ఐకియా స్టోర్‌లో మ‌హిళ అసభ్య ప్ర‌వ‌ర్త‌న‌ | Ikea Response After Video of Woman Masturbating At China Store | Sakshi
Sakshi News home page

ఐకియా స్టోర్‌లో మ‌హిళ అసభ్య ప్ర‌వ‌ర్త‌న‌

Published Mon, May 11 2020 3:22 PM | Last Updated on Mon, May 11 2020 3:40 PM

Ikea Response After Video of Woman Masturbating At China Store - Sakshi

బీజింగ్‌: చైనాలోని ఓ మ‌హిళ ఐకియా స్టోర్‌లో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఘ‌ట‌న‌కు సంబంధించిన ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. అర్ధ‌న‌గ్నంగా తిరుగుతూ అనుచితంగా ప్ర‌వ‌ర్తిస్తోంది.  దీంతో త‌మ సెక్యూరిటీని మ‌రింత పెంచుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు ఐకియా బృందం వెల్ల‌డించింది.  కాగా  ఈ అస‌భ్య వీడియో సోష‌ల్ మీడియాలో విస్తృతంగా వైర‌ల్ అవుతోంది. గ్వాంగ్డాంగ్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు చైనీస్ నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. అంతేకాక స్టోర్‌లో ఎవ‌రూ మాస్కులు ధ‌రించ‌క‌పోవ‌డాన్ని బ‌ట్టి ఇది జ‌న‌వ‌రిలో జ‌రిగి ఉండ‌వ‌చ్చని అభిప్రాయ‌ప‌డుతున్నారు. (‘కరోనా’ ఎఫెక్ట్‌; ఐకియా కీలక నిర్ణయం)

మ‌రోవైపు ఈ క్లిప్పింగ్‌పై స్పందించిన‌ ఫర్నిచర్ రిటైల్‌ దిగ్గజం ఐకియా కంపెనీ స‌ద‌రు మ‌హిళ‌ ప్ర‌వ‌ర్త‌న‌పై మండిప‌డింది. ఇటువంటి అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఈ సంఘట‌న‌పై పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చామ‌ని పేర్కొంది. ఇక‌పై భద్రతతోపాటు, ప్ర‌జా ప‌రిశుభ్ర‌తపైనా మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు అక్క‌డ కొత్తేమీ కాదు. 2015లో బీజింగ్‌లోని జ‌ప‌నీస్ వ‌స్త్ర దుకాణంలో ఓ జంట శృం​గారంలో పాల్గొన‌గా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement