![Infosys bags over USD 100 million deal from Ikea](/styles/webp/s3/article_images/2024/06/16/infosys_0.jpg.webp?itok=BY7H08Of)
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ పలు కొత్త ప్రాజెక్టులతో దూసుకెళ్తోంది. తాజాగా స్వీడన్ రిటైలర్ ఐకియా నుంచి 100 మిలియన్ డాలర్ల (రూ.850 కోట్లు) డీల్‌ను దక్కించుకుంది. హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, డీఎక్స్‌సీ వంటి బడా కంపెనీలను దాటుకుని ఈ భారీ డీల్‌ను సొంతం చేసుకుంది.
ఈ ఐదేళ్ల ఒప్పందం ప్రకారం.. ఇన్ఫోసిస్ 1,70,000 మంది ఉద్యోగులకు సర్వీస్ డెస్క్, సర్వీస్ నౌ ఆధారిత ఎంటర్‌ప్రైజ్ సర్వీస్ మేనేజ్మెంట్, ఐటీ సర్వీసెస్ మేనేజ్మెంట్‌ను అందిస్తుంది. ఇన్ఫోసిస్ కన్జ్యూమర్, రిటైల్, లాజిస్టిక్స్ గ్లోబల్ హెడ్, ఈవీపీ కర్మేష్ వాస్వానీ ఈ డీల్‌కు నేతృత్వం వహించారు. గత ఏడాది ఐటీ దిగ్గజం డాన్స్‌కే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్ల కాంట్రాక్టును దక్కించుకుంది.
ఈ డీల్ కారణంగా చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, పోలాండ్, స్వీడన్, అమెరికా దేశాల్లో ఐకియాలో 350 ఉద్యోగాలపై ప్రభావం పడనుంది. ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కు మారనున్నారు. కోల్డ్ కాలింగ్, కొన్ని ప్రారంభ కనెక్షన్లతో ప్రారంభమై వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముగిసిన మూడేళ్ల సుదీర్ఘ, సంతృప్తికరమైన ప్రయాణం అని ఇన్ఫోసిస్ కొందరు ఎంపిక చేసిన ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment