
వాషింగ్టన్: కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారతదేశానికి ప్రపంచ దేశాలు మద్దుతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్‌కు సాయం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల సాయం చేసినట్లు వైట్‌హౌస్ బుధవారం ప్రకటించింది. 80 మిలియన్ల వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేయడంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
"ఈ రోజు వరకు అమెరికా ప్రభుత్వం భారత్‌కు 500 మిలియన్ డాలర్ల కోవిడ్ సాయం చేసింది. దీనిలో అమెరికా సమాఖ్య, రాష్ట్ర ప్రభుత్వాలు, అమెరికన్ కంపెనీలు, సంస్థలు, ప్రైవేట్ పౌరుల సహకారంతో ఈ మొత్తాన్ని అందించింది" అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వైట్ హౌస్ ఫారిన్ ప్రెస్ గ్రూప్‌తో జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపారు.
కోవిడ్ మహమ్మారి ప్రభావంతో బాధపడుతున్న ఇతర దక్షిణాసియా దేశాలకు కూడా ఆ సహాయాన్ని అందించడానికి బైడెన్ యంత్రాంగం ఇప్పుడు కృషి చేస్తోందని జెన్ సాకి వైట్ తెలిపారు. దీనిలో భాగంగా 80 కోట్ల వ్యాక్సిన్‌లను అందించాలని భావిస్తున్నాం. వీటిలో 60 కోట్ల ఆస్ట్రాజెనికా టీకాలు, మరో మూడు వ్యాక్సిన్‌లు 20 కోట్ల డోసులు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నారు.
చదవండి: తప్పుడు అంచనాల వల్లే తీవ్ర ఇబ్బందుల్లో భారత్: ఆంటోని ఫౌసీ
Comments
Please login to add a commentAdd a comment