టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడో ఓ చోట కూర్చుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని సంపాదించాడు మనిషి. సౌర కుటుంబం ఆవల ఏముందో తెలుసుకుంటున్నాడు. తనలాంటి మనుషులు ఏదైనా గ్రహంలో ఉన్నారేమోనని శోధిస్తున్నాడు. అదేవిధంగా తన సుఖ సంతోషాల కోసం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావును ఎందుకు జయించలేకపోతున్నామని మదనపడుతున్నాడు. మరణాన్ని జయిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నాలు ప్రారంభించాడు.
►చావును జయించే క్రమంలో ఎంతవరకు ప్రయాణించాడు...?
►మృత్యువును జయించగలమా?
►చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?
►చావును ఆపగల శక్తి మనిషికి వచ్చేసిందా?
►డబ్బు ప్రపంచంలో మనిషి బలహీనతలను సొమ్ము చేసుకునే మరో వ్యాపారమా?
చదవండి: Meteor Lights Up Chile Sky: ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే?
ఇన్స్యూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయించుకున్నట్లుగా... జీవిత కాల పరిమితి పూర్తయిన వాహనాలకు గ్రీన్ టాక్స్ కట్టి లైఫ్ పొడిగించుకున్నట్లుగా మనిషి తన జీవితాన్ని రెన్యువల్ చేసుకోగలడా? జీవిత కాలాన్ని తనకు కావాల్సిన విధంగా పెంచుకోగలడా? తిరిగి బ్రతికించగలమనే మూఢ నమ్మకాలతో కన్న బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల గురించి కొంతకాలం క్రితం విన్నాం. అనేక మంది బాబాలు, స్వాములు చనిపోయినవారిని బ్రతికించారనే ప్రచారాన్ని అప్పుడప్పుడూ వింటుంటాం.
జీవరాశుల పుట్టుకకు కారణమైన పంచ భూతాల గుట్టుమట్లను తెలుసుకునే స్థాయికి చేరుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేకోవలో.. గ్రహాంతర వాసుల కోసం అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే..చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నారు కొందరు సైంటిస్టులు. అసలు ఈ స్థాయికి మనిషి మేధస్సు పెరిగిందా? నిజంగా శవాన్ని బ్రతికించగల టెక్నాలజీ తయారయిందా? జబ్బులు, చావులు, వృద్ధాప్యం వంటి సమస్యలు లేని ప్రపంచాన్ని చూడగలమా?... చూడగలమనే అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఇవన్నీ సరే, చనిపోయిన మనిషిని అసలు మళ్లీ బతికించగలమా? మనుష్యులు చేస్తోన్న పరిశోధన ఎంత దూరం వచ్చింది? సెకండ్ స్టోరీలో చదవండి..
Comments
Please login to add a commentAdd a comment