తండ్రితో డోగ్ హెన్నింగ్ వోర్
బోస్టన్ : హాలీవుడ్ సినిమా ఈఎల్‌ఎఫ్ చూసిన వారికి హీరో విల్ ఫెర్రల్ తండ్రిని కలుసుకునే సీను గుర్తుండే ఉంటుంది. మొదటి సారి తండ్రిని కలుసుకునే ఆ సీనులో అద్భుతంగా నటించాడు విల్. 2003లో వచ్చిన ఈఎల్‌ఎఫ్ సినిమాను చూసి, విల్ పాత్రనుంచి స్పూర్తి పొందాడు అమెరికాలోని బోస్టన్‌కు చెందిన డోగ్ హెన్నింగ్ వోర్ అనే వ్యక్తి. అందుకే 43 ఏళ్ల తర్వాత మొదటిసారి తండ్రిని కలవడానికి ఆ సినిమాలో విల్ ధరించే దుస్తుల్లాంటి వాటినే ధరించాడు. చిన్నప్పుడే తండ్రినుంచి దూరమైన డోగ్ పెంపుడు తల్లిదండ్రుల వద్ద పెరిగాడు. యాన్‌సెస్టరీ.కామ్ ద్వారా అతడి తోబుట్టువులను కనుక్కున్నాడు. అనంతరం ఆన్‌లైన్‌లో తండ్రితో మాట్లాడేవాడు. గత మంగళవారం బోస్టన్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. ( వధువుకు కరోనా: అయినా పెళ్లి ఆగలేదు )
ఈ సందర్భంగా సినిమా కాస్ట్యూమ్ ధరించాడు డోగ్. అంతేకాదు సినిమాలోని పాటను పాడుతూ హుషారుగా తండ్రిని చేరాడు. అయితే డోగ్ తండ్రి ఈఎల్‌ఎఫ్ సినిమా చూడకపోవటంతో అసలు సంగతి తెలియలేదు. డోగ్ విచిత్ర వేష ధారణను చూసి కొద్దిగా ఆశ్చర్యపోయాడు. దీనిపై డోగ్ మాట్లాడుతూ.. ‘‘అలా ఆ డ్రెస్‌లో వెళ్లటం నాకు మంచిదని పించింది. కానీ, ఆయన ఎయిర్‌పోర్టునుంచి బయటకు వచ్చి నన్ను చూడగానే పిచ్చోడిననుకుని ఉంటారు’’ అని అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment