Thumb
-
బంతిని పట్టుకున్నాడని.. దళిత వ్యక్తి వేలు కోసేశారు..
గుజరాత్:గుజరాత్లో అమానవీయ ఘటన జరిగింది. పిల్లాడు బంతిని పట్టుకున్నాడని.. ఓ దళిత వ్యక్తి వేలు కోసేశారు. పటాన్ జిల్లాలోని కాకోశీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో కొందరు క్రికెట్ ఆడుతున్నారు. మైదానం చివర కూర్చుని ఓ పిల్లాడు ఆటను చూస్తున్నాడు. ఈ క్రమంలో బంతి అతని వైపు దూసుకొచ్చింది. ఆ బంతిని పట్టుకున్నాడని కొంతమంది అతన్ని హీనంగా దూషించారు. కులపరమైన దూషణలు చేస్తూ అవమానపరిచారు. పిల్లాడి మేనమామ ధీరజ్ పర్మర్ వారిని వారించడంతో సమస్య అప్పటికి సద్దుమణిగింది. కానీ సాయంత్రం నిందితులు కత్తులతో వచ్చి ధీరజ్, అతని సోదరుడు కిర్టీపై వాగ్వాదానికి దిగారు. అనంతరం కిర్టీ వేలును కత్తిరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి:మంచు పెళ్లలు విరిగిపడి మహిళ మృతి -
ఇది ‘మూడో బొటన వేలు’
రెండు చేతులా సంపాదిస్తున్నా సరిపోవడం లేదని కొందరు వాపోతుంటారు.. అదే మరో చేయి కూడా ఉంటే..? పక్షుల్లా ఆకాశంలో ఎగరాలని ఎందరో కలలు కంటుంటారు.. అలా మనకూ రెక్కలు వచ్చేస్తే..? .. ...ఇవన్నీ మరికొన్ని ఏళ్లలో సాధ్యమేనని.. ఇప్పటికే సిద్ధం చేసిన ‘మూడో బొటనవేలు (థర్డ్ థంబ్)’ సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒక చేతికి ఈ ‘థర్డ్ థంబ్’ను అమర్చుకుంటే.. రెండు చేతులతో చేసే పనిని ఒక చేతితోనే చేసేయవచ్చని స్పష్టమైందని, ఇదే సాంకేతికతతో భవిష్యత్తులో రెక్కలు, టెంటకిల్స్ వంటివీ పెట్టేసుకోవచ్చని వివరిస్తున్నారు. అసలు ‘థర్డ్ థంబ్’ ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఈ టెక్నాలజీ మిగతా వాటికి ఎలా దారిచూపుతుందో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ కోల్పోయినా.. కావాలన్నా.. ప్రమాదాలు, యుద్ధాలు, దాడుల్లో కొందరు కాళ్లు, చేతులు కోల్పోతుంటారు. అలాంటి వారి కోసం పూర్తిస్థాయిలో పనిచేయగల కృత్రిమ అవయవాలను రూపొందించడంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మరోవైపు మనుషుల సామర్థ్యం పెరిగేలా పరికరాల సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కేంబ్రిడ్జ్ వర్సిటీ కాగి్నటివ్ న్యూరోసైన్స్ ప్రొఫె సర్లు డానీ క్లోడ్, తమర్ మకిన్ కలసి కృత్రిమ బొటనవేలిని రూపొందించారు. ‘థర్డ్ థంబ్’గా పిలుస్తున్న ఈ పరికరాన్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా ముద్రించి, పలు రకాల సెన్సర్లను అమర్చారు. చేతిపై చిటికెన వేలికి కాస్త కిందుగా దీన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి అనుసంధానంగా కాలి బొటనవేలి వద్ద ఒత్తిడిని గుర్తించే) సెన్సర్లను అమర్చుతారు. కాలి బొటనవేలి కదలికలు, ఒత్తిడిని బట్టి.. చేతికి అమర్చిన ‘థర్డ్ థంబ్’ కదులుతుందన్న మాట. శరీరంలో భాగమే అనుకునేలా.. 20 మంది వలంటీర్లకు ఈ ‘థర్డ్ థంబ్’ను ప్రయోగాత్మకంగా అమర్చి.. పనితీరు, కదలికలపై ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వారి మెదడు ఈ పరికరాన్ని శరీరంలో భాగంగా పరిగణించి, తగినట్టుగా స్పందించడానికి త్వరగానే అలవాటు పడింది. వలంటీర్లు ఒకే చేతితో కాఫీ కప్పు పట్టుకుని,దానిలో చక్కెర వేసి కలపడం, సూదిలో దారం ఎక్కించడం, ఒకే సమయంలో ఎక్కువ వస్తువులను పట్టుకోవడం వంటివి ఈ ‘థర్డ్ థంబ్’తో చేయ గలిగారు. ఒకదశలో ఇది శరీరంలో భాగమనే స్థాయిలో ఫీల్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. మరిన్ని అవయవాలు కూడా.. ‘థర్డ్ థంబ్’ను మెదడు దాదాపుగా స్వీకరించిందని.. అంటే భవిష్యత్తులో మరింత పెద్దవైన, సంక్లిష్టమైన రెక్కలు, టెంటకిల్స్ వంటి అవయవాలనూ జత చేసుకోగలమని ప్రొఫెసర్ తమర్ మకిన్ చెప్పారు. ఇప్పటికే అలాంటి టెక్నాలజీలు కొంతమేర అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ‘థర్డ్ థంబ్’ను నియంత్రించడానికి కాలి బొటనవేలి కదలికలను ఉపయోగించుకున్నామని.. నేరుగా మెదడు నుంచి అందే సిగ్నల్స్‌తో కదిలించే స్థాయికి చేరాల్సి ఉందని వివరించారు. కృత్రిమ రెక్క లు, టెంటకిల్స్ తేలికగా, సమర్థవంతంగా, తక్కువ విద్యుత్‌తో పనిచేయాలని.. భవిష్యత్తులో దీనికి దారి చూపగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే రోబోటిక్ టెంటకిల్.. ప్రొఫెసర్ డానీ క్లోడ్ ఇప్పటికే ‘వైన్ 2.0’ పేరిట ఒక రోబోటిక్ టెంటకిల్‌ను కూడా రూపొందించారు. వెన్నెముక తరహాలో 26 భాగాలను అనుసంధానం చేసి రూపొందించిన ఈ టెంటకిల్‌ను.. పాదాల వద్ద ఏర్పాటు చేసిన ఒత్తిడి సెన్సర్ల ద్వారా నియంత్రించవచ్చు. అది అచ్చంగా ఆక్టోపస్ తరహా కదలికలను చూపడం గమనార్హం. -
మీరు చిన్నారులను ఎత్తుకుంటున్నారా...జర జాగ్రత్త
పిల్లలను ఆడించాలని ఎవరికి ఉండదు? అందునా నెలల పిల్లలనుంచి రెండేళ్లలోపు చిన్నారులు తేలిగ్గా ఉంటారు కాబట్టి వాళ్లను గాల్లోకి ఎగరేసినట్టుగా ఎత్తుతుంటారు తల్లులు. ఇలా చేసే సమయంలో కొందరికి ఓ చిత్రమైన సమస్య వస్తుంటుంది. దానిపేరే ‘బేబీ రిస్ట్’! బొటన వేలూ, చూపుడువేలు మధ్యన పిల్లలను ఎత్తుకుని ఎగరేసినట్లుగా చేసే సమయంలో అక్కడ పడే ఒత్తిడి వల్ల మణికట్టు దగ్గరి టెండన్లు దెబ్బతిని విపరీతంగా నొప్పి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. కాస్త విశ్రాంతితో తేలిగ్గానే తగ్గేతాత్కాలిక సమస్య ఇది. నొప్పి మరీ ఎక్కువైతే తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌తో వైద్యులు చికిత్స అందిస్తారు. చాలా అరుదుగా శస్త్రచికిత్స అవసరం పడే సందర్భాలూ ఉంటాయి. చదవండి: కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ! -
బొటన వేలిని పరీక్షగా చూసి షాక్!
ముంబై : ప్రమాదంలో తెగిపోయిన ఓ వ్యక్తి బొటన వేలు భాగాన్ని అతికించటానికి దాదాపు ఏడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి విజయం సాధించారు డాక్టర్లు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాలు.. ముంబైకి చెందిన రోహాన్ అజ్గాంకర్(42)కు బైక్ విన్యాసాలు చేయటం అంటే సరదా. దీంతో భార్య జాగృతి ఓ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. కొద్దిరోజుల క్రితం అతడు తడి బట్టతో ఆ బైక్‌ను తుడుస్తున్నాడు. ఆ సమయంలో బైక్ ఇంజిన్ ఆన్‌లో ఉంది. ఈ నేపథ్యంలో అతడి ఎడమ చేయి బొటన వేలు చైన్‌లో ఇరుక్కుపోయింది. సెకన్లలో చెయ్యిని వెనక్కు లాక్కున్నాడు. వేలునుంచి బుడబుడా రక్తం కారసాగింది. ( కలలో ప్రత్యక్షం: శివుడి కోసం సమాధిలోకి మహిళ ) అయితే అదో చిన్న గాయంగా భావించిన అతడు బొటన వేలిని పరీక్షగా చూసి షాక్ అయ్యాడు. వేలి పైభాగం కనిపించలేదు. దానికోసం వెతగ్గా ఐదు అడుగుల దూరంలో కనిపించింది. వెంటనే పరెల్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు దాదాపు ఏడు గంటల పాటు శస్త్ర చికిత్స చేసి వేలిని అతికించారు. కాగా, తను గిఫ్ట్‌గా ఇచ్చిన బైక్ కారణంగానే భర్తకు ప్రమాదం జరగటంతో భార్య జాగృతి బాధతో కుమిళిపోతోంది. చదవండి : నానమ్మను గుర్తు చేసిన ప్రియాంక.. ఫోటోలు వైరల్ -
బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది
-
వైరల్: బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది
బోస్టన్ : తన కుడి చేతి బొటనవేలు పుణ్యమా అని ఆ యువకుడు పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు. దాని ప్రత్యేకత కారణంగా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఆ బొటనవేలు ప్రత్యేకత ఏంటంటే.. మామూలుకంటే రెట్టింపు పొడవుగా ఉండటం. మామూలుగా అందరికి 2.5 అంగుళాల బొటనవేలు ఉంటే మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్ పిన అనే యువకుడికి మాత్రం ఎకంగా ఐదు అంగళాల పొడవుండే బొటనవేలు ఉంది. వేలి ప్రత్యేక కారణంగా టాల్క్ ఆఫ్ ది టిక్‌టాక్‌గా మారాడు జాకబ్. బొటనవేలి ప్రత్యేకతను చాటేలా వీడియోలను చేసి టిక్‌టాక్‌లో ఉంచుతున్నాడు. ఈ మధ్య చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దానికి 2.1 మిలియన్ల లైకులు రాగా 37 వేలమంది కామెంట్లు చేశారు. బొటనవేలి కారణంగా టిక్‌టాక్‌లో 1.5 లక్షల మంది జాకబ్‌కు ఫ్యాన్స్ అయ్యారు. -
స్మార్ట్‌ఫోన్‌తో బొటనవేలి నొప్పి...
నేనొక బిజినెస్ పర్సన్‌ని. తీరిక లేకుండా స్మార్ట్‌ఫోన్‌ను వాడుతూనే ఉంటాను. నా బిజినెస్ వ్యవహారాలన్నీ దాంతోనే సాగుతుంటాయి. ఇటీవల నా బొటనవేలు చాలా నొప్పిగా అనిపిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? తగ్గేందుకు మార్గం చెప్పండి. – ఆర్. శ్రీధర్‌రెడ్డి, విజయవాడ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు బ్లాక్‌బెర్రీ థంబ్ లేదా గేమర్స్ థంబ్ అనే కండిషన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. దీన్నే వైద్యపరిభాషలో డీ–క్వెర్‌వెయిన్ సిండ్రోమ్ అంటారు. మనం మన స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించే సమయంలో బొటనవేలిని మాటిమాటికీ ఉపయోగిస్తుంటాం. దాంతో బొటనవేలి వెనకభాగంలో ఉన్న టెండన్ ఇన్ఫ్లమేషన్కు గురై వాపు వస్తుంది. అదేపనిగా దాన్ని ఉపయోగించడం వల్ల ఆ గాయం మానక మళ్లీ మళ్లీ గాయం తిరగబెడుతుంది. ఫలితంగా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మేలు. అవి... ∙టైపింగ్ లేదా టెక్ట్స్ మెటీరియల్ పంపడం కోసం ఒక బొటనవేలినే కాకుండా ఇతర వేళ్లను కూడా మార్చి మార్చి ఉపయోగిస్తూ బొటనవేలిపై పడే భారాన్ని తగ్గించాలి. ∙ఫోన్‌ను ఒక చేత్తో పట్టుకొని మరో చేతి బొటనవేలిని ఉపయోగించే బదులు, దాన్ని ఒక ఉపరితలం మీద పెట్టి ఇరుచేతుల వేళ్లను మార్చి ఉపయోగిస్తూ ఉండటం. ∙మణికట్టును చాలా రిలాక్స్‌గా ఉంచి వీలైనంత వరకు మణికట్టుపై భారం పడకుండా చూడాలి. ∙మీ స్మార్ట్‌ఫోన్‌ను ఒళ్లో పెట్టుకొని ఉండకుండా, కాస్త ఛాతీ భాగం వద్ద ఉండేలా చూసుకోవడం. ఒళ్లో పెట్టుకోవడం వల్ల కంటి మీద, ఒంగి స్క్రీన్ చూస్తూ ఉండటంతో మెడ మీద భారం పడుతుంది. అదే ఫోన్‌ను ఛాతీ వద్ద పెట్టుకుంటే అన్నివిధాలా సౌకర్యంగా ఉంటుంది. ∙ఫోన్‌ను శరీరానికి ఒకవైపున కాకుండా మధ్యన ఉంచడం మంచిది. దీని వల్ల శరీరం అసహజ భంగిమలో వంగకుండా బ్యాలెన్స్‌తో ఉంటుంది. ఇక ఈ జాగ్రత్తలతో పాటు మరికొన్ని జాగ్రత్తలూ అవసరం. అవి... ∙ఫోన్ ఉపయోగించే సమయాన్ని సాధ్యమైనంతగా తగ్గించడం. ∙పొడవు పొడవు వాక్యాలు కాకుండా అర్థమయ్యేరీతిలో షార్ట్‌కట్స్ వాడుతూ బొటనవేలి ఉపయోగాన్ని తగ్గించడం. దీనివల్ల మీ బొటనవేలు, ఇతర వేళ్లు, మణికట్టుపై భారం తగ్గుతుంది. ∙‘ఐ యామ్ ఇన్ మీటింగ్’ లాంటి కొన్ని రెడీమేడ్ వాక్యాలు ఉంటాయి. వాటి సహాయం తీసుకుంటే టైపింగ్ బాధ తగ్గడంతో పాటు, సమయమూ ఆదా అవుతుంది. ∙ఎవరిపేరునైనా కనుగొనాలంటే పూర్తిగా స్క్రీన్ స్క్రోల్ చేస్తుండే బదులు షార్ట్‌కట్స్ ఉపయోగించడం ద్వారా సమయాన్నీ, బొటనవేలి ఉపయోగాన్నీ తగ్గించవచ్చు. ∙అదేపనిగా ఫోన్ ఉపయోగించే వారు... ప్రతి 15 నిమిషాల్లో కనీసం 2–3 నిమిషాల పాటు మీ బొటనవేలికి విశ్రాంతినివ్వాలి. అప్పటికీ మీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. మద్యంతోనూ వెన్నునొప్పి వస్తుందా? నా వయసు 38 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. చాలాసేపు కూర్చొని ఉంటాను. వెన్నునొప్పి వస్తుండడంతో ఇటీవల డాక్టర్‌ను కలిశాను. చాలాసేపు కూర్చొని ఉండటంతోపాటు, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్ల వల్ల కూడా వెన్నునొప్పి తీవ్రమవుతోందని డాక్టర్ చెప్పారు. ఆయన చెప్పేది వాస్తవమేనా?– ఎమ్. కల్యాణ్, బెంగళూరు మీ డాక్టర్ చెప్పిన విషయాలు వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించినా, జీవనశైలి నిపుణులమైన మాకు మాత్రం ఆశ్చర్యకరం కాదు. ఆయన చెప్పింది పూర్తిగా వాస్తవమే. వెన్నునొప్పికి మూడు ప్రధానమైన అంశాలు దోహదపడతాయి. అవి... ఊబకాయం, విపరీతమైన పొగతాగడం, అత్యధిక స్థాయిలో మద్యం తీసుకోవడం. పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత (బోన్ డెన్సిటీ) గణనీయంగా తగ్గుతుంది. నిజానికి ఎముకల్లో ఎంత ఖనిజాల సాంద్రత (నార్మల్ మినరల్ డెన్సిటీ) ఉండాలో అంత ఉంటేనే... అవి పటిష్టంగా ఉండి, చిన్న చిన్న దెబ్బలకే విరగకుండా ఉండటం (రెసిస్టెన్స్ టు ఫ్రాక్చర్స్) కోసం తయారై ఉంటాయి. కానీ ఇలా పొగతాగడం, మద్యం తీసుకోవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గగానే అవి చిన్న చిన్న దెబ్బలకే విరగడం మొదలవుతాయి. ప్రధానంగా ఈ లక్షణం మన శరీరం బరువును తీసుకునే ఎముకలు, వెన్నెముకలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇక రోజూ మూడు పెగ్గుల కంటే ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో ఎముకల సాంద్రత తగ్గడం స్పష్టంగా కనిపిస్తుంటుంది. పైగా పొగతాగడం, మద్యం తీసుకోవడం అనే చర్యలు మనం ఆహారం ద్వారా తీసుకునే క్యాల్షియం జీర్ణక్రియ ద్వారా మన ఎముకలకు అందకుండా చేస్తాయి. కొత్త ఎముక పెరిగే ప్రక్రియనూ ఆలస్యం చేస్తాయి. ఎముకకు రక్తసరఫరానూ తగ్గిస్తాయి. దాంతో ఎముకలు బలహీనపడతాయి. ఫలితంగా మీ వెన్నెముకలోనూ సాంద్రత తగ్గినందువల్లనూ, మీ బరువు దానిపై పడుతుండటం వల్లనూ వెన్నునొప్పి వస్తుంటుంది. అయితే మీరు మీ పొగతాగే అలవాటు, మద్యపానం అలవాట్లను మానేసి, మీ జీవనశైలిని మెరుగుపరచుకొని రోజూ క్రమం తప్పకుండా పోషకాహారాన్ని తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల స్థూలకాయం తగ్గడంతోపాటు, వెన్నునొప్పీ తగ్గుతుంది. మునుపటి ఫిట్నెస్ పొందడం ఎలా? నా వయసు 56 ఏళ్లు. మొదట్నుంచీ హెల్దీపర్సన్ను. ఎక్సర్సైజ్ కూడా బాగానే చేసేవాడిని. కానీ ఈమధ్య నాలో ఫిట్నెస్ తగ్గినట్లు అనిపిస్తోంది. గతంలో ఒకే అంగలో రెండ్రెండు మెట్లు ఎక్కేవాడిని. ఇటీవల అలా ఎక్కలేకపోతున్నాను. కొంచెం నడిస్తే అలసిపోతున్నాను. మునుపటి ఫిట్నెస్ పొందడానికి ఏం చేయాలి?– డి. హరిహరరావు, హైదరాబాద్ మీ వయసు వారంతా కీలకమైన ఇలాంటి సమయంలో మునుపటి ఫిట్నెస్ను కాపాడుకోవడం ఎలాగో తెలుసుకోవడం చాలా ప్రధానం. సాధారణంగా మీ వయసు వారిలో చాలామందికి డయాబెటిస్ లేదా హైబీపీ లాంటి వ్యాధులు ఉండటం మామూలే. అలాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే, వెంటనే తగిన పరీక్షలు చేయించుకొని, వాటికి తగిన చికిత్స పొందడం, మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి అంశాలు ఫిట్నెస్ను నిలుపుకోడానికి ఎంతగానో దోహదపడతాయి. వీటన్నింటిలోనూ వ్యాయామం చాలా ముఖ్యం. మీరు ఏ వయసువారైనప్పటికీ వ్యాయామంతో తగిన ప్రయోజనం పొందవచ్చు. దీనివల్ల గుండెజబ్బులు, మతిమరపు, డయాబెటిస్, కొన్నిరకాల క్యాన్సర్లు, అధికరక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం కూడ నివారితమవుతుంది. దానివల్ల వయసుపైబడ్డవారు పడిపోయే అవకాశాలు తగ్గుతాయి. ఒకవేళ పడిపోయినా... ఎముకలు విరిగే అవకాశం తగ్గుతుంది. వ్యాయామం చేసేవారిలో ఎండార్ఫిన్ వంటి జీవరసాయనాలు ఎక్కువగా స్రవించి ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాదు... అవి దిగులుగా ఉండటం, యాంగై్జటీ, డిప్రెషన్‌ను కూడా రాకుండా నివారిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. అయితే కాస్త వయసుపైబడ్డవారు వ్యాయామాన్ని ప్రారంభించే ముందుగా డాక్టర్ నుంచి తగిన సలహా పొందాలి. వారి వ్యక్తిగత రుగ్మతలకూ, జీవనశైలికి తగిన వ్యాయామ విధానాల గురించి డాక్టర్ నుంచి సూచనలు పొందాలి. ఉదాహరణకు డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు తాము తీసుకుంటున్న మందులు, ఆహారానికి తగినట్లుగా తమ వ్యాయామ పద్ధతులు, వేళల గురించి సలహా పొందడం అవసరం.వ్యాయామాన్ని కొత్తగా మొదలుపెట్టేవారు భారమైన పెద్దపెద్ద వ్యాయామాలను ఒకేసారి ప్రారంభించకూడదు. వ్యవధినీ, శరీరం మీద పడే భారాన్ని మెల్లమెల్లగా పెంచాలి. రోజులో రెండుసార్లు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల అయ్యే గాయాలను నివారించడానికి ఎక్సర్సైజ్కు ముందుగా వార్మింగ్ అప్, తర్వాత కూలింగ్ డౌన్ వ్యాయామాలు చేయాలి. వ్యాయామం మనల్ని మరింత చురుగ్గా ఉండేలా చేయాలి తప్ప నిస్సత్తువను పెంచకూడదు. వ్యాయామం చేస్తున్నప్పుడు నొప్పులు పెరిగినా, ఒంట్లో ఎక్కడైనా ఎర్రబారినా, శ్వాస అందకపోయినా, చెమటలు ఎక్కువగా పట్టినా, ఇతరత్రా ఇబ్బందులు ఎదురైనా వ్యాయామం ఆపేసి వెంటనే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స లేదా సూచనలు పొందాలి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఆన్లైన్ పరీక్ష: చెలరేగిన క్లోనింగ్ ముఠా
సాక్షి, జైపూర్: ఆధార్ గోప్యత, హ్యాకింగ్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్..నకిలీ ఫింగర్ ప్రింట్ రాకెట్ తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్‌లో కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా నకిలీ ఆధార్ కార్డులతో పరీక్షకు హాజరువుతున్న గ్యాంగ్‌ను అధికారులు ఛేదించారు. కానిస్టేబుల్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన పరీక్ష సందర్భంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు. అభ్యర్థుల బొటన వేలి ముద్రలకు నకిలీవి రూపొందించి అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్షలకు హాజరయ్యారు. 5390 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను పూరించడానికి మొదటిసారి ఆన్లైన్ పరీక్షలు ప్రవేశపెట్టగా, మార్చి 7నుంచి 45 రోజులు నిర్వహించన్నారు. మార్చి 12, 14 తేదీలలో, జైపూర్‌లో కంప్యూటర్ను హ్యాక్ చేసి ఘటన నమోదు కావడంతో 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. గత మూడు రోజుల్లో పంకజ్ జాట్, ముక్తర్ సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశామని రాజస్థాన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్అధికారి ఉమేష్ మిశ్రా చెప్పారు. ఇలా 77కేంద్రాల్లో 25మంది నకిలీ అభ్యర్థులను గుర్తించామన్నారు. సినీ ఫక్కీలో నకిలీ ఫింగర్ ప్రింట్స్ యూట్యూబ్‌లో వేలిముద్రల క్లోనింగ్ నేర్చుకున్నారు. మొదట, వారు దరఖాస్తుదారు వేలు మీద చేప నూనెను పూసి,దాన్ని వేడిగా ఉన్న మైనం మీద ఉంచుతారు. దానికి ఫెవికాల్ పూసి అది ఆరిన తరువాత నకిలీ ఫింగర్ ప్రింట్ రడీ. దీని ద్వారా పరీక్షా కేంద్రానికి వెళ్లి దరఖాస్తుదారుడి తరఫున పరీక్షకు హాజరు కావడం, బయోమెట్రిక్ టెస్ట్ పాస్ కావడం, పరీక్షరాసి బయటపడడం అన్నీ జరిగిపోయాయి. అయితే వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు నకిలీ ఫింగర్ ప్రింట్‌తో పరీక్ష హాల్లోకి హాజరైన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ముఠా గుట్టురట్టయింది. విలేజ్ సర్వీస్ వర్కర్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హర్యానాకు చెందిన దేవేంద్ర (20) ను కీలక సూత్రధారిగా గుర్తించారు. కాగా దీంతో ఈముఠా భారీ ఎత్తున విస్తరించి ఉండవచ్చనే సందేహాలు నెలకొన్నాయి. -
ఆ దొంగతనంతో చైనా హర్టయ్యింది
వాషింగ్టన్ : బొటనవేలు దొంగతనం చేసినందుకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే అది మనిషిది కాదు సుమీ... చారిత్రక నేపథ్యం ఉన్న టెర్రా కోట్టా యుద్ధవీరుడి విగ్రహానిది. ఫిలడెల్ఫియాలోని ఫ్రాంక్లిన్ ఇనిస్టిట్యూట్ మ్యూజియంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గతేడాది డిసెంబర్ 21 మ్యూజియంలో ఓ పార్టీ వేడుకలు జరిగాయి. దీనికి పెద్ద ఎత్తున్న విద్యార్థులు హాజరయ్యారు. వారంతా టెర్రా-కొట్టా వారియర్ ఎగ్జిబిషన్లో వారంతా కలియదిరిగారు. దానికి బియర్ ప్రాంతానికి చెందిన చెందిన మైకేల్ రోహనా అనే విద్యార్థి కూడా హజరయ్యాడు. అంతా ఫోటోలు దిగుతున్న సమయంలో మెల్లిగా ఓ విగ్రహాం వద్దకు వెళ్లి దాని బొటనవేలును విరిచేశాడు. దానిని తన జేబులో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సుమారు 4.5 మిలియన్ డాలర్ల విలువైన విగ్రహం కావటంతో ఏకంగా పోలీస్ శాఖా ఎఫ్‌బీఐ సాయం కోరింది. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా ఎఫ్‌బీఐ అతన్ని గుర్తించే ప్రయత్నం చేసింది. దాదాపు నెలన్నరకు పైగా విచారణ చేపట్టి చివరకు అతన్ని అరెస్ట్ చేసింది. బోటనవేలును అతని నుంచి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆపై రోహనా బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా, ఈ ఘటనపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. షాంక్సి కల్చరల్ హెరిటేజ్ ప్రమోషన్ సెంటర్.. అమెరికా విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘అది మా జాతి గౌరవానికి సంబంధించింది. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించటం దారుణం. ఈ కేసులో నిందితుడిని కఠినంగా శిక్షించాలి’ అని పేర్కొంది. FBI says a US man stole the thumb of a 2,200-year-old Chinese terracotta warrior statue being displayed at the Franklin Institute pic.twitter.com/ZwzRrSq8V2 — CGTN (@CGTNOfficial) 18 February 2018 టెర్రా-కొట్టా మ్యూజియాలు... చైనాకు చెందిన బలమైన సైన్యం టెర్రా-కొట్టా సుమారు 2 వేల సంవత్సరాల క్రితం నాటిది. చైనా తొలి చక్రవర్తి క్విన్ షీ హువాంగ్ సమాధికి రక్షణగా ఈ టెర్రా-కొట్టా యుద్ధవీరుల విగ్రహాలను నిర్మించారు. 1974లో ఓ రైతు వీటిని గుర్తించటంతో వెలుగులోకి వచ్చింది. అందులోని కొన్ని విగ్రహాలను ప్రపంచంలోని వివిధ మ్యూజియాలకు తరలించి ప్రదర్శిస్తున్నారు. తమ సంప్రదాయాలకు, చరిత్రకు గుర్తుగా చైనా వీటికి అపూర్వ గౌరవం ఇస్తోంది. -
కాలి వేలే.. చేతి వేలైంది..
సిడ్నీ: ఆస్ట్రేలియా వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఓ వ్యక్తి ప్రమాదంలో చేతి బొటన వేలు కోల్పోగా అతని కాలి బొటన వేలును చేతి బొటన వేలుగా అతికించారు. పెర్త్‌కు చెందిన జాక్ మిచెల్(20) పశువుల కాపరి. అతను పనిచేస్తున్న ఫౌంహౌస్‌లో ప్రమాదవశాత్తు వేలును కోల్పోయాడు. వేగంగా దూసుకొచ్చిన ఎద్దు మిచెల్‌ను ఢీకొట్టింది. ఆ దాటికి అతని బొటన వేలు ఊడి కిందపడింది. ఇక అతని స్నేహితులు ఊడిన వేలుని ఐస్ మధ్య ఉంచి అతన్ని ఆసుపత్రికి తరలించారు. పెర్త్ డాక్టర్లు అతని వేలు అతికించడానికి శత విధాల ప్రయత్నించారు. రెండు సర్జరీలు కూడా చేశారు. అయినా ఆ వేలు అతకపోవడంతో తదుపరి చికిత్సకు సిడ్నీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని సూచించారు. అవసరమైతే కాలి బొటన వేలిని చేతికి అతికించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి మిచెల్ అంగీకరించడంతో సిడ్నీ డాక్టర్లు విజయవంతంగా కాలి వేలిని చేతికి అతికించారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి!
► జిల్లాలో పూర్తి కావచ్చిన పల్స్ సర్వే ► సిబ్బందికి చెల్లించాల్సిన గౌరవ వేతనంలో జాప్యం ► ఎన్యూమరేటర్ల ఎదురుచూపు జనాలకు నిద్రపట్టినివ్వలేదు.. సిబ్బందిని పడుకోనివ్వలేదు.. సామాన్యుల్లో ఒకటే టెన్షన్. స్మార్ట్ సర్వేలో నమోదు అరుుతే చిక్కులు తప్పవని.. దాని తీరూ అలాగే ఉంది. ప్రస్తుతానికి ఆ విషయం పక్కనపెడితే రేరుుంబవళ్లు సర్వే పేరుతో ఒళ్లు గుల్ల చేసుకొని.. పని పూర్తి చేసిన సిబ్బందికి ప్రభుత్వ ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. చేసిన శ్రమకు గౌరవ వేతనం ఇంకా ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తోంది. - ఒంగోలు టౌన్ ‘ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వే చివరి దశకు చేరుకొంది. ఆరునెలలపాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగింది. అరుుతే కష్టపడిన ఎన్యూమరేటర్లకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ ఊసే ఎత్తడం లేదు. దీని కోసం వారంతా ఎదురు చూస్తున్నారు’ జేబులో డబ్బుతో.. సర్వే చేసిన సమయంలో సిబ్బంది కష్టాలు అన్నీ.. ఇన్నీ కావు. సిగ్నల్స్ దొరక్కపోవడంతో పాటు జేబులో డబ్బు పెట్టి మరీ నెట్ బిల్లు చెల్లించి సర్వే పూర్తి చేశారు. అరుుతే ఈ నగదు కూడా తమ ఖాతాలో జమ అవుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సర్వే ప్రారంభం కాగా.. 8,60,463 ఇళ్లను సందర్శించి 33,59,220 మంది వివరాలు నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. కాగా దీనికోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారిలో 2251 మంది ఎన్యూమరేటర్లను, వారి పనితీరును పరిశీలిస్తూ సలహాలు సూచనలు అందించేందుకు 295 మంది సూపర్వైజర్లను నియమించారు. ఒక్క పేరుకు రూ. 4 ఒక్కో ఎన్యూమరేటర్ ఒక పేరు సర్వేలో పొందుపరిస్తే నాలుగు రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎన్యూమరేటర్ చేసిన సర్వేలో దానిలో పదిశాతం సూపర్వైజర్కు ఇవ్వనున్నట్లు చెప్పింది. దీంతో కొన్ని శాఖలకు చెందినవారు తమ విధులను పక్కనపెట్టి పూర్తి స్థారుులో సర్వేలో పాల్గొన్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులంతా అందుబాటులో లేకపోవడంతో ఒక్కో ఇంటికి నాలుగైదుసార్లు తిరిగిన సందర్భాలున్నారుు. పైగా కొంతమంది అథంటికేషన్(థంబ్, ఐరిష్) వంటివి లేకపోవడంతో మరోమారు వివరాలను సేకరించాల్సి వచ్చింది. రూ 3.47కోట్లకు రూ. 1.70 కోట్లే! జిల్లాలో స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి 3.47 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. సర్వేకు సంబంధించి ఎన్యూమరేటర్ల రెమ్యునరేషన్ నుంచి మెటీరియల్ తదితర వాటికి లెక్కలు వేసి నివేదించారు. అరుుతే ప్రభుత్వం కోటి 70లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం వచ్చిన ఈ మొత్తాన్ని ఏవిధంగా పంపిణీ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీనికితోడు సర్వే ప్రారంభించిన సమయంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా నియమించిన వారిలో కొంతమంది శాఖాపరమైన విధి నిర్వహణకు సంబంధించి ఒత్తిళ్లు ఉండటంతో స్మార్ట్ పల్స్ సర్వే నుంచి తప్పుకున్నారు. దాంతో వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. సర్వే చేస్తూ మధ్యలో మానివేసిన వారి వివరాలు, ప్రస్తుతం సర్వే చేస్తున్న వారి వివరాలను సేకరిస్తూ వారి ఖాతాల్లో రెమ్యునరేషన్ వేసే విషయంలో గందరగోళం నెలకొంది. -
చలికాలంలో పాదాల జాగ్రత్తలు...
చలికాలం వచ్చిందంటే మా పాదాలు పగులుతున్నాయి. ఈ సీజన్లో పాదాల ఆరోగ్యం గురించి మాకు తగిన సలహా ఇవ్వండి. - సుమతి, పలాస చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి. పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి. షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి. ఇవి చేయకూడదు : చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు. పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు. ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు. డాక్టర్ భక్తియార్ చౌదరి స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్నెస్ నిపుణుడు, హైదరాబాద్