సాక్షి,హైదరాబాద్ : హైదరబాద్ కురిసిన వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామైంది. ఐకియా సర్కిల్ దగ్గర వర్షం తర్వాత ఆఫీస్ ముగియడంతో వాహనాలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
బయో డైవర్సిటీ మాదాపూర్ వరకు ట్రాఫిక్ ఆగిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగులు దశలవారీగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ తమ గమ్య స్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు.
సైబరాబాద్ పరిధిలో అటు గచ్చిబౌలి మొదులుకుని గచ్చిబౌలి, మాదాపూర్ బయో డైవర్సిటీ సిగ్నల్,ఐకియా, హైటెక్ సిటీ ఫ్లైఓవర్,జేఎన్‌టీయూ ఫ్లైఓవర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. గంటపాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురియడంతో వాహనాలన్నీ ఎక్కడికక్కడా నిలిచిపోయాయని పోలీసులు చెబుతున్నారు.
వర్షం తగ్గగానే ఒక్కసారిగా వాహనాలన్నీ రోడ్డెక్కాయి. ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. నానక్ రామ్ గూడా మొదులుకుని గచ్చిబౌలీ, బయోడైవర్సిటీ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఫలితంగా మాదాపూర్ వెళ్లాలన్నా.. ఇటు జేఎన్‌టీయూ వెళ్లాలన్నా ఐకియా సిగ్నల్ మీది నుంచి వెళ్లాల్సి ఉంది. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ తరుణంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. పోలీసులు సైతం ఉద్యోగులు ఓ గంట ఆలస్యంగా ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment