
పిల్లలను ఆడించాలని ఎవరికి ఉండదు? అందునా నెలల పిల్లలనుంచి రెండేళ్లలోపు చిన్నారులు తేలిగ్గా ఉంటారు కాబట్టి వాళ్లను గాల్లోకి ఎగరేసినట్టుగా ఎత్తుతుంటారు తల్లులు. ఇలా చేసే సమయంలో కొందరికి ఓ చిత్రమైన సమస్య వస్తుంటుంది. దానిపేరే ‘బేబీ రిస్ట్’! బొటన వేలూ, చూపుడువేలు మధ్యన పిల్లలను ఎత్తుకుని ఎగరేసినట్లుగా చేసే సమయంలో అక్కడ పడే ఒత్తిడి వల్ల మణికట్టు దగ్గరి టెండన్లు దెబ్బతిని విపరీతంగా నొప్పి వస్తుంది.
ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. కాస్త విశ్రాంతితో తేలిగ్గానే తగ్గేతాత్కాలిక సమస్య ఇది. నొప్పి మరీ ఎక్కువైతే తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌తో వైద్యులు చికిత్స అందిస్తారు. చాలా అరుదుగా శస్త్రచికిత్స అవసరం పడే సందర్భాలూ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment