Boston
-
Kavita Shukla: అమ్మమ్మ ఇంట్లో వచ్చిన ఐడియా జీవితాన్నే మార్చేసింది!
సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళితే ఏం దొరుకుతుంది? అంతులేని ఆనందం. అయితే అమెరికా నుంచి ఇండియాలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన కవితా శుక్లాకు ఆనందంతో పాటు ‘ఐడియా’ కూడా దొరికింది. ఆ ఐడియా ఆమెను ఇన్వెంటర్ని చేసింది. ఆ తరువాత ఎంటర్‌ప్రెన్యూర్‌ను చేసింది. ఇన్వెంటర్, ఎంటర్ప్రెన్యూర్, మోటివేషనల్ స్పీకర్, డిజైనర్‌గా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది కవితా శుక్లా... చిన్నప్పటి నుంచి సైన్స్, కళలు అంటే కవితకు ఆసక్తి. సైన్స్‌లో రకరకాల ప్రయోగాలు చేసేది. తాను ఇన్నోవేటర్ కావడానికి ఆ ప్రయోగాలు పునాదిగా ఉపయోగపడ్డాయి. పదిహేడు సంవత్సరాల వయసులోనే ఎన్నో పేటెంట్లు తీసుకుంది. ‘ఫ్రెష్‌పేపర్’ రూపంలో ఆహార వ్యర్థాలను తగ్గించే సాంకేతిక ఆవిష్కరణ కవితకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చింది. ఈ ఫ్రెష్ పేపర్ ఆహారం, కూరగాయలలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుదలను నిరోధించి వాటిని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. బోస్టన్లోని స్థానిక రైతు మార్కెట్ లో ఫ్రెష్ పేపర్ లాంచ్ చేశారు. మౌత్‌టాక్‌తోనే ఈ పేపర్ పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ ఫ్రెష్‌పేపర్ 180 దేశాల్లో అందుబాటులో ఉంది. ‘యూఎస్‌లో ఆహార వృథా అనేది ఇంత పెద్ద సమస్య అని తెలియదు. ఫ్రెష్పేపర్కు వచ్చిన స్పందన నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. పండ్లు, కూరగాయలు, ఆహారాన్ని తాజాగా ఉంచడానికి తద్వారా ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. లోకల్ఫుడ్ బ్యాంకులకు వీటిని విరాళంగా ఇచ్చాం’ అంటుంది కవిత. ఫుడ్ ప్రిజర్వేషన్‌కు సంబంధించిన ఆసక్తి కవితలో పదమూడు సంవత్సరాల వయసు నుంచే మొదలైంది. సెలవులు వచ్చినప్పుడు ఇండియాలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది కవిత. ఒకరోజు పొరపాటున కలుషితమైన నీరు తాగింది. ఆందోళన పడిన అమ్మమ్మ వెంటనే కవితతో ఏదో కషాయం తాగించింది. దీంతో కవితకు ఏమీ కాలేదు. అమెరికాకు తిరిగిన వచ్చిన తరువాత కషాయంలో అమ్మమ్మ ఉపయోగించిన పదార్థాల గురించి వివరంగా తెలుసుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఆహారపదార్థాలు, కూరగాయలు చెడిపోకుండా సంరక్షించడానికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టింది. జర్మనీలో పుట్టిన కవిత ఇలియట్ సిటీ (యూఎస్)లో పెరిగింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పుచ్చుకుంది. ‘ సింపుల్ ఐడియాలకు మార్పు తెచ్చే శక్తి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు’ అంటుంది కవిత. ఆహార భద్రత, సంరక్షణకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న కవిత మోటివేషనల్ స్పీకర్ కూడా. ఎన్నో కాలేజీలలో, సమావేశాలలో యువతను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగాలు చేసింది. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్లు అందుకుంది. ఫోర్బ్స్ ‘30 అండర్ 30: సోషల్ ఎంటర్ ప్రెన్యూర్స్’ టైమ్ మ్యాగజైన్ ‘5 మోస్ట్ ఇనోవేటివ్ ఉమెన్ ఇన్ ఫుడ్’ న్యూస్‌వీక్ ‘125 ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ జాబితాలలో చోటు సంపాదించింది. రెండు సంవత్సరాల క్రితం వర్జీనియాలో జరిగిన వ్యాపారులు, చిన్న వ్యాపారులు, ఇండిపెంటెంట్ ఇన్వెంటర్లు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్స్ సమావేశంలో కీలక ఉపన్యాసం ఇచ్చింది. ఇన్వెంటర్ అయిన కవిత ‘ఫ్రెష్ గ్లో’ కంపెనీతో ఎంటర్‌ప్రెన్యూర్‌గా అద్భుత విజయం సాధించింది. ‘మీకు ఏదైనా ఆసక్తిగా అనిపిస్తే దాని గురించి లోతుగా ఆలోచించండి. ఆ తరువాత పరిశోధించండి. ఫలితాలు చేతికి అందేవరకు ప్రయోగాలు చేయండి’ అంటుంది కవిత. ఆలోచించండి... అద్భుతాలు చేయండి కష్టాల దారిలో ప్రయాణించి విజయాలు సాధించిన ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ల గురించి తెలుసుకోవడం అంటే ఇష్టం. వారి గురించి సమావేశాల్లో చెబుతుంటాను. వారి విజయగాథలు ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలతో ఎన్ని గొప్ప పనులైనా చేయవచ్చు. మన ఐడియాను మొదట ఇతరులతో పంచుకోవడానికి భయంగా అనిపిస్తుంది. ఆ భయాన్ని వదులుకొని ఆత్మవిశ్వాసంతో చెప్పండి. ఆత్మవిశ్వాసం ఉన్న చోటుకి విజయం త్వరగా వస్తుంది. – కవితా శుక్లా, ఫ్రెష్ గ్లో కంపెనీ ఫౌండర్, సీయీవో ∙చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో కవితా శుక్లా -
మంత్రి కేటీఆర్‌కు హార్వర్డ్ వర్సిటీ నుంచి ఆహ్వానం
మంత్రి కేటీఆర్‌కు బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీ ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో మాట్లాడేందుకు రావాలని పిలుపునిచ్చింది. ‘ఇండియా రైజింగ్-బిజినెస్, ఎకానమీ, కల్చర్’ అనే థీమ్‌పై ఫైర్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడనున్నారు. హార్వర్డ్‌లోని ఇండియా కాన్ఫరెన్స్ అనేది అమెరికాలోని విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద కార్యక్రమాల్లో ఒకటి. ఇందులో వెయ్యిమంది విద్యార్థులు, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పొల్గొననున్నారు. గతంలో ఎంతో మంది మేధావులు పాల్గొన్న ఈ సదస్సులో పాల్గొనాలనే హార్వర్డ్ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానాన్ని అందించింది. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఆహ్వానం అందడంపట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. -
హైదరాబాద్‌లో ‘స్టెమ్ సెల్’ ల్యాబ్!
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో దేశంలోనే అతి పెద్ద స్టెమ్ సెల్ తయారీ ప్రయోగశాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ‘స్టెమ్ క్యూర్స్ కంపెనీ’ప్రకటించింది. సుమారు 54 మిలియన్ డాలర్ల (సుమారు రూ.440 కోట్లు) పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ తయారీ యూనిట్‌తో 150 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌తో స్టెమ్ క్యూర్స్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం అట్లూరి బోస్టన్ నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అత్యంత తీవ్రమైన వైద్య, ఆరోగ్య సమస్యలకు స్టెమ్ సెల్ థెరపీతో పరిష్కారం లభిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అత్యాధునిక చికిత్సా విధానాలు మన దేశంలో విస్తృతంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. కాగా ప్రపంచ వైద్య ఆవిష్కరణలకు తన సొంత నగరమైన హైదరాబాద్ హబ్‌గా మారిందంటూ సాయిరాం సంతోషం వ్యక్తం చేశారు. నల్లగొండలో సొనాటా కార్యకలాపాలు నల్లగొండలో ప్రారంభం కానున్న ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సొనాటా సాఫ్ట్వేర్ ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఐటీ టవర్‌లో సొనాటా సాఫ్ట్వేర్ 200 ఉద్యోగాలు కల్పిస్తుంది. బోస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ సందర్భంగా సొనాటా సాఫ్ట్వేర్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీని వీరవెల్లి ఈ మేరకు ప్రకటన చేశారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్నాథ్రెడ్డి ఇందుకూరి తదితరులు భేటీలో పాల్గొన్నారు. నగరానికి ప్లూమ్, సనోఫీ, పై హెల్త్ కమ్యూనికేషన్స్ సర్విస్ ప్రొవైడర్స్ (సీఎస్పీ), వారి సబ్‌స్రై్కబర్లకు సాస్ (సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) అనుభూతిని కలిగించిన వేదిక ‘ప్లూమ్’హైదరాబాద్‌లో వంద మంది ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. జయేశ్ రంజన్‌తో ప్లూమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ ఈదర భేటీ సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది. అంతర్జాతీయ ఫార్మా సంస్థ సనోఫీ 350 ఉద్యోగులతో ఒక సెంటర్‌ను ఏర్పా టు చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సమగ్ర కేన్సర్, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌తో భేటీ సందర్భంగా ‘పై హెల్త్’సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి ప్రకటించారు. నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ ఐక్యరాజ్య సమితి మాజీ రాయబారి, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీతో కేటీఆర్ భేటీ అయ్యారు. భారత్, యూఎస్ సంబంధాల్లో హైదరాబాద్, తెలంగాణకు ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతపై చర్చించారు. ఆర్థిక, ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనా లోతుగా చర్చించడంతో పాటు అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్న నిక్కీ హేలీని మంత్రి అభినందించారు. -
గర్భస్థ శిశువు మెదడుకు శస్త్రచికిత్స
బోస్టన్: అమెరికాలోని బోస్టన్ నగరంలో వైద్యులు అరుదైన ఘనత సాధించారు. వైద్య రంగంలోనే అద్భుతాన్ని సృష్టించారు. తల్లిగర్భంలో ఉన్న 34 వారాల శిశువు(పిండం)కు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. శిశువు మెదడులో అపసవ్యంగా ఉన్న రక్తనాళాన్ని సర్జరీతో సరిచేశారు. ప్రపంచంలో ఈ తరహా సర్జరీ చేయడం ఇదే ప్రథమం. బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, బ్రిఘామ్, ఉమెన్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరిగింది. గర్భస్థ శిశువుల్లో అరుదుగా తలెత్తే ఈ వైకల్యాన్ని ‘వీనస్ ఆఫ్ గాలెన్ మాల్ఫార్మేషన్’ అంటారు. ఇలాంటి వైకల్యంతో జన్మించే శిశువులు మెదడులో గాయాలు, గుండె వైఫల్యం వంటి కారణాలతో మరణించే అవకాశం ఉంటుందని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ రేడియాలజిస్ట్ డాక్టర్ డారెన్ ఒబ్రాచ్ చెప్పారు. మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం అపసవ్యంగా ఏర్పడడమే గాలెన్ మాల్ఫార్మేషన్. దీనివల్ల రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ఫలితంగా రక్త పీడనం ఎక్కువై సిరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. సిరలలో ఒత్తిడి కారణంగా మెదడు పెరుగుదల మందగిస్తుంది. కణజాలాలు దెబ్బతింటాయి. అంతేకాకుండా గుండె పనితీరు కూడా దెబ్బతినవచ్చు. గాలెన్ మాల్ఫార్మేషన్తో బాధపడుతున్న గర్భస్థ శిశువుల్లో 50 నుంచి 60 శాతం మంది పుట్టిన వెంటనే ఆరోగ్యం విషమిస్తుందని, వారు బతికే అవకాశాలు కేవలం 40 శాతం ఉంటాయని డారెన్ ఒబ్రాచ్ వెల్లడించారు. -
ఒకే కాన్పులో జంట కవలలు, కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా!
కవలలను సాకడం తల్లిదండ్రులకు ఎంతో కష్టం. అలాంటిది ఒకేసారి కవలల జంట పుడితే! బాప్రే అనుకుంటున్నారా? అలాంటి అరుదైన ఘటన బోస్టన్లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో జరిగింది. యాష్లీ నెస్ అనే మహిళకు ఒకే కాన్పులో ఒకేతీరుగా ఉన్న ఇద్దరు కవలల (ఐడెంటికల్ ట్విన్స్) జంట జన్మించారు. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు... మొత్తానికి నలుగురు పిల్లలు జూలై 28న పుట్టారు. కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇచ్చిన కాన్పు తేదీ కంటే.. పన్నెండువారాలు ముందుగా పుట్టారు. ఇలాంటి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి. కాలిఫోర్నియాకు చెందిన ఒక మహిళ... 15 నిమిషాల తేడాతో కవలలకు జన్మనిచ్చింది. ముందుగా బాబు 2021 డిసెంబర్ రాత్రి 11.45 గంటలకు జన్మిస్తే... 15 నిమిషాల తరువాత.. అంటే 2022 జనవరి ఒకటిన అర్ధరాత్రి పన్నెండుకు పాప జన్మించింది. ఇండియానాలోనూ 2019 డిసెంబర్ 31న ఇలాంటి అరుదైన సంఘటన జరిగింది... కాకపోతే పిల్లలిద్దరికి అర్థగంట తేడా అన్నమాట. -
రైలు వంతెనపై మంటలు...నదిలోకి దూకేసిన ప్రయాణికులు
న్యూయార్క్: అమెరికాలోని బోస్టన్ శివార్లలోని రైలు వంతెనపై మంటులు చెలరేగాయని అధికారులు తెలిపారు. దీంతో దాదాపు 200 మంది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ఐతే కొంతమంది భయంతో కిటికీల గుండా తప్పించుకోగా, మరికొంత మంది వంతెన కింద ఉన్న నదిలోకి దూకేసినట్లు తెలిపారు. ఈ ఘటన పై దర్యాప్తు చేసిన మసాచుసెట్స్ బే ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ కీలక విషయాలు వెల్లడించింది. వెల్లింగ్టన్, అసెంబ్లీ స్టేషన్ల మధ్య ఉన్న వంతెన మీదుగా ప్రయాణిస్తున్న ఆరెంజ్ లైన్ రైలు దాని హెడ్ కార్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. ఐతే ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఈ సంఘటనను చూసి భయపడి నదిలోకి దూకేసిన మహిళ మాత్రం వైద్య సహాయానికి నిరాకరించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. This was my morning. pic.twitter.com/shKkLYE6kT — Glen Grondin (@odievk) July 21, 2022 New video shows a person in the water after an Orange Line train broke down and started smoking over the Mystic River. Riders had to climb off the train on to the tracks and walk back to the station. Witnesses say one person even jumped into the water. pic.twitter.com/Gvimj7krf9 — Rob Way (@RobWayTV) July 21, 2022 (చదవండి: గులాబీ వర్ణంలోకి ఆకాశం.. సినిమాను తలపించిన దృశ్యం.. ఏలియన్స్ పనేనా?) -
బోస్టన్‌లో హెల్త్ కేర్ ఎట్ గ్లాన్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్
-
వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిరాకరించిన వైద్యులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రెండు, మూడు నెలలకొకసారి తన రూపంతారం మార్చుకుని ప్రజలపై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కచ్చితం చేశాయి. ఎక్కడికి వెళ్లినా... కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమతులు ఇస్తున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని సుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డీజే ఫెర్గుసన్ అనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి గుండె మార్పిడి చికిత్స అత్యవసరంగా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే డీజే ఫెర్గుసన్‌ను బోస్టన్‌లో ఉన్నటు వంటి.. బ్రిఘం & ఉమెన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె మార్పిడి చికిత్స కోసం ఆసుపత్రి నిబంధనల ప్రకారం.. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారు. అంతలోనే ఆస్పత్రి ట్విస్ట్ ఇచ్చింది. డీజే ఫెర్గుసన్.. ఇంత వరకు సింగిల్ డోస్ కూడా వేసుకోలేదని, అతను వ్యాక్సిన్ వేసుకుంటేనే తాము చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో డీజే ఫెర్గుసన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా? అత్యవసర సమయంలో ఇలాంటి నిబంధనలు ఎంటని నిలదీశారు. తాను అస్సలు వ్యాక్సిన్ వేసుకోబోనని అటు డీజే ఫెర్గుసన్ మొండి పట్టు పట్టారు. ఇంకేముంది.. తాము ఆపరేషన్ చేయలేమని ఆస్పత్రి సిబ్బంది కుండ బద్దలు కొట్టారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే తాము ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. కాగా అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు. చదవండి: అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా -
ఆరుకోట్లకు అమ్ముడుపోయిన అటోగ్రాఫ్! ఎవరిదంటే..
Steve Jobs Autograph: టెక్నాలజీ ఎరాలో యాపిల్ ఆవిష్కరణ ఒక కీలక పరిణామమనే చెప్పొచ్చు. అందుకే యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్‌ను ఓ పాథ్ మేకర్‌గా భావిస్తుంటారు. చనిపోయాక కూడా ఆయన లెగసీ కొనసాగుతూనే వస్తోంది. తాజాగా ఆయన సంతకంతో ఉన్న ఓ కంప్యూటర్ మ్యానువల్.. వేలంపాటలో సుమారు ఆరు కోట్ల రూపాయలను దక్కించుకుని వార్తల్లో నిలిచింది. 1977లో యాపిల్ II కంప్యూటర్ రిలీజ్ అయ్యింది. దాదాపు రెండేళ్లపాటు నడిచిన ఈ వెర్షన్.. పర్సనల్ కంప్యూటింగ్‌లో, కంప్యూటర్ల బిజినెస్‌లో విప్లవాత్మక మార్పునకు కారణమైంది. అలాంటి కంప్యూటర్‌కు చెందిన మ్యానువల్పై స్టీవ్ జాబ్స్, యాపిల్ సెకండ్ సీఈవో మైక్ మర్క్కులా 1980లో సంతకం చేశారు. యూకేకు చెందిన ఎంట్రప్రెన్యూర్ మైక్ బ్రివర్(తర్వాత యూకే యాపిల్ కంప్యూటర్‌కు ఎండీ అయ్యాడు) కొడుకు జులివాన్ కోసం దానిపై సంతకం చేశారు వాళ్లు. ‘‘జులివాన్.. మీ జనరేషన్ నడక కంప్యూటర్లతో మొదలైంది. మార్పునకు సిద్ధం కండి’ అంటూ దాని మీద స్టీవ్ జాబ్స్ చేత్తో రాసిన రాత కూడా ఉంది. మైక్‌తో స్టీవ్ జాబ్స్ బోస్టన్‌కు చెందిన ఆర్ఆర్ ఆక్షన్స్ కంపెనీ ఈ అటోగ్రాఫ్ కాపీని వేలం వేసింది. మొత్తం 46 బిడ్లు దాఖలు కాగా, విన్నింగ్ బిడ్ 7,87,484 డాలర్ల(మన కరెన్సీలో 5.8కోట్ల రూపాయలకు పైనే) బిడ్ ఓకే అయ్యింది. ఇండియానా పొలిస్ కోల్ట్స్‌కు చెందిన.. జిమ్ ఇర్సే దీనిని దక్కించుకున్నట్లు తెలస్తోంది. ‘‘ఆరోజు జాబ్స్, మర్క్కులా మా ఇంటికి వచ్చారు. బెడ్రూంలో ఉన్న నేను.. ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ వెళ్లా. నా ఆత్రుత చూసి దగ్గరికి తీసుకుని.. నా దగ్గర ఉన్న మ్యానువల్పై సంతకం చేసిచ్చారు వాళ్లు’ అని ఆనాటి సంగతిని గుర్తు చేసుకున్నాడు జులివాన్. ఇక 1973లో స్టీవ్ జాబ్స్ ఓ కంపెనీలో ఉద్యోగం కోసం చేసుకున్న చేతిరాత దరఖాస్తు కాపీని.. యూకేలోని ప్రముఖ సంస్థ చార్టర్‌ఫీల్డ్స్ వేలం వేయగా సుమారు రూ. కోటిన్నరకు పోయింది. చదవండి: IPO-ప్రజల నుంచి 70వేల కోట్లు!! -
మీ వెంట లక్షల మందిమి ఉన్నాం: వైరల్
బోస్టన్ : కరోనా వైరస్‌పై పోరాటం చేయటంలో ఫ్రంట్ లైన్ సిబ్బంది శ్రమ వెలకట్టలేనిది. కర్తవ్య నిర్వహణలో భాగంగా కరోనాకు ఎదురొడ్డి నిలబడి ఇన్ని రోజులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికారు. వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. వారి ప్రార్థనలు ఫలించి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా అమెరికాలో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి లభించింది. వ్యాక్సిన్లను మొదటగా ఫ్రంట్ లైన్ సిబ్బందికి వేయనున్నారు. దీంతో బోస్టన్లోని ఓ మెడికల్ ఇన్స్టిట్యూట్ వైద్య సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. అమెరికన్ సింగర్ లిజ్జో పాట ‘‘ గుడ్ యాజ్ హెల్’’కు డ్యాన్స్‌లు వేశారు. ( ఈ పాప హాబీ ఏంటో తెలుసా? ) బోస్టన్ మెడికల్ సెంటర్ సీఈఓ కేట్ వాల్ష్ ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ ఫ్రంట్ లైన్ సిబ్బంది కోసం వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సిన్లు వస్తున్నందుకు ఈ సంబరాలు. ఓ గొప్ప రోజు.. ఓ గొప్ప ప్రదేశంలో’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ప్రజల్లో నమ్మకం కలగటం ఆనందంగా ఉంది.. నేనింక ఆగలేను.. అద్భుతంగా ఉంది.. మీ వెంట లక్షల మందిమి ఉన్నాం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Why I love my job @The_BMC ! Teams of people working to safely and equitably distribute vaccines to their front line colleagues getting cheered on by their friends celebrating the arrival of the vaccines! A great day, a great place. ❤️ pic.twitter.com/XfrIthFIY5 — Kate Walsh (@KateWalshCEO) December 14, 2020 -
వెరైటీ డ్రెస్‌తో 43 ఏళ్ల తర్వాత తండ్రి చెంతకు
బోస్టన్ : హాలీవుడ్ సినిమా ఈఎల్ఎఫ్ చూసిన వారికి హీరో విల్ ఫెర్రల్ తండ్రిని కలుసుకునే సీను గుర్తుండే ఉంటుంది. మొదటి సారి తండ్రిని కలుసుకునే ఆ సీనులో అద్భుతంగా నటించాడు విల్. 2003లో వచ్చిన ఈఎల్ఎఫ్ సినిమాను చూసి, విల్ పాత్రనుంచి స్పూర్తి పొందాడు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన డోగ్ హెన్నింగ్ వోర్ అనే వ్యక్తి. అందుకే 43 ఏళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలవడానికి ఆ సినిమాలో విల్ ధరించే దుస్తుల్లాంటి వాటినే ధరించాడు. చిన్నప్పుడే తండ్రినుంచి దూరమైన డోగ్ పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరిగాడు. యాన్సెస్టరీ.కామ్ ద్వారా అతడి తోబుట్టువులను కనుక్కున్నాడు. అనంతరం ఆన్లైన్లో తండ్రితో మాట్లాడేవాడు. గత మంగళవారం బోస్టన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ( వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు ) ఈ సందర్భంగా సినిమా కాస్ట్యూమ్ ధరించాడు డోగ్. అంతేకాదు సినిమాలోని పాటను పాడుతూ హుషారుగా తండ్రిని చేరాడు. అయితే డోగ్ తండ్రి ఈఎల్ఎఫ్ సినిమా చూడకపోవటంతో అసలు సంగతి తెలియలేదు. డోగ్ విచిత్ర వేష ధారణను చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. దీనిపై డోగ్ మాట్లాడుతూ.. ‘‘అలా ఆ డ్రెస్‌లో వెళ్లటం నాకు మంచిదని పించింది. కానీ, ఆయన ఎయిర్‌పోర్టునుంచి బయటకు వచ్చి నన్ను చూడగానే పిచ్చోడిననుకుని ఉంటారు’’ అని అన్నాడు. -
విశాఖలో ‘బోస్టన్’ కొత్త కార్యాలయం
సాక్షి, విశాఖపట్నం: కార్యనిర్వాహక రాజధానిగా విశాఖకు లైన్ క్లియర్ కావడంతో పలు అంతర్జాతీయ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల ఆగస్టు 5న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రఖ్యాత బోస్టన్ గ్రూప్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్, బోస్టన్ గ్రూప్, పీపుల్ ప్రైమ్ వరల్డ్ వైడ్ ఛైర్మన్ సుబ్బు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుంది. విశాఖలో ఏర్పాటు కానున్న ఈ కొత్త కేంద్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), సైబర్ సెక్యూరిటీ మరియు హ్యూమన్ రిసోర్సెస్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు చేస్తుంది. వైజాగ్ వంటి టూ టైర్ నగరాల్లో గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ నిపుణుల ప్రతిభ ఆర్ధిక ప్రగతికి బాటలు వేస్తుందని సుబ్బు కోట అన్నారు. (వికేంద్రీకరణే అభివృద్ధి మార్గం) విజయవాడకు చెందిన సుబ్బు.. భారతీయ-అమెరికన్ పారిశ్రామికవేత్తగా, ఫిలాంత్ర ఫిస్ట్గా గుర్తింపు పొందారు. అమెరికాలో నివాసముంటున్న సుబ్బు కోట గత 50 ఏళ్లలో దాదాపు 50 కంపెనీలను ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టింగ్, ఇ-లెర్నింగ్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో విస్తృత అనుభవాన్ని గడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ ప్రభుత్వంతో తమ సంబంధాలు బలోపేతం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో విశాఖ దేశంలోనే అతిముఖ్యమైన గమ్యస్థానంగా మారుతోందని తెలిపారు. పెట్టుబడులకు విశాఖ అనువైన ప్రాంతమని, ఆర్థిక కేంద్రంగా ఎదిగేందుకు విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రపంచం కరోనా కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి సహకారాలు ఎంతో అవసరమన్నారు. పీపుల్ ప్రైమ్ వరల్డ్‌వైడ్ (ది బోస్టన్ గ్రూప్ అనుబంధ సంస్థ) సీఈవో రవి అలెటి మాట్లాడుతూ “కనెక్టివిటీ, కాస్మోపాలిటన్ పాపులేషన్, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు, యూనివర్శిటీలతో విశాఖకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్ లో ప్రపంచ నగరంగా విశాఖ రూపుదిద్దుకోబోతుందని తెలిపారు. విశాఖలోని సెజ్ జోన్లలో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నామని, రాష్ట్ర సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో కలిసి పని చేస్తామని రవి తెలిపారు. విశాఖను ఐటీ హబ్ గా, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేదుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం ఉత్తమమైనదని, ప్రతిభావంతులైన నిపుణులు, ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థలకు విశాఖ నెలవు అని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి నార్త్ అమెరికా పండుగాయల రత్నాకర్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి కట్టుబడి ఉందని, సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలతో దూసుకుపోతోందని అన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నూతన విధానాన్ని తెచ్చారన్నారు . బోస్టన్ గ్రూప్ గురించి.. 1988 లో ది బోస్టన్ గ్రూప్ స్థాపించబడింది. ఫార్చ్యూన్ 500, మిడ్-మార్కెట్ క్లయింట్లకు సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ మరియు ఐటి సేవలను అందించే ప్రధాన వ్యాపారంతో ఈ సంస్థ ప్రారంభమైంది. నాటి నుండి, టిబిజి తన సేవలను విస్తరిస్తూ వస్తోంది. ఐటి ఔట్ సోర్సింగ్, ఇ-లెర్నింగ్, ఇ- గవర్నెన్స్ తదితర సేవలను అందిస్తోంది. మొత్తం ఐదు దేశాలలో టీబీజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫార్మా, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వస్తు తయారీ, బ్యాంకింగ్, రిటైల్ వంటి అనేక రకాల పరిశ్రమలకు సేవలు అందిస్తుంది. -
‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ
న్యూయార్క్: ఆన్లైన్ క్లాస్‌లకు మారిన విద్యా సంస్థలకు చెందిన విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న అమెరికా ప్రభుత్వ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ విభాగం, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలపై ఈ రెండు ప్రఖ్యాత విద్యా సంస్థలు బుధవారం బోస్టన్ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ వేశాయి. ఆ నిబంధనలను తక్షణమే తాత్కాలికంగా నిలిపేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాయి. ‘ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఈ ఉత్తర్వులిచ్చారు. ఇది చాలా దారుణం. ఈ ఆదేశాలు చట్ట వ్యతిరేకం’ అని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ లారెన్స్ బేకో పేర్కొన్నారు. ఈ విషయంలో విదేశీ విద్యార్థులకు న్యాయం జరిగేలా తీవ్ర స్థాయిలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఆన్లైన్ క్లాసెస్‌కు మారిన విద్యాసంస్థల్లోని విదేశీ విద్యార్థులు స్వదేశాలకు వెళ్లాలన్న ఆదేశాల వల్ల విద్యాసంస్థలు త్వరగా పునఃప్రారంభమయ్యే అవకాశముందని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డెప్యూటీ సెక్రటరీ కుసినెలీ అన్నారు. ట్రంప్ ఆగ్రహం: ఫాల్ అకడమిక్ సెషన్‌కి విద్యా సంస్థలను పునఃప్రారంభినట్లయితే, వారికి ఫెడరల్ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. విద్యాసంస్థల పునః ప్రారంభానికి సంబంధించి అరోగ్య విభాగం జారీ చేసిన మార్గదర్శకాలను ఆచరణ సాధ్యం కాదని మండిపడ్డారు. -
ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే..
బోస్టన్: వెచ్చటి వాతావరణం... గాలిలో తేమశాతం అధికంగా ఉండటం! ప్రాణాంతక కరోనా వైరస్‌ను అడ్డుకునే ఆయుధాలని తేల్చారు బోస్టన్లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు. చైనాలోని వూహాన్ నగరంలో గత ఏడాది డిసెంబరులో గుర్తించింది మొదలు.. ఈ నెల 22వ తేదీ వరకూ వివిధ దేశాలకు విస్తరించిన తీరు.. ఆయా దేశాల్లోని ఉష్ణోగ్రతలు, గాల్లో తేమశాతాలను అంచనా వేయడం ద్వారా ఖాసీమ్ బుఖారీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాకు వచ్చింది. ‘ఎస్ఎస్ఆర్ఎన్ రిపాసిటరీ’జర్నల్‌లో ఈ అధ్యయనం తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. మార్చి 22వ తేదీ వరకూ ఉన్న కరోనా కేసులన్నింటిలో 90 శాతం కేసులు ఉష్ణోగ్రతలు మూడు నుంచి 17 డిగ్రీ సెల్సియస్‌లు ఉన్న ప్రాంతాల్లోనే సంభవించాయని ఈ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు.. ఈ ప్రాంతాల్లో గాల్లో తేమశాతం ప్రతి ఘనపు మీటర్ గాలిలో నాలుగు నుంచి తొమ్మిది గ్రాముల వరకూ ఉందని వీరు చెప్పారు. జనవరి నుంచి మార్చి నెల మొదటి వరకూ సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీ సెల్సియస్, గాల్లో తేమశాతం ఘనపు మీటర్‌కు తొమ్మిది గ్రాములు ఉన్న ప్రాంతాల్లో కేవలం ఆరు శాతం కేసులే ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఈ లెక్క ప్రకారం ఆసియా దేశాల్లో రుతుపవనాల్లాంటి వాతావరణం ఏర్పడితే వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశముంది. ఈ రకమైన వాతావరణంలో గాల్లో తేమశాతం ఘనపుమీటర్కు 10 గ్రాముల కంటే ఎక్కువగా ఉంటుందని, అక్కడ ఈ వైరస్ వేగంగా వ్యాపించదని వీరు అంచనా కట్టారు. ‘ చల్లని ఉత్తర ప్రాంతాల్లో ఎక్కువ కేసులు ఉంటే.. వెచ్చటి వాతావరణమున్న దక్షిణ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. దక్షిణ ప్రాంతానితో పోలిస్తే ఉత్తరాన రెట్టింపు కేసులు ఉన్నాయి’ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆసియా, మధ్యప్రాచ్యాల్లో వేగం తక్కువే.. చైనా, యూరప్ దేశాలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల మాదిరిగా క్వారంటైన్ చర్యలు పెద్ద ఎత్తున చేపట్టకపోయినా పలు ఆసియాదేశాల్లో, మధ్యప్రాచ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెబుతోంది. భారత్, పాకిస్తాన్, ఇండోనేసియా వంటి దేశాల్లో పరీక్షల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కేసులు కనపడటం లేదని కొంతమంది వాదిస్తున్నారని.. అయితే ఈ దేశాల్లో ఉండే వాతావరణమే ఉండే సింగపూర్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేసినా కేసులు తక్కువగానే ఉన్నాయని గుర్తు చేశారు. కాబట్టి తగినన్ని పరీక్షలు చేయడం అన్నది సమస్య కాదని స్పష్టం చేశారు. ఇతర అంశాల కంటే కదలికలను నియంత్రించడం, క్వారంటైన్ పాటించడం ద్వారా వైరస్‌ను సమర్థంగా కట్టడి చేయవచ్చునని తెలిపారు. అయితే, వైరస్ ఎలా మార్పు చెందుతోంది? పరిణమిస్తోంది? పునరుత్పత్తి వేగం వంటి అనేక ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే భిన్నమైన అంచనాలు రావచ్చునని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. -
బోస్టన్ కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాం: ఏయూ రిజిస్ట్రార్
-
ఆటా ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
బోస్టన్ : అమెరికాలోని బోస్టన్ నగరంలో విజయదశమి సందర్బంగా అక్టోబర్ 12న అమెరికన్ తెలుగు అసోసియేషన్( ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను షమీ పూజతో ప్రారంభించి కార్యక్రమం ఆసాంతం ఆట పాటలతో వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటా అధ్యక్షులు పరమేష్ భీంరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సాంప్రదాయలు భావితరాలకు తెలియ చేసే విధంగా మన పండుగలు జరుపుకోవాలని తెలిపారు. రాబోయే సంవత్సరం లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఆటా మహాసభలకు ఈ వేడుకలో పాల్గొన్న వారందరిని ఆహ్వనిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా వంటకాలతో పసందైన విందు భోజనాలు ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతికి , సామజిక సేవ సహాయ సహకారం అందించినవారందరిని ఘనంగా సన్మానించారు. ఆటా కార్యవర్గ సభ్యులు రమేష్ నల్లవోలు, కృష్ణ ధ్యాప , రీజినల్ డైరెక్టర్ సోమశేఖర్ నల్లా, రీజినల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి యానాల, బోస్టన్ స్థానిక కోఆర్డినేటర్స్ శశికాంత్ పసునూరి, దామోదర్ పాదూరి, రవి కుమార్, అనిత యాగ్నిక్, మధు యానాల, సునీత నల్లా, శిల్ప శ్రీపురం, సాహితి రొండ్ల, పార్వతి సూసర్ల, అపర్ణ పాదూరి, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
బోస్టన్‌లో ఇళయరాజా పాటల హోరు
బోస్టన్: తెలుగువారి కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) అనేక కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బోస్టన్ లో ఇళయరాజా పాటల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించింది. బోస్టన్ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగువారిలో గాన మాధుర్యం ఉన్న కళకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో నాట్స్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మధుచారి ఆధ్వర్యంలో 21 మందితో గాయనీ, గాయకులతో కూడిన మధురవాణి బృందం ఇళయరాజా స్వరపరిచిన పాటలను పాడి ప్రేక్షకులను అలరించింది. ఆద్యంతం ఈ కార్యక్రమం ఎంతో ఆహ్లాదభరితంగా సాగింది. ఐదుగురితో కూడిన వ్యాఖ్యతల బృందం మధ్య మధ్యలో ఇళయారాజా సాధించిన సంగీత విజయాలు.. ఆయన గురించి ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ.. కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సెయింట్ లూయిస్, న్యూజెర్సీల నుంయి విచ్చేసిన నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ సభ్యులు మోహన్ కృష్ణ మన్నవ , శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్ల తదితరులు నాట్స్ బోస్టన్ విభాగం చేస్తున్న కార్యక్రమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ పాటల కార్యక్రమంలో పాల్గొన్న మధురవాణి బృంద సభ్యులను, వ్యాఖ్యాతలను శాలువలతో ఘనంగా సత్కరించారు. స్థానిక తెలుగు సంఘం తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ ఏరియా ప్రెసిడెంట్ సీతారాం అమరవాదితో పాటు పలువురు స్థానిక తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. దాదాపు 250 మందికి పైగా స్థానిక తెలుగు వారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇళయారాజా పాటల సందడిలో మధురానుభూతులు పొందారు. ఇళయరాజా పాటల కార్యక్రమం మధురవాణిని ఇంత గొప్పగా విజయవంతం చేసినందుకు ఈ బృందంలో పాడిన గాయని, గాయకులకు నాట్స్ బోస్టన్ విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ గొంది గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పాటల కార్యక్రమాన్ని విజయవంత చేయడంలో నాట్స్ టీం సభ్యులు కూడా ఎంతో కృషి చేశారని... ఇదే ఉత్సాహంతో మరిన్ని కార్యక్రమాలను బోస్టన్ లో చేపడతామని శ్రీనివాస్ గొంది ప్రకటించారు -
బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది
-
వైరల్: బొటనవేలు అతడిని సెలబ్రెటీని చేసింది
బోస్టన్ : తన కుడి చేతి బొటనవేలు పుణ్యమా అని ఆ యువకుడు పెద్ద సెలబ్రెటీ అయిపోయాడు. దాని ప్రత్యేకత కారణంగా సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. ఇంతకీ ఆ బొటనవేలు ప్రత్యేకత ఏంటంటే.. మామూలుకంటే రెట్టింపు పొడవుగా ఉండటం. మామూలుగా అందరికి 2.5 అంగుళాల బొటనవేలు ఉంటే మసాచుసెట్స్‌కు చెందిన జాకబ్ పిన అనే యువకుడికి మాత్రం ఎకంగా ఐదు అంగళాల పొడవుండే బొటనవేలు ఉంది. వేలి ప్రత్యేక కారణంగా టాల్క్ ఆఫ్ ది టిక్‌టాక్‌గా మారాడు జాకబ్. బొటనవేలి ప్రత్యేకతను చాటేలా వీడియోలను చేసి టిక్‌టాక్‌లో ఉంచుతున్నాడు. ఈ మధ్య చేసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దానికి 2.1 మిలియన్ల లైకులు రాగా 37 వేలమంది కామెంట్లు చేశారు. బొటనవేలి కారణంగా టిక్‌టాక్‌లో 1.5 లక్షల మంది జాకబ్‌కు ఫ్యాన్స్ అయ్యారు. -
బోస్టన్‌లో 'ఆటా' అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
బోస్టన్ : అమెరికాలోని బోస్టన్ నగరంలో అమెరికన్ తెలుగు అసోషియేషన్(ఆటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభంగా జరిగాయి. ఈ సంవత్సరం ‘బెటర్ ఫర్ బ్యాలెన్స్’ అనే థీమ్‌తో ఈ వేడుకలను ఆట నిర్వహించింది. న్యూ ఇంగ్లండ్ లోని బోస్టన్ పరిసర ప్రాంతాలు కన్నీటికట్, న్యూ హంపశైర్ నుండి ఈ వేడుకలకు మహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో మహిళలకు ఉపయోగకరమైన విషయాలపై వక్తలు మాట్లాడి చర్చించారు. మహిళలు అన్ని రంగాలలో ముందుండి విజయం సాదించాలని రంజని సైగల్ అన్నారు. మసాచుసెట్స్ రాష్ట్ర సెనెటర్ ఎలిజబెత్ వారెన్ రాలేక పోయినందున వారి ప్రత్యేక సందేశాన్ని మహిళలకు చదివి వినిపించారు. మహిళా వాలంటీర్స్ అనిత రెడ్డి , సునీత నల్ల , మధు యానాల, శిల్ప శ్రీపురం, రజని తెన్నేటి , లక్ష్మి , సాహితి రొండ్ల లను మహిళా దినోత్సవ ప్రణాళిక, వక్తల ఏర్పాటు, కార్యక్రమ అమలు బ్రహ్మాండంగా జరిపారని మహిళలు కొనియాడారు ఈ కార్యక్రమాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక అలంకరణ ,సాంస్కృతిక కార్యక్రమాలు, విందు అందరినీ అలరించాయి. ఆటా రీజినల్ డైరెక్టర్ సోమ శేఖర్ రెడ్డి నల్ల, రీజినల్ కోఆర్డినేటర్స్ మల్లా రెడ్డి యానాల, లక్ష్మీనారాయణ రెడ్డి , మేఘనాథ్ రెడ్డి , చంద్రశేఖర్ రావు మంచికంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. 'ఆటా' మహిళలకు అండగా ఉంటూ ప్రోత్సహిస్తుందని, 'ఆటా' మహిళా దినోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన, భాగస్వాములైన స్పాన్సర్స్, వాలంటీర్స్‌కు ఆటా బోర్డు మెంబర్లు రమేష్ నల్లవోలు, కృష్ణ ధ్యాప టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
-
అభాగ్యుల ఆకలి తీర్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం
బోస్టన్ : భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఎందరో అభాగ్యులకు ఆపన్న హస్తం అందించటంలో ఎప్పుడూ ముందు ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరోసారి నిరూపించింది. నాట్స్ బోస్టన్ చాప్టర్ ద్వారా మిత్రుల సహకారంతో శ్రీని గొండి గారి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారుగా 500 పౌండ్ల ఆహార పదార్థాలను వోర్సెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్ ద్వారా ఆకలితో ఉన్న అభాగ్యులకు అందించింది. -
నేను ధైర్యవంతురాలిని కదా.. కానీ ఏం లాభం!
అసలే ఒంటరి ప్రయాణం బోర్ అనుకుంటే.. అందుకుతోడు ఫోన్ కూడా అందుబాటులో లేదు.. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త క్రేజీగా ఆలోచించిన ఆండ్రియా అనే 21 ఏళ్ల యువతి సిక్ బ్యాగ్(బేబీ డైపర్ డిస్పోజల్ బ్యాగ్)పై రాసిన ‘ప్రేమలేఖ’ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆండ్రియా ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఆమె ప్రేమ ఫలించిందా లేదా అనే విషయాలు తెలియాలంటే ఈ ‘లేఖ’ను వైరల్ చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారట నెటిజన్లు. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ‘హలో మీరు ఇది చదువుతున్నారు కదా. నా పేరు ఆండ్రియా. నాకు 21 ఏళ్లు. నాకు చాలా బోర్ కొడుతోంది. ఇప్పుడు నేను ఉన్న ఫ్లైట్ మియామీ నుంచి డీసీ వెళ్తోంది. నిన్న రాత్రి నాలుగు గంటలకు ఈ ఫ్లైట్ కోసం టికెట్ బుక్ చేసుకున్నా. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరంటే నాకు చాలా ఇష్టం. అతను ఇప్పుడు బోస్టన్ నుంచి న్యూ ఒరేలాన్స్ వస్తున్నాడు. అందుకే ఎయిర్‌పోర్టులోనే నా ప్రేమ విషయం చెప్పి తనని సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నాను. నిజంగా నేను ధైర్యవంతురాలిని కదా. కానీ ఏం లాభం ఇది జరిగిన తర్వాత నాలుగు రోజుల్లోనే పై చదువుల కోసం నేను ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఇక ఐదు నెలల పాటు తనని కలిసే వీలే ఉండదు. నాకు బెస్టాఫ్ లక్ చెప్పండి. అవును బార్ఫ్ బ్యాగ్‌పైనే నా భావాలన్నీ రాస్తున్నా కానీ ఏం చేయను వైఫై రావట్లేదు. ఒంటరి ప్రయాణమేమో బోర్ కొడుతోంది. మీకు కూడా ఎప్పుడైనా బోర్ కొడితే ఇలాంటి క్రేజీ పనులు చేయండి. బాగుంటుంది’ అంటూ ఆండ్రియా తన మనసులోని భావాలని రాసుకొచ్చింది. ఆండ్రియా రాసిన ఈ ‘లెటర్’ తనకు దొరకటంతో క్లీనింగ్ సిబ్బంది ఈ విషయాన్ని రెడిట్ వెబ్‌సైట్‌తో పంచుకున్నారు. -
బోస్టన్‌లో ఘనంగా దసరా దీపావళి ఉత్సవాలు
బోస్టన్ : నాశువా హై స్కూల్ సౌత్‌లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ బోస్టన్(టీఏజీబీ) దసరా దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 700ల మందికిపైగా ప్రవాసాంధ్రుల విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమ ప్రాంగణాన్ని రూబి బోయినపల్లి ఆధ్వర్యంలో అలంకరించారు. బోర్డు ట్రస్ట్ సభ్యులు పద్మ పరకాల, సురేందర్ మాదాదిలు జ్యోతి ప్రజ్వలన చేయగా, అధ్యక్షురాలు మణిమాల చలుపాది స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారులు ఆలపించిన ఆధ్యాత్మిక పాటలు, భజనలు, డ్యాన్సులు, శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వేదికపై 'బతుకమ్మ' పండగ వేడుకలలో మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కూచిపూడి నాట్యాలయం విద్యార్థులు 'నారాయణతే నమో నమో' నృత్యం లో దశావతారాలు చూపించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఇవే కాక, వేదికపైననే సరదా 'సరదాగా కాసేపు' జరిపించిన వివాహ వేడుకలు, బాలలహరి విద్యార్థుల 'భక్తి గీతాలు', శ్రీరామ్ రేకపల్లి, ఎమ్వీఎన్ కిరణ్ కుమార్ల మృదంగం, వయోలిన్ 'జుగల్బందీ', "జరిగింది చెప్తాను, జరిగేది చెప్తాను" అని వచ్చి, నేటి తరం సెల్ ఫోన్ల వ్యసనంతో ఎటువంటి ముప్పుల్లో పడుతున్నారో విడమర్చి చెప్పిన 'సోది' లాంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. మానస కృష్ణ నేపథ్యంలో ప్రదర్శించిన 'నవదుర్గా నర్తనం - మహిషాసుర మర్దనం' నృత్యము ప్రేక్షకులని భక్తి సామ్రాజ్యంలో ఓలలాడించి, మొత్తం దసరా కార్యక్రమానికే కలికితురాయిలా నిలిచింది. కల్చరల్ సెక్రటరీ పద్మజా బాలా పర్యవేక్షణలో కల్చరల్ టీమ్ రెండు నెలలకు పైగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అరుణ్ మూల్పూర్, సుధా మూల్పూర్లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. కార్య వర్గ సభ్యులు సీతారాం అమరవాది, రమణ దుగ్గరాజు,రామకృష్ణ పెనుమర్తి, సత్య పరకాల కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. హరిత బృందం నిర్వాహకులు మాధవికమ్మ, చందశేఖర్ కమ్మలను టీఏజీబీ సత్కరించింది. వైస్ చైర్మన్ శివ దోగిపర్తి టీఏజీబీ సభ్యుల తరఫున అందరికి పండగ శుభాకాంక్షలుతెలియజేశారు. టీమ్ ఏయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున నన్నపనేని మోహన్, పలు మానసిక, శారీరక కష్టాలకు గురి అయిన తెలుగు వారికి తమ సంస్థ ద్వారా ఎటువంటి సేవలు సహాయాలు అందిస్తున్నారో తెలిపారు. -
బోస్టన్‌లో దసరా వేడుకలు
బోస్టన్ : విజయదశమి పండుగను బోస్టన్లోని ఎన్నారైలు ఘనంగా జరుపుకున్నారు. అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు దాదాపు 250 మంది ప్రవాసాంధ్రులు హాజరైనట్టు పేర్కొన్నారు. బోస్టన్ లో నివసిస్తున్న తెలుగు వారు ఈ వేడుకను జమ్మిపూజతో మొదలుపెట్టారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు ఆహ్లాదభరితంగా జరిగాయి. పసందైన విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు. ఆటా సభ్యులైన రమేష్ నలవోలు, మల్లా రెడ్డి యనల, క్రిష్ణా ద్యాపా, సోమ శేఖర్ నల్లా, చంద్ర మంచికంటి, శశికాంత్, దామోదర్, రవి, మధు, అనిత ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.