పుష్ప 2 మరో రికార్డ్‌.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే! | Allu Arjun Pushpa 2 Creates New Record At Box Office Premiere Sales | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: పుష్ప 2 మరో రికార్డ్‌.. బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

Published Tue, Nov 19 2024 3:05 PM | Last Updated on Tue, Nov 19 2024 3:39 PM

Allu Arjun Pushpa 2 Creates New Record At Box Office Premiere Sales

ఇప్పుడంతా ఎక్కడ చూసినా పుష్ప-2 పేరే వినిపిస్తోంది. పుష్ప-2 ట్రైలర్‌ రిలీజైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ మొదలైంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. అత్యంత వేగంగా 100 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో పుష్ప మూవీ రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తోంది.

తాజాగా ఈ మూవీ మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఓవర్‌సీస్‌లో ఇప్పటికే ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. యూఎస్‌ బాక్సాఫీస్ వద్ద ఏ భారతీయ సినిమాకు సాధ్యంకాని రికార్డ్ సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ప్రీ సేల్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో ఐకాన్ స్టార్‌ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సుకుమార్-అల్లు అర్జున్‌ కాంబోలో వస్తోన్న పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2021లో వచ్చిన పుష్ప పార్ట్‌-1కు సీక్వెల్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మిక మందన్నా మరోసారి అలరించనుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement