![Adipurush Effect Where Is Prabhas Fans Comments - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/17/prabhas-usa.jpg.webp?itok=evX0ft0F)
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని అత్యున్నత టెక్నాలజీని ఉపయోగించి ఆదిపురుష్ చిత్రాన్ని దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించాడు. సినిమాకి మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో ఏ హీరోకి లేనంత క్రేజ్ ఉన్న ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో సినిమాకు బజ్ జనరేట్ అయ్యింది. ప్రభాస్ కాకుండా ఇంకొకరు ఆదిపురుష్ చేసి ఉంటే.. ఈరోజు మూవీ గురించి ఇంత డిస్కషన్ జరిగేది కాదేమో. అందుకే ప్రతి చిన్న విషయాన్ని నెటిజన్స్ ఫాలో అవుతున్నారు.
(ఇదీ చదవండి: ఓం రౌత్‌ను ప్రభాస్ డైలాగ్‌తోనే ఆడుకుంటున్న నెటిజన్లు)
ప్రభాస్ ఎక్కడ
టాలీవుడ్‌లో తన సినిమాను మొదటిరోజే హైదరాబాద్ థియేటర్లలో చూసేవాడు. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి పెరిగిపోవడంతో ముంబయి వెళ్లి తన సినిమాను చూసేవాడు. బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు వచ్చిన తర్వాత అక్కడా ఇదే పరిస్థితి ఎదురుకావడం వల్ల ఇప్పుడు ఫారెన్లో తన సినిమాను చూసేందుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. దీంతో అమెరికాలో ఆదిపురుష్ ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రభాస్ చూశాడట.
బాహుబలి సినిమా సమయంలో ప్రభాస్ కాలికి ఏర్పడిన గాయం మళ్లీ ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్‌లో కూడా కాలి నొప్పితో ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. అందుకే మరోసారి అమెరికాలోనే సర్జరీ చేయించుకోనున్నారట. అనంతరం కొన్నిరోజుల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని.. సలార్ మూవీ సెట్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. కాలి నొప్పి బాధ నుంచి ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment