
జైపూర్: రాజస్థాన్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వ్యక్తే వక్ర బుద్ధి చూపించారు. నాలుగేళ్ల బాలికపై ఓ పోలీస్ అఘాయిత్యానికి పాల్పడిన అమానుషం శుక్రవారం వెలుగుచూసింది.
దౌసా జిల్లాలోని లాల్‌సోట్ మండలం రాహువస్ పోలీస్ స్టేషన్‌లో భూపేంద్ర సింగ్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన ఇంటి సమీపంలో నివసిస్తున్న నాలుగేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి రూమ్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడపై బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం బాలిక ప్రవర్తనలో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. ఆమెను నిలదీయగా జరిగిన విషయాన్ని వివరించింది.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, స్థానికులంతా రాహువస్ పోలీస్ స్టేసన్ ఎదుట పెద్దఎత్తున గుమిగూడి ఎస్సైకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడిని పోలీస్ స్టేషన్ వద్దే చితకబాదారు. ఈ ఘటనపై ఏఎస్పీ రామచంద్ర సింగ్ నేత్ర మాట్లాడుతూ.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ రాజ్యసభ ఎంపీ కిరోడి లాల్ మీనా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలికి న్యాయ చేయాలని డిమాండ్ చేశారు. లాల్‌సోట్ బాలికపై పోలీసు అత్యాచారం ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలీసులు నిరంకుశంగా మారుతున్నారని విమర్శించారు. నిందితుడు, ఏఎస్సై భూపేంద్ర సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, అతన్ని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని, వారికి సాయం అందిస్తామని చెప్పారు.
చదవండి: ఉపాధ్యాయుడు విధులు ముగించుకొని.. ఇంటికి వెళ్తుండగా..
Comments
Please login to add a commentAdd a comment