Surgery Treatment
-
పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే!
స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన పూజాహెగ్డేకు గత కొన్నాళ్ల నుంచి అస్సలు కలిసి రావట్లేదు. ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు ఆమెవైపు చూడటం మానేశారు. దీంతో ఆమె షాపింగ్ మాల్స్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కానీ గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో వచ్చిన అవకాశాన్ని తనే వద్దనుకుందని ప్రచారం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం తన ఆరోగ్య విషయమేనని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్ చేసిన శివకార్తికేయన్) పూజా హెగ్డేకు ఈ మధ్యనే తన కాళ్లకు సంబంధించి మేజర్ సర్జరీ జరిగిందని ప్రచారం జరుగుతుంది. కాలినొప్పితో ఆమె చాలారోజుల నుంచి బాధపడుతుందని సమాచారం. ఇదే విషయాన్ని పూజా స్నేహితులే ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్నవారికి చేరవేశారట. ఇలాంటి సమయంలో షూటింగ్లో పాల్గొంటే ఆమె మరిన్నీ ఇబ్బందులు ఎదురవుతాయనే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందట. రాధేశ్యామ్, బీస్ట్ సినిమాల నుంచే ఆమె కాలినొప్పితో బాధపడుతుండేదట.. ఆ సమస్య ఎక్కువ కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చిందట. దీంతో తను ఒప్పుకున్న రెండు సినిమాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బహిరంగంగా తెలిపేందుకుక పూజా హెగ్డేకు ఇష్టం లేదట.. అందుకే దానిని గోప్యంగా ఉంచారని సమాచారం. (ఇదీ చదవండి: కేజీఎఫ్ హీరో యశ్ నాకు బావ అవుతాడు: శ్రీలీల) ఇప్పుడు ఇదే విషయం సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. చాలా రోజుల నుంచే పూజా హెగ్డే కాలినొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు. వైద్యులు ఓకే చెప్పడంతో మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంది. అప్పట్లో ఆపరేషన్ చేయుంచుకుందని భారీగా ప్రచారం జరిగింది. అప్పుడు తన టీమ్ సభ్యులు అందులో నిజం లేదని తెలపడంతో ఆ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్ పడింది. తాజాగ ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. -
సంపూర్ణంగా కోలుకున్న లాలూ
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యం నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. చాలా హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని తేజస్వి యాదవ్ క్యాప్షన్ పెట్టారు. -
కాస్మొటిక్ సర్జరీతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి
-
Adipurush: ప్రభాస్ ఎక్కడ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు. సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో సినిమాకు బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ చేసి ఉంటే.. ఈరోజు మూవీ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్స్ ఫాలో అవుతున్నారు. (ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు) ప్రభాస్ ఎక్కడ టాలీవుడ్లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్ థియేటర్లలో చూసేవాడు. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి పెరిగిపోవడంతో ముంబయి వెళ్లి తన సినిమాను చూసేవాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడా ఇదే పరిస్థితి ఎదురుకావడం వల్ల ఇప్పుడు ఫారెన్‌లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాలో ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్ చూశాడట. బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలికి ఏర్పడిన గాయం మళ్లీ ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్లో కూడా కాలి నొప్పితో ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట. అనంతరం కొన్నిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ మూవీ సెట్లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) -
చెయ్యి తెగితే.. మరొకరి చెయ్యి అతికిస్తారిక్కడ
సాక్షి, హైదరాబాద్: ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మను.. కేరళలోని కొచ్చికు చెందిన ఆయన రైలు ప్రమాదంలో రెండు చేతులనూ కోల్పోయారు. చాలా కాలంపాటు కుటుంబ సభ్యుల మీదే ఆధారపడి బతికాడు. కానీ ఇప్పుడు ఆయనకు రెండు చేతులూ ఉన్నాయి. అందరిలాగే తానూ పనిచేసుకుని బతుకుతున్నాడు. కొచ్చిలోని అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రి ఆయనకు ఈ కొత్త జీవితాన్ని కల్పించింది. ఈ ఆస్పత్రికి చెందిన తల, మెడ, ప్లాస్టిక్ సర్జరీ శస్త్రచికిత్స విభాగాధిపతి సుబ్రమణ్యం అయ్యర్ దేశంలోనే తొలిసారిగా మనుకు చేతి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. బ్రెయిన్‌డెడ్ అయిన ఒక వ్యక్తికి చెందిన రెండు చేతులను తీసుకుని మనుకు అమర్చారు. ఇందుకోసం క్లిష్టమైన సర్జరీ చేయడంతోపాటు ఆరు నెలల పాటు ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మను తన ‘కొత్త’చేతులను మామూలుగా వినియోగించడం మొదలుపెట్టారు. ఈ చేతి మార్పిడి తర్వాత.. మరెంతో మంది ఇలాంటి చికిత్సల కోసం వస్తున్నారని వైద్యులు చెప్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లోనే ఈ చికిత్సలు మన దేశంలో కిడ్నీ, లివర్, గుండె మార్పిడి వంటి శస్త్రచికిత్సలు చాలా ఆస్పత్రులలో జరుగుతున్నాయి. కానీ ఏదైనా ప్రమాదంలో రెండు చేతులూ కోల్పోయిన వారికి ఇతరుల చేతులను అమర్చే శస్త్రచికిత్సలు ఐదారు ఆస్పత్రుల్లో మాత్రమే జరుగుతున్నాయి. అందులో మొట్టమొదటగా కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో జరిగింది. ఎక్కువ చికిత్సలూ అక్కడే చేశారు. దేశంలో ఇప్పటివరకు దాదాపు 40 మంది రోగులకు చేతులు మార్పిడి చేయగా.. అందులో 14 మంది రోగులకు అమృత ఆస్పత్రిలోనే జరిగాయి. ఈ 14 మందికి కలిపి 26 చేతులను మార్పిడి చేశారు. ఇద్దరికి భుజాలు దెబ్బతినడంతో ఒక్కో చేతిని మాత్రమే మార్పిడి చేశారు. ఇలాంటి ఇన్ని చికిత్సలు చేయడం ప్రపంచంలోనే అమృత ఆస్పత్రిలో ఎక్కువని అక్కడి వైద్యులు చెప్తున్నారు. నాలుగు వైద్య బృందాలతో.. చేతుల మార్పిడి శస్త్రచికిత్స కోసం నాలుగు వైద్య బృందాలు కలిసి పనిచేస్తాయని వైద్యులు తెలిపారు. రెండు బృందాలు రోగికి చేతిని అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తాయని.. మరో రెండు బృందాలు బ్రెయిన్‌డెడ్ వారి నుంచి చేతులను తీసుకోవడానికి సిద్ధం చేస్తాయని వివరించారు. మొత్తంగా దాదాపు 16 గంటల పాటు శస్త్రచికిత్స జరుగుతుందని.. తర్వాత రోగి కొన్నినెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ఫిజియో థెరపీ, ఇతర చికిత్సలతో అమర్చిన అవయవం సరిగా పనిచేస్తుందో లేదో చూస్తారని వెల్లడించారు. 18 ఏళ్లు పైబడిన వారికే చెయ్యి మార్పిడి చేయవచ్చని, చికిత్సకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. నాలుగు రోజుల్లో పనిచేయడం మొదలవుతుంది బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచే వారి కుటుంబ సభ్యుల అనుమతి మేరకు చేతులను స్వీకరిస్తాం. ఆ వ్యక్తి, అమర్చే వారి బ్లడ్ గ్రూప్ ఒకటే అయి ఉండాలి. చెయ్యి మార్పిడి చికిత్స చేసిన నాలుగు రోజుల్లో రోగి ‘కొత్త’చేతులతో మంచినీటి గ్లాసు పట్టుకోగలరు. పూర్తి స్థాయిలో చెయ్యి పనిచేయాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన బాధితులకు అవసరమైన మేర అవయవాలు దొరకడం లేదు. బ్రెయిన్‌డెడ్ అయిన పేషెంట్ల కుటుంబ సభ్యులు దానానికి ముందుకు రావాలి. ఈ మేరకు ప్రజల్లో అవగాహన రావాల్సి ఉంది. – డాక్టర్ సుబ్రమణ్యం అయ్యర్, అమృత ఆస్పత్రి వైద్యుడు -
నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స
ఒడిశా (భువనేశ్వర్) : నాగుపాముకి అరుదైన శస్త్రచికిత్స చేసి, దాని పొట్టలో ఇరుక్కున్న సారా సీసా మూతను వైద్యులు తొలగించారు. ప్రస్తుతం వైద్యుల పరిశీలనలో ఉన్న పాము ఆరోగ్య పరిస్థితులను దాదాపు వారం రోజుల పాటు పరిశీలిస్తారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్త వహిస్తారు. వివరాలిలా ఉన్నాయి.. స్థానిక వాసుదేవ్ నగర్‌లోని నిర్మాణ దశలో ఉన్న ఓ భవనం దగ్గరున్న కొట్టు గదిలో మూడున్నర అడుగుల నాగుపాముని అక్కడి కార్మికులు గుర్తించి, స్నేక్ హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును చాకచక్యంగా పట్టుకుని, పరిశీలించగా, పాము పొట్ట భాగంలో ఏదో ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించగా, అక్కడ తీసిన ఎక్స్–రేలో పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు. -
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, ఇతర వైద్యులు ఈనెల 9న నాలుగు గంటలు శ్రమించి 65 ఏళ్ల వృద్ధురాలు శివపూర్ణమ్మ మెడలోని క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆమె కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ ఈ వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన శివపూర్ణమ్మ మెడలో కణితితో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా క్యాన్సర్ కణితి అని తేలింది. దీంతో ఆమె ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. రక్తనాళాలు, గొంతు నరాలకు హానికలగకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ కణితిని, దాని చుట్టూ ఉండే శోషరస గ్రంధులను తొలగించారు. పోస్ట్ ఆపరేటివ్ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ఆమె శరీరంలో క్యాల్షియం తగ్గడాన్ని గుర్తించి వైద్యం చేశారు. ప్రస్తుతం ఆమెకు రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ కిరణ్‌కుమార్ చెప్పారు. శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, వారి బృందం, సర్జరీ వైద్యులు డాక్టర్ చందనాప్రియాంక, డాక్టర్ ఉష, డాక్టర్ గాయత్రిల కృషి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్ ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా గుంటూరు జిల్లా చినకాకానిలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులతో విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. అక్కడ ముగ్గురు క్యాన్సర్ నిపుణులు ఉన్నారని, వారు వచ్చి ఇక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో సేవలు అందిస్తారని చెప్పారు. -
మీరు చిన్నారులను ఎత్తుకుంటున్నారా...జర జాగ్రత్త
పిల్లలను ఆడించాలని ఎవరికి ఉండదు? అందునా నెలల పిల్లలనుంచి రెండేళ్లలోపు చిన్నారులు తేలిగ్గా ఉంటారు కాబట్టి వాళ్లను గాల్లోకి ఎగరేసినట్టుగా ఎత్తుతుంటారు తల్లులు. ఇలా చేసే సమయంలో కొందరికి ఓ చిత్రమైన సమస్య వస్తుంటుంది. దానిపేరే ‘బేబీ రిస్ట్’! బొటన వేలూ, చూపుడువేలు మధ్యన పిల్లలను ఎత్తుకుని ఎగరేసినట్లుగా చేసే సమయంలో అక్కడ పడే ఒత్తిడి వల్ల మణికట్టు దగ్గరి టెండన్లు దెబ్బతిని విపరీతంగా నొప్పి వస్తుంది. ఈ సమస్యను వైద్యపరిభాషలో ‘డి క్వెర్వెయిన్స్ టెనోసినోవైటిస్’ లేదా ‘డి క్వెర్వెయిన్స్ టెండనైటిస్’ అంటారు. కాస్త విశ్రాంతితో తేలిగ్గానే తగ్గేతాత్కాలిక సమస్య ఇది. నొప్పి మరీ ఎక్కువైతే తేలికపాటి పెయిన్‌కిల్లర్స్‌తో వైద్యులు చికిత్స అందిస్తారు. చాలా అరుదుగా శస్త్రచికిత్స అవసరం పడే సందర్భాలూ ఉంటాయి. చదవండి: కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ! -
ప్రయోగం చేశాడు.. ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు
నేటి తరం పిల్లలు ఒక పట్టాన ఏదీ నమ్మరు. స్వయంగా తమంతట తాము స్వయంగా తెల్సుకుంటేగాని ఒక నిర్ణయానికి రారు. ఈ కోవకు చెందిన వాడే మనం చెప్పుకోబోయే చిచ్చరపిడుగు రిలేమోరిసన్. ఇంగ్లాండ్‌లోని గ్రేట్ మాంచెస్టర్‌కు చెందిన 12 ఏళ్ల మోరిసన్ 54 మ్యాగ్నటిక్ బాల్స్ మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందని లె లుసుకున్న మోరిసన్ .. మాగ్నెట్‌తో తయారు చేసిన బాల్స్‌ను మింగితే.. తన పొట్ట అయస్కాంతంలా పనిచేస్తుందని అనుకున్నాడు. అసలు అది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు జనవరి 1న కొన్ని బాల్స్, నాలుగున... కొన్ని... మొత్తం 54 మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగేసాడు. మింగిన తరువాత ఒక ఐరన్ స్టిక్‌ను తన పొట్ట మీద ఉంచాడు. ఎంతకీ అది అయస్కాంతానికి ఆతుక్కోక పోవడంతో.. తాను మింగిన బాల్స్ టాయిలెట్లో పడిపోయాయేమోనని వాష్‌రూమ్‌కు వెళ్లి చూశాడు. అక్కడ ఏమీ కనిపించకపోవడంతో కంగారుపడిపోయాడు. వాటిని ఎలా బయటికి తీయాలో తెలియక నానా అవస్థలు పడిన మోరిసన్ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వాళ్ల అమ్మ పైజ్వార్డ్ను నిద్రలేపి పొరపాటున రెండు మ్యాగ్నటిక్ బాల్స్‌ను మింగానని చెప్పాడు. వెంటనే మోర్సిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లిన పైజ్‌కు విస్తుపోయే నిజం తెలిసింది. చదవండి: రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కుక్క! కూలో చేరిన కంగనా: ట్విటర్‌కు కౌంటర్ డాక్టర్లు ఎక్స్‌రే తీసి మొత్తం 54 బాల్స్ ఉన్నాయని చెప్పారు. ఇవి కడుపులో అలాగే ఉండిపోతే వేరే అవయవాలు పాడై ప్రాణం పోయే అవకాశం ఉందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి సర్జరీని ప్రారంభించారు. ఆరుగంటల పాటు నిర్విరామంగా సర్జరీ చేసి మోరిసన్ మింగిన బాల్స్ అన్నింటినీ బయటకు తీశారు. అప్పటికీ మోరిసన్ పూర్తిగా కోలుకోలేదు. హాస్పిటల్లో 10 రోజుల పాటు ఉండిపోవలసి వచ్చింది. పేగుకు రంధ్రం పడడం వల్ల ఆకుపచ్చని ద్రవం ఒకటి విడుదలవ్వడంతో దానిని పూర్తిగా కక్కిన తరువాత గాని అతను కదల్లేకపోయాడు. ఈ సమయంలో అతనికి ట్యూబ్ ద్వారా ఆహారం అందించారు. రెండు వారాలు తరువాత పూర్తిగా కోలుకుని డిచార్జ్ అయ్యాడు మోరిసన్. మోరిసన్‌కు సైన్స్ అంటే ఎంతో ఆసక్తి. ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే కడుపులో మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటే ఐరన్ స్టిక్ తన పొట్టకు అతుక్కుంటుందా లేదా అనే∙విషయం తెలుసుకోవడానికి ఇలా చేసానని మోరిసన్ చెప్పినట్లు తల్లి చెప్పారు. ఈ విషయం మనకు చాలా సిల్లీగా అనిపించవచ్చు కానీ మోరిసన్ చాలా చిన్నవాడు కావడంతో ఇలా చేసాడని ఆమె వివరించారు. -
పీజీ ఆయుర్వేద వైద్యులూ సర్జరీలు చేయొచ్చు
న్యూఢిల్లీ: పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద వైద్యులు కూడా ఇకపై శస్త్రచికిత్సలు(సర్జరీలు) చేయొచ్చు. ఇందుకోసం వారు శిక్షణ పొందవచ్చు. ఈ మేరకు కేంద్ర ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్(సీసీఐఎం) నవంబర్ 20న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయం ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పీజీ ఆయుర్వేద వైద్యులు చేయాల్సిన 39 సాధారణ శస్త్రచికిత్స పద్ధతులను ఐఐసీఎం తన జాబితాలో పేర్కొంది. ఇందులో 19 పద్ధతులు విధానాలు కన్ను, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినవే ఉన్నాయి. ఇందుకోసం ఇండియన్ మెడిసిన్ సెంట్రల్ కౌన్సిల్(పోస్టు గ్రాడ్యుయేట్ ఆయుర్వేద మెడిసిన్)–2016 నిబంధనలను సైతం కేంద్రం సవరించింది. తమ గెజిట్ నోటిఫికేషన్‌పై విమర్శలు వస్తుండడంతో ఆయుష్ శాఖ సెక్రెటరీ వైద్య రాజేశ్ కొటెచా స్పందించారు. ఇందులో కొత్త నిర్ణయం ఏదీ లేదని, నిబంధనలను ఉల్లంఘించడం లేదని చెప్పారు. పీజీ ఆయుర్వేద వైద్యులందరినీ సర్జరీలు చేయడానికి అనుమతించడం లేదన్నారు. కేవలం శల్య, శలక్య విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించిన వారికే అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు. ఆయుర్వేద సంస్థల్లో 20 ఏళ్లుగా శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని సీసీఐఎం బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ వైద్యజయంత్ దేవ్‌పూజారి తెలిపారు. తమ నోటిఫికేషన్‌తో వాటికి చట్టబద్ధ గుర్తింపు లభిస్తుందన్నారు. అది తిరోగమన చర్య: ఐఎంఏ సీసీఐఎం అనుమతిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది తిరోగమన చర్య అని స్పష్టం చేసింది. సదరు ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఆధునిక వైద్యానికి చెందిన శస్త్రచికిత్స పద్ధతులు కాకుండా పురాతన ఆయుర్వేద గ్రంథాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా సొంత శస్త్రచికిత్స విధానాలను రూపొందించుకోవాలని ఐఐసీఎంకు ఐఎంఏ సూచించింది. భారతీయ వైద్య శాస్త్రానికి సంబంధించిన కాలేజీల్లో ఆధునిక వైద్య శాస్త్ర వైద్యులను నియమించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వేర్వేరు వైద్య శాస్త్రాలను కలిపేయడం మంచి పద్ధతి కాదని తేల్చిచెప్పింది. అది ముమ్మాటికీ తిరోగమని చర్య అంటూ ఐఎంఏ ఒక ప్రకటన విడుదల చేసింది. -
ఇక టెస్టులు ఆడటం నాకు సవాలే
న్యూఢిల్లీ: వెన్ను నొప్పికి శస్త్రచికిత్స తర్వాత టెస్టు క్రికెట్ ఆడటం తనకు సవాలేనని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు తన అవసరమున్నందున సుదీర్ఘ ఫార్మాట్ కోసం తాపత్రయపడి ప్రమాదం కొనితెచ్చుకోనని పేర్కొన్నాడు. ‘టెస్టుల్లో నన్ను బ్యాకప్ సీమర్‌గా భావిస్తారని తెలుసు. కానీ వెన్నునొప్పి చికిత్స తర్వాత టెస్టులాడటం నాకు పెద్ద సవాలే. కేవలం నేను టెస్టు స్పెషలిస్టునే అయితే రిస్క్ చేసి అయినా సుదీర్ఘ ఫార్మాట్లో ఆడేవాడిని. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్లో జట్టుకు నా అవసరం ఉంది’ అని పాండ్యా వెల్లడించాడు. 2018 ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ తీవ్రమైన వెన్నునొప్పితో మైదానాన్ని వీడాడు. ఆ సమయంలో ఇక తన కెరీర్ ముగిసిపోయినట్లు భావించానని అతను తెలిపాడు. ఇ ప్పటివరకు 11 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల పాండ్యా 2018 సెప్టెంబర్ తర్వాత మరో టెస్టు ఆడలేదు. ‘కాఫీ విత్ కరణ్’ టీవీ షో తర్వాత ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానన్న పాండ్యా... తన కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు రావడం బాధించిందని అన్నాడు. కఠిన సమయాల్లో ముంబై ఇండియన్స్ కోచ్ రికీ పాంటింగ్ తనను తండ్రిలా ఆదరించాడని తెలిపాడు. అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నాడు. ఇతరుల అభిప్రాయాలు వినడంతోనే 2016 ఐపీఎల్ సీజన్లో రాణించలేకపోయానని పేర్కొన్నాడు. జాతీయ జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి, ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. -
షేపు మారుస్తారు.. రూపునిస్తారు..
మారుతున్న కాలానికి అనుగుణంగా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతాన్ని పీకే దంత వైద్యులుగానే పరిమితమైన వీళ్లు.. నేడు ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగి వైద్య రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ప్రమాదాల్లో ముఖం, దవడ ఎముకలు విరిగినా, నుదురు, తల ఎముకలకు పగుళ్లు వచ్చినా చికిత్స చేస్తూ ట్రామాకేర్ బృందంలో ముఖ్య సభ్యులుగా మారారు. నేడు మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ⇔ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన వరుణ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలకు చికిత్స తీసుకుని, కోలుకున్నాడు గానీ, దవడ ఎముకలు విరగడంతో ముఖం మునుపటి రూపును కోల్పోయింది. అద్దంలో చూసుకుంటే తనను తానే గుర్తుపట్టలేని విధంగా తయారవ్వడంతో డిప్రెషన్‌కు గురయ్యాడు. తెలిసినవారి సలహాతో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్‌ను సంప్రదించాడు. కొద్దిరోజుల్లోనే తన మునుపటి స్థితిని మరలా పొందగలిగాడు. ⇔ గుంటూరు నగరానికి చెందిన ఎస్తేరు, తను బాల్యంలో గ్రహణంమొర్రి వ్యాధికి గురవడంతో, ముక్కు, నోరు వంకరపోయింది. బాల్యం నుంచి వేధిస్తున్న సమస్య తన వయసుకు లాగానే పెరిగి పెద్దదయింది. దీంతో అందంగా లేనని ఆత్మన్యూనత భావానికి గురయి, నలుగురిలో కలవలేకపోయేది. రోజూ అద్దంలో చూసుకుని మధనపడేది. తమ పాప బాధ చూడలేక పేరెంట్స్ ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ద్వారా లోపాన్ని సవరించగలిగారు. సాక్షి, లబ్బీపేట(విజయవాడ): కృష్ణా, గుంటూరు జిల్లాలో సుమారు 50 మంది వరకూ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ సేవలు అందిస్తున్నారు. వీరిలో 30 మంది విజయవాడలోనే ఉన్నారు. నిత్యం ప్రమాదాల్లో ముఖ ఎముకలు విరిగిన వారికి ఏడాదికి ఐదు వందల మందికి పైగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుండగా, పొగాకు ఉత్పత్తుల ద్వారా నోటి క్యాన్సర్ వచ్చిన 500 నుంచి 600 మందికి వీరు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తూ సరిచేస్తున్నారు. ప్రమాదాల్లో దవడ ఎముకలతో పాటు కాస్మోటిక్ ఫేషియల్ సర్జరీలు, ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీలు, ఫేస్ లిఫ్ట్, రైనో ప్లాస్టీ, బొటాక్స్, డెర్మో ఫిల్లర్స్ ద్వారా ముఖంపై ముడతలు తొలగించడం వంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫేషియల్ అంకాలజీ, గ్రహణం మొర్రి ఆపరేషన్లు, ప్రమాదాల్లో పళ్లు ఊడిన వారికి ఇంప్లాంట్ విధానంలో దవడ ఎముకకు శాశ్వత దంతాలు అమర్చుతున్నారు. కొత్త పుంతలు తొక్కుతున్న వైనం ఇప్పటి వరకూ గుండె, కాలేయం, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయడం అందరికీ తెలిసిందే. సరికొత్తగా ముఖాన్నే మార్చే ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. ఏడాది కిందట జరిగిన అంతర్జాతీయ సదస్సులో విజయవంతంగా ఫేషియల్ రీ ప్లాంటేషన్ చేసిన కేసుపై విశ్లేషణ చేయడం జరిగిందని వైద్యులు చెపుతున్నారు. ఒకప్పుడు పుచ్చిన దంతం పీకే వైద్యులుగా ఉన్న ఫేషియల్ సర్జన్లు నేడు ఫేషియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసే స్థాయికి ఎదిగారు. పుట్టుకతోనే ముఖం అందవిహీనంగా వున్న వారికి ఫేషియల్ సర్జరీలతో రూపురేఖలు మార్చేస్తున్నారు. దవట ఎముక వంకరగా ఉన్నా, నుదుటి భాగం ఎత్తుగా వున్నా, ముక్కు వంకరగా ఉన్నా మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ వాటిని సరిదిద్దేస్తున్నారు. ఫేషియల్ సర్జన్ ప్రాధాన్యత పెరిగింది ప్రస్తుతం వైద్య రంగంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం ప్రమాదాల్లో దవడ, ముఖ ఎముకలు విరిగిన వారికి అరుదైన శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వబోధనాస్పత్రిల్లోని ట్రామాకేర్ బృందంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లను నియమిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. నిత్యం యువత రోడ్డు ప్రమాదాలకు గురవుతూ, ముఖ ఎముకలు విరిగి, ప్రవేటు ఆస్పత్రిలకు చికిత్సకోసం వెళ్తున్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో అందుబాటులోకి తీసుకువస్తే మంచిది. గ్రహణం మొర్రి శస్త్ర చికిత్సలు నిర్వహించడంలో మాక్సిల్లో ఫేషియల్ సర్జన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. – డాక్టర్ మెహబూబ్ షేక్, ప్రొఫెసర్, ఓరల్అండ్ మాక్సిల్లో ఫేషియల్ విభాగం రోడ్డు ప్రమాదంలో ముఖానికి గాయాలైన యువకుడికి సర్జరీ చేసి మునుపటి స్థితికి తెచ్చిన వైనం -
మహిళ కడుపులో ఐదు కిలోల కణితి
సాక్షి, గజ్వేల్: కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ కడుపులో నుంచి వైద్యుల బృందం 5కిలోల కణితిని విజయవంతంగా తొలగించారు. గురువారం ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో దాదాపు 3 గంటల పాటు శస్త్రచికిత్స జరిపి కణితిని తొలగించారు. ఆర్వీఎం వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చెల్ జిల్లా మండల కేంద్రమైన ఏదులాబాద్ గ్రామానికి చెందిన మండీ లక్ష్మయ్య భార్య సువర్ణ గత కొంత కాలంనుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆమె ఆర్వీఎం ఆసుపత్రిలో చేరింది. దీంతో ఆర్వీఎం ఆసుపత్రి వైద్యనిపుణులు ఆమె కడుపులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వైద్య నిపుణులు డాక్టర్.మంజుల, డాక్టర్.స్వాతి, డాక్టర్.కవితలతో పాటు మత్తు డాక్టర్లు రవీందర్, విజయ్, వంశీ ఇతర వైద్య సిబ్బందితో కలసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేశారు. మూడు గంటల పాటు శ్రమించి ఆ మహిళ కడుపులోనుంచి 5 కిలోలకు పైగా బరువుగల పెద్ద కణితిని తొలగించారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో రోగి కుటుంబీకులు, గ్రామస్తులు ఆర్వీఎం ఆసుపత్రి బృందాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. శస్త్రచికిత్స సఫలం కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. రోగి పూర్తిగా కోలుకుంటుందని వైద్యుల బృందం పేర్కొంది. -
ప్రభుత్వాస్పత్రిలో ముఖ్యమంత్రికి శస్త్రచికిత్స
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు శస్త్రచికిత్స జరిగింది. భోపాల్‌లోని హమిదియా హాస్పటల్లో ఆయన వేలుకు (ట్రిగ్గర్ ఫింగర్) వైద్యులు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది,. కొన్ని గంటలపాటు ముఖ్యమంత్రిని అబ్జర్వేషన్లో ఉంచి సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ‘కమల్ నాథ్ శనివారం ఉదయం 9 గంటలకు హమీదియా ఆసుపత్రిలో చేరారు. అతని కుడి చేతి ట్రిగ్గర్ వేలికి ఆస్పత్రి వైద్య బృందం శస్త్రచికిత్స చేసింది’ అని గాంధీ మెడికల్ కాలేజీ డీన్ అరుణ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సీఎంకు కొన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు శనివారం ఉదయం శస్త్రచికిత్స చేశారు. మరోవైపు హాస్పటల్లో ఇతర రోగులు, సిబ్బందికి అసౌకర్యం కలిగించవద్దని, తనను కలిసేందుకు ఎవరూ రావద్దంటూ కమల్‌నాథ్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కమల్‌నాథ్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయించుకోవడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. -
సీఎం సహాయ నిధిలో..సొమ్ముల్లేవు!
అమరావతి: వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న నిరుపేదలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి నిధుల కొరత ఏర్పడింది. డబ్బులు లేవంటూ బ్యాంకు అధికారులు తిరకాసు పెడుతుండడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రే ఇలా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ బోరుమంటున్నారు. ఒక్క గుంటూరు జిల్లా అమరావతి మండలంలోనే ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ అయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సాధారణంగా ఖాతాలో డబ్బుల్లేకుండా చెక్కులిస్తే చెక్కు బౌన్స్ కేసు పెట్టి జైలుకు పంపుతారు. అలాంటిది సాక్షాత్తు ముఖ్యమంత్రి పేరుతో వచ్చే చెక్కులే బౌన్స్ అయితే ఎవరిపై చర్యలు తీసుకోవాలనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇలాగే పలు ప్రాంతాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు బౌన్స్ అవుతున్నట్లు సమాచారం. వివరాలివీ.. అమరావతి మండల కేంద్రంలోని మద్దూరు రోడ్డులో నివాసం ఉంటున్న చౌటా నాగేశ్వరరావు కుమారుడు చౌతా వెంకట నాగసాయి లోకేష్‌కు రెండు నెలల క్రితం ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి రావటంతో శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. నాగేశ్వరరావుకి స్థోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ప్రభుత్వం సీఎంఅర్ఎఫ్ నుంచి రూ.20,910లు మంజూరు చేసి చెక్కును మార్చి 8న వెలగపూడి సచివాలయం నుండి పంపించింది. సీఎంఆర్ఎఫ్ విడుదల చేసే చెక్కులు తహశీల్దారు నుంచి నేరుగా లబ్ధిదారులకు అందాల్సి ఉండగా, అమరావతి మండలంలో మాత్రం అవి స్థానిక అధికార పార్టీ నేతల చేతికి చేరాయి. అలా మండలంలో వచ్చిన చెక్కులన్నింటినీ సుమారు నెలరోజులపాటు తమ వద్ద పెట్టుకున్న టీడీపీ నేతలు.. సరిగ్గా ఎన్నికలకు రెండ్రోజుల ముందు బాధితుడు నాగేశ్వరరావు చేతికిచ్చారు. అనంతరం నగదు కోసం బ్యాంకులో చెక్కును డిపాజిట్ చేయగా పది రోజుల తర్వాత బ్యాంకు ఖాతాలో నగదులేదని అధికారులు చెప్పి చెక్కును నాగేశ్వరరావుకు ఇచ్చేశారు. ఇదిలా ఉంటే.. టీడీపీ నేతలు బాధితునికి సాయం అందించే విషయంలోనూ రాజకీయంగా ఆలోచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. అమరావతి మండలంలో ఇలాగే సుమారు పదిహేను మందికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
శస్త్రచికిత్సలు చేసే రోబో స్పైడర్లు
బోస్టన్: అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది. వైద్యులకు సహాయకారిగా ఉంటూ.. వారు చెప్పిన పనులను పూర్తి చేయనుంది. దీనిని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తయారుచేశారు. మిల్లీమీటర్ సైజులో ఉండే ఆస్ట్రేలియాలోని పీకాక్ స్పైడర్‌ను ఆదర్శంగా తీసుకుని దీన్ని అభివృద్ధిచేశారు. 3 రకాల టెక్నాలజీల సాయం తీసుకొని మరో సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. దీని తయారీలో సిలికాన్ రబ్బర్‌ను మాత్రమే వాడినట్లు పోస్ట్డాక్టరోల్ ఫెలో రుస్సో తెలిపారు. -
జైట్లీకి కిడ్నీ మార్పిడి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65)కి సోమవారం నిర్వహించిన మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం జైట్లీతోపాటు ఆయనకు కిడ్నీ దానం చేసిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ (ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్య బృందం తెలిపింది. సోమవారం ఉదయం 8.30 గంటలకు మొదలైన శస్త్రచికిత్స నాలుగున్నర గంటలపాటు సాగింది. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. 20 మంది వైద్యులతో కూడిన బృందం జైట్లీకి శస్త్రచికిత్స నిర్వహించింది. జైట్లీ దూరపు బంధువు, మధ్య వయస్కురాలైన ఓ మహిళ తన మూత్రపిండాన్ని దానమిచ్చేందుకు ముందుకు రావడంతో సోమవారం కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. అంతకు కొద్దిసేపటి ముందు ప్రధాన మంత్రి మోదీ జైట్లీతో మాట్లాడారు. -
స్వాప్ పద్ధతిలో ఒకేసారి ఇద్దరికి కిడ్నీ మార్పిడి
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఇద్దరు రోగులకు ‘స్వాప్’పద్ధతిలో ఒకే సమయంలో రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో వేర్వేరు బ్లడ్ గ్రూపుల మధ్య కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం దాతలు, స్వీకర్తలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు బుధ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చికిత్సకు సంబంధించిన వివరాలు డెక్కన్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నాయక్, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ పవన్‌కుమార్, కిమ్స్ ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌లు వెల్లడించారు. సింగరేణి కాలరీస్ ఉద్యోగి బిల్ల మల్లయ్య జన్యు సంబంధ మూత్ర పిండాల సమస్యతో బాధపడు తున్నాడు. చికిత్స కోసం ఆయన ఇటీవల డెక్కన్ ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిందని, మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కార మని సూచించారు. కిడ్నీ దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నా కిడ్నీ లభించలేదు. దీంతో మల్లయ్య(బ్లడ్ గ్రూప్–బి)కు కిడ్నీ ఇవ్వడానికి భార్య పద్మ(బ్లడ్ గ్రూప్–ఎ) అంగీకరించింది. అయితే, స్వీకర్త, దాతల బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడం చికిత్సకు అడ్డంకిగా మారింది. ఇదే సమయంలో కిమ్స్‌లో కరీంనగర్‌కు చెందిన బానోతు రాజు(బ్లడ్ గ్రూప్–ఎ)ఇదే సమస్యతో బాధపడుతున్నాడు. ఆయన భార్య సునీత బ్లడ్‌గ్రూప్–బిగా తేలింది. ‘స్వాప్’ (రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో ఇద్దరు వేర్వేరు బ్లడ్‌గ్రూప్‌ల మధ్య అవయవమార్పిడి చికిత్స)పద్ధతిలో కిడ్నీ మార్పిడి చికిత్స చేయాలని వైద్యులు భావించారు. ఆ మేరకు జీవన్‌దాన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. దీనికి సుమారు ఆరునెలలు పట్టింది. సునీత నుంచి సేకరించిన కిడ్నీని డెక్కన్ ఆస్పత్రిలోని మల్లయ్యకు అమర్చగా, పద్మ నుంచి సేకరించిన కిడ్నీని బానోతు రాజుకు కిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా అమర్చారు. రెండు వేర్వేరు ఆస్పత్రుల్లో జరుగుతున్న ఈ ప్రక్రియను స్వైప్‌లో వీక్షిస్తూ చేశారు. ఈ తరహా చికిత్స దక్షిణాదిలో ఇదే మొదటిదని డాక్టర్ నాయక్ వెల్లడించారు. -
నేడు జైట్లీకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్
న్యూఢిల్లీ: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ(65) శుక్రవారం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో చేరారు. నేడు ఆయనకు శస్త్రచికిత్స చేస్తారని, అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అపోలో ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ సందీప్ గులేరియా జైట్లీకి శస్త్రచికిత్స చేస్తారని సమాచారం. అనారోగ్యం కారణంగా గత కొద్ది రోజులుగా జైట్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఈనెల 12న జరిగే 10వ ‘బ్రిటన్–ఇండియా ఆర్థిక, వాణిజ్య చర్చ’ల్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లాల్సి ఉండగా.. ఆ పర్యటనను రద్దుచేసుకున్నారు. ‘కిడ్నీ సమస్యలు, కొన్ని ఇన్ఫెక్షన్లకు చికిత్స పొందుతున్నాను’ అని జైట్లీ గురువారం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
చెప్పు తిని దొరికిపోయింది...!!
పెర్త్, ఆస్ట్రేలియా : దాదాపు పది అడుగుల పొడవాటి ఓ కొండ చిలువ (పైథాన్) ఇంట్లోకి ప్రవేశించడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఈ సంఘటన సోమవారం పెర్త్‌లోని మౌంట్ ఒమానెయ్లో చోటుచేసుకుంది. దానిని పట్టుకునేందుకు స్థానికంగా ఉండే పాములు పట్టే వ్యక్తికి సమాచారమివ్వగా.. అతను వచ్చేసరికే పాము చెట్టు కొమ్మల్లోకి చేరింది. అయితే ఎలాగోలా దాన్ని పట్టుకున్న ఆ వ్యక్తి దాని కడుపులో ఏదో వస్తువుందని గ్రహించి వెటర్నరీ ఆస్పత్రి హెర్ప్ వెట్‌కు తరలించాడు. ఆ పైథాన్‌ను స్కాన్ చేయగా దాని కడుపులో చెప్పు ఉందని తేలింది. సర్జరీ చేసి దాని పొట్టలో నుంచి చెప్పును తొలగించారు. ఆపరేషన్ జరిగిన తీరును వీడియో తీసి వైద్యుడు జాన్ లీనాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. కావాలంటే మీరూ చూడొచ్చు. -
చెప్పు తిని దొరికిపోయింది...చివరికి!
-
శుక్లాలకు చుక్కల మందు!
వయసు మీదపడుతున్న కొద్దీ చూపు మందగించడం, కొంతమందిలో కంటి శుక్లాలు ఏర్పడటం మనం చూస్తూనే ఉంటాం. చత్వారాన్ని కళ్లజోడుతో సరిచేసుకోవచ్చునేమోగానీ... శుక్లాలకు మాత్రం శస్త్రచికిత్సకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ పరిస్థితి త్వరలోనే మారిపోతుందని అంటున్నారు చైనాలోని సన్ యాట్ సేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ప్రకృతిలో లభించే ఓ రసాయనాన్ని చుక్కల మందుగా వాడటం ద్వారా శుక్లాలను కరిగించే రోజు ఎంతో దూరంలో లేదని వీరు చెబుతున్నారు. లానో స్టెరాల్పై జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ రసాయనం శుక్లాల ప్రొటీన్లు ఒకదగ్గర గుమికూడకుండా అడ్డుకుంటుందనీ, కుక్కలపై దీన్ని ఉపయోగించినప్పుడు ఆరువారాల్లోనే వాటి కంటి శుక్లాలు గణనీయంగా తగ్గాయనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.