![Cryonics: Scientists Believe Process Chance Of Life After Death - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/19/Untitled-12.jpg.webp?itok=S88ONhjV)
Cryonics Part 4:
మరణాన్ని జయించాలన్న కోరిక మనిషికి ఏనాటి నుంచో ఉంది. సంజీవని పర్వతం, అమృతం వంటి అంశాలు చిన్నప్పటినుంచీ వింటూనే ఉన్నాం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇంతవరకు మరణాన్ని వాయిదా వేయగలుగుతున్నాడే గాని పూర్తిగా జయించలేకపోతున్నాడు. అయితే సుదూర కాలంలోనే మరణాన్ని ఆపగలిగే టెక్నాలజీ అభివృద్ధి చేయగలమనే నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం లోనుంచే క్రయోనిక్ టెక్నాలజీ రూపొందింది.
చదవండి: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..
శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే?
ముందు శరీరాన్ని శిధిలం కాకుండా భద్రపరచగలిగితే తర్వాత ఆ శరీరాలపై ప్రయోగం చేసి, చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. ప్రపంచంలోని ధనికులు అనేక వేల మంది అమెరికాలోని ఈ రెండు సంస్థల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో 1353 మంది తమ శరీరాలను భద్రపరుచుకున్నారు.
వారి కుటుంబాలు రెండు లక్షల డాలర్ల ఫీజు చెల్లించి మృత శరీరాలను ఆల్కర్కు అప్పగించాయి. ఎప్పటికైనా తమవారికి తిరిగి జీవించే అవకాశం వస్తుందని వారు నమ్ముతున్నారు. వేల ఏళ్లుగా వేధిస్తున్న, అంతుచిక్కని అనేక జబ్బులను ప్రస్తుత కాలంలో తేలిగ్గా నయం చేస్తున్నారు. అలాగే ఇప్పటికీ లొంగని అనేక జబ్బులకు భవిష్యత్ లో చికిత్స తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నారు. మనిషికి చావులేని చికిత్స త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే ఆశ మనిషిలో కనిపిస్తోంది. అందుకే శరీరాలను భద్రపరుచుకునే వ్యాపారం మొదలైంది.
చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment