స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసింది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఐకియా స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మన సొంత హైదరాబాద్, తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి తెలిపారు