
న్యూఢిల్లీ: ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత విభాగం సీఈవోగా కొత్తగా పీటర్ బెజెల్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న జువెన్సియో మేజ్తూ ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఐకియా గ్రూప్ ఇన్‌గా హోల్డింగ్ సీఎఫ్‌వో, డిప్యూటీ సీఈవోగా బాధ్యతలు చేపడతారు.
స్వీడన్‌కి చెందిన హోమ్ ఫర్నిషింగ్స్ సంస్థ అయిన ఐకియా భారత్‌లో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో త్వరలోనే ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. కొత్త సీఈవోగా నియమితులైన బెజెల్.. ఇప్పటిదాకా జర్మనీ విభాగానికి సారథ్యం వహించినట్లు ఐకియా తెలిపింది. దాదాపు పాతికేళ్లుగా ఐకియాలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు.