సాక్షి, జైపూర్: ఆధార్ గోప్యత, హ్యాకింగ్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్..నకిలీ ఫింగర్ ప్రింట్ రాకెట్ తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్‌లో కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా నకిలీ ఆధార్ కార్డులతో పరీక్షకు హాజరువుతున్న గ్యాంగ్‌ను అధికారులు ఛేదించారు. కానిస్టేబుల్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన పరీక్ష సందర్భంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు. అభ్యర్థుల బొటన వేలి ముద్రలకు నకిలీవి రూపొందించి అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్షలకు హాజరయ్యారు.
5390 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను పూరించడానికి మొదటిసారి ఆన్‌లైన్ పరీక్షలు ప్రవేశపెట్టగా, మార్చి 7నుంచి 45 రోజులు నిర్వహించన్నారు. మార్చి 12, 14 తేదీలలో, జైపూర్లో కంప్యూటర్‌ను హ్యాక్ చేసి ఘటన నమోదు కావడంతో 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. గత మూడు రోజుల్లో పంకజ్ జాట్, ముక్తర్ సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశామని రాజస్థాన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్‌అధికారి ఉమేష్ మిశ్రా చెప్పారు. ఇలా 77కేంద్రాల్లో 25మంది నకిలీ అభ్యర్థులను గుర్తించామన్నారు.
సినీ ఫక్కీలో నకిలీ ఫింగర్ ప్రింట్స్
యూట్యూబ్‌లో వేలిముద్రల క్లోనింగ్ నేర్చుకున్నారు. మొదట, వారు దరఖాస్తుదారు వేలు మీద చేప నూనెను పూసి,దాన్ని వేడిగా ఉన్న మైనం మీద ఉంచుతారు. దానికి ఫెవికాల్ పూసి అది ఆరిన తరువాత నకిలీ ఫింగర్ ప్రింట్ రడీ. దీని ద్వారా పరీక్షా కేంద్రానికి వెళ్లి దరఖాస్తుదారుడి తరఫున పరీక్షకు హాజరు కావడం, బయోమెట్రిక్ టెస్ట్ పాస్ కావడం, పరీక్షరాసి బయటపడడం అన్నీ జరిగిపోయాయి. అయితే వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు నకిలీ ఫింగర్ ప్రింట్‌తో పరీక్ష హాల్లోకి హాజరైన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ముఠా గుట్టురట్టయింది. విలేజ్ సర్వీస్ వర్కర్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. ముఖ‍్యంగా హర్యానాకు చెందిన దేవేంద్ర (20) ను కీలక సూత్రధారిగా గుర్తించారు. కాగా దీంతో ఈముఠా భారీ ఎత్తున విస్తరించి ఉండవచ్చనే సందేహాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment