర్యానీ వంటి వెజిటేరియన్ ఫుడ్‌నూ ఆఫర్ చేయనుంది. 50 శాతం భారతీయులు ఫుడ్‌నే ఎక్కువగా ఇష్టపడతారని, అందుకే రెస్టారెంట్‌ను కూడా ఆఫర్ చేస్తున్నట్టు ఐకియా ఇండియా డిప్యూటీ కంట్రీ మేనేజర్ పట్రిక్ ఆంటోనీ చెప్పారు. ఐకియా ఇండియా స్టోర్ వచ్చే ఏడాది ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. నగరాల్లో ఆన్లైన్ సేల్స్‌ను ఇది ఆఫర్ చేస్తుంది. ముంబైలో ఈ ఈ-కామర్స్ కార్యకలాపాలను ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. స్మాలాండ్, క్రెష్‌లను కూడా ఐకియా హైదరాబాద్ లాంచ్ చేయనుంది. వీటితో షాపర్లు తమ పిల్లలతో ఎంతో సురక్షితంగా షాపింగ్ చేసుకోవచ్చు. -
‘ఐకియా’కు స్థలంపై హైకోర్టుకు రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఐకియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫర్నిచర్ షోరూం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్ పన్మక్త గ్రామంలోని అత్యంత ఖరీదైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా ఇండియాకు ప్రభుత్వం ఏకపక్షంగా కేటాయించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. టెండర్లు ఆహ్వానించకుండానే కేటాయింపులు జరిపారని.. దీంతో ప్రభుత్వానికి రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రేవంత్ వెల్లడించారు. ఈ కేటాయింపులను నామినేషన్ పద్ధతిలో చేశారని.. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఐకియా ఏర్పాటు చేస్తున్నది కేవలం ఫర్నిచర్ షాపు మాత్రమేనని, దీనికోసం మరో చోటైనా భూమిని కేటాయించవచ్చని వివరించారు. ఐటీ కంపెనీలకే కేటాయించాలి.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఐటీ కంపెనీలు, దాని ఆధారిత కంపెనీలకే భూమి కేటాయించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా ఐకియాకు కేటాయింపులు జరిగాయని రేవంత్ పేర్కొన్నారు. ప్రస్తుత కేటాయింపుల ద్వారా రూ.33 కోట్లు మాత్రమే ఖజానాకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ భూమిలో 3.17 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.19.21 కోట్లకు ఐదేళ్ల తర్వాత కొనుగోలు చేసేలా ఐకియాకు రిజర్వు చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని.. వ్యాజ్యం తేలే వరకు ఆ భూమిలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఐకియాను ఆదేశిం చాలని కోరారు. ఈ కేటాయింపులను చట్ట విరుద్ధంగా ప్రకటించి.. ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని ఆ కంపెనీ నుంచి రాబట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
ఐకియా రాక.. ఆలస్యం
హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన గృహోపకరణాల తయారీ దిగ్గజ సంస్థ ఐకియా తన తొలి భారతీయ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతుంది. అయితే ఈ స్టోర్ ప్రారంభం షెడ్యూల్ కంటే 20 రోజులు ఆలస్యం కానుందని తెలిసింది. తొలుత ఈ స్టోర్‌ను ఈ నెల 19న ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. కానీ ఈ స్టోర్‌కు అవసరమైన కొన్ని పనుల్లో జాప్యం జరగడంతో 2018 ఆగస్టు 9కు వాయిదా వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘‘వినియోగదారులు, కో-వర్కర్ల కోసం అనుకున్న నాణ్యతతో స్టోర్ సిద్ధం చేయడానికి మరికొంత సమయం అవసరమవుతుంది. దీంతో ప్రారంభాన్ని వాయిదా వేయాలని ఐకియా ఇండియా నిర్ణయించింది’ అని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ వినియోగదారులకు, కో-వర్కర్లకు సురక్షితమైన అనుభవాన్ని, అత్యుత్తమ సౌకర్యాన్ని అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జల్ తెలిపారు. నాణ్యత విషయంలో తమ వాగ్దానాలను నిలబెట్టుకుంటామని, ఐకియా తొలిస్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుండటం చాలా సంతోషకరమని బెట్జల్ అన్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఈ స్టోర్ ప్రారంభమవుతుంది. దీనిలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా, మరో 1,500 మందికి పరోక్షంగా ఉద్యోగాలను కల్పించబోతుంది. ఈ స్టోర్‌లో సగం ఉద్యోగాలను మహిళలకు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఐదేళ్ల క్రితం ఈ స్వీడన్ పర్నీచర్ దిగ్గజానికి భారత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. భారత్‌లో తన స్టోర్లను ఏర్పాటు చేయాలనే రూ.10,500 కోట్ల పెట్టుబడుల ప్రణాళికకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2025 కల్లా ఐదు భారతీయ నగరాల్లో 25 స్లోర్లను ప్రారంభించాలని ఐకియా ప్లాన్ చేస్తుంది. ఏప్రిల్‌లో స్టోర్లను ఏర్పాటు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వంతో కంపెనీ ఒప్పందం కూడా కుదుర్చుకుంది. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని అంచనావేస్తోంది. అదేవిధంగా కర్నాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలో కూడా రిటైల్ స్టోర్లను ఏర్పాటుచేసేందుకు ఎంఓయూలపై ఐకియా సంతకాలు కూడా పెట్టింది. -
15వేల ఉద్యోగాలిస్తాం: 50శాతం మహిళలకే
సాక్షి, న్యూఢిల్లీ: స్వీడన్‌కు చెందిన ఫర్నీచర్ సంస్థ ఐకియా దేశీయ నిరుద్యోగులకు , ముఖ్యంగా మహిళలకు తీపి కబురు అందించింది. రాబోయే ఏళ్లలో దేశంలో భారీగా ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతోంది. 2025 నాటికి ఐకియా గ్రూపు సంస్థల్లో 15వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. వీటిలో 50శాతం మహిళలే ఉంటారని తెలిపింది. 2025 నాటికి భారతదేశంలో 15వేల మందిని ఎంపిక చేసుకోనున్నామని స్వీడిష్ హోమ్ ఫర్నిషింగ్ రీటైలర్ ఐకియా తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో 400మందికిపైగా ఉద్యోగులుండగా, 2025 నాటికి వీరి సంఖ్యను 15వేలకు పెంచుకోవాలనే ప్రణాళిక వేసింది ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీలో(ఎన్సీఆర్ పరిధి) ప్రారంభించే స్టోర్ల కోసం ఒక్కో స్టోరుకు 500 నుంచి 700 మంది ఉద్యోగులను ఎంపిక చేస్తామని ఐకియా ఇండియా కంట్రీ హెచ్ఆర్ మేనేజర్ అన్నా కెరిన్ మాన్సన్ చెప్పారు. వీరిలో సగంమంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. అంతేకాదు లాయల్టీ కింద తమ స్టోర్లలో పని చేసే ఉద్యోగుల్లో ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి పెన్షన్ ఖాతాకు అదనంగా రూ.1.5 లక్ష జమ చేస్తామని ఐకియా గ్రూపు ప్రకటించడం విశేషం. -
ఒకటి...రెండు కాదు వందేళ్ల ప్రణాళిక మాది..!
‘ఐకియా’ ఇండియా సీఈఓ జువెన్సియో ♦ అందుకే ఇన్నాళ్ల సమయం తీసుకున్నాం ♦ వచ్చే ఏడాది వేసవిలో హైదరాబాద్ స్టోర్ ఆరంభం ♦ 13 ఎకరాల్లో ఏర్పాటు; ఒక స్టోర్‌కు రూ.600 కోట్లు ♦ 2000 ఉద్యోగాలు; శాశ్వత సిబ్బంది 500 మంది ♦ మా సిబ్బందిలో 50% మంది మహిళలుండాల్సిందే ♦ జూన్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఆరంభిస్తాం ♦ 2025 నాటికి దేశంలోని 9 నగరాల్లో 30 స్టోర్లు ♦ కళాకారుల పేర్లు కూడా మా ఫర్నిచర్‌పై ఉంటాయి ‘‘వందేళ్లు నడిచేటపుడు... ఆ దారి వేయటానికి మూడేళ్లు తీసుకుంటే తప్పులేదు. డబ్బులైనా ఇంతే!!. పెట్టుబడిలో 3 శాతాన్ని... తగిన రంగం సిద్ధం చేయడానికి వెచ్చిస్తే తప్పేమీ కాదు. మేం చేసిందీ అదే.’’ ఇదీ... అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ‘ఐకియా’ ఇండియా సీఈఓ జువెన్సియో మేజు మనోగతం. రూ.11,000 కోట్ల పెట్టుబడితో ఇండియాలోకి ప్రవేశిస్తున్నట్లు 2012లో ప్రకటించిన ఈ సంస్థ... తన తొలిపై నిర్ణయానికి రావటానికి మూడేళ్లు పట్టింది. హైదరాబాద్‌ను తొలి గమ్యస్థానంగా ఎంచుకున్న ఈ సంస్థ... ఐటీ హబ్ చేరువలో 13 ఎకరాలు కొనుగోలు చేసి ఈ మధ్యే పనులు కూడా ఆరంభించింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ స్టోర్‌ను ఆరంభించనున్న నేపథ్యంలో పనుల్ని పర్యవేక్షించడానికి సంస్థ సీఈఓ జువెన్సియో బుధవారం హైదరాబాద్‌కు వచ్చారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సాక్షి, బిజినెస్ బ్యూరో ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... హైదరాబాద్ ఎండలు ఎలా ఉన్నాయి? నేను స్పెయిన్ దక్షిణ ప్రాంతంలో పుట్టా. అక్కడా ఎండలు ఎక్కువే. నాలుగేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాను కనక కాస్త అలవాటుపడ్డా. ఇబ్బంది లేదు. దేశంలో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌నే ఎందుకు ఎంచుకున్నారు? మొదట దేశంలోని 9 ప్రధాన నగరాల్ని అనుకున్నాం. దాన్లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీలను వడపోశాం. చివరికి హైదరాబాద్‌ను ఎంచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ ఆధునికత, సంప్రదాయం రెండూ ఉన్నాయి. ఇంటి ఫర్నిచర్‌కు, అలంకరణ సామగ్రికి వెచ్చించాలని కోరికతో పాటు, వెచ్చించగలిగే స్తోమత ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడి సొసైటీ కూడా మాకు బాగా కనెక్ట్ అయింది. మొదటి స్టోర్ ఆరంభమెప్పుడు? ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది వేసవిలో స్టోర్‌ను ఆరంభిస్తాం. ఇండియాలో వ్యాపార పరిమాణానికి సంబంధించి లక్ష్యాలేమైనా? వ్యాపారానికి లక్ష్యాలుండొచ్చు. ఉండాలి కూడా. కానీ మాది దీర్ఘకాల ప్రణాళిక. వందేళ్లో అంతకు మించో ఉండాలనేది మా కోరిక. అందుకే స్వల్పకాలిక లక్ష్యాలేవీ పెట్టుకోలేదు. దీర్ఘకాలానికి తగ్గ పునాది వెయ్యటమే నా బాధ్యత. నేను నా కంపెనీకి చెప్పేది కూడా ఇదే. ఇది కూడా ఫర్నిచర్ స్టోరే కదా? మరి మీ ప్రత్యేకతలేంటి? స్టోర్ పరిమాణం 4 లక్షల చదరపు అడుగులు. నేనైతే దీన్నొక ఫర్నిచర్ స్టోర్‌గా కాక ఐకియా సొసైటీ పిలుస్తా. ఇక్కడ సుశిక్షితులైన, మంచి విలువలున్న సిబ్బంది ఉంటారు. వీళ్లు కేవలం ఉద్యోగులే కాదు. మా కుటుంబ సభ్యులు. తప్పనిసరిగా ఉద్యోగుల్లో 50 శాతం మంది మహిళలుంటారు. మేం అమ్మే వస్తువుల్లో కళాకారులు తయారు చేసే కుషన్ల వంటి వస్తువులపై వాళ్ల పేర్లు కూడా ఉంటాయి. స్టోర్లలో విదేశాల్లో మాదిరి నిబంధనలే ఇక్కడా ఉంటాయా? అవును! అక్కడిలాగే ధరల్ని జనవరి 1న విడుదల చేస్తాం. డిసెంబరు 31వరకూ అవే ఉంటాయి. స్టోర్లలో రెస్టారెంట్లతో పాటు పిల్లలకు ప్లే గ్రవుండ్ కూడా ఉంటుంది. కుటుంబమంతా హాయిగా తిరిగి, తమ బడ్జెట్లో వచ్చే వస్తువుల్ని కొనటానికి వీలుగా 9వేల రకాల ఫర్నిచర్ సొల్యూషన్లను అందిస్తాం. మిగతా ఫర్నిచర్ షాపులకన్నా ధర తక్కువ ఆశించొచ్చా? మేం పెద్దసంఖ్యలో తయారుచేసి విక్రయిస్తాం కనక ధర పోటీపడేలానే ఉంటుంది. ఇక్కడ ధర ఒక్కటే కాక... రకరకాల సొల్యూషన్లు అందిస్తాం. కాబట్టి వాళ్లకు కావాల్సిన ధరలో ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? సిబ్బంది నియామకాలు మొదలయ్యాయా? ఒకో స్టోర్‌లో 500 మంది ఐకియా పర్మనెంట్ ఉద్యోగులుంటారు. వీళ్లలో 50 శాతం మహిళలే. మరో 1500 మందికి పరోక్షంగా... అంటే డెలివరీ, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ వంటి రంగాల్లో ఉపాధి దొరుకుతుంది. నియామకాలు మొదలు పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం జూన్ నుంచి డిసెంబరు దాకా వారికి శిక్షణ ఇస్తాం. శిక్షణ తరవాత సర్టిఫికెట్ ప్రధానం చేస్తాం. దాంతో వేరేచోట కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. ఇండియా నుంచి కొంటున్న వస్తువుల శాతమెంత? తెలంగాణలో సప్లయర్లు ఉన్నారా? స్టోర్లు లేనప్పటికీ చాలా సంవత్సరాలుగా ఇండియా నుంచి సోర్సింగ్ చేస్తున్నాం. దాన్నిపుడు పెంచుతున్నాం. అంతర్జాతీయంగా చూస్తే మేం సోర్సింగ్ చేస్తున్న దేశాల్లో ఇండియాది 8వ స్థానం. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఒక సప్లయర్ ఉన్నారు. పెంచటానికి ప్రయత్నిస్తున్నాం. స్టోర్ తెరిచేనాటికి ఈ సంఖ్య పెరుగుతుంది. తయారు చేసేవారి నుంచి నేరుగా తేవటం మా ప్రత్యేకత. దానివల్ల కళాకారులకే డబ్బులు మిగులుతాయి. అలాగే మా రెస్టారెంట్లలో ఆహారాన్ని కూడా రైతుల నుంచే తెస్తాం. ఇండియాలో ఎన్ని స్టోర్లు ఏర్పాటు చేస్తారు? భవిష్యత్తులో పెట్టుబడి పెంచుతారా? ఒక స్టోర్‌కు రూ.600 కోట్లు ఖర్చవుతుంది. హైదరాబాద్ తరవాత ఢిల్లీ, ముంబై, బెంగళూరుల్లో తెరుస్తాం. 2025 నాటికి 9 ప్రధాన నగరాల్లో 30 స్టోర్లు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీనికి అనుగుణంగా పెట్టుబడి పెంచుతాం. ఒక నగరంలో ఒకే స్టోర్ ఉండాలని లేదు. పరిస్థితుల్ని బట్టి ఎక్కువ స్టోర్లూ ఉంటాయి. మీ ఫర్నిచర్ ప్రత్యేకత ఏంటి? డిజైన్, పనితీరు, నాణ్యత, మన్నిక, ధర... ఇవన్నీ మా ప్రత్యేకతలే. ఎందుకంటే మంచి ఇల్లనేది ప్రతి కుటుంబం కల. భవిష్యత్తులో ఇళ్ల రేట్లు పెరిగిపోతాయి. అయినా వారి కలకు తగ్గ ఫర్నిచర్‌ను అందుబాటు ధరలో అందించాలనేది మా లక్ష్యం. మేం విక్రయించే లైట్లలో ఎల్ఈడీ మాత్రమే వాడతాం. అలాగే ట్యాప్‌లను తక్కువ నీరొచ్చే ఆప్షన్ ఉండేటట్లు డిజైన్ చేస్తాం. యువతకు తయారీలో శిక్షణ ఇచ్చి భవిష్యత్తు తరాలకూ పనికొచ్చేలా చేస్తాం. మా సిబ్బం దిలో మహిళలుండటంతో పాటు మా వ్యాపారం కూడా పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. స్టోర్ పైకప్పు మొత్తం సోలార్ ప్యానల్స్‌ను అమర్చుతున్నాం. అర్థవంతమైన వ్యాపారం చేస్తాం. విజయమంటే అదేనని నా నమ్మకం. నిర్మల్ పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి పాత్రలు... ఇలా పేరున్న స్థానిక వస్తువుల్నీ విక్రయిస్తారా? వాటిని యథాతథంగా విక్రయించకపోవచ్చు. కానీ వారితో కలిసి ఐకియా డిజైన్‌కు తగ్గ వస్తువుల్ని చేయిస్తాం. వాటిని విక్రయిస్తాం. మొత్తం సమాజంతో అనుసంధానమై వ్యాపారం చేయాలనేది మా లక్ష్యం.