Ikea
-
కొత్త నగరాలకు ఐకియా
న్యూఢిల్లీ: ఫర్నిచర్ రంగ దిగ్గజం ఐకియా భారీగా విస్తరిస్తోంది. ఢిల్లీ–ఎన్సీఆర్తోపాటు మరో తొమ్మిది మార్కెట్లలో ఆన్లైన్ విక్రయాలను ఈ వారం ప్రారంభిస్తోంది. స్వీడన్‌కు చెందిన ఈ సంస్థ భారత్‌లో తదుపరి దశ పెట్టుబడుల కోసం చూస్తోందని, విస్తరణ తర్వాత లాభదాయకతకు చేరుకుంటుందని ఐకియా ఇండియా సీఈవో సుసాన్ పల్వరర్ తెలిపారు. ఢిల్లీ–ఎన్సీఆర్లో 2026లో గురుగ్రామ్ వద్ద, అలాగే 2028లో నోయిడాలో పూర్తి స్థాయిలో స్టోర్లను నెలకొల్పాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు. చెన్నై, పుణేలోనూ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భారీ స్టోర్ ఏర్పాటుకు ముందే చిన్న కేంద్రాలను ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. పుణేలో కంపెనీ ఇప్పటికే ఆన్లైన్లో అమ్మకాలను సాగిస్తోంది. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో భారీ స్టోర్లున్నాయి. రూ.10,500 కోట్లతో..: పదేళ్లలో అనుబంధ మౌలిక సదుపాయాలతో ఐకియా ద్వారా 10 స్టోర్లను ఏర్పాటు చేయడానికి రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇంగ్కా గ్రూప్‌లో భాగమైన ఇంగ్కా సెంటర్స్ ఐకియా రిటైల్‌ను నిర్వహిస్తోంది. గురుగ్రామ్, నోయిడాలో లైక్లీ బ్రాండ్ కింద కేంద్రాలను ఏర్పాటు చేయడానికి రూ.9,136 కోట్ల పెట్టుబడి పెడుతోంది. పెట్టుబడుల విషయమై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు ఆమె చెప్పారు. మెట్రోల్లో విస్తరించిన తర్వాత తదుపరి దశలో చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు సుసాన్ తెలిపారు. కాగా, 2023–24లో కంపెనీ టర్నోవర్ భారత్‌లో రూ.1,810 కోట్లు. నష్టాలు రూ.1,299 కోట్లకు చేరాయి. రాబోయే సంవత్సరాల్లో భారత్‌లో కూడా లాభాలను ఆర్జిస్తామని సుసాన్ వివరించారు. -
హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్!
సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్టీయూ ఫ్లైఓవర్లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
మరో భారీ డీల్‌ను దక్కించుకున్న ఇన్ఫోసిస్
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. -
భారత్‌లో ఐకియా విస్తరణ.. కొత్త స్టోర్ నిర్మాణం.. ఎక్కడంటే..
భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని స్వీడన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఐకియా యోచిస్తోంది. తాజాగా ఇండియాలో పెట్టుబడులు పెంచాలని భావిస్తోంది. పదేళ్ల క్రితం భారత్‌లో వ్యాపారం ప్రారంభించిన సమయంలో ప్రకటించిన రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఐకియా ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ పేర్కొన్నారు. 2018 ఆగస్టులో కంపెనీ హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ-ఎన్సీఆర్లో కొత్త స్టోర్ నిర్మాణంలో ఉండగా, 2025లో దీన్ని ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ మాట్లాడుతూ.. ఎన్సీఆర్తో కలిపి రూ.10,500 కోట్ల పెట్టుబడులు పూర్తవుతాయన్నారు. భారత్‌లో ఐకియా విస్తరణ కోసం మరిన్ని నిధులు వెచ్చించనున్నామని చెప్పారు. అమ్మకాలను మరింత పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో ఏమేరకు నిధులు పెట్టుబడి పెట్టనున్నామో ప్రకటిస్తామన్నారు. ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత.. 2013లో 10 ఏళ్లలో 10 స్టోర్లు ఏర్పాటు చేసేందుకు ఐకియా రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, బెంగళూరుల్లో కంపెనీ స్టోర్లు ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడాల్లో స్టోర్లను ఏర్పాటు చేస్తోంది. -
ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!
చాలా విభన్నమైన స్టయిలిష్ కాస్ట్యూమ్స్‌ని డిజైన్ చేస్తుంటారు డిజైనర్లు. ఒక్కొక్కరిది ఒక్కో తరహా స్టయిల్. వెస్ట్రన్ స్టయిల్ కొందరూ దేశీ సంస్కృతిని మిళితం చేసేలా ఇంకొకరు ఎంచుకుని మరి కళ్లు చెదిరే కాస్ట్యూమ్స్‌ని తయారు చేస్తారు. వాటి ధరలు కూడా ఎక్కువే. ప్రముఖ సెలబ్రెటీలకు మంచి బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ అందించేది వారే. రాను రాను ఎలా డిజైన చేయాలో తెలియాక ఒక్కొసారి ఇలా పిచ్చిగా డిజైన్ చేస్తారో లేక ఏం తోచక ఇలా చేస్తారో గానీ ఇదే వెర్రీ అనిపించేలా ఉంటాయి ఆ కాస్ట్యూమ్‌లు. అది కూడా మంచి పేరుగాంచిన ఓ ప్రముఖ కంపెనీ యే ఇలాంటి డిజైన్ని తీసుకొస్తే..ఛీ ఏంటీ ఇవి కూడా ఇలా దిగజారిపోతున్నాయా? లేక బ్రాండ్ పడిపోయిందా? అనిపిస్తాయి. అలాంటి పిచ్చి కాస్ట్యూమ్‌నే ఓ ప్రముఖ కంపెనీ విడుదల చేసి అందర్నీ కంగుతినేలా చేసింది. వివరాల్లోకెళ్తే..ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ బాలెన్సియగా ఫ్యాషన్ బ్రాండ్ కంపెనీ అత్యంత వెరైటీగా ఓ టవల్ స్కర్ట్ డిజైన్వేర్ని పరిచయం చేసింది. అది మన ఇళ్లలోని పెద్ద చిన్న మగవాళ్లంతా ప్రతి రోజు కనిపించే తీరు తరహా స్టయిలే అది. అది ఎవర్నీ ఆకర్షించకపోగా దాని ధర చూసి ఒక్కసారిగా భగ్గమంటున్నారు నెటిజన్లు. ఇంతకీ ఈ టవల్ స్కర్ట్ డిజైన్ వేర్ ఏంటంటే ఏం లేదు జస్ట్ ఫ్యాంట్‌పై టవల్ కట్టుకునేలా స్టయిల్. నిజానికి ఇది స్టయిల్ కాదు. మన ఇంట్లో మగవాళ్లు ఫ్యాంటు తీసే ముందు ఇదే తరహాలో టవల్ చుట్టుకుని ఉంటారు. దీన్నే గ్రేట్ డిజైన్ అంటూ విడుదల చేయడం ఒక ఎత్తు అయితే, ధర ఏకంగా రూ 76,000 వేలు అని ప్రకటించడం మరింత విడ్డూరం. దీంతో ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఐకియా ఈ డిజైన్‌కి అయ్యే ఖర్చు జస్ట్ రూ. 1700/- కంటే ఎక్కవ అవ్వదంటూ అందుకు సంబంధించిన సేమ్ మోడల్ని నెట్టింట షేర్ చేసింది. పలువులురు నెటిజన్లు కూడా ఐకియాకు మద్దతు ఇస్తూ అవును అంతకంటే ఎక్కువ ధరేమి ఉండదు. పోనీ ఆ టవల్ జస్ట్ కాటన్ టర్కీ టవల్. దాని ధర కూడా అంత ఉండదు. కానీ ఏకంగా ఫ్యాంట్ విత్ టవల్ కలిపి అంత ధర ప్రకటించారని మండిపడ్డారు. మరో నెటిజన్ ప్రతి కుటుంబంలోని డాడీలు ఉండే స్టయిలే అది బాస్ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by IKEA UK (@ikeauk) (చదవండి: విష్ణు విరానికాల గారాల పట్టి ధరించిన డ్రస్ ధర వింటే షాకవ్వుతారు!) -
ఐకియా గుడ్‌న్యూస్: ధరలు తగ్గాయోచ్!
ముంబై: ఫర్నీచర్ రంగంలో ఉన్న యూరప్ దిగ్గజం ఐకియా కస్టమర్లకు శుభవార్త అందించింది. భారత్‌లో ధరలను తగ్గించింది. లివింగ్ రూమ్ ప్రొడక్ట్స్, స్టోరేజ్, కిచెన్, పరుపులు, బెడ్రూమ్ ఫర్నీచర్ వంటి విభాగాల్లో 9,000 పైచిలుకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 16-39 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇవీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్! టాటా మోటార్స్ గుడ్ న్యూస్, టాప్ మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్లు Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్ -
Video: ఐకియాలో గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. సీపీఆర్‌తో నిమిషాల్లో..
వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటుకు గురవుతున్నారు. అకస్మిక గుండెపోటులో అర్థాతరంగా తనువు చలిస్తున్నారు. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి సరైన సమయానికి కార్డియో పల్మనరీ రిసిటేషన్( సీపీఆర్)చేస్తే బతికే అవకాశం ఉంటుంది. తాజాగా కర్ణాటలో ఇలాంటి ఘటనే జరిగింది.బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. అతను ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు. అయితే అదే సమయంలో షాపింగ్‌కు వచ్చిన డాక్టర్(ఆర్థోపెడిక్ సర్జన్) వెంటనే స్పందించాడు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ కొడుకు రోహిత్ డాక్ కొడుకు ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya — Rohit Dak (@rohitdak) December 29, 2022 దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సరైన సమయానికి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ను అభినందిస్తున్నారు. రోగిపట్ల డాక్టర్ చేసిన కృష్టి, అంకితభావాన్ని కొనియాడుతున్నారు. అతడి ఒకరి ప్రాణం కాపాడటం కన్నా సంతృప్తి ఇంకేముంటుంది అంటూ ప్రశంసిస్తున్నారు. సకాలంలో వైద్య సాయం అందించి మృత్యువు నుంచి కాపాడి కొత్త జీవితాన్ని అందించాడు. అతనికి ధన్యవాదాలు చెప్పండంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం -
అయ్యో!.. ఐకియాకు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫర్నీచర్ రంగ దిగ్గజం ఐకియా ఇండియా 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.903 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.810 కోట్ల నష్టం వాటిల్లింది. టర్నోవర్ 73 శాతం ఎగసి రూ.650 కోట్ల నుంచి రూ.1,125 కోట్లకు చేరింది. నిర్వహణ వ్యయాలు 45 శాతం పెరిగి రూ.1,591 కోట్లుగా ఉంది. 2021–22లో విస్తరణ ప్రణాళికపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం చూపిందని కంపెనీ తెలిపింది. హైదరాబాద్, నవీ ముంబై, బెంగళూరులో ఐకియా స్టోర్లు ఉన్నాయి. ఈ మూడు నగరాలతోపాటు పుణే, గుజరాత్లో ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. -
మహిళపై జాత్యాంహకార వివక్ష కలకలం! కేటీఆర్ ఆగ్రహం!
ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా వివాదంలో చిక్కుకుంది. ఐకియా సిబ్బంది జాత్యంహకార వ్యాఖ్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకియా తీరును తప్పుబట్టారు. ఐకియా బాధితులకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. నితిన్ సేథి జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం రోజు నితిన్ సేథి భార్య, మణిపూర్‌కు చెందిన అకోలిజం సునీతా గచ్చిబౌలీ ఐకియా స్టోర్‌కి వచ్చారు. కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేసి తిరిగి వెళుతుండగా కౌంటర్లో ఉన్న సిబ్బంది తమపై జాత్యంహకార వ్యాఖ్యలు చేసినట్లు బాధితురాలు ట్వీట్ చేసింది. I was one of the many who bought stuffs at @IKEAIndia Hyderabad today. but i was the only one whose purchased items were checked one by one. if this is not #racism then what is it? the senior staffs there were far from helpful. does @IKEA endorse such behavior? https://t.co/DAeYW6hP2E — akoijam sunita (@akoi_Jam) August 28, 2022 'ఈరోజు హైదరాబాద్ ఐకియా స్టోర్ సిబ్బంది నేను మాత్రమే కొనుగోలు చేసిన వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు. అక్కడి సిబ్బంది సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇది జాత్యహంకారం కాకపోతే అది ఏమిటి? అని ప్రశ్నించారు.పైగా పేరుతో పిలిచి అవమానించారని అన్నారు. @IKEA ఇటువంటి సిబ్బంది ప్రవర్తనను సమర్థిస్తారా? అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నాభార్యకు అవమానం జరిగింది నితిన్ సేథి సైతం ఐకియా స్టోర్‌లో తన భార్య సునీతాకు జరిగిన అవమానంపై ట్వీట్ చేశారు. నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసే వ్యక్తి..ఈ వస్తువుల్ని మేం కూడా కొన్నాం అంటూ నవ్వాడు. మమ్మల్ని ఒంటరిగా ఉంచారు. అడిగితే సమాధానం ఇవ్వలేదు. పట్టించుకోలేదు. పైగా ఐకియా స్టోర్‌లో పనిచేసే సూపర్ వైజర్లు..అవునా కావాలంటే పోలీసుల్ని పిలవండి. మేం వారితో మాట్లాడతామని అన్నారు. ఇది ఇక్కడితో ముగియలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ జాత్యహంకారం అంటూ ట్వీట్ చేశారు. This is appalling and absolutely unacceptable @IKEAIndia Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously Hope you will make amends asap https://t.co/l84GimoIrM — KTR (@KTRTRS) August 29, 2022 కేటీఆర్ ఆగ్రహం ఈ ట్వీట్ వైరల్ కావడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐకియా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నితిన్ సేథికి క్షమాణలు చెప్పాలని, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో సిబ్బందికి అవగాహన కల్పించాలని యాజమాన్యానికి సూచిస్తూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్, నితిన్ సేథి ట్వీట్‌పై ఐకియా యాజమాన్యం స్పందించింది. స్టోర్ల వద్ద సమానత్వం మానవ హక్కుగా భావిస్తాం. ఇక్కడ జాత్యహంకారం, పక్షపాతాలకు తావులేదని తెలిపింది. బాధితులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్ చేసింది. -
అక్కడ లాక్డౌన్ అంటే చాలు జనాలు జంప్! వీడియో వైరల్
చైనా: ప్రంపంచ దేశాలన్నింటిని గత రెండేళ్లుగా పట్టిపీడించిన కరోనా మహమ్మారీ ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను పలు చోట్ల పునరుద్ధరించారు కూడా. చైనాలో మాత్రం కరోనా పగ సాధిస్తున్నట్లుగా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరగడంతో చైనా అధికారులు ప్రజలను వరుస లాక్డౌన్లతో నిర్బంధించి, కఠిన ఆంక్షలు విధించారు. జీరో కోవిడ్ వ్యూహం ప్రజల్లో తీవ్ర అసహనానని రేకిత్తించింది. అది ఎంతలా మారిందంటే వారు లాక్డౌన్ అని చెబితే చాలు పరుగులు తీసి బయటకు వచ్చేసేంతగా విసిగిపోయారు. ఈ మేరకు చైనాలో ఒక ఐకియా స్టోర్‌లో కరోనాకి కేసుల ట్రేసింగ్‌లో భాగంగా స్టోర్ లాక్డౌన్ చేస్తున్నామని అనౌన్స్మెంట్ ఇలా రాగానే ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది డోర్లు మూసేందుకు యత్నించినా.. బాబాయ్ ఇక మా వల్ల కాదంటూ దూకాణంలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా గుంపులుగా తోసుకుంటూ బయటకి పరుగులు తీశారు. ఇటీవలే టిబెట్‌లోని లాసా నుంచి షాంఘై వచ్చిన ఆరేళ్ల బాలుడి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ స్టోర్‌ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాలుడికి కరోనా రావడానికి ముందు ఆ ఐకియా దుకాణంలోని సుమారు 400 మందితో టచ్‌లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఐకియా స్టోర్‌ని లాక్డౌన్ చేయాని అధికారులు నిర్ణయించి ప్రజలకు అనౌన్సమెంట్ ఇచ్చారు. అంతే ఒక్కసారిగా ప్రజల్లోంచి అసహనం కట్టలు తెంచుకుని బయటకు వచ్చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, అధికారులు వారిని బయటకు రాకుండా నియంత్రించ లేకపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Yesterday, an abnormal health code case was presented at an IKEA in Shanghai, & the entire mall was suddenly blocked🥶 Some ppl forced their way out for fear of being sent to concentration camps, but there is actually nowhere to escape under #AmazingChina’s digital surveillance pic.twitter.com/MWpbTOJ3kz — Donna Wong💛🖤 (@DonnaWongHK) August 14, 2022 (చదవండి: చైనా కక్ష పూరిత చర్య! తైవాన్ అధికారుల పై ఆంక్షల మోత) -
IKEA : కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ
ప్రపంచంలోనే అతి పెద్ద హోం ఫర్నీచర్ తయారీ, అమ్మకాల సంస్థ ఐకియా మరో కొత్త కాన్సెప్టుతో మార్కెట్లోకి రానుంది. అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త ఎత్తులతో వస్తోంది. ఫర్నీచర్ సెగ్మెంట్లో ధరల యుద్ధానికి తెర లేపనుంది. హైదరాబాద్‌తో మొదలు స్వీడన్‌కి చెందిన అతి పెద్ద ఫర్నీచర్ తయారీ సంస్థ ఐకియా తన తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత నవీ ముంబైలో రెండో స్టోర్‌ను ఇటీవల ప్రారంభించింది. ఈ రెండు స్టోర్లు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంటాయి. ఇందులో తొమ్మిది వేల రకాల ఫర్నీచర్ వస్తువులు సిద్ధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ తరహా ఆల్ ఇన్ వన్ అనే సూత్రానే పాటిస్తూ వచ్చింది ఐకియా సంస్థ. కానీ ఇటీవల మార్కెటింగ్‌లో కొత్త సిటీ స్టోర్స్ పేరుతో కొత్త కాన్సెప్టును తీసుకొచ్చింది. సిటీ స్టోర్లు విశాలమైన ప్రాంగణంలో అన్ని వస్తువులు ఒకే చోట కష్టమర్లకు లభించాలనే మార్కెటింగ్ టెక్నిక్‌కి స్వల్ప మినహాయింపులు ఇచ్చింది. అన్ని రకాల వస్తువుల స్థానంలో ముఖ్యమైన వస్తువులు లభించే విధంగా ఐకియా ఫర్నీచర్ స్టోర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటిని సిటీ స్టోర్ల పేరుతో ఏర్పాటు చేస్తోంది. పరిమాణంలో ఐకియా స్టోర్ల కంటే సిటీ స్టోర్లు చిన్నవిగా ఉంటాయి. యాభై వేల చదరపు అడుగుల నుంచి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సిటీ స్టోర్లు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడ 6,500 రకాల ఫర్నీచర్లు లభిస్తాయి. ఎక్కడంటే ఐకియా సిటీ స్టోర్లు ఇప్పటికే యూరప్‌లో ముఖ్యమైన నగరాల్లో ప్రారంభం అవగా ఇండియాలో హైదరాబాద్, నవీ ముంబై స్టోర్లకు అదనంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబైలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నగర శివారు ప్రాంతాల్లో ఈ సిటీ స్టోర్లు రానున్నాయి. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రచురించింది. ధరల తగ్గింపు సిటీ స్టోర్ల ఏర్పాటుతో పాటు ధరలు తగ్గించడం ద్వారా ఎక్కువ కస్టమర్ బేస్‌ను సేల్స్‌ను సాధించాలనే లక్ష్యంతో ఐకియా ఉంది. ఈ మేరకు ఐకియా స్టోర్లలో ఎక్కువగా అమ్ముడయ్యే 50 రకాల వస్తువుల ధరలను 20 శాతం మేరకు తగ్గించాలని నిర్ణయించినట్టు ఐకియా, ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పెర్ హార్నెల్ తెలిపారు. ఐకియా స్టోర్ల నిర్వహాణ సామర్థ్యం పెంచడంతో పాటు మార్జిన్లను తగ్గించుకునైనా ధరల తగ్గింపును అమలు చేస్తామన్నారయన. చదవండి: పికప్ వాహనాలకు మహీంద్రా ఫైనాన్స్ -
ఆడి కారు యాక్సిడెంట్ కేసులో కొత్త మలుపు
సాక్షి, గచ్చిబౌలి: తప్పతాగి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ మాదాపూర్‌లో తెల్లవారు జామున ఆడి కారు ఆటోను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడంతో ప్రమాదానికి కారణమైన వారితో పాటు తండ్రి కటకటాలపాలయ్యారు. మల్లాపూర్‌లో నివాసం ఉంటూ గోవాలో ఎంఎస్ చదువుతున్న వాకిటి సుజిత్ రెడ్డి(24) స్నేహితుడు ఆశిష్‌తో పాటు మరో ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ సమీపంలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకొని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఈ నెల 27 ఉదయం 5.30 గంటల సమయంలో ఆశిష్‌తో కలిసి ఆడి కారులో కృష్ణానగర్ బయలు దేరారు. అతి వేగంగా వెళుతూ ముందు వెళుతున్న ఆటోను ఢీ కొట్టడంతో వెనక సీట్లో కూర్చున్న వై.ఉమేష్ కుమార్ (37, పబ్‌లో వర్కర్) ఎగిరి ఫుట్‌పాత్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత కారులో ఉన్నవారు ఆగకుండా ముందుకు వెళ్లి కారు నెంబర్ ప్లేట్లు తీసేసీ ఇనార్బిట్ మాల్ వైపు పరిగెత్తారు. అక్కడి నుంచి సుజిత్‌రెడ్డి తండ్రి రఘునందన్ రెడ్డికి ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఆటోలో రావాలని చెప్పాడు. కొడుకును డీడీ కాలనీలో దాచిపెట్టారు. ఈ నెల 28న డ్రైవర్ ప్రభాకర్ (52) కారు నడిపాడని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. సీసీ పుటేజీలో యువకులు పరిగెత్తినట్లు కనిపించడంతో పోలీసులు తమ స్టయిల్లో విచారించారు. డైవర్‌ను మార్చే ప్రయత్నం చేశామని ఒప్పుకోవడంతో రఘునందన్ రెడ్డిపై ఐపీసీ 202, 203, 205,212,419,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నెంబర్ ప్లేట్లు తీస్తుండగా చూసిన ఇద్దరు వ్యక్తులను బెదిరించారు. కారు నడిపిన సుజీత్ రెడ్డితోపాటు, అశిష్‌పై 304(2), 201,506, రెడ్ విత్ 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: హైటెక్ సిటీలో కారు బీభత్సం.. ఫుట్‌పాత్‌పై ఎగిరిపడ్డ ఆటో ఎగిరి కింద పడి మృతి చెందిన ఉమేష్ కుమార్ నుజ్జునుజ్జయిన ఆటో -
ఐకియాకు భారీ షాక్..!
పారిస్: ప్రముఖ స్వీడిష్ ఫర్నీచర్ కంపెనీ ఐకియాకు ఫ్రాన్స్‌లో భారీ షాక్ తగిలింది. ఆ దేశపు కోర్టు కంపెనీపై సుమారు ఒక మిలియన్ డాలర్ల జరిమానాను విధించింది. ఐకియా తన కస్టమర్ల, ఉద్యోగులపై గూడచర్యం చేసిందని కోర్టు తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టోర్లను కలిగి ఉన్న ఐకియా గత కొన్ని సంవత్సరాలుగా వినియోగదారుల, ఉద్యోగుల సమాచారాన్ని అక్రమంగా సేకరిస్తోందని కంపెనీపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ పద్ధతుల ద్వారా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను సమీక్షించినట్లు ప్రముఖ ఫ్లాట్‌ప్యాక్ ఫర్నిచర్ గ్రూప్ ఆరోపణలు చేయసాగింది. ఉద్యోగుల, కస్టమర్ల గోప్యతకు భంగం వాటిల్లేలా ఐకియా ప్రవర్తించిందని ఫ్లాట్‌ప్యాక్ ఫర్నిచర్ గ్రూప్ తెలిపింది. అంతేకాకుండా ఐకియా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కస్టమర్ల, ఉద్యోగుల డేటాను వాడినట్లు కోర్టు ధృవీకరించింది. కాగా ఈ విషయంపై ఐకియా స్సందించింది. మరలా ఇలాంటివి జరగకుండా చూస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఐకియాకు ఫ్రాన్స్ మూడో అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్ దేశంగా నిలుస్తోంది. సుమారు ఐకియాకు ఫ్రాన్స్‌లో సుమారు పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. చదవండి: ఫ్రాంక్లిన్ ఏఎంసీ, ఉద్యోగులపై భారీ జరిమానా -
ఐకియా ఫ్యామిలీ క్రెడిట్ కార్డ్
సాక్షి, హైదరాబాద్: ఫర్నీచర్ రంగ సంస్థ ఐకియా తాజాగా ఫ్యామిలీ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తెచ్చింది. సిటీ బ్యాంక్ భాగస్వామ్యంతో మాస్టర్‌కార్డ్ ఈ కార్డును ప్రవేశపెట్టింది. ఈ కార్డుతో స్టోర్‌లో భారత్ క్యూఆర్ ద్వారా చెల్లింపులు జరుపవచ్చు. రివార్డు పాయింట్లూ పొందవచ్చు. ఆకర్షణీయ ఈఎంఐలు అందుకోవచ్చని ఐకియా ఇండియా కమర్షియల్ మేనేజర్ కవితరావు బుధవారం తెలిపారు. జాయినింగ్, వార్షిక ఫీజు ఏవీ ఉండవు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కస్టమర్లు ఐకియా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. కాగా, ఫిన్స్లిప్యాడ్, నాస్ట్రైట్ పేరుతో టెక్స్టైల్స్, డెకోరేటివ్స్ శ్రేణిలో మేడిన్ ఇండియా ఫెస్టివ్ కలెక్షన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఆ టిప్స్‌తో జాగ్రత్త! లిస్టెడ్ సంస్థల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లకు సెబీ హెచ్చరిక న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి అయాచిత టిప్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. సెక్యూరిటీస్ మార్కెట్లో లావాదేవీలు జరపడానికి ముందుగా తగు రీతిలో మదింపు చేయాలని సూచించింది. రకరకాల షేర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటూ బల్క్ ఎస్ఎంఎస్లు, వెబ్సైట్లు, వాట్సాప్.. టెలిగ్రాం వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా భారీ స్థాయిలో అయాచిత సలహాలు పెరిగిపోతున్న నేపథ్యంలో సెబీ ఈ ప్రకటన చేసింది. గృహ రుణ సర్వీసుల్లోకి మ్యాజిక్‌బ్రిక్స్ న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పోర్టల్ మ్యాజిక్‌బ్రిక్స్ గృహరుణ సర్వీసుల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా పలు ప్రధాన బ్యాంకులతో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఆవిష్కరణ నుంచి లావాదేవి దశ వరకు ఇంటి కోనుగోలుదారులకు సమగ్రమైన సేవలను అందించడమే లక్ష్యమని పేర్కొంది. రుణాలు తీసుకోవాలనుకునే వారు ఆప్లికేషన్ ప్రాసెస్ ద్వారా ఉత్తమ ఆఫర్ రేట్లను ఆన్లైన్, ఆఫ్లైన్లలో పోల్చి చూసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు విరివిగా రుణం సాక్షి, హైదరాబాద్: రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వినియోగదార్లకు విస్తృత స్థాయిలో రుణ లభ్యత కోసం నడుం బిగించింది. 17 బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఫిన్‌టెక్ సంస్థలతో చేతులు కలిపినట్టు ప్రకటించింది. వీటిలో ఎస్బీఐ, ఎస్బీఐ కార్డ్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా, ఫెడరల్ బ్యాంక్, పేటీఎం తదితర సంస్థలు ఉన్నాయి. కొత్త కస్టమర్లను ఆకర్శించే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదుర్చుకుంది. తద్వారా 25 కోట్లకుపైగా ఉత్పత్తులను వినియోగదార్లకు చేరువ చేయాలన్నదే సంస్థ ధ్యేయం. అలాగే ఏడు కోట్ల మందికిపైగా కస్టమర్లకు క్రెడిట్ సౌకర్యం అందిస్తుందని తెలిపింది. 60 బ్రాండ్లకు చెందిన గిఫ్ట్ కార్డులను కూడా ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోం ఫర్నీషింగ్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంటుందని ఫ్లిప్‌కార్డ్ ఫిన్‌టెక్, పేమెంట్స్ గ్రూప్ హెడ్ రంజిత్ బోయనపల్లి ఈ సందర్భంగా తెలిపారు. -
ఐకియా స్టోర్‌లో మహిళ అసభ్య ప్రవర్తన
బీజింగ్: చైనాలోని ఓ మహిళ ఐకియా స్టోర్‌లో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. అర్ధనగ్నంగా తిరుగుతూ అనుచితంగా ప్రవర్తిస్తోంది. దీంతో తమ సెక్యూరిటీని మరింత పెంచుకోవాలని భావిస్తున్నట్లు ఐకియా బృందం వెల్లడించింది. కాగా ఈ అసభ్య వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. గ్వాంగ్డాంగ్ పరిధిలో ఈ ఘటన జరిగినట్లు చైనీస్ నెటిజన్లు పేర్కొంటున్నారు. అంతేకాక స్టోర్‌లో ఎవరూ మాస్కులు ధరించకపోవడాన్ని బట్టి ఇది జనవరిలో జరిగి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. (‘కరోనా’ ఎఫెక్ట్; ఐకియా కీలక నిర్ణయం) మరోవైపు ఈ క్లిప్పింగ్‌పై స్పందించిన ఫర్నిచర్ రిటైల్ దిగ్గజం ఐకియా కంపెనీ సదరు మహిళ ప్రవర్తనపై మండిపడింది. ఇటువంటి అనుచిత ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారమిచ్చామని పేర్కొంది. ఇకపై భద్రతతోపాటు, ప్రజా పరిశుభ్రతపైనా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే ఇలాంటి ఘటనలు అక్కడ కొత్తేమీ కాదు. 2015లో బీజింగ్‌లోని జపనీస్ వస్త్ర దుకాణంలో ఓ జంట శృంగారంలో పాల్గొనగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ఈ ఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. -
లవ్లీ ఫ్లవర్స్...
-
‘కరోనా’ ఎఫెక్ట్; ఐకియా కీలక నిర్ణయం
బీజింగ్ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ చైనాను ఆర్థికంగా కూడా దెబ్బతీస్తోంది. చైనాలోని నగరాలతోపాటు ప్రపంచదేశాలకు కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆయా దేశాలు చైనాలో ఉన్న తమ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశాయి. పలు విమానయాన సంస్థలు చైనా విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద ఫర్నిచర్ రిటైలర్ స్వీడన్ కు చెందిన ఐకియా కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలోని తన 30 దుకాణాలలో సగం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరించిన వుహాన్ నగరంలోని దుకాణాన్ని ఇప్పటికే మూసి వేసింది. వ్యాధి వ్యాప్తిని సమర్థవంతంగా నియంత్రించేందుకు సహకరించాలన్న చైనా ప్రభుత్వం పిలుపునకు ప్రతిస్పందనగా జనవరి 29 నుండి చైనాలోని సగం దుకాణాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. బాధిత ఉద్యోగులు తదుపరి నోటీసు వచ్చేవరకు విధులకు హాజరు కానవసరం లేదని ఇంట్లోనే వుంటారని తెలిపింది. కాగా చైనాలో సుమారు 14,000 మందికి ఉపాధి కల్పిస్తోంది ఐకియా. గత నెలలో బైటపడిన చైనాలో కరోనా వైరస్ బారిన పడి చనిపోయినవారి సంఖ్య బుధవారం నాటికి 132కు పెరిగిన సంగతి తెలిసిందే. -
భారత్ ప్లాస్టిక్ కప్పులకు డబ్బు వాపస్: ఐకియా
న్యూఢిల్లీ: భారత్‌లో తయారయ్యే ప్లాస్టిక్ కప్పుల తయారీదారులకు రిటైల్ దిగ్గజం ఐకియా స్టోర్స్ షాకిచ్చింది. కేవలం భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 400 స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను సమీక్షించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కప్పులలో అత్యధిక స్థాయిలో కెమికల్స్ ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఓ కంపెనీ అధికారి స్పందిస్తూ ఇప్పటి వరకు ఆరోగ్యానికి హానికరమైన అంశాలను గుర్తించలేదని.. కేవలం వినియోగదారుల శ్రేయస్సు దృష్యా సమీక్షిస్తున్నామని తెలిపారు. వ్యాపార వర్గాలు మాత్రం కప్పులలో కెమికల్స్ స్థాయిని తెలుసుకోవడానికి ఐకియా స్టోర్స్ యాజమాన్యం పరీక్షలకు పంపించిందని.. ఈ పరీక్షల అనంతరం కప్పుల్లో డై బ్యుటైల్ తాలేట్ అనే కెమికల్ అధిక స్థాయిలో ఉన్నట్లు గుర్తించారని వ్యాపార వర్గాలు తెలిపాయి. ఐకియా స్టోర్లలో ప్లాస్టిక్ కప్పులను కొనుగోలు చేసిన వినియాగదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. వినియాగదారులు ఏ రకంగా కోనుగోళ్లు చేసినా డబ్బులను తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో చెల్లించినా, రశీదు లేకపోయినా కప్పులను స్టోర్స్‌కు తీసుకురాగలిగితే చెల్లించిన డబ్బు తిరిగి ఇస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలలో 400 ఐకియా రిటైల్ స్టోర్స్ ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ఐకియా బంపర్ ఆఫర్ -
ఐకియా బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ గృహోపకరణాల సంస్థ ఐకియా వార్షికోత్సవం సందర్భంగా తన కస్టమర్లకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ నెల 18లోగా ఫ్యామిలీ మెంబర్షిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని స్టోర్‌లో కొనుగోలు చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెంబర్షిప్ కార్డు తీసుకుని ఆపై తమ అనుభూతులను, ఫోటోలతో సహా ఐకియా ఫ్యామిలీ పేజీలో పంచుకున్న వారి నుండి టాప్ 20 కథనాలను ఎంపిక చేసి వెబ్సైట్లో ఓటింగ్ పెడతామని, సెప్టెంబర్ 9 నుండి 20వ తేదీ వరకు సాగే ఓటింగ్‌లో విజేతలుగా నిలిచిన కుటుంబాలను స్వీడన్‌లోని (6 డేస్, 5 నైట్స్) వివిధ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం కల్పిస్తామని ఐకియా ప్రకటన పేర్కొంది. తెలంగాణా వాసులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. -
ఐకియా ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారతదేశంలో తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన స్వీడిష్ ఫర్నిచర్, ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా... ‘లెట్స్ ప్లే ఫర్ చేంజ్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పిల్లలు, పెద్దలకు ఆటల ప్రాముఖ్యతను తెలియజేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ఐకియా స్టోర్లలో పలు చోట్ల ఆటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఐకియా బిర్యానీలో గొంగళి పురుగు
హైదరాబాద్: ఐకియా స్టోర్‌లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేపింది. శుక్రవారం స్టోర్‌కు వెళ్లిన మొహమ్మద్‌కు బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. ఈ విషయాన్ని అతడు స్టోర్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ట్విటర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై స్పందించిన జీహెచ్ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు శనివారం స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు. స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఆగస్టులో స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
ఐకియా స్టోర్ ఆరంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్‌లో ఐకియా గ్రూప్ తొలి స్టోర్ గురువారం ఆరంభమయింది. తొలిరోజు కొనుగోలుదారులు, ఔత్సాహికులు విపరీతంగా పోటెత్తారు. స్టోర్‌ను ఆరంభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ... ఐకియా సంస్థ హైదరాబాద్‌కు రావటం తమ ప్రభుత్వ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాల ఫలితమన్నారు. అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలున్న ఐకియా.. అందుబాటు ధరల్లో హోమ్ ఫర్నిషింగ్‌ను అందిస్తుందన్నారు. ‘‘ఈ సంస్థ స్థానికంగా సమీకరిస్తున్న వస్తువుల్లో 30 శాతం తెలంగాణవే. ఇక్కడి చేనేత ఉత్పత్తులు, నిర్మల్ పెయింటింగ్స్, గ్లాస్ వర్క్స్‌ను ఐకియాలో విక్రయానికి పెడతారు. దీంతో ప్రావీణ్యం గల కార్పెంటర్లకూ ఉపాధి కలుగుతోంది’’ అని వివరించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయి సంస్థలు మరెన్నో రానున్నాయని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భారత్‌లోని స్వీడన్ రాయబారి క్లాస్ మోలిన్తో పాటు తెలంగాణ ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ , ఐకియా గ్రూప్ సీఈఓ జాస్పర్ బ్రాడిన్, గ్రూప్ డిప్యూటీ సీఈఓ జువెన్సియో మాజు, ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్, తెలంగాణ ఎండీ జాస్ అచిలియా తదితరులు పాల్గొన్నారు. -
బంపర్ ఆఫర్‌తో ఐకియా స్టోర్ వద్ద తోపులాట
సాక్షి, హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో పాటు దాదాపు 1000 రకాల ఉత్పత్తుల ధర రూ. 200లోపు విక్రయించడంతో జనాలు విపరీతంగా తరలి వచ్చారు. ఓకే సారి భారీ జనం తరలిరావడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపుచేయలేక పోయారు. బారికేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్టోర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్ ఏర్పాటు చేసింది. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ ఐకియా స్టోర్ వద్ద తోపులాట
-
ఐకియా స్టోర్‌ను లాంచ్ చేసిన కేటీఆర్
-
హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ లాంచ్
-
ఐకియా స్టోర్ వచ్చేసింది.. ఇక పండుగే
సాక్షి, హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌కు వచ్చేసింది. తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఐకియా స్టోర్ ప్రారంభోత్సవ వేడుకలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. మన సొంత హైదరాబాద్, తెలంగాణ ద్వారా మరో ప్రముఖ బ్రాండ్ భారత్‌లోకి ప్రవేశించిందని మంత్రి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు, ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్, భారత్‌లో స్వీడన్ అంబాసిడర్ క్లాస్ మోలిన్, ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్‌లు పాలుపంచుకున్నారు. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్ వెల్లడించారు. హైదరాబాద్ స్టోర్ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో 40 నగరాల్లో.. దేశంలో 40 నగరాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వెల్కమ్ టు ఐకియా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా... ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. గురువారం ఈ స్టోర్ ప్రారంభం కానుంది. హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం. ప్రత్యక్షంగా ఈ స్టోర్‌లో 950 మంది పనిచేస్తున్నారు. ఐకియా పాలసీ ప్రకారం వీరిలో సగం మంది మహిళలున్నారని ఐకియా రిటైల్ ఇండియా సీఈవో పీటర్ బెజెల్ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ స్టోర్ ద్వారా పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. భారత్‌లో 40 నగరాల్లో.. దేశంలో 40 నగరాల్లో ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నది ఐకియా ప్రణాళిక. 2025 నాటికి 25కు పైగా సెంటర్లు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటి వరకు భారత్‌లో కంపెనీ సుమారు రూ.5,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ముంబై స్టోర్ 2019 వేసవిలో అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత బెంగళూరు, గురుగ్రామ్‌లో సైతం ఐకియా కేంద్రాలు రానున్నాయి. అహ్మదాబాద్, పుణే, చెన్నై, కోల్‌కతా, సూరత్‌లోనూ ఏర్పాటు చేస్తామని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ తెలిపారు. 20 కోట్ల మంది కస్టమర్లను మూడేళ్లలో చేరుకోవాలన్నది సంస్థ లక్ష్యం. పన్నులు సరికాదు..: దిగుమతి చేసుకునే ఫర్నిచర్‌పై అధిక పన్నులకు బదులు దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని ఐకియా గ్రూప్ సీఈవో జాస్పర్ బ్రాడిన్ సూచించారు. ‘ఎక్కువ పన్నులతో కస్టమర్లకే భారం. తయారీ మెరుగుపడదు. భారత్‌లో స్థలం కొనుగోలు, హక్కుల బదిలీ క్లిష్టమైన ప్రక్రియ. అందుకే ఇక్కడ స్టోర్ల ప్రారంభం ఆలస్యం అయింది. రిటైల్‌లో తరచూ మారే విధానపర నిర్ణయాలు ఆందోళన కలిగించే విషయం. పాలసీలు ఆకట్టకునేలా ఉండాలి. దీర్ఘకాలిక వ్యూహంతోనే ఇక్కడ అడుగుపెట్టాం’ అని వివరించారు. -
హైదరాబాద్‌లో ఐకియా స్టోర్ ఫోటోలు మీకోసం..
-
ఇది ‘భారతీయ’ ఐకియా..!!
ఈ నెల 19న హైదరాబాద్ స్టోర్ ఆరంభంఇక్కడి జనాభాకు తగ్గట్టు భారీ రెస్టారెంట్ వంటకాల్లోనూ ‘భారతీయ’ మార్పులు...ప్రపంచంలోనే తొలిసారిగా ‘ఐకియా’ డెలివరీ దీనికోసం 150 మంది సిబ్బంది; ‘గతి’తో భాగస్వామ్య ఒప్పందం విక్రయించే వస్తువుల్లోనూ మార్పుచేర్పులుఫర్నిషింగ్, ఫర్నిచర్ విక్రయాలు మాత్రమే... వచ్చే ఏడాది ముంబై స్టోర్‌తో ఆన్‌లైన్‌లోకి కూడా... ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్ వెల్లడి ఐకియా... ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ స్వీడిష్ కంపెనీ వార్షికాదాయం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు. హోమ్ ఫర్నిషింగ్ రంగంలో తిరుగులేని అంతర్జాతీయ దిగ్గజం ఈ సంస్థ. కాకపోతే 75 ఏళ్ల కిందట చిన్న దుకాణంగా ఆరంభమైన ఈ సంస్థకు.. కొన్ని నియమాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా స్టోర్లన్నీ ఒకేలా ఉంటాయి. ప్రతి స్టోర్‌లోనూ ఉద్యోగుల్లో 50% మగవారు, 50% మహిళలు ఉంటారు. ప్రతి స్టోర్‌లో రెస్టారెంట్ కూడా ఉంటుంది. వీటన్నిటితో పాటు... ఐకియాలో విక్రయించే వస్తువులన్నీ దాదాపుగా అట్టపెట్టెల్లో ప్యాక్ చేసేసుకోవచ్చు. ఎవరికి వారు ఇంటికి తెచ్చుకుని సొంతంగా బిగించేసుకోవచ్చు. అలాంటి ఐకియా... భారత్‌లో అడుగుపెట్టడానికి ఆరేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలెట్టింది. మొట్టమొదటి స్టోర్‌కు హైదరాబాద్‌ను ఎంచుకుంది. అవన్నీ ఫలించి... తొలి స్టోర్ ఈ నెల 19న ఆరంభమవుతోంది. ఈ సందర్భంగా ఐకియా ఇండియా సీఈఓ పీటర్ బెజెల్ బుధవారం కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్ కోసం తమ నియమాలు కొన్నింటిని ఎలా మార్చుకుంటున్నదీ వివరించారు. అవేమిటంటే... భారీ రెస్టారెంట్... ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఐకియా స్టోర్‌లో భారీ రెస్టారెంట్ ఉంటుంది. కనిష్ఠంగా 400 నుంచి గరిష్ఠంగా 700 మంది ఒకేసారి కూర్చునే వీలుం టుంది. కానీ హైదరాబాద్ జనాన్ని, ఇక్కడి మార్కె ట్ను చూశాక ఆ మాత్రం సీట్లు సరిపోతాయన్న నమ్మకం ఐకియాకు లేకపోయింది. అందుకే.. ఇక్కడ ఏకంగా ఒకేసారి వెయ్యి మంది కూర్చునేలా భారీ రెస్టారెంట్‌ను నిర్మించారు. అన్నిచోట్లా రెస్టా రెంట్లలో ఫోర్క్‌ను విక్రయిస్తుండగా.. ఇక్కడి ఆచార వ్యవహారాల కారణంగా దాన్ని నిషేధించారు. డెలివరీ కూడా చేస్తారు? ప్రపంచంలో ఎక్కడా ఐకియా తను విక్రయించే వస్తువుల్ని డెలివరీ చెయ్యదు. అదే ఈ సంస్థ ప్రత్యేకత కూడా. ఫర్నిచర్, ఫర్నిషింగ్ వస్తువుల్ని అట్టపెట్టెల్లో పట్టేలా తయారు చెయ్యడం, ఎవరికి వారు రవాణా చేసుకునేందుకు వీలుగా ఉంచటం సంస్థ ప్రత్యేకత. ఈ ఖర్చులన్నీ లేకపోవటం వల్ల ఐకియాలో వస్తువులు తక్కువ ధరకు లభిస్తుంటాయి కూడా. కానీ ఇండియాలో ఈ పద్ధతి పనిచెయ్యదేమోనని సంస్థ సందేహిస్తోంది. అందుకే ఇక్కడ కావాలనుకున్న వారికి కాస్తంత అదనపు ఛార్జీలతో వస్తువుల్ని డెలివరీ చెయ్యడానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వస్తువుల్ని ఇంటివద్దకు తెచ్చి బిగించడానికి 150 మంది సిబ్బందిని అదనంగా నియమించుకుంది. వీరిలో సగం మహిళలే. ఇంకో విశేషమేంటంటే వస్తువుల్ని ఇంటికి డెలివరీ చెయ్యడానికి హైదరాబాద్‌లో ప్రముఖ లాజిస్టిక్ సంస్థ ‘గతి’తో ఒప్పందం చేసుకున్నట్లు కూడా పీటర్ బెజెల్ తెలియజేశారు. అమ్మే వస్తువుల్లోనూ మార్పులు ఐకియాలో ఎక్కడైనా వస్తువులు ఒకేలా ఉంటాయి. కానీ హైదరాబాద్ స్టోర్‌కు వచ్చేసరికి కొన్ని వస్తువుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు చెంచాల సెట్‌ను తీసుకుంటే... అందులో చెంచాలు, ఫోర్క్‌లు మాత్రమే ఉన్నాయి. ఇతర దేశాల్లోని మాదిరిగా చాకు లేదు. ‘‘అది ఇండియాకు అంత ముఖ్యం కాదు. అందుకే దాన్ని సెట్ నుంచి తీసి విడిగా పెట్టాం’’ అని చెప్పారు బెజెల్. మరో విశేషమేంటంటే ఎక్కడైనా ఐకియా స్టోర్లలో బెడ్షీట్లు, లినెన్ వంటివి ప్రింటెడ్ కలర్స్ దొరకవు. ప్లెయిన్‌వి మాత్రమే దొరుకుతాయి. ‘‘భారతీయుల అవసరాలు వేరు. అభిరుచులు వేరు. అందుకే తొలిసారిగా ఇక్కడ ప్రింటెడ్ బెడ్ షీట్లను విక్రయానికి పెడుతున్నాం’’ అని బెజెల్ వివరించారు. గృహోపకరణాలు లేవు? మిగతా దేశాల్లోని ఐకియా స్టోర్లలో టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి గృహోపకరణాలన్నీ విక్రయిస్తుంటారు. వాటికి వేరేవేరే బ్రాండ్లు కూడా ఉంటాయి. నిజానికి ఈ బ్రాండ్ల టీవీల వంటివి నాణ్యంగా ఉండటంతో పాటు ధర కూడా తక్కువే. కాకపోతే హైదరాబాద్‌తో సహా ఇండియాలో రాబోయే స్టోర్లలో ప్రస్తుతానికి అలాంటి అవకాశమేదీ లేదు. ఎందుకంటే ఐకియా ఇక్కడ అడుగుపెడుతున్నది సింగిల్ బ్రాండ్ రిటైల్ మార్గంలోనే. అంటే.. ఏం విక్రయించినా ఐకియా బ్రాండ్‌తోనే విక్రయించాలి. ‘‘అందుకే ఇక్కడ ఫర్నిచర్, హోమ్ ఫర్నిషింగ్‌తో పాటు లైటింగ్ పరికరాలు, వంటింటి ఉపకరణాలు మాత్రం విక్రయిస్తున్నాం. ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకరణాలు విక్రయించటం లేదు’’ అని బెజెల్ ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లోకి... ఐకియా తెలంగాణ ఎండీ జాన్ అచిలియాతో కలిసి బెజెల్ మరిన్ని వివరాలు వెల్లడించారు. రెండవ స్టోర్ వచ్చే ఏడాది ముంబైలో ఆరంభమవుతుందని, దాంతో పాటే దేశంలో ఆన్లైన్ విక్రయాలను కూడా ఆరంభిస్తామని తెలియజేశారు. వారంలో ఏడు రోజులూ స్టోర్ తెరిచే ఉంటుందని, రోజూ ఉదయం 10 నుంచి రాత్రి 11 వరకూ పనిచేస్తుందని వెల్లడించారు. ‘‘భారతదేశంలో మా వ్యాపారమనేది దీర్ఘకాలిక లక్ష్యం. తొలుత భారీ నగరాలపై దృష్టి పెడతాం. వచ్చే నాలుగేళ్లలో పాతిక స్టోర్లు ఏర్పాటు చేస్తాం. ఆ తరవాత 10 లక్షల జనాభా దాటిన 49 నగరాల్లోనూ స్టోర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యం ఉంది. హైదరాబాద్ స్టోర్‌కు దాదాపు రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ముంబైలో ఆన్లైన్ విక్రయాలు ఆరంభించాక.. పరిస్థితిని చూసి వాటిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. ఇక మేం విక్రయించే వస్తువుల్లో 20% ఇప్పటికే స్థానికంగా తయారు చేయిస్తున్నాం. మిగతా 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. స్థానికంగా తయారు చేసే వస్తువుల్ని 50 శాతానికి చేర్చాలనే దీర్ఘకాలిక లక్ష్యం ఉంది. ఇండియాకు తగ్గట్టుగా ఇప్పటికే కొన్ని మార్పులు చేశాం. మున్ముందు మరిన్ని మార్పులకు సిద్ధం’’ అని వివరించారు. రెండేళ్ల శ్రమ కొలిక్కొచ్చింది... హైదరాబాద్ స్టోర్ ఏర్పాటు చేయడానికి రెండేళ్లు పట్టింది. మావి స్వల్పకాలిక లక్ష్యాలు కావు. రెండేళ్లలో లాభాల్లోకి వచ్చేసి... నాలుగేళ్లలో మొత్తం పెట్టుబడిని రాబట్టుకోవాలని, త్వరత్వరగా దేశమంతా విస్తరించెయ్యాలని మేం అనుకోవటం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మాది వందేళ్ల వ్యూహం. పెట్టుబడులు పెడుతూనే ఉంటాం. విస్తరిస్తూనే ఉంటాం. ఇక్కడి ఉద్యోగులంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారికి ఐదురోజుల పనిదినాలు మాత్రమే కాదు. కనీస వేతనాలకన్నా రెట్టింపు ఇస్తున్నాం. కనీస వేతనం అనే మాట పక్కనబెట్టి జీవనానికి అవసరమైన వేతనం చెల్లించాలనేది మా ఉద్దేశం. ఉద్యోగుల్లో సగం మంది మహిళలుండాలనే మా నిబంధనను మాత్రం మేం ఎక్కడ సవరించుకోవటం లేదు. –జాన్ అచిలిస్, హెడ్(తెలంగాణ– ఐకియా) మంథా రమణమూర్తి -
రూ.200 కంటే తక్కువకే ఫర్నీచర్
హైదరాబాద్ : స్వీడిష్‌కు చెందిన ఫర్నీచర్ దిగ్గజ కంపెనీ ‘ఐకియా’ భారత్‌లో ధరల యుద్ధానికి సిద్ధమైంది. ఈ జూలై నెలలో హైదరాబాద్‌లో తన ఫర్నీచర్ స్టోర్‌ను నెలకొల్పి, తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. తొలిసారి భారత మార్కెట్లోకి వస్తున్న క్రమంలో తన 15 శాతం ఉత్పత్తులను 200 రూపాయలకు లేదా అంతకంటే తక్కువకే ఆఫర్ చేయబోతున్నట్టు టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ఐకియా ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రిటైలర్. సరసమైన ధరల్లో ఈ కంపెనీ తన ఉత్పత్తులను ఆఫర్చేస్తోంది. భారత వినియోగదారుల కోసం ఈ ధరలను మరింత తగ్గించబోతున్నట్టు తెలిపారు. ‘తక్కువ ధరలతో మేము భారత మార్కెట్లోకి ఎంతో విశ్వాసంతో ప్రవేశిస్తున్నాం. స్టోర్ ప్రారంభించినప్పుడు 15 శాతం ఉత్పత్తులను అంటే 1000 ప్రొడక్ట్‌లను 200 రూపాయల కంటే తక్కువకు ఆఫర్ చేస్తాం’ అని ఐకియా ఇండియా మహారాష్ట్ర మార్కెట్ మేనేజర్ పర్ హార్నెల్ చెప్పారు. తమ రెండో స్టోర్‌ను ముంబైలో ఏర్పాటు చేస్తామని, దాన్ని 2019 మధ్యలో లాంచ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఆశ్చర్యకరంగా ఐకియా, ముంబై లాంచ్ అనంతరం తన ఆన్లైన్ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయనుంది. డిజిటల్ విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు ఈ కంపెనీ ఆన్లైన్ అమ్మకాలపై అంత సీరియస్‌గా తీసుకోకపోవడం గమనార్హం. హోమ్ ఫర్నీసింగ్ కన్సల్టెన్సీ వంటి కొత్త బిజినెస్ మోడల్స్‌ను కూడా ఐకియా పరిశీలిస్తోంది. ఐకియా ఇటీవలే అర్బన్ క్లాప్ అనే మొబైల్ ఆధారిత సర్వీసు ప్లాట్‌ఫామ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన హైదరాబాద్ స్టోర్‌కు ఇదే ఫర్నీచర్ సర్వీసు పార్టనర్. తక్కువ ధరలకే సర్వీసులు అందజేయడానికి ఇది అనుమతి ఇస్తుందని హార్నెల్ చెప్పారు. భారత హోమ్ ఫర్నీచర్, ఫర్నీసింగ్ మార్కెట్ 2016 నుంచి 2021 మధ్యలో 13 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధిని సాధించినట్టు కన్సల్టెన్సీ సంస్థ వాజిర్ అడ్వయిజర్స్ పేర్కొంది. 2016 సెప్టెంబర్ నుంచి 2017 ఆగస్టు వరకు ఐకియా గ్రూప్ రెవెన్యూలు 1.7 శాతం పెరిగాయి. కంపెనీ వెబ్సైట్ 2.3 బిలియన్ హిట్స్‌ను సాధించింది. గ్లోబల్‌గా తమ రిటైల్ స్టోర్లను 936 మిలియన్ మంది సందర్శించినట్టు కూడా పేర్కొంది. మొత్తం 49 మార్కెట్లలో 403 స్టోర్లను ఐకియా కలిగి ఉంది. -
ఐకియా ఇండియా సీఈవోగా పీటర్ బెజెల్
న్యూఢిల్లీ: ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత విభాగం సీఈవోగా కొత్తగా పీటర్ బెజెల్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న జువెన్సియో మేజ్తూ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఐకియా గ్రూప్ ఇన్‌గా హోల్డింగ్ సీఎఫ్‌వో, డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. స్వీడన్‌కి చెందిన హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ అయిన ఐకియా భారత్‌లో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో త్వరలోనే ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త సీఈవోగా నియమితులైన బెజెల్.. ఇప్పటిదాకా జర్మనీ విభాగానికి సారథ్యం వహించినట్లు ఐకియా తెలిపింది. దాదాపు పాతికేళ్లుగా ఐకియాలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. -
పురుష ఉద్యోగులకు బంపర్ ఆఫర్
స్వీడన్‌కు ఫర్నిచర్ కంపెనీ ఐకియా ఇండియా తన కంపెనీలో తల్లితండ్రులైన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిడ్డకు జన్మనిచ్చిన తల్లితోపాటు తండ్రికూడా ఆరు నెలల సెలవు దినాలను వర్తింప చేయనుంది. ఈ మేరకు కొత్త పేరెంటల్ లీవ్ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఇక మీదట పురుష ఉద్యోగులకు కూడా ఆరు నెలల పెయిడ్ పెటర్నటీ లీవును అమలు చేయనుంది. తన సహ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ కొత్త విధానాన్ని ప్రకటించడం సంతోషగా ఉందని ఐకియా హెచ్ఆర్ మేనేజర్ అన్నా కారిన్ మాన్సన్ చెప్పారు. మహిళా ఉద్యోగులకు 26 వారాలకు వేతనంతోకూడిన సెలవుదినాలతోపాటు , మరో 16 వారాల పాటు పనిగంటల్లో 50శాతం కోత పెడుతున్నట్టు స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా. సంస్థలో ఉద్యోగులందరికీ ఈ కొత్త విధానాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు తల్లులైన మహిళా ఉద్యోగులకు అదనపు సౌకర్యాలను కల్పించనున్నామని చెప్పారు. ట్యూబెక్టమీ చేయించుకున్న మహిళలకు అదనంగా మరో రెండువారాల సెలవు ఇస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ గర్భధారణ, ప్రసవం కారణంగా అనుకోని అనారోగ్యం బారిన పడితే గరిష్టంగా ఒక నెలపాటు సెలవు ఇస్తున్నట్టు తెలిపింది. సరోగేట్, సింగిల్ పేరెంట్, దత్తత తీసుకున్నా కూడా ఈ నిబంధన వర్తిస్తున్నందని కారిన్ మాన్సన్ తెలిపారు. 50/50 లింగ సమతుల్యతను సాధించే దిశగా తాము కృషి చేస్తున్నట్టు తెలిపారు. కుటుంబ బాధ్యతల్లో, పిల్ల పెంపకంలో ఉన్న ఉద్యోగుల కరియర్ కోసం డే కేర్ సెంటర్లు, దీర్ఘకాలిక శిక్షణ, డెవలప్మెంట్ ప్లాన్స్ లాంటి కొన్ని ప్రత్యేక చర్యల్ని కూడా చేపడుతున్నట్టు చెప్పారు. కాగా జర్మనీకి చెందిన బ్యాంకింగ్ దిగ్గజం డ్యుయిష్ బ్యాంక్ ఇండియా కూడా తండ్రులు 6 నెలల సెలవును ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
స్టీల్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకం!
♦ ఇది టన్నుకు 557 డాలర్లు వరకు ఉండొచ్చు ♦ ఎంఐపీపై కేంద్ర నిర్ణయం స్టీల్ పరిశ్రమకు కీలకం: ఇక్రా న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశంలోకి దిగుమతయ్యే పలు స్టీల్ ప్రొడక్ట్స్‌పై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించనుంది. ఇది టన్నుకు 557 డాలర్ల వరకు ఉండొచ్చని తె లుస్తోంది. చైనా, జపాన్, కొరియా, రష్యా, బ్రెజిల్, ఇండోనేసియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే అలాయ్/నాన్ అలాయ్ స్టీల్ హాట్ రోల్డ్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ ధరలు సాధారణ స్థాయి కన్నా తక్కువ గా ఉన్నట్లు డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ యాంటీ డంపింగ్ అండ్ అలీడ్ డ్యూటీస్ (డీజీఏడీ) పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశ ంలోకి వచ్చే పలు స్టీల్ ఉత్పత్తులపై టన్నుకు 474-557 డాలర్ల స్థాయిలో యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా ఇతర దేశాల నుంచి మనకు దిగుమతి అవుతున్న పలు స్టీల్ ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం విధించాలని ఎస్సార్ స్టీల్ ఇండియా, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా డీజీఏడీని ఇదివరకే అభ్యర్థించాయి. కేంద్రపు ఎంఐపీ నిర్ణయంపైనే స్టీల్ పరిశ్రమ భవితవ్యం: ఇక్రా కేంద్ర ప్రభుత్వం కనీస దిగుమతి ధర (ఎంఐపీ) అంశంపై తీసుకోనున్న నిర్ణయంపైనే దేశీ స్టీల్ పరిశ్రమ భవిష్యత్తు ఆధారపడి ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లోని మిగులు ఉత్పత్తి, అధిక దిగుమతులు, చౌక ధరలు వంటి అంశాల కారణంగా దేశీ స్టీల్ పరిశ్రమ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపింది. ఎంఐపీని ఆగస్ట్ 5 తర్వాత కొనసాగించాలా? వద్దా? అనే అంశం పరిశ్రమకు చాలా కీలకమని అభిప్రాయపడింది. విదేశాల నుంచి ఉప్పెనలా వస్తోన్న స్టీల్ దిగుమతులకు అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కేంద్రం ఫిబ్రవరిలో దాదాపు 173 స్టీల్ ఉత్పత్తులపై ఎంఐపీని విధించింది. దీంతో వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్-మే కాలంలో స్టీల్ దిగుమతులు 30 శాతం తగ్గాయని తెలిపింది. అలాగే జూన్ మధ్య నాటికి స్టీల్ ధరలు 25 శాతంమేర పెరిగాయని పేర్కొంది. ఈ చర్యలు స్టీల్ కంపెనీలకు ఊరట కలిగించేవని పేర్కొంది. ఇక ఎంఐపీ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొని ఉన్న అస్థిర పరిస్థితుల వల్ల స్టీల్ ధరలు గత నెల రోజుల్లో 8 శాతం మేర క్షీణించాయని తెలిపింది. -
ఐకియా స్టోర్‌కు ఆగస్టు 11న శంకుస్థాపన
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రిటైల్ రంగ దిగ్గజం, స్వీడన్‌కు చెందిన ఐకియా భారత్‌లో తొలి స్టోర్ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. ఈ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 11న శంకుస్థాపన చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. హైటెక్ సిటీ సమీపంలో 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.685.5 కోట్ల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2017 వేసవిలోగా నిర్మాణం పూర్తి చేసి స్టోర్‌ను ప్రారంభించాలనేది కంపెనీ ప్రణాళిక. 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 ఔట్లెట్లను స్థాపించాలన్నది సంస్థ లక్ష్యం. భాగ్యనగరి సహా మొత్తం 9 నగరాల్లో ఇవి రానున్నాయి. వీటి ఏర్పాటుకు రూ.10,500 కోట్ల పెట్టుబడి పెట్టాలని కంపెనీ నిర్ణయించింది. -
రిటైల్ వార్‌కు ఐకియా రెడీ..!
హైదరాబాద్‌లో తొలిస్టోర్తో ఇండియాలోకి ♦ 2025 నాటికి దేశవ్యాప్తంగా 25 స్టోర్లు లక్ష్యం ♦ ఒక స్టోర్ సగటు వార్షిక టర్నోవర్ రూ.720 కోట్లు! ♦ అంతర్జాతీయంగా ప్రస్తుతం 348 స్టోర్లు ♦ గతేడాది అమ్మకాలు రూ.2.72 లక్షల కోట్లు; లాభం 24,200 కోట్లు ♦ ఇండియాలో టీవీలు కూడా ఐకియా బ్రాండ్‌తోనే అమ్మకం! ♦ మల్టీబ్రాండ్ రిటైల్‌కు అనుమతి లేకపోవటమే కారణం ♦ ఐకియా అంతర్జాతీయ వస్తువుల్లో ఇండియా వాటా 3 శాతమే ♦ ఐదేళ్లలో దీన్ని రెట్టింపు చేస్తామంటున్న సంస్థ ♦ ప్రస్తుతానికైతే చైనా నుంచి తెచ్చే వస్తువులే విక్రయం ♦ ఈ వస్తువుల డిజైన్, టెస్టింగ్ మాత్రం ఐకియా సొంతం నేను ఒక్కడిని ఒకవైపు... లోకం ఒకవైపు!! ఇప్పుడు యూరప్ రిటైల్ దిగ్గజం ఐకియాను చూస్తే అదే అనిపిస్తుంది. చెమ్చాలు, బల్బుల నుంచి బెడ్లు, కర్టెన్ల దాకా ఇంటికి కావాల్సిన హోమ్ ఫర్నిషింగ్ మొత్తాన్ని విక్రయించే ఐకియా... భారతదేశానికి కొత్త రిటైల్ అనుభవాన్ని పరిచయం చేస్తామంటోంది. యూరప్‌లో, అమెరికాలో మాదిరి తన స్టోర్లలో ఫర్నిచర్‌తో పాటు టీవీ, ఫ్రిజ్, మైక్రో ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్‌ను కూడా విక్రయిస్తామంటోంది. అదే జరిగితే... దేశంలో వివిధ బ్రాండ్లతో ఒకేసారి పోటీ పడుతున్నట్లే!! ఎనిమిదేళ్లుగా చైనాలో సైతం నిలకడగా మార్కెట్ వాటా పెంచుకుంటూ వస్తున్న ఈ సంస్థ... ఇండియాలో కూడా 2025 నాటికంటూ పెద్ద లక్ష్యాలే నిర్దేశించుకుంది. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో స్టోర్ ప్రారంభించనున్న నేపథ్యంలో స్వీడన్‌లోని తన పుట్టినిల్లయిన ‘ఆల్మ్‌హల్ట్’లో తన టెక్నాలజీని, పని సంస్కృతిని కొందరు పాత్రికేయులకు ప్రత్యక్షంగా చూపించింది. ఆ విశేషాల సమాహారమే ఈ కథనం... ఆల్మ్‌హల్ట్(స్వీడన్) నుంచి మంథా రమణమూర్తి ఆల్మ్‌హల్ట్! నిజానికిది స్వీడన్లో ఓ చిన్న ప్రాంతం. కాకపోతే ఏడాదికి రూ.2.7 లక్షల కోట్ల అమ్మకాలు జరిపే ‘ఐకియా’ హృదయం మాత్రం ఇక్కడే ఉంది. దాని వ్యవస్థాపకుడు ఇంగ్వర్ కొంప్రాడ్ సొంత ప్రాంతం కావటంతో పాటు... ప్రపంచ ధనికుల్లో ఒకడిగా ఆయన ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. సైకిల్‌పై వస్తువులు విక్రయించే స్థాయి నుంచి ఆయన తొలి ఐకియా స్టోర్‌ను ఆరంభించింది కూడా ఇక్కడే. ఇప్పుడు ఐకియా కార్పొరేట్ కార్యాలయాల్లో కొన్ని కొన్ని కొలువుదీరటంతో పాటు.. సంస్థ ఉత్పత్తులకు ఆత్మ లాంటి ఇన్నోవేషన్... డిజైన్... టెస్టింగ్... కొన్ని ప్రాంతాలకు అవసరమైన ఉత్పత్తితో పాటు ప్రచార విభాగం... క్యాటలాగ్ ముద్రణ... ఇవన్నీ కూడా జరిగేది ఆల్మ్హల్ట్లోనే. తయారీ నుంచి అమ్మకాల వరకూ భిన్నమే!! ఇతర తయారీ సంస్థల్లా ఐకియా తాను విక్రయించే వస్తువులన్నిటినీ తనే తయారు చేయదు. అలాగని వాల్‌మార్ట్ లాంటి రిటైల్ సంస్థల్లా ఇతరులు తయారు చేసిన వస్తువుల్ని మాత్రమే విక్రయించదు. కొన్ని ఫర్నిచర్ వస్తువుల్ని తాను తయారు చేయటంతో పాటు... తన స్టోర్‌లో విక్రయించే ప్రతి వస్తువునూ తనే డిజైన్ చేయటం... దాన్ని కాంట్రాక్టు తయారీ కంపెనీలకు అప్పగించటంతో పాటు, తయారైన వస్తువుల్ని తనే పరీక్షించటం ఐకియా ప్రత్యేకత. వీటికి తోడు ఆయా తయారీ ప్రాంతాల్లో ఐకియా సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారని ఐకియా కమ్యూనికేషన్స్ (ఇండియా) హెడ్ పాట్రిక్ ఆంటోనీ ‘సాక్షి’తో చెప్పారు. ఇక స్టోర్‌లో విక్రయించేటపుడూ ఐకియా ప్రత్యేకత కనిపిస్తుంది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో 348కి పైగా స్టోర్లను నిర్వహిస్తున్న ఈ సంస్థ... దాదాపు ప్రతిచోటా స్టోర్ డిజైన్ ఒకేలా ఉండేలా జాగ్రత్తపడుతుంది. కొనుగోలుదార్ల కోసం రకరకాల బెడ్రూమ్ సెటప్‌లను స్టోర్‌లోనే ఏర్పాటు చేయటంతో పాటు ప్రతి దానికీ ఓ కోడ్ నంబరుంటుంది. స్టోర్ ప్రవేశద్వారం వద్ద మనకిచ్చే ఫారంపై నచ్చిన వస్తువు తాలూకు కోడ్ నంబర్ వేస్తే చాలు. అది బిల్లింగ్ దగ్గరకు వచ్చేస్తుంది. పెపైచ్చు ప్రతి వస్తువునూ కార్లోనో, ట్రాలీలోనే తీసుకెళ్లేలా ఫ్లాట్‌గా ఉండే అట్టపెట్టెల్లో పెట్టి ఇవ్వటం ఐకియా ప్రత్యేకత. దీన్నే సంస్థ ‘ఫ్లాట్ ప్యాక్’ స్ట్రాటజీగా చెబుతుంది. ఇక్కడ కొనే ప్రతి వస్తువూ ఎవరికి వారే బిగించుకునేలా ఉంటుంది. మారుతున్న టెక్నాలజీతో... ‘ఆల్మ్‌హల్ట్’లో ప్రధానంగా ఐకియా భవిష్యత్ వ్యూహాలు కనిపిస్తాయి. 2009 నుంచీ ‘‘రూపం- పనితీరు - నాణ్యత - స్థిరత్వం-తక్కువ ధర’’ అనే ఐదు లక్షణాలూ ఉండే డెమొక్రటిక్ డిజైన్ కాన్సెప్ట్‌ను పాటిస్తున్నట్లు సంస్థ డిజైన్ మేనేజర్ ‘మార్కస్ ఎంగ్మన్’ చెప్పారు. ‘‘ప్రస్తుతం 70 ప్రొడక్ట్ ఇన్నోవేషన్ బృందాలున్నాయి. ఏటా 3,600 కొత్త వస్తువులు డిజైన్ చేస్తున్నాం. స్టోర్లలో అవి పాత వాటి స్థానాన్ని ఆక్రమిస్తుంటాయి. మొత్తం డిజైనర్లలో 20 మంది ఐకియా ఉద్యోగులు కాగా 170 మంది బయటివారు’’ అని వివరించారాయన. స్థిరత్వంలో భాగంగా పేపర్‌తో ఎం- బోర్డ్లను తయారు చేయడానికి, పర్యావరణానికి హాని చేయని వస్తువుల్ని వినియోగించడానికి ప్రయతిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ కోసం ఐకియా ‘వర్చువల్ రియాలిటీని’ పరీక్షిస్తోంది. ఐకియా సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకుని వీఆర్ హెడ్సెట్ ద్వారా మనక్కావాల్సిన వస్తువుల్ని నిజంగా తాకుతున్నట్లుగా అనుభూతి చెందుతూ సెలక్ట్ చేసుకోవటం దీని ప్రత్యేకత. ‘‘ఇది భవిష్యత్ టెక్నాలజీ. దీని అమలుకు కొన్నేళ్లు పట్టొచ్చు. కానీ ఇదో గేమ్ చేంజర్’’ అని సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ హెడ్ సుసాన్ పుల్వెరర్ అభిప్రాయపడ్డారు. సింగిల్ బ్రాండా? మల్టీ బ్రాండా? మరో చిత్రమేంటంటే దేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థలు 100 శాతం పెట్టుబడి పెట్టడానికి ప్రస్తుతం అనుమతి లేదు. కాకపోతే ఐకియా సింగిల్ బ్రాండా... మల్టీ బ్రాండా అన్నది కూడా ఒకింత గందరగోళమే. ఎందుకంటే విదేశాల్లోని స్టోర్లలో టీవీలు, ఓవెన్ల వంటి హోమ్ అప్లయెన్సెస్నూ ఇది విక్రయిస్తోంది. అక్కడైతే వీటికి ఐకియా బ్రాండ్ ఉండదు. ఇదే ప్రశ్న పాట్రిక్‌ను అడగ్గా.. ‘‘నిజమే! చూడాలి. ఇండియాలో వాటికీ ఐకియా బ్రాండ్ తప్పకపోవచ్చు. మా వ్యూహాన్ని మార్చుకోవాలేమో’’ అన్నారాయన. అంటే.. ఐకియా టీవీలూ వస్తాయన్నమాట!!. కేటలాగే పెద్ద మీడియా!! ఐకియా స్టోర్లలో దొరికే కేటలాగ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా అంటే... ఏటా వివిధ భాషల్లో దాదాపు 22 కోట్లకుపైగా కేటలాగ్లు ముద్రిస్తుందీ సంస్థ. అంతే కాదు!! ప్రచారానికి పెట్టే ఖర్చులో 70 శాతం దీనికే పెడుతుంది. ఎందుకంటే ఇదే సంస్థ ప్రధాన ప్రచారాస్త్రం. ఆన్లైన్లో సైతం ఈ- కేటలాగ్ లభ్యమవుతుంది. మరో విశేషమేంటంటే ఏడాదికోసారి ముద్రించే కేటలాగ్‌లో... ధరలు కూడా ఉంటాయి. అవి ఏడాదంతా ఒకేలా ఉంటాయి. మధ్యలో పెరగవు. మూడేళ్ల నుంచే వ్యూహానికి పదును... ఐకియాను చూస్తే అంతర్జాతీయ కంపెనీల బ్రాండింగ్ వ్యూహం ఎంత పక్కాగా ఉంటుందో అర్థమవుతుంది. 1.5 బిలియన్ యూరోల పెట్టుబడితో ఇండియాలో అడుగుపెడుతున్నామని 2012లో ప్రకటించిన ఐకియా... అప్పటి నుంచీ తగిన ఏర్పాటు చేసుకుంటూ వస్తోంది. ఢిల్లీ తదితర నగరాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి హోమ్ ఫర్నిషింగ్‌ను ఇష్టపడే వివిధ వర్గాలను వాటికి ఆహ్వానించింది. నగరాల్లో మధ్య తరగతి ఎలా పెరుగుతోందో, 2025 నాటికి ఎంత ఉంటుందో సర్వేలు చేసింది. పలు అంశాలు కలసి రావటంతో తొలి స్టోర్‌కు హైదరాబాద్‌నే వేదికగా నిర్ణయించింది. 2015లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 13 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అంతేకాదు!! 2014లోనే స్వీడిష్ ఎంబసీ వివిధ కళాశాలల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించింది. ఫైనల్స్‌కు హైదరాబాదే వేదిక. విజేతలను ఉచితంగా స్వీడన్‌కు తీసుకెళ్లటంతో పాటు ఐకియా ప్రధాన కార్యాలయాన్నీ చూపించటం విశేషం. ఇక గతేడాది జనవరిలో హైదరాబాద్‌లో హోమ్ ఫర్నిషింగ్‌పై వర్క్‌షాప్‌లు నిర్వహించటంతో పాటు జూన్‌లో జాబ్ మేళానూ నిర్వహించింది. ఇండియాలో సోర్సింగ్ పెరుగుతుందా? ఐకియా 30 ఏళ్లుగా విదేశాల్లోని తన స్టోర్లలో విక్రయించడానికి ఇండియాలో రకరకాల వస్తువుల్ని తయారు చేయిస్తోంది. ప్రస్తుతం ఏటా ఇండియా నుంచి సోర్స్ చేస్తున్న వస్తువుల విలువ రూ.234 కోట్లు. వీటిలో అత్యధికం కర్టెన్లు, కార్పెట్ల వంటి కాటన్ వస్తువులే. ‘‘ప్రపంచ వ్యాప్తంగా 12 లక్షల మంది పత్తిరైతులుండగా ఒక్క ఇండియాలోనే 4 లక్షల మంది ఉన్నారు. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో ఇండియా వాటా 11.5 శాతం. తక్కువ నీటిని వాడుతూ పండించేలా కాటన్ ఫర్ మోర్ సస్టెయినబుల్ సోర్సెస్ (సీఎంఎస్ఎస్) నినాదంతో మేం పనిచేస్తున్నాం. ఈ పద్ధతిలో పండించిన 85 లక్షల టన్నుల పత్తిని ఏటా కొంటున్నాం. ఇది మా పత్తి కొనుగోళ్లలో 35 శాతం. తెలంగాణ నుంచి 10 నుంచి 12 శాతం పత్తి కొంటున్నాం. జన్యు మార్పిడి (జీఎం) విత్తనాల విషయానికొస్తే దీన్లో రైతు నిర్ణయమే కీలకం. అయితే ప్రపంచంలో 90 శాతం పత్తి జీఎం విత్తనాలతోనే పండుతోందని గుర్తుంచుకోవాలి’’ అని ఐకియాలో కాటన్ లీడర్‌గా పని చేస్తున్న బిహార్ వాసి ప్రమోద్ సింగ్ చెప్పారు. హైదరాబాద్‌లో వచ్చే ఏడాది స్టోర్ ఆరంభించినా... దీన్లోని వస్తువులు మాత్రం అత్యధికం విదేశాల నుంచి తెచ్చినవే ఉంటాయి. ప్రస్తుతం ఐకియా తన స్టోర్ల కోసం చైనా నుంచి 25 శాతం, పోలండ్, స్వీడన్ల నుంచి తలా 8 శాతం సోర్స్ చేస్తోంది. ఇండియా నుంచి 3 శాతమే సోర్స్ చేస్తుండగా... దేశంలో అమ్మే వస్తువుల్లో కనీసం 30 శాతం స్థానికంగా తయారు చేసినవై ఉండాలనే నిబంధన ఇక్కడ ఉంది. అయితే తొలి ఐదేళ్లూ ఈ నిబంధన వర్తించదు కాబట్టి... వచ్చే ఐదేళ్లలో ఇండియా నుంచి సోర్స్ చేసే వస్తువుల్ని 30 శాతానికి పెంచుకుంటామని పాట్రిక్ ఆంటోనీ చెప్పారు. ‘‘మీరు చైనా నుంచి వస్తువుల్ని డంప్ చేసి విక్రయిస్తారు కదా? దీనివల్ల ప్రధాని నరేంద్రమోదీ చెబుతున్న మేకిన్ ఇండియా భావన దెబ్బతినదా?’’ అని ఆయన్ను ప్రశ్నించగా... ‘‘మేం ప్రస్తుతం ఏటా రూ.234 కోట్ల విలువైన వస్తువుల్ని ఇండియా నుంచి ఎగుమతి చేస్తున్నాం. మున్ముందు దీన్ని వేగంగా పెంచుతాం. వచ్చే ఐదేళ్లలో మేం దిగుమతి చేసుకునే వస్తువుల విలువకన్నా ఎగుమతి చేసేవే ఎక్కువగా ఉంటాయి’’ అని చెప్పారాయన. కాకపోతే ప్రస్తుతం సగటున ఒక ఐకియా స్టోర్ ఏడాదికి రూ.720 కోట్ల అమ్మకాలు జరుపుతోంది. 2025 నాటికి దేశంలో 25 స్టోర్లు ఏర్పాటు చేయాలన్నది ఐకియా లక్ష్యం. మరి ఆ లెక్కన.. 25 స్టోర్లలో విక్రయాలు 2015 నాటికి రూ.18,000 కోట్లుగా ఉంటాయి. ఆ మేరకు ఇండియాలో తయారీ పెరుగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమే. -
హైదరాబాద్‌లో భూమి కొనుగోలు చేసిన ఐకియా
హైదరాబాద్: అంతర్జాతీయ ఫర్నీచర్ వ్యాపార దిగ్గజం స్వీడన్‌కు చెందిన ఐకియా కంపెనీ హైదరాబాద్‌లో వ్యాపార సముదాయాన్ని నెలకొల్పనుంది. టీఎస్ఐఐసీ నుంచి ఎకరం భూమి 19కోట్ల 21 లక్షల రూపాయలకు ఐకియా కంపెనీ కొనుగోలు చేసింది. రాయదుర్గం పరిధిలో నాలెడ్జి సిటీలో స్థలం కొనుగోలు కూడా ఈ కంపెనీ అంగీకరించింది. భారతదేశంలోనే తమ మొదటి ఫర్నిచర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కంపెనీ ఉంది. ఈ విషయమై కంపెనీ సీఈఓ జువెనికో మెజ్టు, సీఎఫ్ఓ ప్రీత్దాపర్లు గత ఏడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కలిశారు. ప్రస్తుతం ఐకియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 338 స్టోర్లు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో ఐకియా తొలిస్టోర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఇండియాలో తొలి రిటైల్ ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. సుమారుగా రూ. 500 నుంచి రూ. 600 కోట్ల పెట్టుబడితో ఈ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయనుంది. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లోకి 100 శాతం ఎఫ్‌డీఐని అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత వస్తున్న తొలి అంతర్జాతీయ కంపెనీ ఐకియానే. దేశంలో సుమారుగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఐకిమా ముందుకొచ్చింది. ఇందులో భాగంగా తొలి ఔట్‌లెట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించి బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర ఐకియా ఇండియా సీఈవో జువెన్సియో మాజ్తూ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలి రిటైల్ ఔట్లెట్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. మొన్నటి సింగపూర్ పర్యటనలో ఐకియా స్టోర్ నన్ను ఆకర్షించింందన్నారు. తెలంగాణ కళాకారులు తయారు చేసే నిర్మల్ బొమ్మలు, పెయింట్స్, పెంబర్తి బొమ్మలు, సిల్వర్ ఫిల్గిరి వంటి వాటికి ఈ ఔట్లెట్లో చోటు కల్పించాల్సిందిగా ఐకియా ప్రతినిధులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రిని కలిసిన సామ్సంగ్ ప్రతినిధులు అన్ని చెల్లింపులకు ఒకే కార్డును వినియోగించుకునే క్లియరింగ్ హౌసింగ్ సిస్టమ్స్ (సీసీహెచ్ఎస్) ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి సామ్సంగ్ డేటా సిస్టమ్ ప్రతినిధులు వివరించారు. బస్, రైల్వే, మెట్రో రైల్, టాక్సీలు, రిటైల్ షాపులన్నింటిలో వినియోగించుకునే విధంగా కాంటాక్ట్‌లెస్ కార్డ్‌తో ఈ సీసీహెచ్ఎస్ సిస్టమ్ పనిచేస్తుందని, ఇప్పటికే ఈ విధానం బ్రిటన్, హాంకాంగ్, జపాన్ దేశాల్లో వాడుకలో ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ హైదరాబాద్ నగరం కోసం ప్రత్యేక ప్రాజెక్ట్ రిపోర్ట్‌తో రావాల్సిందిగా కోరారు.