Cryonics
-
మరణించిన వారిని మళ్లీ పునర్జీవింప చేసే సంస్థ...మళ్లీ బతకాలని....
ఎవరైనా మృతి చెందితే సహజంగా అంతిమ సంస్కారాలు జరిపి అక్కడితే వదిలేస్తాం. కొన్నేళ్లు బాధలో ఉండిపోతాం. క్రమేణా వారి జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు యత్నిస్తాం. కానీ కొంతమంది తమ వారు చనిపోయిన వారు ఏదోనాటికి తిరిగి వస్తారన్న ఆశతో వారి శరీరాలను భద్రంగా దాచుతున్నారట. అందు కోసం అమెరికాలో ఒక సంస్థ ఈ సేవను పెద్ద మొత్తంలో రుసుముతో అందిస్తోంది కూడా. అక్కడ పలువురు శరీరాలను కొన్ని రకాల ఉష్ణోగ్రత మధ్య వివిధ రసాయానాల సాయంతో అత్యంత భద్రంగా ఉంచాతారట. వివారాల్లోకెళ్తే...చనిపోయినా మళ్లీ బతికి రావడం వంటి వాటిని సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో అసాధ్యం. కానీ సాధ్యం చేయాలనకుంటున్నారు యూఎస్‌లోని అల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే సంస్థ. ఇక్కడ చనిపోయిన మానవులు భవిష్యత్తులో ఎప్పటికైనా తిరిగి బతికివస్తారనే ఆశతో జాగ్రత్తగా వారి మృతదేహాలను కాపాడతారు. దీన్ని క్రయో ప్రెజర్వ్ అంటారు. చనిపోయిన వారిని లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంకులో ఉంచుతారు. ఇందులో వాటిని మైనస్ 196 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద దశాబ్దాల పాటు జాగ్రత్తగా ఉంచుతారు. దీన్ని క్రయోనిక్స్ అంటారు. వాళ్లు భవిష్యత్తులో ఏనాటికైనా మేల్కొనేలా సాంకేతిక వైద్యం అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారట. ఇలా తొలిసారిగా బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న థాయ్ అమ్మాయి మాథెరిన్ నవోరాట్‌పాంగ్ 2015లో 2 సంవత్సరాల వయస్సులో క్రయో ప్రెజర్వ్ చేసిన పిన్న వయస్కురాలు. ఈ అమ్మాయి తల్లిదండ్రులిద్దరూ వైద్యులు, ఆమెకు మెదడుకు సంబంధించిన ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు గానీ ప్రయోజనం లేకపోవడంతో యూఎస్‌లోని అల్కోర్ ఫౌండేషన్‌ని సంప్రదించి క్రయో ప్రిజర్వ్ చేశారు. అలా బిట్‌కాయిన్ మార్గదర్శకుడు హాల్ ఫిన్నీ, 2014లో మృతి చెందిన తర్వాత క్రయో ప్రిజర్వ్ చేశారు. వాస్తవానికి ఒక వ్యక్తి చట్టబద్ధంగా చనిపోయిన తర్వాత క్రయో ప్రెజర్వేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో శరీరాన్ని రక్షించేందుకు అల్కోర్ సంస్థ ఉపయోగించే ప్రక్రియను విట్రిఫికేషన్ అంటారు. అందులో రోగి శరీరం నుంచి రక్తం, ఇతర ద్రవాలు తొలగించి హానికరమైన మంచు స్పటికాలు ఏర్పడకుండా నిరోధించే రసాయనాలతో భర్తీ చేస్తారు. అత్యంత శీతల ఉష్ణోగ్రత వద్ద విట్రిఫై చేసే ట్యాంకుల్లో ఉంచుతారు. అందుకోసం ఒక్క మృతదేహానికి సుమారు రూ. కోటి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం రోగి మెదడుని మాత్రం క్రయో ప్రిజర్వ్ చేయాలంటే దాదాపు రూ. 65 లక్షలు ఖర్చవుతుంది. ఇప్పటివరకు 500 మంది వ్యక్తుల తమ శరీరాలను క్రయో ప్రిజర్వ్ చేయడానికి ఈ సంస్థను సంప్రదించారని చెబుతున్నారు ఫౌండేషన్ అధికారులు. ప్రస్తుతానికి ఈ సంస్థలో సుమారు 199 మంది మానవులను, దాదాపు100 పెంపుడు జంతువులను క్రయో ప్రిజర్వ్ చేశారు. అసలు ఈ ఫౌండేషన్‌ను 1972లో లిండా, ఫ్రెడ్‌చాంబర్ లైన్ అనే వ్యక్తులు 1972లో స్థాపించారు. జీవితంలో రెండో అవకాశాన్ని ప్రజలకు అందించే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ మేరకు న్యూయార్క్ యూనివర్శిటీ గ్రాస్మన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో మెడికల్ ఎథిక్స్ విభాగానికి అధిపతిగా ఉన్న ఆర్దర్ మాట్లాడతూ...ఈ వైజ్క్షానిక కల్పన అనేది ఊహజనితం, సాధ్యమవుతుందని కూడా చెప్పలేం. కానీ చాలా మంది తమవాళ్లు తిరిగి పునర్జీవించేలా సైన్సు అభివృద్ధి చెందుతుందనే ఆశతో ఇలా చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు ఉన్నవాళ్లు దొరికిన సువర్ణావకాశంగా పేర్కొన్నారు. ఐతే పలువురు శాస్త్రవేత్తలు మాత్రం క్రయోప్రిజర్వ్ చేయబడిన వ్యక్తులు వాళ్లు తిరిగి జీవించి వస్తే అతని చుట్టు ఉన్నా దశాబ్దాల నాటి ప్రపంచానికి ప్రస్తుత ప్రపంచానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆ వ్యక్తి ప్రస్తుత ప్రపంచానికి ఒక గ్రహాంతరవాసిగా కనిపిస్తుంటాడని చెబుతున్నారు. (చదవండి: ఎంతపనిచేసింది ఆ దోమ..నాలుగు వారాల కోమా, ఏకంగా 30 సర్జరీలా!) -
క్రయోనిక్స్: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా?
Cryonics Part 8: అమెరికాలోని బేస్ బాల్ క్రీడాకారుడు టెడ్ విలియమ్స్ 2002లో చనిపోయాడు. అతడు తన తల, శరీరాన్ని వేర్వేరుగా ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో నిల్వ చేసుకున్నాడు. తిరిగి అతని శరీరానికి జీవం పోయగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినపుడు వైద్యులు విలియమ్స్ తలను శరీరానికి అతికించి బ్రతికించగలరని నమ్మకంతో ఇలా చేశారు. నిప్పును చూసి భయపడే ఆదిమ కాలం నుంచి క్షణంలో ఆకాశానికి ఎగిరిపోయే అత్యంత ఉన్నత స్థాయి టెక్నాలజీ రూపొందించే స్థాయికి మనిషి అభివృద్ధి చెందాడు. అవసరాల్లో నుంచి అనేక అన్వేషణలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాడు. మనిషి తన ఉనికికి కారణమైన భూమిని, ప్రకృతినే ధ్వంసం చేసుకుంటున్నాడు. అదే సమయంలో వాటిని కాపాడుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన డైనోసార్లకు ప్రాణం వస్తుందా అని వాటి శిలాజ అండాలను పరిశోధిస్తున్నాడు. అంతరించిపోతున్న జీవ జాతుల్ని పరిరక్షించడానికి క్రయోనిక్స్ విధానం ఉపయోగపడుతుందా అని కూడా ఆలోచిస్తున్నాడు. అలాగే చనిపోయిన వారిని బ్రతికించడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఆశకు అంతం లేదు. నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందో రాదో లేదో కాలమే చెబుతుంది. చదవండి: Cryonics Part7: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు -
క్రయోనిక్స్: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు
Cryonics Part 7: సృష్టిలో కొన్ని జీవులు అతి శీతల వాతావరణంలో జీవించడానికి వీలుగా.. సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా స్తంభింపచేసి.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి. తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినపుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు మొదలవుతాయి. కొన్ని రకాల కప్పలు, మొసళ్ళు, తొండలు వంటివి ధృవ ప్రాంతాల్లో ఇలాగే జీవిస్తాయి. వీటన్నిటినీ శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యం అవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు, తిరిగి కొనసాగే విధానాలను మనిషిలో ఎందుకు తీసుకురాలేమనే కోణం నుంచే క్రయోనిక్స్ పద్ధతి ఊపిరి పోసుకుంది. ఆల్కర్ సంస్థలో 2009 నుంచి జంతువుల మృత శరీరాలను కూడా నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 33 జంతువుల శరీరాలను విట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా కంటెయినర్లలో నిల్వ చేశారు. అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే 50 ఏళ్లనుంచి క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఒక్క ఆల్కర్ సంస్థలోనే 1353 మృత శరీరాల్ని భద్రపరిచారు. రెండు అగ్రదేశాల్లో మొత్తం రెండు వేలకు పైగానే చనిపోయినవారి శరీరాలు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేల మంది తమ శరీరాలను భవిష్యత్ లో తిరిగి జీవించే ఆశతో నిల్వ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! దానికి అవసరమైన ఫీజును రెడీ చేసుకున్నారు. అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించేవారిలో చాలా మంది...మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీదంటున్నారు. విట్రిఫికేషన్ విధానంలో కంటెయినర్లలో భద్రపరిచిన శరీరాలు నిజంగా పాడవకుండా ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు. లండన్‌లోని కింగ్స్ కాలేజిలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న క్లైవ్ కోయెన్ ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ క్రయోనిక్స్ విధానం ద్వారా చనిపోయిన మనిషికి చికిత్స చేసి జీవం పోసినా..కచ్చితంగా అనేక రుగ్మతలు వెంటాడుతాయని, మెదడు దెబ్బతింటుందని, ఆ వ్యక్తి స్పృహలోకి రాకపోవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భరించలేని నొప్పి, బాధలు అనుభవించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అసలు మృత శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీని ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు చేయలేదు. కేవలం ఊహాజనితంగానే ఆ విధానం ఉంది. వందేళ్ళ నాడు లేని టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినపుడు.. ఆనాడు లేని చికిత్సలు, ప్రాణాంతక రోగాలకు మందులు, చికిత్సలు కనిపెట్టినపుడు.. చావును ఎందుకు జయించలేమనే ఒకే ఒక ప్రశ్న నుంచి వ్యాపార అవకాశాలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికీ జీవించి ఉండాలనే ఆశగల ధనికులు ఈ క్రయోనిక్స్ వ్యాపారానికి ఊపిరి పోస్తున్నారు. ఒక మృత శరీరాన్ని నిల్వ చేయడానికి ప్రస్తుత మనదేశ కరెన్సీలో కోటిన్నర ఖర్చవుతుంది. చదవండి: Cryonics 6: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. -
క్రయోనిక్స్: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. ఆపై..
Cryonics Part 6: బ్రతికున్న మనిషి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అతి శీతలీకరణ వాతావరణంలో మానవ అండాల్ని ఏళ్ళతరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అండంలో ఎలాంటి రసాయన మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల జీవితం స్తంభించిపోతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండం జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇటువంటి శీతలీకరణ వాతావరణంలో పెద్దవారి గుండె, మెదడు, ఇతర అవయవాలను నిల్వ ఉంచితే అవి స్తంభించిపోతాయి. అలా గంట సేపటి వరకు వాటిలో ఎటువంటి రసాయన మార్పులు జరగకుండా నిరోధించి తర్వాత యధాస్థితికి తీసుకురావచ్చు. అవయవాల మార్పిడి కోసం వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ చేసే తీసుకువస్తారు. ప్రస్తుత కాలంలో అండంతో సహా అవయవాల్లో జీవాన్ని స్తంభింపచేసి, తిరిగి యధాస్తితికి తీసుకురావడంలో సక్సెస్ అయిన సైంటిస్టులు భవిష్యత్ లో మనిషి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరీరాలను ఫ్రీజ్ చేయకుండా విట్రిఫికేషన్ చేయడం ద్వారా మానవ శరీర కణజాలం శిధిలం కాకుండా కాపాడుతారు. ఫ్రీజర్ లో ఐస్ ఏర్పడుతుంది. కాని మైనస్ 120 సెంటిగ్రేడ్ కంటే తక్కువలో కూడా ఐస్ ఏర్పడకుండా కేవలం శీతలీకరించడాన్నే విట్రిఫికేషన్ గా పిలుస్తారు. ఇందులో క్రయో ప్రొటెక్టెంట్స్ గా పిలిచే అత్యంత గాఢమైన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల మృత శరీరం వందేళ్లయినా ఎలా ఉంచింది అలాగే ఉంటుంది. పంచభూతాలతో నిర్మితమైన మృత శరీరాన్ని వందేళ్ళయినా శిధిలం కాకుండా నిల్వ చేయగలిగే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినపుడు.. ఆ శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కూడా కచ్ఛితంగా రూపొందుతుందని ఆశిస్తున్నారు. ఒక జీవిలో సాధారణంగా జరిగే రసాయనమార్పులు క్రమం తప్పితే, ఒక పద్ధతి లేకుండా సాగితే మరణం సంభవిస్తుంది. అటువంటపుడు రసాయన మార్పులను యధాస్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే క్రయోనిక్స్ విధానంలో చనిపోయిన మనిషి శరీరంలో కణజాలం ధ్వంసం కాకుండా రసాయనమార్పులను స్తంభింపచేయడం ద్వారా నిల్వ చేసి భవిష్యత్ లో తిరిగి వారికి జీవం రప్పించడమే క్రయోనిక్స్ లక్ష్యమంటున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! -
సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!
Cryonics Part 5: జీవిత కాలంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నా మనిషి ఆశకు అంతులేకుండా పోయింది. అందుకే ఎప్పటికైనా మరణాన్ని జయించాలనుకుంటున్నాడు. వందేళ్ళకైనా సాధ్యమవుతుందని ఆశిస్తున్నాడు. దాని కోసం 50 ఏళ్ళ క్రితమే ఏర్పాట్లు ప్రారంభించాడు. ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసుకుంటున్నాం. చావును జయించలేమా అని తనకు తాను ప్రశ్నించుకుంటున్నాడు. దీనిపై సైంటిస్టులంతా ఏకాభ్రిపాయంతో ఉన్నారా? మనిషి ఆశాజీవి. సైంటిస్టులు కూడా అంతే. ఈ రోజు సాధ్యం కానిది మరో రోజు సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. అంతేగాని సాధ్యం కాదని చెప్పరు. క్రయోనిక్స్ టెక్నాలజీని సమర్థించే శాస్త్రవేత్తలు కూడా ఆశావాదులు. మృత శరీరాన్ని పాడు కానీయకుండా, శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా నిర్ధిష్టమైన టెంపరేచర్ లో ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 50 సంవత్సరాలుగా క్రయోనిక్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. ఆల్కర్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలైంది. అప్పటికి ఇప్పటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి అయింది కదా అని సంస్థలోని సైంటిస్టులు అంటున్నారు. వందేళ్ళ క్రితం గుండె ఆగితే మరణించినట్లే..కాని ఇప్పుడు నూతన ఆవిష్కరణల ద్వారా పది నిమిషాల పాటు ఆగిన గుండెను కూడా కొట్టుకునేలా చేయగలుగుతున్నారు. అంతర్గత అవయవాలను విజయవంతంగా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరానికి మార్చుతున్నారు. అదేవిధంగా భవిష్యత్ లో చనిపోయినవారి శరీరాలకు అవసరమైన చికిత్స చేసి వారికి తిరిగి ప్రాణం పోయగలమని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా! గుండె లేదా బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. సర్జరీ పూర్తయ్యాక తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువస్తారు. శరీరాన్ని మొత్తంగా భద్రపరచడం కూడా ఇలాంటిదే అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ రెండూ ఒకే విధంగా కనిపించినా, శాస్త్ర పరిభాషలో ఈ రెండూ వేర్వేరు పద్ధతులు. క్రయానిక్స్ విధానం మరణాంతరం శరీరాన్ని భద్రపరచడానికి సంబంధించిన అంశం. క్రయోనిక్స్ టెక్నాలజీని ఇప్పటికే వైద్యానికి సంబంధించి అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వీర్యం, అండాలు, చర్మం మొదలైన వాటిని మైనస్ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. క్లోనింగ్ ద్వారా పునరుత్పత్తి చేయడం, సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం కూడా మానవ మేధాశక్తికి గొప్ప ఉదాహరణలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ........................ఐదో భాగంలో చదవండి.. చదవండి: Cryonics 4: చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా? -
చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా?
Cryonics Part 4: మరణాన్ని జయించాలన్న కోరిక మనిషికి ఏనాటి నుంచో ఉంది. సంజీవని పర్వతం, అమృతం వంటి అంశాలు చిన్నప్పటినుంచీ వింటూనే ఉన్నాం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇంతవరకు మరణాన్ని వాయిదా వేయగలుగుతున్నాడే గాని పూర్తిగా జయించలేకపోతున్నాడు. అయితే సుదూర కాలంలోనే మరణాన్ని ఆపగలిగే టెక్నాలజీ అభివృద్ధి చేయగలమనే నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం లోనుంచే క్రయోనిక్ టెక్నాలజీ రూపొందింది. చదవండి: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే? ముందు శరీరాన్ని శిధిలం కాకుండా భద్రపరచగలిగితే తర్వాత ఆ శరీరాలపై ప్రయోగం చేసి, చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. ప్రపంచంలోని ధనికులు అనేక వేల మంది అమెరికాలోని ఈ రెండు సంస్థల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో 1353 మంది తమ శరీరాలను భద్రపరుచుకున్నారు. వారి కుటుంబాలు రెండు లక్షల డాలర్ల ఫీజు చెల్లించి మృత శరీరాలను ఆల్కర్కు అప్పగించాయి. ఎప్పటికైనా తమవారికి తిరిగి జీవించే అవకాశం వస్తుందని వారు నమ్ముతున్నారు. వేల ఏళ్లుగా వేధిస్తున్న, అంతుచిక్కని అనేక జబ్బులను ప్రస్తుత కాలంలో తేలిగ్గా నయం చేస్తున్నారు. అలాగే ఇప్పటికీ లొంగని అనేక జబ్బులకు భవిష్యత్ లో చికిత్స తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నారు. మనిషికి చావులేని చికిత్స త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే ఆశ మనిషిలో కనిపిస్తోంది. అందుకే శరీరాలను భద్రపరుచుకునే వ్యాపారం మొదలైంది. చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా! -
మనిషి మరణించగానే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. చదవండి: పార్ట్ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి.. చదవండి: పార్ట్ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. -
మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..
చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నాయి కొన్ని పరిశోధనా సంస్థలు. అమెరికా, రష్యా దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని చెబుతున్నారు. శవాలతో వ్యాపారం చేసే సైంటిఫిక్ సంస్థలకు ఊపిరి పోస్తున్నాయి సైంటిస్టుల మాటలు. జీవి ఏదైనా మరణించిన గంట తర్వాతి నుంచి శిధిలావస్థ మొదలవుతుంది. కాని మంచు ప్రాంతాల్లో చనిపోయిన మనుషులు లేదా జంతువులు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాడవకుండా కనిపించిన ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా మైనస్ 196 సెంటీగ్రేడ్ డిగ్రీల టెంపరేచర్ లో వందేళ్ళయినా మృతుడి శరీరం పాడవకుండా భద్రపరచగల ఏర్పాట్లు చేశాయి అమెరికాలోని రెండు సంస్థలు. అవే ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్ ఇనిస్టిట్యూట్లు. ఆల్కర్ 1972లో ఏర్పడగా...క్రయోనిక్ ను 1976లో స్థాపించారు. చదవండి: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! క్రయోనిక్స్ టెక్నాలజీ అంటే అత్యంత శీతల వాతావరణం సృష్టించి మనిషి శరీరం పాడవకుండా భద్రపరచడమే. మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే...వారు ఏ కారణంతో చనిపోయారో..దానికి తగిన చికిత్స అందుబాటులోకి వస్తే...ఆ చికిత్స లేదా సర్జరీ ద్వారా వారిని తిరిగి బ్రతికించగలగడమే క్రయోనిక్స్ ఉపయోగం అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. భవిష్యత్ లో అత్యంత ఉన్నతస్థాయి చికిత్సలు అందుబాటులోకి వస్తే చనిపోయినవారిని తిరిగి బ్రతికించగలమనే నమ్మకంతో ఈ సంస్థలు కోట్ల రూపాయల ఫీజు తీసుకుని మృత శరీరాలను పాడవకుండా భద్రపరుస్తున్నాయి. ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? థర్డ్ స్టోరీలో చదవండి.. -
చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? సైన్స్ ఏం చేప్తోందంటే!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడో ఓ చోట కూర్చుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని సంపాదించాడు మనిషి. సౌర కుటుంబం ఆవల ఏముందో తెలుసుకుంటున్నాడు. తనలాంటి మనుషులు ఏదైనా గ్రహంలో ఉన్నారేమోనని శోధిస్తున్నాడు. అదేవిధంగా తన సుఖ సంతోషాల కోసం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావును ఎందుకు జయించలేకపోతున్నామని మదనపడుతున్నాడు. మరణాన్ని జయిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నాలు ప్రారంభించాడు. ►చావును జయించే క్రమంలో ఎంతవరకు ప్రయాణించాడు...? ►మృత్యువును జయించగలమా? ►చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? ►చావును ఆపగల శక్తి మనిషికి వచ్చేసిందా? ►డబ్బు ప్రపంచంలో మనిషి బలహీనతలను సొమ్ము చేసుకునే మరో వ్యాపారమా? చదవండి: Meteor Lights Up Chile Sky: ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే? ఇన్స్యూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయించుకున్నట్లుగా... జీవిత కాల పరిమితి పూర్తయిన వాహనాలకు గ్రీన్ టాక్స్ కట్టి లైఫ్ పొడిగించుకున్నట్లుగా మనిషి తన జీవితాన్ని రెన్యువల్ చేసుకోగలడా? జీవిత కాలాన్ని తనకు కావాల్సిన విధంగా పెంచుకోగలడా? తిరిగి బ్రతికించగలమనే మూఢ నమ్మకాలతో కన్న బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల గురించి కొంతకాలం క్రితం విన్నాం. అనేక మంది బాబాలు, స్వాములు చనిపోయినవారిని బ్రతికించారనే ప్రచారాన్ని అప్పుడప్పుడూ వింటుంటాం. జీవరాశుల పుట్టుకకు కారణమైన పంచ భూతాల గుట్టుమట్లను తెలుసుకునే స్థాయికి చేరుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేకోవలో.. గ్రహాంతర వాసుల కోసం అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే..చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నారు కొందరు సైంటిస్టులు. అసలు ఈ స్థాయికి మనిషి మేధస్సు పెరిగిందా? నిజంగా శవాన్ని బ్రతికించగల టెక్నాలజీ తయారయిందా? జబ్బులు, చావులు, వృద్ధాప్యం వంటి సమస్యలు లేని ప్రపంచాన్ని చూడగలమా?... చూడగలమనే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవన్నీ సరే, చనిపోయిన మనిషిని అసలు మళ్లీ బతికించగలమా? మనుష్యులు చేస్తోన్న పరిశోధన ఎంత దూరం వచ్చింది? సెకండ్ స్టోరీలో చదవండి.. -
చనిపోయిన వాళ్లు నిజంగా బతికొస్తే....?
మాస్కో: చనిపోయిన వారు మళ్లీ బతికొస్తారా? మనతోపాటు మన ఇంట్లో ఒక సభ్యుల్లా బతికిన కుక్క, పిల్లి కూడా మనలాగే బతికొస్తే...? సైన్స్ ఫిక్షన్ అంటారు. అవును ప్రస్తుతానికి ఇది సైన్స్ ఫిక్షనే. మరో 40, 50 ఏళ్లలో ఇది నిజం కాబోతోందని ఆధునిక సైన్స్ చెబుతోంది. మరి అన్నేళ్లు మృతదేహాలు కుళ్లిపోకుండా నిద్రపోయినట్లుగానే ఎలా ఉంటాయి? అందుకే క్రయోనిక్స్ సంస్థలు ప్రపంచంలోని పలు చోట్ల వెలిశాయి. మానవ మృతదేహాలు, వాటిలోని అవయవాలను ఏమాత్రం దెబ్బతినకుండా అతిశీతలంలో భద్రపర్చడాన్నే క్రయోనిక్స్ అంటారు. అమెరికాలో ఇప్పటికే ఇలాంటి రెండు సంస్థలు ఉండగా, రష్యాలో ఒకటి ఉంది. రష్యాలో 2005లోనే క్రయోనిక్స్ సంస్థను స్థాపించగా అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. ఓ రష్యా శాస్త్రవేత్త కుమారుడైన 35 ఏళ్ల దనిలా మెద్వెదెవ్ ల్యాబ్ లాంటి ‘క్రియోరస్’ సంస్థను నిర్వహిస్తున్నారు. మాస్కో శివారులోని సెర్గీవ్ పొసద్ పట్టణంలో ఈ సంస్థ ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలెవరికీ తెలియదు. అప్పుడప్పుడు ఆధునిక అంబులెన్స్ వాహనాలు గ్రీన్ గేట్ గుండా లోపలకి వెళ్లడం మాత్రం కనిపిస్తుంది. అందులో ప్రస్తుతం 9 దేశాలకు చెందిన 24 మానవ మృతదేహాలను, 21 మనుషుల తలలను భద్రపరుస్తున్నారు. కుక్కలు, పిల్లుల శవాలు కూడా ఇంతకంటే ఎక్కువగానే ఉన్నాయట. జబ్బుల కారణంగానో, ప్రమాదాల కారణంగానో ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేశాలను కొన్ని క్షణాల్లోనే ఫ్రీజర్ బాక్సుల్లోకి ఎక్కించి, అక్కడి నుంచి ఈ ఆస్పత్రి ల్యాబ్‌కు తరలిస్తారు. శీతలీకరణలో మృతదేహంలోని రక్తకణాలు దెబ్బతినకుండా ఉండేందుకు పాత రక్తాన్ని కొంతతీసి రసాయనాలతో మిశ్రమం చేసిన కొత్త రక్తాని శరీరంలోకి ఎక్కిస్తారు. అనంతరం మృతదేహాలన్ని లేదంటే తలలను మైనస్ 196 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. ఇదేమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారమేమి కాదు. కార్పొరేట్ కల్చర్‌గా కొనసాగుతున్న వ్యాపారం. మొత్తం మృదదేహాన్ని భద్రపర్చేందుకు 24 లక్షల రూపాయలు, ఒక తలను భద్రపర్చేందుకు 8 లక్షల రూపాయలను వసూలు చేస్తారు. తలను భద్రపర్చినట్టయితే మెదడు భద్రంగా ఉంటుందని, భవిష్యత్తులో తలను రక్షించుకుంటే దాన్ని తగిలించుకునేందుకు సరైన బాడీ దొరక్కపోతుందా ? అన్న ఆశాభావం కొందరిదైతే, తలను మాత్రమే భద్రపరిస్తే తక్కువ ఖర్చవుతుందన్నది మరి కొందరి కస్టమర్ల భావన. అమెరికాలో ఇలాంటి ఓ క్రయోనిక్స్ సంస్థ కోర్టు కేసుల కారణంగా దివాలాతీసి మూతపడగా, ఆరిజోనాలోని అల్కార్ ఇనిస్టిట్యూట్ మాత్రం ఇప్పటికీ నడుస్తోంది. అందులో ప్రముఖ బేస్‌బాల్ స్టార్ టెడ్ విలియమ్స్‌తోపాటు పలు రంగాలకు చెందిన ప్రముఖుల మృతదేహాలు భద్రంగా ఉన్నాయి. మృతదేహాల వివరాలు బహిర్గతం చేయరాదన్నది సంస్థ నియమం. ఈ అల్కార్లో మానవ మృతదేహాలను భద్రపర్చడం రష్యా సంస్థకన్నా మరింత కాస్లీ వ్యవహారం. ఇందులో ఒక్క మానవ మృతదేహాన్ని భద్రపర్చేందుకు 1.33 కోట్ల రూపాయలను, తలకు 53 లక్షలను వసూలు చేస్తున్నారు. ఈ సంస్థకు బతికున్న సభ్యులు కూడా దాదాపు 1100 మంది ఉన్నారు. భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇది ముందుగానే సీటు రిజర్వ్ చేసుకోవడం లాంటిది. చనిపోయిన వారిని లేదా క్లినికల్ డెడ్ అని ప్రకటించిన వారిని కొన్ని గంటల్లోనే భద్రపరిస్తే మళ్లీ భవిష్యత్తులో ప్రాణం పోయవచ్చన్నది మిచిగాన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన రాబర్ట్ ఎటింగ్ సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ప్రాతిపదికనే ఇలాంటి క్రయోనిక్స్ సంస్థలు పుట్టుకొచ్చాయి. చైనాలో కూడా జాయింట్ వెంచర్‌గా క్రయోనిక్స్ భారీ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతుండగా, స్విడ్జర్లాండ్‌లో కూడా మరోటి వెలుస్తోంది. ఆరిజోనాలోని ఆల్కార్ తన వ్యాపారాన్ని విస్తృతం చేసుకునేందుకు వివిధ ఆస్పత్రులతోని, మార్చురీలతోని టైఅప్‌లు పెట్టుకోగా రష్యా సంస్థ ముందుగా ఒప్పందం చేసుకున్న ప్రకారం కొన ఊపిరితోనున్న వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఏకంగా అనుబంధ ఆస్పత్రినే ఏర్పాటు చేస్తోంది. ఈ క్రయోనిక్స్ సంస్థల పరిభాష కూడా భిన్నంగా ఉంటుంది. మృతదేహాలను పేషంట్స్‌గా వ్యవహరిస్తారు. శీతలీకరణ చేయడాన్ని నిశ్చల స్థితి అని పిలుస్తారు. తిరిగి ప్రాణం తెప్పించే ప్రక్రియను రీయానిమేషన్ అని అంటారు.