జాన్సన్‌ వ్యాక్సిన్‌కు మరోషాక్‌ : షాకింగ్‌ స్టడీ | Johnson Vaccine Far Less Effective 0n Delta Variant: Study | Sakshi
Sakshi News home page

Delta Variant: జాన్సన్‌ వ్యాక్సిన్‌కు మరోషాక్‌ : షాకింగ్‌ స్టడీ

Published Fri, Jul 23 2021 5:09 PM | Last Updated on Fri, Jul 23 2021 9:23 PM

Johnson Vaccine Far Less Effective 0n Delta Variant: Study - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సింగిల్‌ డోస్‌ కోవిడ్-19 వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌, ఇతర  వేరియంట్లపై సరిగా పనిచేయడంలేదని తాజా నివేదికలో తేలింది  ప్రస్తుతం అమెరికాలో మళ్లీ విస్తరిస్తున్న కేసులకు కారణమైందని న్యూయార్క్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది.

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం అమెరికాలో ఆమోదించిన మూడు కరోనా వ్యాక్సిన్లను తీసుకున్న వ్యక్తుల నుండి తీసుకున్న రక్త నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఆధారంగా ఈ అధ్యయనాన్నినిర్వహించారు ఈ సందర్బంగా జాన్సన్‌ టీకా సమర్థత 29 శాతం మాత్రమేనని తేల్చారు. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి బూస్టర్ డోస్‌లు అవసరమవుతాయని అధ్యయనవేత్తలు సూచించారు. డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా టీకా  సింగిల్‌ డెస్‌ పనితీరు 33 శాతం సమర్ధతతో పనిచేస్తుంది.  రెండు డోసులకు గాను 60 శాతం సమర్ధతతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో రెండో డోస్‌ కావాలని  అధ్యయనం అంచనా వేసింది.

వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ మాట్లాడుతూ, బూస్టర్ షాట్లు అవసరమా అనేదానిపై పరిశోధకులు ఇంకా అంచనా వేస్తున్నారన్నారు. మరోవైపు ఈ వాదనను జే అండ్ జే ప్రతినిధి సీమా కుమార్‌ తోసి పుచ్చారు. ఇతర కొత్త వేరియంట్‌లపై తమ టీకా ప్రభావవంతంగా ఉంటుందని స్పష్టం చేశారు. క్లినికల్ ట్రయల్స్‌లో సింగిల్‌ షాట్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌ మొదటి కరోనా వైరస్‌పై 66శాతం, రెండు-షాట్ల ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు 90శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉన్నాయని తేలాయి. సీడీసీ డైరెక్టర్ డాక్టర్ రోషెల్ వాలెన్స్కీ మంగళవారం  అందించిన సమాచారం  అమెరికాలో మొత్తం కేసుల్లో 83 శాతం డెల్టా  వేరియంట్‌ కేసులే.  అలాగే అమెరికాలో 13 మిలియన్లకు పైగా జాన్సన్‌ టీకాను తీసుకున్నారు.

కాగా ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన కరోనా వ్యాక్సిన్‌ పలు విమర్శలొచ్చాయి. జాన్సన్ వ్యాక్సిన్ ఫిబ్రవరిలో ఆమోదం పొందినప్పటి నుండి అనేక సమస్యపై నివేదికలు వెలువడ్డాయి. తీవ్రమైన రక్తం గడ్డకట్టేసమస్యల వివాదంతో ఏప్రిల్‌లో 10 రోజుల విరామాన్ని ప్రకటించింది.  ఆ తరువాత  ఈ టీకా తీసుకున్న వారిలో  అరుదైన నాడీ స‌మ‌స్య‌లు తలెత్తే అవకాశం ఉందని, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అనే న్యూరోలాజికల్ డిజార్డర్ ప్రమాదం ఉందని  అమెరికా ఆహార‌, ఔష‌ధ నియంత్ర‌ణ  సంస్థ (ఎఫ్‌డీఏ)  హెచ్చరించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement