
తల్లి ఒడి లా.. మంచం
బోస్టన్: ఏడుస్తూ చికాకు పెట్టే పిల్లలున్న తల్లిదండ్రులకు ఇది శుభ వార్త. తల్లి గర్భంలో శిశువు అనుభవించే స్పందనలను పోలిన ఫీచర్స్‌తో కూడిన అత్యంత అధునాతన చిన్న పిల్లల పడకను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘స్నూ’గా పిలిచే ఈ మంచంలోని 3 మైక్రోఫోన్లు చిన్నారులు ఎప్పుడు ఏడ్చినా పసిగట్టిసంగీతాన్ని వినిపిస్తాయి. బిడ్డను నిద్రపుచ్చడానికిమంచం అటూఇటూ కదులుతుంది. దీని వల్ల పిల్లలు కొద్దిరోజుల్లోనే క్రమబద్ధ, సరైన నిద్ర కు అలవాటు పడతారట. స్విస్ ఇండస్ట్రియల్ ఇంజినీర్ వేస్ బెహార్, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీర్లుతో కలసి బ్రిటిట్ వైద్యుడు హార్వే కార్ప్ స్నూను రూపొందించారు.