వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో చాలా మందికి గుండెపోటుకు గురవుతున్నారు. అకస్మిక గుండెపోటులో అర్థాతరంగా తనువు చలిస్తున్నారు. చూస్తుండగానే రెప్పపాటులో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి సరైన సమయానికి కార్డియో పల్మనరీ రిసిటేషన్( సీపీఆర్)చేస్తే బతికే అవకాశం ఉంటుంది. తాజాగా కర్ణాటలో ఇలాంటి ఘటనే జరిగింది.బెంగళూరు ఐకియాలో షాపింగ్‌కు వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలాడు. అతను ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోవడంతో అక్కడున్న వారంతా భయపడిపోడిపోయారు.
అయితే అదే సమయంలో షాపింగ్‌కు వచ్చిన డాక్టర్(ఆర్థోపెడిక్ సర్జన్) వెంటనే స్పందించాడు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేయడం ప్రారంభించాడు. బాధితుడి ఛాతీపై చేతితో నొక్కుతూ 10 నిమిషాలపాటు శ్రమించి అతడి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ కొడుకు రోహిత్ డాక్ కొడుకు ట్విటర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
My dad saved a life. We happen to be at IKEA Bangalore where someone had an attack and had no pulse. Dad worked on him for more than 10 mins and revived him. Lucky guy that a trained orthopedic surgeon was shopping in the next lane. Doctors are a blessing. Respect !!! pic.twitter.com/QXpXTMBOya
— Rohit Dak (@rohitdak) December 29, 2022
దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. సరైన సమయానికి ప్రాణాలు కాపాడిన డాక్టర్‌ను అభినందిస్తున్నారు. రోగిపట్ల డాక్టర్ చేసిన కృష్టి, అంకితభావాన్ని కొనియాడుతున్నారు. అతడి ఒకరి ప్రాణం కాపాడటం కన్నా సంతృప్తి ఇంకేముంటుంది అంటూ ప్రశంసిస్తున్నారు. సకాలంలో వైద్య సాయం అందించి మృత్యువు నుంచి కాపాడి కొత్త జీవితాన్ని అందించాడు. అతనికి ధన్యవాదాలు చెప్పండంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: డ్రైవర్‌కు గుండెపోటు.. ఘోర ప్రమాదం.. 10 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment