
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..
చైనాలోని హాంగ్‌జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్‌మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది.
ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది.
దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు.
దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది.
ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది.
ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment