ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న తరుణం రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే పుష్ప-2 ప్రభంజనం థియేటర్లలో మొదలు కానుంది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే బెనిఫిట్ షోలు వేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా టికెట్స్ బుకింగ్స్ పుష్ప సరికొత్త రికార్డులు తిరగరాస్తోంది.
అయితే పుష్ప-2 రిలీజ్‌కు ముందు అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మూవీని 3డీ వర్షన్‌లో అందుబాటులోకి రాలేదనే టాక్ వినిపిస్తోంది. రిలీజ్ రోజున అన్ని థియేటర్స్‌లోనూ కేవలం 2డీ వెర్షన్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే 3డీ వర్షన్ టికెట్స్ బుక్ చేసుకుంటే.. ఆ షోలు కూడా 2డీ వర్షన్‌లోనే ప్రదర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 3డీ వెర్షన్ రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశముంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
(ఇది చదవండి: 'పుష్ప 2'.. తమన్‌ని సైడ్ చేసేశారా?)
కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఐమ్యాక్స్, డాల్బీ, డిబాక్స్, 4డీఎక్స్, ఐస్, 2డీ, 3డీ విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 2డీ వెర్షన్‌కు సంబంధించిన ప్రింట్‌ను రెడీ చేశారు మేకర్స్.
Comments
Please login to add a commentAdd a comment