cloned
-
జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!
కొందరూ యజమానులు తమ పెంపుడు కుక్కల కోసం ఎంత దూరమైనా.. వెళ్లిపోతారు. వాటికోసం ఎంత డబ్భైనా ఖర్చు చేస్తారు. అలానే గతంలో కొందరు యజమానులు తమ కుక్కలకు పుట్టిన రోజులు, పెళ్లిళ్లు జరిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఓ యజమానురాలు తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క దూరమైందని ఆమె ఏ చేసిందో తెలిస్తే మతిపోతుంది. మరీ ఇంతలానా అని అనుకోవడం ఖాయం. ఇంతకీ ఆ మహిళ ఏం చేసిందంటే..చైనాలోని హాంగ్జౌకు చెందిన జు అనే మహిళ 2011లో డోబర్మ్యాన్ అనే కుక్కను కొనుగోలు చేసి జోకర్ అని పేరు పెట్టుకుంది. దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రాను రాను ఆ కుక్కతో ఆమెకు విడదీయరాని బంధం ఏర్పడింది. తన పాఠశాల విద్య నుంచి వృత్తి జీవితం వరకు తన పెంపుడు కుక్కతో పెనవేసుకున్న ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే ఆ కుక్క తొమ్మిదేళ్ల వయసులో ప్రాణాంత సార్కోమా బారిన పడింది. ఆ సమయంలోనూ జు తన కుక్కను తన కంటిపాపల కాచుకుంది. దానికి అనస్థీషియా లేకుండానే విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించి మరీ రక్షించుకుంది. అయితే కాలక్రమంలో ఆ కుక్క పలు వ్యాధుల బారినపడటం మొదలైంది. అయినా తన శక్తిమేర దాని బాగోగులు చూసుకుంటూనే వచ్చింది జూ. కానీ ఆ కుక్క 2022లో గుండెపోటుతో అనూహ్యంగా మరణించింది. దీంతో పెంపుడు కుక్క పోయిందన్న దిగులతో గడపటం మొదలుపెట్టింది జూ. అలా ఆ కుక్క మరణం జూపై తీవ్ర ప్రభావం చూపింది. నిద్రలేని రాత్రులతో సతమతమయ్యేది. ఇక ఆమె ఆరోగ్యం నెమ్మదిగా క్షీణించటం మొదలైంది. ఇక లాభం లేదు ఇలా దుఃఖంలో మునిగిపోవడమే తప్ప బయటకి రాలేనని గ్రహించింది జు. దీనికి సరైన పరిష్కారం కనుగొని ఇదివరకటిలా హాయిగా జీవితాన్ని గడపాలనుకుంది. అందుకోసం బాగా ఆలోచించి.. క్లోనింగ్ ఒక్కటే మార్గమని డిసైడ్ అయ్యింది. క్లోనింగ్ ప్రక్రియతో జీవిని పోలిని జీవిని సృష్టిస్తారు శాస్త్రవేత్తలు. ఇదే తన బాధకు చక్కటి ఉపశమనం అని నమ్మి.. క్లోనింగ్ సౌకర్యాన్ని అందించే ఆస్పత్రిని సందర్శించి ఏకంగా రూ. 19 లక్షలు చెల్లించింది. ఆ ఆస్పత్రి వైద్యులు జు పెంపుడు కుక్క ఉదరం, చెవుల నుంచి కొద్ది మొత్తంలో చర్మాన్ని సేకరించి ఒక ఏడాదిలో అచ్చం అలాంటి కుక్కనే రూపొందించారు. వైద్యులు జుకి సమాచారం ఇవ్వడంతో ఆనందంగా ఆ చిన్న కుక్కను ఇంటికి తీసుకువెళ్లింది. దానికి లిటిల్ జోకర్ అని పేరుపెట్టుకుని పెంచుకుంటుంది. ఇది అచ్చం తన పెంపుడు కుక్క జోకర్ మాదిరిగానే ఉందని ఆనందంగా చెబుతోంది. ఈ కొత్త కుక్కరాకతో ఆ బాధ నుంచి తేరుకోగలుగుతున్నాని సంతోషంగా చెబుతోంది జు. మనిషి తన బాధకు ఉపశమనం కోసం ఎంత దూరమైన వెళ్తాడంటే ఇదేనేమో. అంతేగాదు మనం పెంచుకుంటున్న వాటిపై చూపించే ప్రేమ అంతకుమించి అన్నట్లు ఉంటే జులానే ఎంత డబ్భైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరేమో కదూ. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.(చదవండి: నాలుగు పదుల వయసులోనూ అంతే అందంగా శ్రియ.. ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ఆన్లైన్ పరీక్ష: చెలరేగిన క్లోనింగ్ ముఠా
సాక్షి, జైపూర్: ఆధార్ గోప్యత, హ్యాకింగ్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్..నకిలీ ఫింగర్ ప్రింట్ రాకెట్ తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్‌లో కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా నకిలీ ఆధార్ కార్డులతో పరీక్షకు హాజరువుతున్న గ్యాంగ్‌ను అధికారులు ఛేదించారు. కానిస్టేబుల్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన పరీక్ష సందర్భంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు. అభ్యర్థుల బొటన వేలి ముద్రలకు నకిలీవి రూపొందించి అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్షలకు హాజరయ్యారు. 5390 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను పూరించడానికి మొదటిసారి ఆన్లైన్ పరీక్షలు ప్రవేశపెట్టగా, మార్చి 7నుంచి 45 రోజులు నిర్వహించన్నారు. మార్చి 12, 14 తేదీలలో, జైపూర్‌లో కంప్యూటర్ను హ్యాక్ చేసి ఘటన నమోదు కావడంతో 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. గత మూడు రోజుల్లో పంకజ్ జాట్, ముక్తర్ సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశామని రాజస్థాన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్అధికారి ఉమేష్ మిశ్రా చెప్పారు. ఇలా 77కేంద్రాల్లో 25మంది నకిలీ అభ్యర్థులను గుర్తించామన్నారు. సినీ ఫక్కీలో నకిలీ ఫింగర్ ప్రింట్స్ యూట్యూబ్‌లో వేలిముద్రల క్లోనింగ్ నేర్చుకున్నారు. మొదట, వారు దరఖాస్తుదారు వేలు మీద చేప నూనెను పూసి,దాన్ని వేడిగా ఉన్న మైనం మీద ఉంచుతారు. దానికి ఫెవికాల్ పూసి అది ఆరిన తరువాత నకిలీ ఫింగర్ ప్రింట్ రడీ. దీని ద్వారా పరీక్షా కేంద్రానికి వెళ్లి దరఖాస్తుదారుడి తరఫున పరీక్షకు హాజరు కావడం, బయోమెట్రిక్ టెస్ట్ పాస్ కావడం, పరీక్షరాసి బయటపడడం అన్నీ జరిగిపోయాయి. అయితే వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు నకిలీ ఫింగర్ ప్రింట్‌తో పరీక్ష హాల్లోకి హాజరైన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ముఠా గుట్టురట్టయింది. విలేజ్ సర్వీస్ వర్కర్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హర్యానాకు చెందిన దేవేంద్ర (20) ను కీలక సూత్రధారిగా గుర్తించారు. కాగా దీంతో ఈముఠా భారీ ఎత్తున విస్తరించి ఉండవచ్చనే సందేహాలు నెలకొన్నాయి. -
మరో మైఖేల్ వస్తారా?
గొర్రెను పోలిన గొర్రెను కృత్రిమంగా సృష్టించిన ‘క్లోనింగ్’ విధానం గురించి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ అప్పట్లో ఈ క్లోనింగ్ విషయంలో ఆసక్తి కనబర్చారట. తనను పోలిన రూపం ఉండాలని ఆయన కోరుకున్నారట. ఈ సంగీత సంచలనం కనుమరుగై దాదాపు ఐదేళ్లవుతోంది. అయితే, తనలాంటి రూపాన్ని సృష్టించాలని మైఖేల్ అనుకున్న విషయం ఇప్పుడు బయటికొచ్చింది. 2009లో మైఖేల్ తుదిశ్వాస విడిచారు. అంతకుముందు తన వీర్యకణాలను ఆయన ఓ పరిశోధక కేంద్రంలో భద్రపరిచారని సమాచారం. ఒక యూరోపియన్ శాస్త్రవేత్తను తన సమరూప జీవిని సృష్టించాల్సిందిగా ఆయన కోరారట. ఈ క్లోనింగ్ విధానం కోసం మైఖేల్ మిలియన్ డాలర్లు ఇచ్చారన్న వార్త ఇప్పుడు హాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఆయన తన వీర్యకణాలను మూడు పరిశోధక కేంద్రాల్లో భద్రపరిచారని, మూడు వేర్వేరు కారణాలకు వాటిని ఉపయోగించాల్సిందిగా కూడా కోరారని బోగట్టా. క్లోనింగ్ గొర్రె డాలీ గురించి తెలుసుకుని మైఖేల్ తనలాంటి రూపం ఉంటే బాగుంటుందని భావించారని న్యూయార్క్‌కు చెందిన ‘ఎక్స్‌ట్రాటెర్రెస్ట్రియల్ రిసెర్చ్’ డెరైక్టర్ మైఖేల్ సి. లక్మేన్ పేర్కొన్నారు. మైఖేల్కూ, ఆయన సోదరి జానెట్ జాక్సన్‌కూ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన స్వర్గీయ ఆండ్రూ వాన్ పీర్ బతికున్న రోజుల్లో తనతో ఈ విషయం చెప్పారని లుక్మేన్ తెలిపారు. ఇదిలా ఉంటే మైఖేల్ జాక్సన్ క్లోనింగ్ విషయంలో ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం ఏంటనేది ఇంకా బయటికి రాలేదు. మైఖేల్ సి. లుక్మేన్ మాత్రం కనుమరుగైన ఈ పాప్‌స్టార్ కోరిక నెరవేర్చాలనుకుంటున్నారట. అయితే త్వరలోనే మరో.. మైఖేల్ జాక్సన్ మన ముందుకొస్తారా? ఏమో! కాలమే సమాధానం చెప్పాలి మరి.