ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రెండు, మూడు నెలలకొకసారి తన రూపంతారం మార్చుకుని ప్రజలపై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కచ్చితం చేశాయి. ఎక్కడికి వెళ్లినా... కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమతులు ఇస్తున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని సుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డీజే ఫెర్గుసన్ అనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి గుండె మార్పిడి చికిత్స అత్యవసరంగా చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలోనే డీజే ఫెర్గుసన్‌ను బోస్టన్‌లో ఉన్నటు వంటి.. బ్రిఘం & ఉమెన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె మార్పిడి చికిత్స కోసం ఆసుపత్రి నిబంధనల ప్రకారం.. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారు. అంతలోనే ఆస్పత్రి ట్విస్ట్ ఇచ్చింది. డీజే ఫెర్గుసన్.. ఇంత వరకు సింగిల్ డోస్ కూడా వేసుకోలేదని, అతను వ్యాక్సిన్ వేసుకుంటేనే తాము చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో డీజే ఫెర్గుసన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.
చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?
అత్యవసర సమయంలో ఇలాంటి నిబంధనలు ఎంటని నిలదీశారు. తాను అస్సలు వ్యాక్సిన్ వేసుకోబోనని అటు డీజే ఫెర్గుసన్ మొండి పట్టు పట్టారు. ఇంకేముంది.. తాము ఆపరేషన్ చేయలేమని ఆస్పత్రి సిబ్బంది కుండ బద్దలు కొట్టారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే తాము ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. కాగా అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు.
చదవండి: అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా
Comments
Please login to add a commentAdd a comment