తన కుడి చేతి బొటనవేలు పుణ్యమా అని ఆ యువకుడు పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు. దాని ప్రత్యేకత కారణంగా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఆ బొటనవేలు ప్రత్యేకత ఏంటంటే.. మామూలుకంటే రెట్టింపు పొడవుగా ఉండటం. మామూలుగా అందరికి 2.5 అంగుళాల బొటనవేలు ఉంటే మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్ పిన అనే యువకుడికి మాత్రం ఎకంగా ఐదు అంగళాల పొడవుండే బొటనవేలు ఉంది. వేలి ప్రత్యేక కారణంగా టాల్క్ ఆఫ్ ది టిక్‌టాక్‌గా మారాడు జాకబ్.