భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని స్వీడన్ ఫర్నిచర్ రిటైల్ సంస్థ ఐకియా యోచిస్తోంది. తాజాగా ఇండియాలో పెట్టుబడులు పెంచాలని భావిస్తోంది. పదేళ్ల క్రితం భారత్‌లో వ్యాపారం ప్రారంభించిన సమయంలో ప్రకటించిన రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఐకియా ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ పేర్కొన్నారు.
2018 ఆగస్టులో కంపెనీ హైదరాబాద్‌లో మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం దిల్లీ-ఎన్‌సీఆర్‌లో కొత్త స్టోర్ నిర్మాణంలో ఉండగా, 2025లో దీన్ని ప్రారంభించనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇండియా సీఈఓ సుసాన్ పుల్వరర్ మాట్లాడుతూ.. ఎన్‌సీఆర్‌తో కలిపి రూ.10,500 కోట్ల పెట్టుబడులు పూర్తవుతాయన్నారు. భారత్‌లో ఐకియా విస్తరణ కోసం మరిన్ని నిధులు వెచ్చించనున్నామని చెప్పారు. అమ్మకాలను మరింత పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. సరైన సమయంలో ఏమేరకు నిధులు పెట్టుబడి పెట్టనున్నామో ప్రకటిస్తామన్నారు.
ఇదీ చదవండి: అంబానీ చేతుల్లోకి పేటీఎం వాలెట్? నిజమెంత..
2013లో 10 ఏళ్లలో 10 స్టోర్‌లు ఏర్పాటు చేసేందుకు ఐకియా రూ.10,500 కోట్ల ఎఫ్‌డీఐ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్, ముంబయి, బెంగళూరుల్లో కంపెనీ స్టోర్‌లు ఉన్నాయి. గురుగ్రామ్, నోయిడాల్లో స్టోర్‌లను ఏర్పాటు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment