బోస్టన్ : జీవితకాలాన్ని పెంచుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. నిండు నూరేళ్లు బతకాలని ప్రతి మనిషికీ ఉంటుంది. వీలైతే సెంచరీ దాటాలనుకుంటారు. అయితే ఆయుష్షును పెంచే ప్రయత్నాలు చేయడంలో మాత్రం బద్ధకాన్ని చూపుతాడు. కానీ ఈ ఐదురకాల అలవాట్లతో దీర్ఘకాలంపాటు బతకొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండడం, ఆల్కహాల్ తీసుకోకపోవడం, పోగతాగకపోవడం వంటివి పాటిస్తే మన ఆయుఃప్రమాణం మరో పదేళ్లు పెరుగుతుందని అమెరికాలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో భాగంగా 78,865 మంది మహిళల 34 ఏళ్ల డేటాను, 44,354 మంది పురుషుల 27 ఏళ్ల డేటాను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment